top of page

వాసంతసమీరం


'Vasanthasameeram' New Telugu Story(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

సాయంత్రం వేళ పార్కులో కూర్చుని కాస్త దూరంగా ఆడుకుంటున్న పిల్లలని చూస్తోంది వాసంతి. బాంకు ఉద్యోగ బాధ్యతలతో నిత్యం ఒత్తిడికి గురవుతూ వారాంతంలో ఇలా దగ్గరగా ఉన్న పార్కుకు వచ్చి ప్రశాంతంగా కాసేపు గడపడం ఆమెకు అలవాటు. హఠాత్తుగా ఒక బంతి వచ్చి ఆమె దగ్గరగా పడడం, ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ రావడం రెప్పపాటులో జరిగింది. ముద్దులొలికే ఆ పాపకి సుమారు ఐదారు సం…వయస్సు ఉండచ్చేమో. బంతిని ఆ పాప చేతికిచ్చి " నీపేరేంటి పాపా"? అంది వాసంతి.


"సమీర " ముద్దుముద్దుగా చెప్పింది ఆపాప. 'ఎంత అందమైన పేరు' అని మనసులో అనుకుంది వాసంతి.


ఇంతలో 'సమీరా' అంటూ పిలుస్తూ ఒకతను వచ్చాడు. పాపని ఎత్తుకొని తీసుకుని వెళుతూ వాసంతిని చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది వాసంతికి. వెంటనే గుర్తుపట్టి " మీరు రమేష్ కదా!" అంది. "మీరు వాసంతి కదా!" అన్న అతని మాటలకు నవ్వుతూ "అవును. దా! కూర్చో. ఎలా ఉన్నావు?" అడిగింది వాసంతి.


"బానే ఉన్నాను. నీవెలా ఉన్నావు?" అంటూ పాపని ఒళ్లోకూర్చొపెట్టుకుని కూర్చున్నాడు రమేష్. అతని పలకరింపుకు జవాబుగా చిరునవ్వు నవ్వింది వాసంతి.


"నా కూతురు సమీర" అని పాపను చూపించి "నమస్కారం పెట్టు" అన్న తండ్రి మాటలకు "నమస్తే ఆంటి" అంది సమీర. ముద్దులొలికే ఆ పాప మాటలకు ముచ్చటేసి పాపను దగ్గరకు తీసుకుంది వాసంతి. ఈ ఊరిలో తను లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు చెపుతూ 'నీ గురించి చెప్పు?' అన్నాడు రమేష్.


"నేను బాంకులో ఉద్యోగం చేస్తూ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకున్నాను" అంది వాసంతి.


"మీ వారు ఏంచేస్తున్నారు? అన్న అతని మాటలకు అడ్డొస్తూ ' నేను పెళ్లి చేసుకోలేదు' అని దూరంగా ఎటో చూస్తూ గంభీరంగా జవాబిచ్చింది వాసంతి. ఒక్క క్షణం ఆమెని నిశితంగా పరిశీలించిన రమేష్ వెంటనే వాతావరణాన్ని తేలిక పరుస్తూ కాసేపు ఏదో మాటలను చెప్పి సరదాగా ఆమెని నవ్వించాడు. పాపని తీసుకుని వెళుతూ ఒకరోజున వాసంతిని తన ఇంటికి రమ్మని చెప్పి అడ్రస్ ఇచ్చి వెళ్లాడు రమేష్. వాళ్లు వెళ్లిన వైపే చూస్తూ తను కూడా లేచి ఇంటికి వెళ్లింది వాసంతి.


ఆ రాత్రి ఆమెకు అతని గురించిన ఆలోచనలతో నిద్ర లేదు. గతమంతా కళ్లముందు కదలాడింది. తనూ, రమేష్ కాలేజీలో మంచి స్నేహితులు. కొన్నాళ్లకు ఆ స్నేహం కాస్తా ఇద్దరి మధ్యా ప్రేమగా మారింది. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. సరదాగా సినిమాలు, షికార్లతో కాలేజి చదువు ముగిసింది. ఇద్దరూ మంచి ఉద్యోగాలు పొందాకే పెళ్లి చేసుకుందామనుకున్నారు.


తండ్రి లేని రమేష్ ను తల్లి శారదమ్మ కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించింది.. తనకు ఉద్యోగం వచ్చాక తన ప్రేమ విషయాన్ని తల్లితో చెప్పి వాసంతిని పెళ్లి చేసుకుందా మనుకున్నాడు రమేష్. వీళ్ల ప్రేమ విషయం వాసంతి తల్లితండ్రులకు నచ్చలేదు. కూతుర్ని మందలించి తన ఉద్యోగాన్ని వదిలి వేరే రాష్ట్రానికి కుటుంబాన్ని మార్చాడు తండ్రి రామనాధం.


వాసంతితో పెళ్లి, కోటి ఊహలలతో కలలు కంటున్న రమేష్ కు ఈ పరిణామంతో ఒక్క సారిగా కాళ్లక్రింద భూమి కదలాడినట్టయింది. ఆమె గురించి ఎంత ప్రయత్నించినా వివరాలు దొరకలేదు. అతన్ని విడిచి ఉండటం వాసంతికి కూడా చాలా దుర్భరంగా అనిపించింది. 'అతన్ని కలిస్తే చస్తానన్న' తండ్రి బెదిరింపులతో పిరికిదానిలా మౌనం వహించింది.

ఇద్దరి మధ్యనా కమ్యూనికేషన్ లేదు.


బాంకు ఉద్యోగం వచ్చిన వాసంతికి తల్లి తండ్రులు పెళ్లి సంబంంధాలు చూడ మొదలుపెట్టి పెళ్లి చేసుకోమని వత్తిడి చేయసాగారు. తను మనసిచ్చిన రమేష్ తో తప్ప తనకు ఎవరితో పెళ్లి వద్దని స్ధిరనిర్ణయాన్ని చెప్పింది వాసంతి. చేసేదిలేక వాళ్లు మిన్నకుండిపోయారు. రోజులు గడుస్తున్నాయి.


ఒకరోజున రోడ్డు ప్రమాదంలో వాసంతి తల్లితండ్రులు మరణించారు. జరిగిన విషాదానికి గుండెలు పగిలేలా ఏడ్చి తనకు తనే నిబ్బరం తెచ్చుకుని జరగవలసిన తంతుని యధావిధిగా నిర్వహించిది వాసంతి. ఎంతటి గాయాన్నయినా కాలమే మాన్పుతుంది. ఉద్యోగనిర్వహణలో ఆ బాధని మర్చిపోయి మామూలు మనిషయింది వాసంతి. మరలా ఇన్నేళ్లతర్వాత ఈరోజు రమేష్ ని చూశాను అనుకుంది. ఆలోచనలకు స్వస్తి చెప్పి క్రమేణా నిద్రలోకి జారింది వాసంతి.


రమేష్ లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించాడు. తల్లి బలవంతంమీద మేనమామ కూతురు సుధని పెళ్లి చేసుకున్నాడు రమేష్. పెళ్లయినాక భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకు తొలి కాన్పు కష్టమై పాపని కని చనిపోయింది సుధ. జరిగిన దారుణానికి బాధపడి సుధ తాలూకు కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించి పాపకు 'సమీర' అని పేరు పెట్టుకుని తల్లి సాయంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు రమేష్. పార్కు నుంచి ఇంటికి వచ్చిన రమేష్ కు వాసంతిని చూసిన ఆనందంతో మనసంతా సంతోషంతో నిండిపోయింది. రోజులు గడుస్తున్నాయి.ఒక రోజున వాసంతి రమేష్ ఇచ్చిన అడ్రసు ను వెతుక్కుంటూ వాళ్లింటికి వెళ్లింది. వాకిట్లో ఆడుకుంటున్న పాప వాసంతిని గుర్తుపట్టి "రండి ఆంటీ" అంటూ చేయిపట్టుకుని ఇంట్లోకి తీసికెళ్లింది. రమేష్ వాసంతిని ఆప్యాయంగా పలకరించి తల్లికి పరిచయం చేశాడు. శారదమ్మ కూడా చక్కగా పలకరించి చాలా మర్యాదలు చేసింది. వంట చేసి ఆప్యాయంగా భోజనం వడ్డించింది. వాళ్లతో కలిసి భోజనం చేసి సరదాగా గడిపింది వాసంతి. మాటలమధ్యలో శారదమ్మ ద్వారా రమేష్ కు జరిగింది విని బాధపడింది వాసంతి. ఇంటికి తిరిగి వస్తూ తన అడ్రసును రమేష్ కు ఇచ్చి వాళ్లని తీసుకుని తనింటికి రావాలని ఆహ్వానించింది.


ఒక రోజున వాళ్లని తీసుకుని వాసంతి ఇంటికి వెళ్లాడు రమేష్. వాళ్లని ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేసి, మంచి రుచికరమైన వంట చేసి వాళ్లకు వడ్డించింది వాసంతి. మాటల మధ్యలో శారదమ్మ వాసంతిని గురించి వివరాలను అడిగింది. దాపరికం లేకుండా వాసంతి తన గురించి చెప్పింది. అంతా విన్నాక "వాసంతీ! నీకిష్షమైతే మనం పెళ్లి చేసుకుందాం" అన్న రమేష్ మాటలకు సిగ్గుల మొగ్గయింది వాసంతి. శారదమ్మ సంతోషించింది.


ఒక శుభముహూర్తాన రమేష్, వాసంతి లు రిజిస్టర్ మారేజ్ చేసుకుని ఒక ఇంటివారయ్యారు. వాళ్లని దగ్గరకు తీసుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది శారదమ్మ. అతి త్వరలోనే సమీరకు దగ్గరయింది వాసంతి. ఇద్దరూ తమ ఉద్యోగాలకు వెళ్లివస్తూ వారాంతంలో సమీరతో సంతోషంగా గడుపుతున్నారు వాసంతి దంపతులు. వాసంతి కలుపుగోలుతనం, మంచి మనస్సు శారదమ్మకు బాగా నచ్చింది. వాసంతి సమీరను ప్రేమగా చూసుకోవడం చూసి నిబ్బరంగా ఉంది శారదమ్మ మనస్సు. సమీర చక్కగా చదువుకుంటోంది. క్రమేణా సమీరచేత "అమ్మా" అని పిలిపించుకుంటూ సంతోషిస్తోంది వాసంతి.

రోజులు హాయిగా గడుస్తున్నాయి. కొన్నాళ్లకు వాసంతి గర్భవతి అయింది. రమేష్ ఆనందానికి అవధులు లేవు. శారదమ్మ కోడలిని ప్రేమగా చూసుకుంటోంది. నెలలు నిండి సుఖప్రసవం జరిగి పండంటి మగబిడ్డని కన్నది వాసంతి. ఆ బాబుని చూసి ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. ఆడుకోవడానికి తనకొక తోడు దొరికాడని ఎంతో సంతోషంగా ఉంది సమీర. ఆ బాబుకి "అనిల్" అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నారు. చూస్తూ ఉండగానే అనిల్ కు మొదటి పుట్టినరోజు వచ్చింది. ఆరోజున అందరినీ పిలిచి ఫంక్షన్ ఏర్పాటు చేశారు రమేష్ దంపతులు. తన తమ్ముడి పుట్టినరోజుకి తానే స్వయంగా గ్రీటింగ్ కార్డుని తయారు చేసి "ప్రేమతో అక్క" అని తన చిన్ని చిన్ని చేతులతో అందంగా వ్రాసి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చి వాడికి ముద్దిచ్చింది సమీర. అది చూసి వాసంతి చాలా సంతోషించింది.

అనిల్ తన ముద్దుముద్దు మాటలతో అందరినీ అలరిస్తున్నాడు. "అక్కా" అంటూ కూడా తిరుగుతున్న అనిల్ ని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటోంది సమీర. అరమరికలు లేని ఆ అక్కాతమ్ముళ్ల బంధాన్ని చూసి రమేష్ చాలా సంతోషంగా ఉంటున్నాడు. వాసంత సమీరంలా ఆ ఇంట ఎప్పుడూ ఆనందపు విరిజల్లులు వెల్లువలా కావాలని మనసారా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది శారదమ్మ.

సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
44 views0 comments

Comentarios


bottom of page