top of page
Original.png

వాయిదాల పద్ధతి

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #వాయిదాలపద్ధతి, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

వాయిదాల పద్ధతి వారిగా ఫీజు కట్టలేరు... ఆ స్కూల్లో

Vayidala Paddhathi - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 12/02/2026

వాయిదాల పద్ధతి - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)


ఉదయం అమ్మ చెప్పింది మాధవ్‌కి, "ఈ రోజు ఈ నెల ఫీజు కట్టు స్కూల్‌కు వెళ్ళగానే... స్కూల్ బ్యాగ్‌లో పెట్టుకో... జేబులో వద్దు... కింద పడిపోవచ్చు... జాగ్రత్త!"


మాధవ్ నసిగాడు, "సంవత్సరం ఫీజు మొత్తం ఒకేసారి కట్టాలి అన్నారు స్కూల్ వారు... వాయిదా పద్ధతిలో నెలనెలా కట్టకూడదు అట."


"ఒకేసారి ఫీజు మొత్తం కట్టే స్తోమత లేదు అని మా అమ్మ చెప్పింది అని చెప్పు."... ధైర్యం నూరిపోసింది అమ్మ మాధవ్‌కి.


... "నెల నెలా కడుతున్నాం కదా... ఎక్కడికి పారిపోతాం?"... భరోసా ఇచ్చింది అమ్మ.


--------------------


2)


మాధవ్ స్కూల్ ఫీజు కౌంటర్‌కు చేరుకున్నాడు.


భయం భయంగానే... మాధవ్ ఆ నెల యొక్క ఫీజు తీసి ఇచ్చాడు ఆ స్కూల్ ఉద్యోగికి.


"ఒకేసారి సంవత్సరం ఫీజు మొత్తం కట్టే స్తోమత లేదు అని మా అమ్మ చెప్పింది."... గబగబా చెప్పేశాడు భయంగా, దిగులుగా.


3)


ఆ స్కూల్ ఉద్యోగి ఫీజు ఎంట్రీ రిజిస్టర్ పుస్తకం తీశాడు.


ఒక్క పేజీ తిప్పుతూ చూపిస్తున్నాడు మాధవ్‌కు.


ప్రతి విద్యార్థి పూర్తి సంవత్సరం ఫీజు చెల్లించినట్టు రాసి ఉంది.


మాధవ్‌కి మాటలు తడబడ్డాయి. కాళ్లు వణుకుతున్నాయి.


ఉచిత గవర్నమెంట్ స్కూల్‌కి మారిపొమ్మంటాడా???... అనే గుబులు పట్టుకుంది మాధవ్‌కు. "ఇక పని అయిపోయింది!" మాధవ్ అనుకున్నాడు బేలగా.


ప్రపంచంలో పేదవాడి స్థితి - పరిస్థితి ఏమో... మాధవ్‌కి పూర్తిగా అర్థం అయింది... ఆ ఒక్క క్షణంలో. జీవిత సత్యం బోధపడింది అనవచ్చు.


4)


"ఈ పేజీ చూడు," అన్నాడు ఆ ఉద్యోగి ఫీజు ఎంట్రీ రిజిస్టర్ చూపిస్తూ.


గుండె గుబేలుమంది మాధవ్‌కు. వణుకుతూ భయపడుతూ


రిజిస్టర్ చూసాడు.


ఓ బాబు (విద్యార్థి)... వాయిదా పద్ధతిలో... ఆ నెల ఫీజు మాత్రం కట్టాడు.


ఊపిరి పీల్చుకున్నాడు మాధవ్. మనసు కాస్త తేలిక పడింది, కానీ పూర్తిగా కాదు.


5)


ఆ స్కూల్ ఉద్యోగి ఇలా చెప్పాడు, "ఈ బాబు నా కొడుకు... ఈ స్కూల్‌లో చదువుతున్నాడు... వాయిదా పద్ధతిలో ఫీజు చెల్లిస్తాడు నెలనెలా వారిగా."


ఆ ఉద్యోగి ఈసారి ఇలా అడిగాడు, "మీ అమ్మ స్కూల్లో పనిచేస్తుందా?"


షాక్ తిన్నాడు మాధవ్. "ఔను... టీచర్‌గా... మీకెలా తెలుసు?" అతి కష్టం మీద నోరు తేరుచుకుంది... మాటలు పెగిలాయి... భయంగానే... మాధవ్ నోటి నుండి.


ఆ స్కూల్ ఉద్యోగి ఇలా చెప్పాడు నవ్వుతూ,


"స్కూల్ ఉద్యోగుల జీతాలు తక్కువ... పని భారం ఎక్కువ," గట్టిగా నవ్వాడు ఆ స్కూల్ ఉద్యోగి.


"అందుకే పేదలకు నెలవారీ ఫీజు కట్టే సౌకర్యం ఉంటుంది... ఎక్కడైనా... లేకుంటే పేదవారు స్కూళ్ళకు రాలేరు... స్కూల్ ఖాళీ అయిపోతుంది,"... భరోసా ఇచ్చాడు ఆ పాఠశాల ఉద్యోగి.


6)


ఇంకో పేజీ తిప్పాడు ఫీజు రిజిస్టర్‌లో.


ఆశ్చర్యం... తన క్లాస్‌మేట్ - తన ప్రాణ స్నేహితురాలు - అందాల వింధ్య కూడా... వాయిదా పద్ధతిలో... నెలవారీగా ఫీజు చెల్లిస్తుంది. ఆమె చాలా ధనికురాలు కదా!... అందరూ ఆమెను రాణి - దేవకన్య అంటారు. అంటే ధనవంతురాలు, గుణవంతురాలు, సొగసరి... 3 ఇన్ 1 (అని).


7)


అప్పుడే బోధపడింది మాధవ్‌కు...


అందాల వింధ్య కావాలనే నెలవారీ వాయిదా పద్ధతిలో ఫీజు చెల్లిస్తుంది స్కూల్లో అని... ఎందుకలా?... ఆమెను ఎవ్వరూ ఏమీ అనరు... కాబట్టి... తనకు (మాధవ్‌కు) భరోసాగా, మద్దతుగా... పూర్తి ఫీజు ఒకేసారి చెల్లించాలి అని ఎవరూ అనకుండా, నియమం పెట్టకుండా... స్నేహం కోసం త్యాగంలా!


మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు ఆమెకు మాధవ్.


8)


అప్పుడే అక్కడికి ఏదో పని మీద వచ్చింది వింధ్య.


"నువ్వు దేవతవి... నాకు భరోసాగా, మద్దతుగా... నువ్వు కూడా నెలవారీ వాయిదా పద్ధతిలో ఫీజు చెల్లిస్తున్నావు... నువ్వు నాకు దేవుడు ఇచ్చిన బహుమానం, ప్రాణ స్నేహితురాలువి."


... అని అన్నాడు మాధవ్... ఆమెను కృతజ్ఞతాపూర్వకంగా, మెచ్చుకోలుగా చూస్తూ.


"నువ్వు మంచిని మించిన మంచి వాడివి... అందరికీ నీ నోట్స్ పుస్తకములు ఇచ్చి సహాయపడతావు... మంచి మాటల - చేతల సాయం చేస్తావు,"... అని మాధవ్‌ని కొనియాడింది అందాల వింధ్య.


...


9)


అప్పుడే ఎక్కడి నుండో రేడియోలో పాట వినిపిస్తోంది... "స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం... స్నేహమే నాకున్నది... స్నేహమే నా పెన్నిది."


... నిప్పులాంటి మనిషి (1974 సినిమా పాట).


----- X X X ---- చిన్న కథ సమాప్తం --- X X X -------


------ నీతి:- ------


1)


వాయిదా పద్ధతి చెల్లింపులు పెట్టాలి అన్ని చోట్ల... సంస్థకు, వ్యాపారులకు మంచిది... ప్రత్యేకంగా నిరుపేదలకు కూడా.


2)


చిన్ననాటి స్నేహితులు, మంచి స్నేహితులు... దేవుడు ఇచ్చిన బహుమానం.


3)


అపాయంలో ఉపాయం ముఖ్యం, దిగులు కాదు... చతురతతో ఏటువంటి పరిస్థితిలో కూడా విజయం సాధించవచ్చు.


4)


పేదవారికి అన్ని సదుపాయాలు - సౌకర్యాలు కల్పించాలి... సమాజం బాధ్యతగా... అందరూ కష్టపడుతున్నారు దేశ ప్రగతి, శాంతి, శ్రేయస్సు, పురోగతి కొరకు... పేదవారు కూడా అని గుర్తించాలి, గమనించాలి.


5)


ప్రతి రాష్ట్రం, దేశం పేదరికం నిర్మూలించడానికి... ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి... సమాజం బాధ్యతగా.

6)

తల్లిని మించిన దైవం లేదు


(No deity is greater than God)


7)

ఈ ప్రపంచంలో ... ప్రతి దేశం - రాష్ట్రం లో ... ప్రతి పౌరుడు కనీసం ఒక్క రూపాయి (లేక ఆ దేశ కరెన్సీ) దానం చేయాలి ... ప్రతి రోజు ప్రభుత్వ పేదరికం నిర్మూలన నిధికి (donate atleast rupee 1 every DAY to CM fund AND PM fund ... TO remove - eradicate poverty from the entire EXCELLENT WORLD... AS a Social responsibility - give back to humanity - state - nation - world)



8)


అందరూ సంతోషకరమైన అభివృద్ధి మరియు ఆనందకరమైన విజయ పరిష్కారాలు మరియు నిర్మాణాత్మక స్వభావాన్ని - నిర్వాహన మాత్రమే నిర్వహించాలి.


ALL should ALWAYS implement HAPPY Development Management and WIN-WIN JOYFUL success SOLUTIONS and a CONSTRUCTIVE nature.



---------- నీతి సమాప్తం -------------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page