top of page
Original.png

విదేశీ గుర్రం

#TarigoppulaVLNMurthy, #తరిగొప్పులవిఎల్లెన్మూర్తి, #VidesiGurram, #విదేశీగుర్రం #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Videsi Gurram - New Telugu Story Written By - Tarigoppula VLN Murthy   

Published In manatelugukathalu.com On 30/01/2026

విదేశీ గుర్రం - తెలుగు కథ 

రచన: తరిగొప్పుల వి ఎల్లెన్ మూర్తి

గన్నయ్య అని ఒకడు ఉండేవాడు. ఒకరోజు గన్నయ్య పక్క ఊరి సంతకు వెళ్లి ఒక గాడిదను కొన్నాడు. దాన్ని తీసుకుని వస్తుంటే దారిలో ఒక చెరువు కనిపించింది. ఎండ ఎక్కువగా ఉండటంతో గన్నయ్యకు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది.


"నేను నడిచి వెళ్తే నా కాళ్లు నొప్పులు పుడతాయి, గాడిద మీద కూర్చుంటే దానికి పాపం. కాబట్టి మేమిద్దరం కలిసి చల్లగా చెరువులో ఈదుకుంటూ వెళ్దాం" అనుకున్నాడు. గన్నయ్య గాడిదను తీసుకుని నీళ్లలోకి దిగాడు. గాడిదకు ఈత రాదు, గన్నయ్యకు అంతకన్నా రాదు. గాడిద భయంతో

"ఓఓఓ.. ఓఓఓ.." అని అరవడం మొదలుపెట్టింది. గన్నయ్య ఏమనుకున్నాడంటే, "అబ్బా! నా గాడిద ఎంత సంతోషంగా పాటలు పాడుతుందో!" అని మురిసిపోయాడు.


అంతలో ఆ ఊరి ప్రెసిడెంట్ అటుగా వెళ్తూ ఇది చూసి, "ఒరేయ్ గన్నయ్యా! ఆ గాడిదను నీళ్లలో ముంచుతున్నావేంటిరా? అది చచ్చిపోతుంది!" అని అరిచాడు.


దానికి గన్నయ్య చాలా సీరియస్ గా, " ఇది నా పర్సనల్ విషయం. నా గాడిద సింగింగ్ ప్రాక్టీస్ చేస్తోంది, అడ్డుతగలకండి" అన్నాడు. చివరికి ఎలాగోలా బయటపడి ఇంటికి చేరాడు. 

మరుసటి రోజు గన్నయ్య ఆ గాడిదకు మంచి రంగులు వేసి, దాని తల మీద ఒక పాత విగ్గు పెట్టి, ఊర్లో అందరికీ "ఇది విదేశీ గుర్రం, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది" అని చెప్పి అమ్మకానికి పెట్టాడు.


ఊరి పిసినారి సూరయ్య దాన్ని నమ్మి 10 వేలు పెట్టి కొన్నాడు. సూరయ్య గర్వంగా దాని మీద కూర్చుని "హై.. హై.." అన్నాడు. గాడిద ఒక్క అడుగు కూడా వేయలేదు. సూరయ్య కర్రతో కొట్టగానే, అది వెనక కాళ్లతో ఒక్క తన్ను తన్నింది. సూరయ్య వెళ్లి పక్కనే ఉన్న పేడ కుప్పలో పడ్డాడు. సూరయ్య కోపంతో గన్నయ్య దగ్గరికి వెళ్లి,

"ఏరా! ఇది గుర్రం అన్నావు, తంతుంది ఏంటి?" అని అడిగాడు.


గన్నయ్య ప్రశాంతంగా ఇలా అన్నాడు. "అదే కదా దీని స్పెషాలిటీ! ఇది విదేశీ గుర్రం కదా, దీనికి తెలుగు రాదు. నువ్వు 'హై హై' అంటే దానికి అర్థం కాలేదు. అదే ఇంగ్లీష్‌ లో 'ఎక్స్‌క్యూజ్ మీ' అని అడిగి ఉంటే.. బుద్ధిగా వెళ్లేది!"


అది విన్న సూరయ్యకు ఏం చెప్పాలో అర్థం కాక, తల పట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు.


కథ సమాప్తం. 

***

తరిగొప్పుల వి ఎల్లెన్ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 పేరు: తరిగొప్పుల వి ఎల్లెన్ మూర్తి


వృత్తి:  ఈటీవీ.,

          Big FM 

          జీ తెలుగు.,

          స్టార్ మా టీవీ చానెళ్లలో

          28సంవత్సరాలుగా రైటర్  ఉద్యోగం. ఎన్నో టివి కార్యక్రమాలకి రూపకల్పన చేసా.

ఆంధ్రభూమి., ఆంధ్రప్రభ,లలో నా సాహితీ వ్యవసాయాన్ని ప్రారంభించాను

స్వాతి వీక్లీ - నా కథలు వ్యాసాలు ప్రచురించి కథకుడిగా నాకో స్థానాన్ని ఏర్పరిచింది.

పురస్కారాలు

స్వాతి సంపాదకీయం ఫస్ట్ కాలమ్ 2002 లో నా వ్యాసం ప్రచురణ ( ఇది నాకు ఆస్కార్ కి మించి)🙏


స్వాతి మంత్లీ - 12 నెలల్లో 14 ఆర్టికల్స్ 2019 లో ప్రచురించడం .

అదే 2019 సంవత్సరం స్వాతీ వీక్లీల్లో కూడా దాదాపు 25 వరకూ వ్యాసాలు…


స్వాతి సరస కథల్లో 3సార్లు  ప్రథమ బహుమతులు 



ఇవి కాక…

కథలు వ్యాసాలు 

దాదాపుగా 50 వ్యాసాలు వరకూ స్వాతి లో 300 వ్యాసాలు ఆంధ్రభూమి లో..  100 వ్యాసాలు వివిధ పత్రికలలో 


ఈనాడు హాయ్ బుజ్జీ., అంతర్యామి, వ్యక్తిత్వవికాసం శీర్షిక ( వైనతేయ - pen nameతో)

నవతెలంగాణ (ఆనంద ‘మైత్రేయ’మ్ - pen name)

వార్త ఆదివారం అనుబంధాలు కవర్ స్టోరీలు.  ఫీచర్స్ … 

ఆంధ్రప్రభ చింతనలో ఆధ్యాత్మిక వ్యాసాలు 

ఆరాధన రాష్ట్రస్థాయి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.. సన్మానం

సరస సలిల పత్రిక గృహశోభ సంయుక్తంగా ‘వికటకవి’ బిరుదు ప్రదానం చేశాయి.

అక్షరాల తోవ జాతీయ స్థాయి కథల పోటీ లో బహుమతి.

మట్టూరు కమలమ్మ స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి.

ఇంకా మరికొన్ని.

ముఖ్యంగా రైటర్ హోదాలో జీ తెలుగు టీవీ ద్వారా యూరప్. థాయిలాండ్, బ్యాంకాక్ అబూదబీ పట్టాయ్యా., ఫు దీవులు… మరికొన్ని దేశాలు ఉచితంగా సందర్శించడం మధురానుభూతి.

 


bottom of page