top of page
Original.png

విశ్రాంతి



Visranthi - Telugu Poem| Dr. Darala Vijaya Kumari

విశ్రాంతి - తెలుగు కవిత | డా. దారల విజయ కుమారి

Published in manatelugukathalu.com on 18/03/2026 

జీవితం అనేది వసంతం మాత్రమే కాదు…

శిశిరం కూడా ఒక పాఠమే.


కొన్ని జీవన వనాలలోఎప్పుడో కానీ తొంగిచూడదు వసంతం.పచ్చని అనురాగాల గుసగుసలు,ఆత్మీయ సొదలు లేనిసుదీర్ఘ శిశిరంలోరాలిపడే ఎండుటాకులు అంగలార్పులే.

మరి కొన్ని లోగిళ్ళలోఅనుబంధాలను నిలువునాకోసేస్తున్న చప్పుళ్ళు,రాలిపడుతున్న కుటుంబాల ముక్కలు.

ఉండుండి.. ఎక్కడివో దుఃఖ రాగాలనుమోసుకుని తెచ్చే గాలి.

బాంధవ్యాల ఆకాశంలోఅకారణ అదిలింపులకుకనురెప్పల కిటికీలుటపటపా కొట్టుకుంటాయి.భారమైన హృదయ మేఘంఉరుములతో వడగళ్ళను కురిపిస్తుంది.

అక్కడక్కడాఎదలను నలగ్గొడుతున్న శబ్దాలువినబడుతూనే ఉంటాయి.

అన్నీ దాచుకుని గంభీరంగా సాగేజీవిత సాగరమిది—అవిశ్రాంతంగా..అలలు ఎగసిపడుతూనే ఉంటాయి.

అనుకోవడంలో సుఖముంటే,అన్నీ.. అందమైనవే..!


ఈ కవిత మీ మనసును తాకితే SHARE చేయండి 🙏

***************

డా. దారల విజయ కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డా. దారల విజయ కుమారి

పేరు : డా. దారల విజయ కుమారి

చదువు : డాక్టరేట్ ఇన్ సైకాలజీ

కుటుంబం : భర్త శ్రీ సురేంద్ర బాబు, పిల్లలు సాహితీ చరణ్, ప్రవల్లిక

స్వంత జిల్లా కర్నూలు, ప్రస్తుత నివాసం తిరుపతి


రచనలు : వేచాను కలకై..కవితా సంకలనం,

చర్విత చరణం - కథా సంకలనం

వివాహ బంధం.. దీర్ఘ కవిత (తానా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి పోటీలో చోటు చేసుకుంది)


మొదటి నవల, "హేమంత తుషారం" ఉషా- శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందింది.


రెండవ నవల "ఎ బర్డ్ ఇన్ ది హ్యాండ్" ఉషా సుజన ఫౌండేషన్ నవలల పోటీలో బహుమతి లభించింది


బహుమతులు..పురస్కారాలు :

************

సాహిత్య ప్రస్థానం , కౌముది, కథా మంజరి, వివిధ, స్నేహ ప్రజా శక్తి, సాక్షి ఫన్ డే, నెచ్చెలి, ఈమాట, మల్లెతీగ ,సహరి , విశాలాక్షి, స్వాతి సచిత్ర వార పత్రిక, విమల సాహితీ సంస్థ, వార్త, నేటి నిజం, మహిళా మార్గం, శ్రమ జీవి, ప్రజా సాహితి పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన కథల కవితల పోటీలలో పలు కథలు కవితలు బహుమతులు పొందాయి, ప్రచురించబడ్డాయి. కొన్ని కథలు,  సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఆలిండియా రేడియో లోనూ ప్రసారం చేయబడ్డాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page