top of page

విజయయాత్రలో చిట్టచివరి మజిలీ

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #VijayaYathraloChittachivariMajili, #విజయయాత్రలోచిట్టచివరిమజిలీ, #TeluguHeartTouchingStories

Vijaya Yathralo Chittachivari Majili - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 28/05/2025

విజయయాత్రలో చిట్టచివరి మజిలీ - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ప్రజ్ఞ్యేశ్వరరావు అతి గొప్ప రచయితల్లో ఒకడు. 40 సంవత్సరాల నుండి కథలు రాస్తున్నాడేమో చేయి తిరిగిన రచయితగా రెండు తెలుగురాష్ట్రాలలో పేరు పొందాడు.. చాలా తెలుగు కథల సంపుటులు, నాటక పుస్తకాలు, నవల్స్ వగైరా వగైరా పుస్తకాలుగా తీసు కొచ్చిన వ్యక్తి. 


ఈ మధ్యకాలంలో టీవీ, సెల్, ఇంటర్నెట్, లాప్టాప్, టాబ్ వగైరా వచ్చాక ఆ ప్రపంచంలో నిలదొక్కు కోలేక ఆయన పుస్తకాలు ప్రింట్ చేయించడం చాలా వరకు తగ్గించాడు. 


అయితే ఈ సామాజిక మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోవడం ఆ మాధ్యమాలలో వెబ్ మ్యాగ్జైన్లు.. ఈ బుక్స్.. వెబ్ సైట్స్.. ఫేస్బుక్ యూట్యూబ్ పాడ్ కాస్ట్ స్టోరీస్ అలా అలా రకరకాల పద్ధతుల ద్వారా సాహిత్యం కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. 


ఎవరు వింటున్నారు ఎవరు చదువుతున్నారు అని లెక్కలు వేసుకునే కన్నా ఆర్టికల్స్ కు వచ్చే వ్యూస్ ను బట్టి ఎందరో కొందరు ఎక్కడో ఒకచోట చదువుతున్నారు అని సరిపెట్టుకోక తప్పడం లేదు. కొందరు తాము చదివిన వాటి గురించి కామెంట్స్ కూడా చేయడంతో గుడ్డి లో మెల్లల కథా ప్రపంచం, నవలాప్రపంచం, కవితా ప్రపంచం అలా అలా సాగుతుంది అని అనుకోవలసి వస్తుంది. 


అయితే ముద్రణా ప్రపంచం విపరీతమైన ఖరీదుతో ముందుకు వెళుతున్న సమయంలో అక్కడక్కడ చీకటిలో చిరుదీపాలలా కొందరు సరస్వతీపుత్రులు గత ఐదు సంవత్సరాలలో పుస్తకాలను ముద్రించే సంస్థల ను పెట్టడం కూడా జరిగింది.. అయితే ఇదివరకు పాత విధానంలో కాకుండా ఇప్పటి ప్రింట్ ఆన్ డిమాండ్ విధానంలో ముందుకు వెళుతూ వారి లాభం నష్టం మాట అటుoచి మొత్తానికి వారు దిగ్విజయంగానే ఆ వ్యవస్థలను నడుపుతూ రచయితలకు అతి కొద్ది పుస్తకాలు అనగా 50 పుస్తకాలు అతి తక్కువ ఖర్చుతో ముద్రించి ఇస్తూ పుస్తకాలను ముద్రించే తమ సంస్థలను దిగ్విజయంగానే ముందుకు నడిపిస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఆ విధానాలకు లోబడి ఇప్పటి రచయితలలో కొందరు ఆ 50 పుస్తకాలనే తెప్పించు కుంటూ ఆనందిస్తున్నారు కూడా. 


అదిగో ఆ విధంగా దిగ్విజయంగా నడిపిస్తున్న విజ్ఞాన విజయం అనే పబ్లిషింగ్ సంస్థ ద్వారా ప్రజ్ఞ్యేశ్వరరావు తను గతంలో రచించి వివిధపత్రికల ద్వారా అవా ర్డులు పొందిన ఒక పది కథలతో '' విజయయాత్రలో మొదటి మజిలీ'' అనే ఒక కథల సంపుటి ప్రచురింప జేశాడు. దాని తాలూకు 50 పుస్తకాల పార్సెల్ కూడా ఆ రోజే వచ్చాయి. 


ఆనందంతో అతను పార్శిల్ ఓపెన్ చేసి చూస్తుండగా ఆ ఇంట్లో పనిచేసే రంగన్న ఇల్లు ఊడ్చుతూ ముందుకు వచ్చాడు అదంతాచూసి యజమానితో ఇలా అన్నాడు. 


''అయ్యా! మీరు పుస్తకాలు వేయించినట్టున్నారు. నాకు ఎప్పుడూ ఇవ్వలేదు కదా ఈసారి ఒకటి ఇవ్వండి.'' అంటూ వినయంగా అడిగాడు. 


''ఒరేయ్ రంగన్న.. నువ్వు ఏమనుకుంటున్నావు ఈ పుస్తకాల గురించి. నీది ఐదవతరగతి చదువు అని చెప్పావు కదా. వీటి గురించి నీకు చెప్పిన నీ గుజ్జు బుర్రకు అర్థం కాదురా. గత రెండు దశాబ్దాలలో నేను.. పత్రికల వారు, సంస్థల వారు నిర్వహించిన కథల పోటీ లకు పంపిన కథలలో ప్రథమ బహుమతి వచ్చిన కథ లన్నమాట ఇవి. ఈ కథలను వాళ్లు ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసా. పోటీలకు వచ్చిన ఐదువందల కథల్లో ఒక పది మంది జడ్జిలు వడబోసి వడబోసి మూడు కథలను సెలక్ట్ చేస్తారన్నమాట. 


ఆ జడ్జిలు ఎవరనుకుంటున్నా వు.. గతంలో వందలాది గ్రంథాలు రాసి ఎన్నో బహుమ తులు పొంది మరెన్నో సన్మానాలు సత్కారాలు పొందిన దిట్టలన్నమాట. అలాంటివారి చేతి నుండి వచ్చిన ఈ 10 కథలు ఒక పుస్తకంగా తీసుకు వచ్చాను ఇప్పుడు. దీనికి '' విజయ యాత్రలో మొదటి మజిలీ'' అని పేరు పెట్టాను..'' అర్థమయ్యేటట్లు వివరించాడు రచయిత ప్రజ్ఞ్యేశ్వరరావు.. 


చీపిరి, చేట ఓ పక్కన పెట్టి యజమాని చెప్పింది అంతా శ్రద్ధగా చేతులు కట్టుకొని తలదించుకొని వింటున్నాడు రంగన్న. 


''నాకు 50 పుస్తకాలే వచ్చాయి రా. నేను ఇందాక చెప్పిన మహానుభావులులాంటి వాళ్ళందరికీ తలొక పుస్తకం ఇస్తాను. వాళ్లని ఈ పుస్తక ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానిస్తాను. అందరూ కాకపోయినా కనీసం 10 మంది వస్తారు. 


ఆ పుస్తకాన్ని చదివిన వాళ్లు సభలో ఒక్కొ క్క కథ గురించి దాని ఔన్నత్యం గురించి దానివల్ల సమాజానికి జరుగుతున్న మేలు గురించి చాలా చక్కగా విడ మర్చి మరీ ప్రసంగిస్తారు ఆనాటి సభలో. నువ్వు వింటా వు కదా ఆ కార్యక్రమం అంతా నీ చేతులు మీదిగనే జరుగుతుంది. 


అప్పుడు ఆయా కథల గురించి మహానుభావులు చెప్పింది అంతా విను చాలు. నీకు పుస్తకం చదవకుండానే అర్థం అవుతుంది ఈ పుస్తకం గురించి. అంతేకానీ వచ్చిరాని చదువుతో నువ్వు ఈ పుస్తకం చదివి ఎలా అర్థం చేసుకోగలవు చెప్పు. అందుచేత నీకు పుస్తకం ఇవ్వలేదని ఏమనుకోకు పుస్తకాలు చాలా తక్కువ వచ్చాయి మరి. '' అంటూ తన పనిలో పడ్డాడు రచయిత ప్రజ్ఞ్యేశ్వరరావు. 


ప్రజ్ఞ్యేశ్వరరావు తనుఅనుకున్నట్లుగా కొందరికి స్వయం గాను కొందరికి పోస్టు ద్వారా తన దగ్గర ఉన్న మొత్తం 50 పుస్తకాలను చేరవేశాడు. వాళ్లల్లో కొందరు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తానని చెప్పడం కూడా జరిగింది. 


ప్రజ్ఞ్యేశ్వరరావు హాయిగా డబల్ కాట్ మంచం మీద పడుకుని ఏసీ పెట్టుకుని జరగబోయే ఆవిష్కరణ కార్య క్రమం గురించి అలా కలలు కంటూ ఉండడం మొదలు పెట్టాడు. 


వివిధ పత్రికల విలేకరులు వస్తారు అంతేనా వివిధ టీవీ చానల్స్ రిపోర్టర్స్ వస్తారు. ఊరి ప్రజలందరూ వస్తారు. తను ముఖ్యంగా ఇన్వైట్ చేసిన ఇద్దరు రాజకీయ నాయకులు కూడా వస్తారు. అంతటి గొప్ప మహాసభ లో తన "విజయయాత్రలో మొదటి మజిలీ" అనే కథల సంపుటి ఆవిష్కరణ. ఇరవైఐదుసంవత్సరాల గా కలలు కంటూ ఉన్న కలల పంట. 


ఆయా మహా రచయితలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథను చదివి ఆ కథ సవివరంగా విశ్లేషిస్తూ దానివల్ల సమాజానికి జరగబోయే మేలును తేటతెల్లం చేసే మహోన్నతసమయం. తన కథలు విశ్లేషణ ద్వారా ప్రపంచానికి గొప్ప మెసేజ్ ఇవ్వ బోతున్న మహోత్కృష్టమైన ఘడియలు. 


అనుకున్నట్లుగా ఆ రోజు రానే వచ్చింది. 


అందమైన షామీయానాలు, లౌడ్ స్పీకర్లు. ప్రజలు కూడా బాగానే వచ్చారు. రచయితలు నాయకులు కొందరు కార్ల మీద కొందరు ఆటోల మీద చేరుకున్నారు మొత్తానికి సభ ఘనంగా ప్రారంభం అయింది. 


దైవ ప్రార్థన అనంతరం ఓ రాజకీయ నాయకుని చేతి మీదుగా పుస్తక ఆవిష్కరణ, సన్మానాలు ఘనంగానే జరిగిపోయాయి. 


ముగింపులో "విజయయాత్రలో మొదటి మజిలీ" అనే తన కథల సంపుటిలోని 10 కథల గురించి ఒక్కొక్క మహామహుడు వివరంగా విశదీకరించే సమయం ఇది. 


ముందుగా పరందామం అనే రచయిత నిలబడి వినయంగా వందనాలు తెలియజేసి కథల సంపుటిలో తను చదివిన ఆరనిజ్యోతి అనే కథ గురించి వివరించడం మొదలుపెట్టాడు. 


''నేను ఆరనిజ్యోతి అనే కథ చదివాను. కథ ఆద్యంతం అద్భుతంగా మలిచారు రచయిత మన ప్రజ్ఞ్యేశ్వర రావు గారు. కథ లో జ్యోతి ఎందుకు ఆరిపోకూడదో.. ఆరిపోవడం వల్ల జరిగే సమస్యలు ఏమిటో చాలా చక్కగా పాటకునికి అర్థమయ్యేలా చెప్పారు. వారి శైలి అద్భుతం. కథలో పాత్రలకు పెట్టిన పేర్లు పరమాద్భుతం.. వారికి నా అభినందనలు వారు మరిన్ని కథలు ఇలాంటివి రాయాలని కోరుకుంటూ సెలవు. '' అంటూ వివరించి కూర్చున్నాడు.. ఓ గొప్ప రచయిత పరంధామం. 


ఆ తర్వాత జోగినాథం తను చదివిన రెండవ కథ గురించి చెప్పడానికి ముందుకు వచ్చాడు. 


'' నేను ఈ పుస్తకంలో రెండవ కథ వీధి ఊరకుక్క చది వాను. కథ ఎలా ఉందంటే నేటి సమాజ తీరుతెన్నుకు అద్దం పట్టినట్టు ఉంది. కథలో పాత్రల స్వభావాలను వారు మలచిన విధానం కడు యింపుగా ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే నభూతో న భవిష్యతి. అంటే భూతకాలంలోనూ భవిష్యత్తు కాలంలోనూ అని అర్థం అన్నమాట. 


చివరగా ఈ కథ గురించి నేను చెప్పేది ఏమిటి అంటేఈ కథ ఒక వండర్ మిరాకిల్.. ఇలాంటి కథను మన రచయిత ప్రజ్ఞ్యేశ్వరరావు గారు మాత్రమే రాయగలరు. నిండు మనసుతో వారికి అభినందనలు తెలియ జేస్తున్నాను. '' అంటూ ముగించి కూర్చున్నాడు మరో మహా రచయిత జోగినాథం. 


అలా మిగిలిన ఎనిమిది మంది.. పెద్దలు, మహా రచయితలు మిగిలిన 8 కథల గురించి సవివరంగా వారి వారి ధోరణిలలో వివరించారు, 


మొత్తానికి బాగా రాత్రి అయ్యే సమయానికి సభ ఘనం గా ముగిసింది. 


అయితే ఆ రాత్రి అక్కడ నుండి వెళ్లే అవకాశం లేక పోవడంతో తన ఇంటికి కొంచెం దూరంలో ఆ పది మందికి ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాడు ప్రజ్ఞేశ్వరరావు. వాళ్లు అక్కడకు చేరి ఫ్రెష్ అయ్యి అంతకు ముందే అక్కడ ఏర్పాటుచేసిన మితాహారం తీసుకుంటూ కబుర్లలో పడ్డారు. 


''పరంధామం గారు నాకు బోలెడన్ని వ్యవహారాలు మాట తీసేయలేక కథ చదివి దాని గురించి నాలుగు మొక్కలు చెబుతానులే అని ఒప్పుకొని వచ్చాను. మన ప్రజ్ఞ్యేశ్వరరావు గారు రాసిన వీధి ఊరకుక్క కథ అసలు చదవలేక పోయానండి. టైము లేదు నాకు. అందుకనే ఏదో మాట్లాడి అలా సరి పెట్టేసాను.. మీకు ఏదైనా డౌటు అనిపించిందా నా ప్రసంగం'' అడిగాడు జోగినాథం. 


''బాగుంది బాగుంది.. నేను కూడా ఇదే విషయం మీకు చెబుదాము అనుకుంటున్నాను జోగినాథం గారు.. ఆరనిజ్యోతి కథ నేను మాత్రం చదివాను అనుకుంటు న్నారా? అంత సమయం ఉంటే ఇంకో నాలుగు కథలు రాసి ఉండేవాడిని. ఆయన కథలు ఎలాగూ బాగా ఉంటాయేమో అన్న ఉద్దేశంతో బాగానే ఉంది అని లాజిక్కుగా చెప్పాను అంతే. కథకు సంబంధం లేకుండా వాక్యాలు అలా అలా పేర్చుకుంటూ పోయాను అంతే. నేను కూడా చదివేసినట్టు బిల్డప్ కట్టాను. లేకుంటే మన ప్రజ్ఞ్యేశ్వరరావు గారు చాలా బాధపడతారు కదా. '' అన్నాడు మొదటి కథ తాను చదివాను అని చెప్పిన పరంధామం. 


మిగిలిన ఎనిమిది మంది పకపక నవ్వేశారు. 


''మేము కూడా సేమ్ డిటో. మేము కూడా సేమ్ డిటో'' మేము ఆయన కథలు చదవలేదు కానీ ఏదో చదివి నట్టు బిల్డప్ ఇచ్చాము. '' అంటూ ఇంకా గట్టిగానే నవ్వేశారు. 


ఆ పదిమంది నవ్వులు రీ సౌండ్ వచ్చినట్టు హాల్ అంతా నిండిపోయాయి. 


వాళ్లు మాట్లాడుకోవడానికి ఒక సెకండ్ ముందే ఆ పది మంది సభకు విచ్చేసినందుకు అభినందించాలి అన్న ఉద్దేశంతో ఆ గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చిన ప్రజ్ఞ్యేశ్వర రావు.. అంతా విని తన మెదడు నరాలలో రక్తప్రసరణ స్తంభించిపోయినట్లు అయిపోయాడు. 


ఒక్క క్షణం అక్కడ ఉండలేక వారితో మాట్లాడలేక వెను తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. వెంటనే బీరువా లోంచి అంతకుముందే తనను సన్మానించిన శాలువా తీసి.. 


''రంగన్న.. రంగన్న.. '' అంటూ బిగ్గరగా పిలిచాడు.. ప్రజ్ఞ్యేశ్వరరావు. 


తన చేతిలో ఉన్న చెత్తబుట్టను పక్కన పెట్టి కంగారుగా యజమాని ముందుకు వచ్చాడు రంగన్న. 


వెంటనే ఆ శాలువాను రంగన్న కు కప్పి.. టేబుల్ సొరుగు లో తనకోసం దాచుకోగ మిగిలి ఉన్న ఒకే ఒక్క

''విజయయాత్రలో మొదటి మజిలీ'' పుస్తకాన్ని రంగన్న చేతిలో పెట్టి నమస్కరించి ఆ తాదాత్మ్య అనుభూతి పొందాడు. 


అర్థం కాని రంగన్న పరవశించి శిలా ప్రతిమలా అలా ఉండిపోయాడు!


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






Comments


bottom of page