top of page
Original.png

విష ప్రయోగం


“అనుమానం పెనుభూతమైతే… విషం అవసరం లేకుండానే ఇంట్లో యుద్ధం మొదలవుతుంది!”
“అనుమానం పెనుభూతమైతే… విషం అవసరం లేకుండానే ఇంట్లో యుద్ధం మొదలవుతుంది!”

Visha Prayogam - Telugu Comedy Story | Malla Karunya Kumar

విష ప్రయోగం - తెలుగు హాస్య కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In manatelugukathalu.com On 23/03/2026


"వారం రోజులుగా ఇదే తంతు సార్. బిగుసుకుపోయి, బెరుకుతో ఉన్నాడు. డాక్టర్‌కి చూపిస్తే పరీక్షలు చేసి, కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను." పక్కనే ఉన్న భర్తను చూపిస్తూ లబోదిబోమని గుండెలు బాదుకుంది కాంతం.

రత్నంను చెక్ చేసి తెల్లముఖం వేస్తూ, "రోగం ఏమిటో పూర్తిగా తెలియాలంటే మరికొన్ని పరీక్షలు చేయాలి" అని అంటూ, రత్నంను తనతో పాటు తీసుకువెళ్ళాడు మానసిక వైద్యుడు.


చాలా సమయమయ్యింది. లోపలికి వెళ్ళిన ఇద్దరూ బయటకు రాకపోయేసరికి, కంగారుపడుతూ అటువైపు చూసింది కాంతం.


ఇంతలో, "కాంతం అంటే మీరేనా?" అని వినిపించడంతో, తుళ్ళిపడుతూ పక్కకు తిరిగి చూసింది. పక్కనే నిల్చుని ఉన్నాడు ఎస్సై ధర్మ!


"అవును సర్, నేనే." తడబడుతున్న స్వరంతో అంది కాంతం, లేచి నిలబడుతూ.


"ఎందుకు ఈ పని చేశావు?"


"ఏ పని సర్?"


"నీ భర్తను విషం పెట్టి చంపాలనుకున్నావు."


"అయ్యో! నేనెందుకు అలా చేస్తాను సర్? మీరు ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్లున్నారు."


"సాక్ష్యాలు లేనిదే నేను రాను. నీ భర్త నీ మీద కంప్లయింట్ ఇచ్చాడు." ఎస్సై చెప్పడం పూర్తి కాకమునుపే,


"అవును సర్, ఈమె నన్ను విషం పెట్టి చంపడానికి చూస్తోంది." అని అన్నాడు అక్కడికి చేరుకున్న రత్నం.


"ఏవండీ!, మీరు ఈ నిందలు వేయకండి. నేను మిమ్మల్ని చంపాలని చూస్తానా? రామ రామ!"


"ఇంకెంత కాలం ఇలా నాటకాలు ఆడుతావు? అంతా నాకు తెలిసిపోయింది."


విసుగు చెంది, "సాక్ష్యం ఏమిటి?" అని అడిగింది.


"మన బిడ్డే సాక్ష్యం."


రత్నం మాటలతో కాంతంకు సంఘటన మొత్తం గుర్తుకొచ్చింది. "అయ్యో! మీ అనుమానం తగలయ్య! మొన్న నేనేదో టెన్షన్ లో ఉండి, విషం పెడితే పీడ పోతుందని అన్నాను. దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా! నిజంగా మీకు పిచ్చి పట్టింది. ఆ క్రైమ్ స్టోరీస్ చూసి చూసి ఇలాంటి వేషాలు వేస్తున్నారు. మీ సంగతి ఇలా కాదు" అని అక్కడే ఉన్న ఎస్సై చేతిలో లాఠీ తీసుకొని రత్నం వైపుకు దూసుకువెళ్ళింది!


"నేనుండగా ఒక అమాయకుడిని బలి కానివ్వను!" ఉరకబోయాడు ఎస్సై.


"ఆగండి సర్, సీన్ మొత్తం తేటతెల్లం అయిన తర్వాత మనం భార్యాభర్తల మధ్య దూరకూడదు." అని అన్నాడు వైద్యుడు వారిస్తూ,


"అంటే?"


"అంటే, విష ప్రయోగం వికటించింది అన్నమాట. ఇప్పుడు మనం వాళ్ళ మధ్యలోకి వెళ్లామంటే దాని తీవ్రతకు మనం కూడా బలి కావాల్సి వస్తుంది."


"వామ్మో! సరైన సమయానికి ఆపారు, లేకుంటే నా పరిస్థితి ఏమయ్యేదో. అందుకే అంటారు అనుమానం పెనుభూతమని." అని అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు ఎస్సై.


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.

telugu comedy story, funny telugu kathalu, husband wife comedy story, telugu humor story, short comedy story telugu, మళ్ళ కారుణ్య కుమార్,  Malla Karunya Kumar


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page