పోలయ్య కవి కూకట్లపల్లికి ఘన సన్మానం
- Kukatlapalli Polayya

- Apr 30
- 1 min read

POlayya Kavi Kukatlapalli Gariki Ghana Sanmanam |Special Telugu Article | Polayya Kavi
పోలయ్య కవి కూకట్లపల్లికి ఘన సన్మానం - తెలుగు వ్యాసం |పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 30/04/2026
సాహిత్యానికి గౌరవం…
కవులకు సన్మానం…
గజల్ సాహిత్యానికి ఘన వేడుకగా నిలిచిన ఒక స్మరణీయ సభ.
హైదరాబాద్: బాగ్ లింగంపల్లి
విశ్వ పుత్రిక గజల్ ఫౌండేషన్
5 వ వార్షికోత్సవం సందర్భంగా
వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం
శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గజల్స్ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది.
కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ అధ్యక్షత వహించిన
ఈ సభకు ముఖ్య అతిథిగా తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు టి.డి. జనార్థన్ హాజరై, విజయలక్ష్మి పండిట్ వ్రాసిన గజల్స్ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా కొందరు గజల్ గాయకులు విజయలక్ష్మి పండిట్ మరియు కళారత్న బిక్కీ కృష్ణ వ్రాసిన గజల్స్ అద్భుతంగా గానం చేసి, సభికులను సంతోష సాగరంలో ముంచి, సభను అలరించారు.
ఈ సందర్భంగా సమకాలీన సామాజిక అంశాలు, మానవ సంబంధాలే ఇతివృత్తంగా, దాదాపుగా 4,500 లకు పైగా కవితలను వ్రాసి చేస్తున్న సాహితీ సేవకు కృషికి గుర్తింపుగా, ప్రముఖ కవి, రచయిత, నటుడు పోలయ్య కవి కూకట్లపల్లిని టిడిపి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు టి.డి. జనార్దన్, డా. విజయ లక్ష్మి పండిట్, కళారత్న బిక్కీ కృష్ణ మెమెంటో, శాలువా, సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించారు. కూకట్లపల్లి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంకా ఈ సభలో నరసింహప్ప, జీవన్ లాల్, రవి శంకర్, డా. వి.డి. రాజగోపాల్, ప్రతాప్ రెడ్డి, డా. రాధా కుసుమ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
తదనంతరం దాదాపు వందమంది గజల్ కవులకు, గాయకులకు వివిధ రంగాలలో విశిష్ట సేవలనందించిన ప్రముఖులకు డాక్టర్ విజయలక్ష్మి పండిట్, టి.డి. జనార్దన్ చేతుల మీదుగా జీవన సాఫల్య మరియు జాతీయ అవార్డులను అందజేసి, అందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది.
-పోలయ్య కవి














Comments