ఓటు సెపరేటు
- Pitta Govinda Rao
- Dec 22, 2023
- 3 min read

'Vote Separate' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 22/12/2023
'ఓటు సెపరేటు' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఆయుధం ఓటు. కానీ..
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఓటు విలువ తెలుసుకోలేకపోతున్నారు.
తద్వారా ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా ప్రభుత్వాదికారుల నిర్లక్ష్యానికి, వారి లంచగొండితనానికి బలై, తమ పనులు సక్రమంగా జరగకపోవటానికి కారకులు అవుతున్నారు.
అంతేనా.. సమస్యలు ఎక్కడవక్కడ కొట్టుమిట్టాడుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ఏమీ చేయలేని అమాయకులు అవుతూ నిట్టూర్చుతూ మరలా ఎన్నికలు సమీపించగా సేమ్ సీను రిపిట్ చేస్తారు ప్రజలు.
ఎక్కడ చూసినా.. పార్టీ జెండాలు
ఎక్కడ చూసినా.. జనం ఉత్సాహం
ఎటు చూసినా.. నాయకులు పోస్టర్లు, బ్యానర్లు
ఎటు విన్నా.. నమ్మలేని పెద్ద పెద్ద హామీలు
ఎలక్షన్స్ వచ్చాయంటే ముందు ఇవి కామన్.
ఎప్పటిలాగే సిరిపురం గ్రామం ప్రచారానికి వచ్చాడు రఘువీరయ్య.
ఎన్నో ఉచిత హామీలు చెప్పాడు. ముఖ్యంగా
మహిళలను ఆకర్షించటానికి ఉచిత ఆర్టీసీ ప్రయాణం సహా పలు హామీలు చెప్పారు.
"గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదని ఈసారి నన్ను గెలిపిస్తే చేసి చూపిస్తా"నని ప్రజలకు మరియు ఆ గ్రామం సర్పంచ్ ధర్మారావుకి హామి ఇచ్చి వెళ్ళాడు.
ప్రజలంతా ఉచితాలకు ఆశపడి ఎలక్షన్స్ సమయానికి ముందు పట్టు చీరలు, బీరులు, బిర్యానీలకు ఆశపడి రఘువీరయ్యకి ఓటు వేసి గెలిపించారు.
తమ బతుకు మార్చగలిగే ఓటు ని ప్రజలు ఇంత హీనంగా చూశారు.
అందుకే ఫలితం అనుభవిస్తున్నారు ప్రస్తుతం.
అదికారం లేనప్పుడు పదే పదే తమ గ్రామానికి వచ్చి అందరికీ పలకరించిన రఘువీరయ్య ఇప్పుడు ఆ గ్రామం వైపే కాదు ఏ గ్రామము వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా... పట్టుమని నాలుగు నిమిషాలు ఉండటం లేదు.
ఎలాగో ఎదురు వెళ్ళి అడిగితే
"రెండు రోజుల్లో మళ్ళీ మీ గ్రామం వస్తాను, కాగితాలు అన్ని సిద్దం చేసుకో " అని ముఖం చాటేసేవాడు.
గ్రామాలకి రోడ్లు లేవు, వీది దీపాలు లేవు, మురుగు కాలువలు సరిగా లేవు. అంతెందుకు ఉచిత హామీల్లో కొన్నీంటికి అడ్డదిడ్డమైన నిబంధనలు పెట్టి గాలికొదిలేయగా,
ఇస్తున్న ఆ కొద్దీ ఉచితాలకు బదులుగా కరెంటు, పురుషులు రవాణా చార్జీలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మొదలైన నిత్యవసర వస్తువులు ధరలు అమాంతం పెంచేసి ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంది.
రఘువీరయ్య ప్రభుత్వం చేస్తున్న ఈ పాపాలు కొందరికి అర్థం కాలేదు ఉచితాలు బాగున్నాయనే భ్రమలోనే బతుకుతున్నారు.
కొందరికి మాత్రం అర్థమయినా ఎవరికి చెప్పుకోలేని, అడగలేని పరిస్థితి.
గ్రామంలో ఓ నలుభై మంది ఓటర్లు సర్పంచ్ పూచికత్తు పై రఘువీరయ్యకి ఓట్లు వేయటంతో ఈ సమస్యలపై సర్పంచ్ ని నిలదీశారు.
సర్పంచ్ ధర్మారావు కూడా నిజాయితీపరుడే. అందువలన తనను అడగటానికి వచ్చిన వారికి మద్దతు ఇచ్చాడు.
నిజమే మరీ! నిజాయితీగా ఓటు వేసేవారికి ప్రశ్నించే హక్కు ఉంది. అది ఎవరూ కాదనని సత్యం.
అంతేనా.. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన నాయకులు సమస్యలు గాలికొదిలేసి ఇష్టానుసారంగా పాలిస్తుంటే ప్రజలు తమ వ్యతిరేకతను శాంతియుత నిరసనలు, ర్యాలీలు ధర్నాల ద్వారా తెలపవచ్చు. అది అందరికీ రాజ్యాంగ కల్పించిన చట్టబద్దమైన హక్కు.
కానీ.. ఇక్కడ ఆ నిరసనలు, ర్యాలీలు అధికార బలంతో ఉక్కుపాదంతో అణచివేయబడుతున్నాయి.
మరోమారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా సమస్యలు పరిష్కారం కాలేదు. అందుకే నిజాయితీ ఓటర్లు సర్పంచ్ పై ఒత్తిడి తెచ్చారు.
"తాను ఎమ్ ఎల్ ఎ గారికి విషయం చెప్తా"నని హామీ ఇచ్చాడు సర్పంచ్.
సర్పంచ్ వెళ్ళి రఘువీరయ్యకి గ్రామ సమస్యలు ఏకరువుపెట్టాడు.
"చూద్దాం, చేద్దాం " అంటూ రెండు వారాలు తిప్పించుకున్నాడు రఘువీరయ్య.
ఆ తర్వాత తనకు మద్దతు ఇచ్చిన ఓటర్లుతో ఆయనకు కలవటానికి వెళ్ళగా అపాయింట్మెంట్ దొరకలేదు.
దీంతో అతనికి వ్యతిరేకంగా మరో పార్టీ కి మారిపోయారు.
విషయం తెలిసి రఘువీరయ్య హుటాహుటిన సిరిపురం వచ్చాడు.
అధికార బలంతో తమకు ఏమైనా కీడు చేయగలడని గ్రామంలో చాలామంది ఆయనకు మద్దతు ఇవ్వగా ఉచిత పథకాల పై నమ్మకం పెట్టుకున్న అందరూ ఆయనకు మద్దతు ఇచ్చారు. దీంతో సర్పంచ్ సహా కేవలం నలభైమంది ఓటర్లు మాత్రమే తన కి వ్యతిరేకంగా ఉన్నారని రఘువీరయ్య అర్థం చేసుకున్నాడు.
"పోతే మీ నలుభైమంది ఓట్లు పోని.. ఎలాగైనా నేనే గెలుస్తాను. అప్పుడు మీ అంతు చూస్తా"నని రఘువీరయ్య వాళ్ళని బెదించాడు.
ఈ విషయం ఊరువాడ తెలిసినా..
"నా ఒక్క ఓటు ఆయనకు వ్యతిరేకంగా వేసినంత మాత్రానా ఆయన గెలుపు ఆపగలమా " అని తమకు తాము ప్రశ్నించుకునే ఓటర్లు ఎందరో ఉన్నారు.
"నా ఒక్క ఓటే వారి గెలుపునకు బలం " అని ఎవరూ ఆలోచించటం లేదు.
అందుకే ప్రజాస్వామ్య దేశంలో విలువైన ఓటు అమ్ముడుపోతుంది.
మరోమారు ఎలక్షన్స్ వచ్చాయి.
ఎప్పటిలానే గ్రామల్లో పార్టీ జెండాలు రెపరెపలు,
జనం ఉత్సాహలు, సంబరాలు నడుమ సారా ఏరులై పారింది. ఎన్నో ఓట్లు అమ్ముడుపోయాయి.
ఇంత జరిగినా సమస్యలు పట్టించుకోని నాయకుడైన రఘువీరయ్య ఓటమి పాలయ్యాడు.
ఇక్కడ ఆనందించదగ్గ, ఆలోచించదగ్గ విషయం ఏంటంటే....
ఆయన కేవలం నలభై ఓట్లు తేడాతో ఓడిపోయాడు. ఆ నలభై ఓట్లు సర్పంచ్ ధర్మారావు సహా ఆయన వెంట నిలబడిన మరో ముప్పైతొమ్మిది మందివి అని తెలిసి ఒకవైపు సర్పంచ్ బృందం ఆనందంతో కేరింతలు కొట్టగా,
రఘువీరయ్య మాత్రం ఊహించని ఈ ఓటమికి, అమ్ముడుపోని నలుభై ఓటర్ల ని తలుచుకుని తన పనితనంకి, తన ఓటమికి బాధ్యత వహించి ఓటమి ఒప్పుకున్నాడు.
ఈ సంఘటనతో నాయకులు చాలామంది మారారు. ఒక్క ఓటే కదా అని తీసిపారేస్తే ఫలితం వేరేగా ఉంటుందని ఆలోచింపజేసేలా చేసింది.
నిజమే..
నీకు ఉన్నది ఒకే ఒక్క ఓటు. దాని విలువ వెలకట్టలేనిది. అది తెలుసుకోవాలి. దానిని అమ్ముకుంటే ఏమో.. కానీ
నిజాయితీగా ఓటు వేస్తే ఖచ్చితంగా సత్ఫలితం ఉంటుంది.
నిజాయితీగా ఓటు వేసే ఓటరుకి ప్రశ్నించే హక్కు ఉంది.
అలాగే
ప్రశ్నించేవాడికి సరైన సమాధానం ఇవ్వల్సిన బాధ్యత నాయకుడిదే.
నిజంగా ప్రశ్నించేవాడికి సరైన సమాధానం చెప్పేవాడే లీడర్ వాడికే మన ఓటు.
ఓటుకు ఉన్న విలువే సెపరేటు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
కథ బావుంది.