'Chethilo Cheyyesi Cheppu Bava' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 21/12/2023
'చేతిలో చెయ్యేసి చెప్పు బావ' తెలుగు కథ
రచన, కథా పఠనం: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
వెంకటాపురం రామలింగేశ్వరయ్య అంటే ఆ చుట్టు పక్కల గ్రామాలన్నింటికీ పెద్ద పేరు. అతను పెద్దగా ఆస్తిపాస్తులు సంపాదించుకోకపోయినా ప్రజోపకరమైన పనులు చేస్తూ ఉంటుంటాడు. చిన్నదో పెద్దదో ఏదో ఒక మంచి పని చేయందే ప్రతిరోజు ఆయనకు నిద్ర పట్టదు. అతని భార్య కాత్యాయని. వాళ్ళిద్దరకు పిల్లలు పుట్ట లేదు. అయితే కాత్యాయని తన భర్తకు ఒక మంచి స్నేహితురాలుగా కూడా అన్ని విషయాలలోనూ సహాయ సహకారం అందిస్తూ అతడిని ముందుకు నడిపిస్తుంది.. అందుకనే భార్య అంటే అతనికి ఎనలేని ప్రేమ.
రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా పెద్దదో చిన్నదో ఏదో ఒక పని కానీ సహాయం కానీ ఆ ఊర్లో చేసుకుంటూ పోతుండడంతో రామలింగేశ్వరయ్య కొంతమంది రాజకీయ వ్యక్తులకు కొరకరానికొయ్యగా కనిపిస్తున్నాడు. తమకన్నా ఎక్కువ ప్రజాభిమానం అతను పొందడం వల్ల తమ భవిష్యత్తులు ఏమవు తాయో అన్న భయం వాళ్ళ గుండెల్లో ఉంది. అయితే ఏ ఒక్కరిని రామలింగేశ్వరయ్య పట్టించుకోకుండా ఎవరితో సంబంధం లేకుండా తను మిగిలిన ఊరి ప్రజల అందరి సహకారంతో మంచిపనులు మొదలు పెట్టి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.
ఒకరోజు ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే గంగాధర రావుగారు దగ్గర నుండి రామలింగేశ్వరయ్యకు కబురు వచ్చింది. తనకున్న పాత సైకిల్ మీదే రామలింగేశ్వ రయ్య నాలుగు కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎమ్మెల్యే గారి ఇంటికి సమీపించాడు.
చూస్తే ఎమ్మెల్యే గారు ఇంటి వాతావరణం రామలింగే శ్వరయ్యకు కొంచెం చిత్రంగా అనిపించింది. ఆ నియో జకవర్గానికి సంబంధించిన ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పి లాభం పొందడానికి అని వచ్చి బారులుతీరి నిలబడ్డారు.. భవనంలో లోపలి గదిలో పరుపు మీద కూర్చున్న ఎమ్మెల్యే గంగాధరరావుగారు దగ్గరకు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తూ వాళ్ళ కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదా సమస్యలు, కోర్టు సమస్యలు చెప్పుకుంటు న్నారు.. కొంచెం దూరంగా నిలబడి..
ఎమ్మెల్యే అనుచరులు అవన్నీ నోట్ చేసుకుంటున్నారు. ఎవరితోనైనా ఆ సమస్య గురించి చర్చించాలి.. మాట్లా డాలి అనిపిస్తే వెంటనే ఫోన్ తీసుకొని అవతల వాళ్ళ తో మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే గారు. అవసరమైతే వాళ్ళను రప్పిస్తున్నాడు. ఇరుపక్షాలను తన రూము లోకి రప్పించి వాళ్ల సమస్యలను ఏదో విధంగా పరి ష్కరించి పంపిస్తున్నాడు. ఈ విధానంలో ఒకపక్షం మాత్రమే లాభపడుతుంది రెండవ పక్షం తప్పకుండా నష్టపడుతుంది అన్న విషయం రామలింగయ్య ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సార్లు గమనించాడు. అయినప్పటికీ ఏమీ చేయలేకపోయేవాడు.
. ఎమ్మెల్యే గారు మీద ఉండే భయంతో అలా ఒప్పంద పడిపోతున్నారు ప్రజలు. ఎమ్మెల్యేగారు కూడా బోల్డంత లాభపడిపోతున్నారు. అదిగో ఆ విధంగా ఆయన ఎమ్మెల్యే అయ్యాక సమకూర్చుకున్నవే రెండు రైసు మిల్లులు, 50 ఎకరాల కొబ్బరితోట.
ఎమ్మెల్యేగారి పిలుపుతో వచ్చిన రామలింగేశ్వరయ్య చేసేదిలేక తను కూడా జనం అందరితోపాటు లైను చివరన నిలబడవలసి వచ్చింది. 'అయ్యా నన్ను ఎమ్మెల్యే గారు కలవమన్నారు. '.. అని ప్రత్యేకంగా అక్కడ ఉన్న నిర్వాహకులకు చెప్పిన పని జరగలేదు. మొత్తానికి లైన్ లో నిలబడ్డాడు. లెక్క వేసుకుంటే సాయంత్రం ఐదు గంటలకు తనకు పిలుపు వస్తుంది అనుకుని ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడ్డాడు రామలింగేశ్వరయ్య.
మొత్తానికి అలా అలా సమయం గడిచిపోయింది. మధ్యాహ్నం ఆ లైనులో నిలబడే అక్కడికి వచ్చిన తినుబండారాలు తిన్నాడు. అలాగే సాయంత్రం వరకు జనం మధ్యకి వచ్చిన టీ కాఫీలు తాగి సరిపెట్టు కున్నాడు.. అలా అలా సాయంత్రం ఐదు గంటల అయ్యింది. తన వంతు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగారి రూమ్ లోకి వెళ్లి నిలబడి ఎందుకు పిలిపించారు.. అంటూ వినయంగా అడిగి ఆయన ఏం చెబుతారు అని ఎదురు చూడసాగాడు రామలింగేశ్వరయ్య.
'' ఇవన్నీ సెటిల్మెంట్ వ్యవహారాలు. నీ పేరు రామలింగే శ్వరయ్య అట కదా వచ్చిన వెంటనే నా దగ్గరికి రావా ల్సిoది. సరే.. ఊరు ఉద్ధరించడానికి మేము ఉన్నాం కదా. నీ పనేదో నువ్వు చేసుకుంటే సరిపోతుంది కదా. కుటుంబ పరంగా నీకేమైనా లాభాలు కావాలంటే మేము చేసి పెడతాం. '' అంటూ ఎమ్మెల్యే గంగాధర రావు గారు రామలింగేశ్వరయ్య వైపు చూస్తూ అన్నాడు.
''ఎమ్మెల్యే గారు క్షమించండి నా పనేదో నేను చేసు కుంటున్నాను ఎవరికీ నా వల్ల నష్టం లేదు కదా. ''
అని సమాధానం చెప్పాడు రామలింగేశ్వరయ్య.
ఎమ్మెల్యే గారు ఇక అతనిని తన దారిలోకి తెచ్చుకో వడం అనవసరం అనిపించి పంపించేశాడు.
ఏది ఆగిన ఈ కాలచక్రం ఆగదు కదా ఈ కాలచక్రానికి నట్టులు లూజ్ అయినా టైట్ అయినా ఆయిల్ వెయ్య కపోయినా అలా తిరుగుతూనే ఉంటుంది.
ఇప్పుడు అదే జరిగింది కాలచక్రం అలా తిరిగి తిరిగి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసాయి. ఇప్పుడు ప్రతి పక్షము బలం పుంజుకుంది. దాంతో ఎవరిని ఎమ్మెల్యే గా నిల బెట్టాలి అని పార్టీ అధిష్టానం ఆలోచించడం మొదలు పెట్టింది. ఈసారి పాతవారికి కాకుండా కొత్త వారికి
ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని నిశ్చయించుకుని వెంకటా పురం రామలింగేశ్వరయ్య కు బాగా పలుకుబడి పెరిగింది అని తెలుసుకుని.. అతడినే నిలబెట్టాలని అందరూ నిర్ణయించుకున్నారు.
రాజకీయాలు అంటే ఏమాత్రం సరిపడని రామలింగే శ్వరయ్య ముందు ససేమిరా అన్నాడు కానీ కొన్ని తప్పని పరిస్థితులలో ఒప్పుకోక తప్పలేదు. సరే పదవి ఉంటే ఇంకా ఎక్కువ ఉపకారాలు చేయొచ్చు కదా ఊరి ప్రజలకు.. తప్పేముంది.. అని స్నేహితులు, ముఖ్యంగా అతని భార్య కాత్యాయని సలహా ఇవ్వడంతో మనసు ని సముదాయించుకొని అందరి ప్రోత్సాహంతో ఎలక్షన్ల లో నిలబడ్డాడు రామలింగేశ్వరయ్య.
అప్పటివరకు ఉన్న అధికార పక్షం చిత్తుగా ఓడిపో యింది. ఎమ్మెల్యే గంగాధరరావు కూడా డిపాజిట్ కోల్పోయాడు. ప్రతి పక్షం అధికారంలోకి రావడంతో రామలింగేశ్వరయ్య చాలా సంతోషంగా ప్రజల సమ స్యలు తీర్చవచ్చు అన్న నమ్మకంతో ఎమ్మెల్యేగా పదవి స్వీకరించి తన పరిధిలో ప్రజలకు ఉపకారాలు చేయ డం మొదలుపెట్టాడు.
తర్వాత ప్రజలందరూ కోరిన మీదట ప్రతిరోజు కొంత సమయం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎమ్మెల్యే మాట అంటే అందరూ వింటారు పోలీస్ యంత్రాంగం కూడా సహాయ సహకారాలు అందిస్తారు.. అంటూ హితులు చెప్పడంతో ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య ఒప్పుకోవలసి వచ్చింది.
పదవి చేపట్టి మూడు నెలలు గడిచాక..
భార్య కాత్యాయని ఒకరోజు మధ్యాహ్నం భర్తకు భోజనం పెడుతూ ''ఏవండీ గతంలో ఎమ్మెల్యే ఒక పక్షానికి లాభం వచ్చేలా తీర్పులు చెబుతున్నాడని మీరు అతన్ని విమర్శించారు. డబ్బున్న వాళ్ళకి అస మర్థులకి తన పలుకుబడితో న్యాయం చేసి.. సమర్థు లని నీతి పరులని అన్యాయం పాలు చేస్తూన్నాడని అన్నారు కదా.
ఎవ్వరూ ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదని.. చేసిన
సెటిల్మెంట్లు, దందాలు నిర్వహించకూడదని అప్పుడు అన్న మాట మీకు గుర్తుందా. చివరికి ఇప్పుడు మీరు కూడా అలా చేయక తప్పడం లేదు. రాజకీయ నాయ కులు అంటే అంతే కదా.
నేను మీకు చెప్పవలసింది ఏమీ లేదు కానీ.. నా ప్రోత్సాహంతో ఎన్నికలలో నిలబడ్డారు కనుక భార్యగా చిన్ని మాట. మీకు ఇష్టంలేకపోయినా ఎమ్మెల్యే అయ్యారు.. ఇది మీకు దేవుడు ఇచ్చిన కోరిన వరం. అందుచేత వీలైనన్ని మంచి పనులే చేయండి. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది. అలాగే నడుచుకుంటా నని నా చేతిలో చేయి వేసి ఒట్టు పెట్టండి.. '' అంటూ అడిగింది.. భర్తను.
'''' ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం ఎంతసేపు కాత్యా యని.. ఇదిగో మాట ఇస్తున్నాను కదా. నా మాట మీద నమ్మకం ఉంచుకో చాలు. ''
రామలింగేశ్వరయ్య భోజనం పూర్తిచేసి చేతులు కడు క్కొని పైకి లేచి టవల్తో చెయ్యి తుడుచుకొని తన గది లోకి వెళ్లిపోయాడు.
***''
మరొక నెల రోజులు పోయిన తర్వాత..
కాత్యాయని తన భర్త పడుకున్న బెడ్ రూమ్ లోకి వచ్చి భర్త కాళ్లు నొక్కడం వదిలిపెట్టింది.
'' ఏమండీ. '' అంటూ నెమ్మదిగా ఏదో విషయం చెప్ప, బోతున్న భార్య వైపు చూసి..
''ఏమిటి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. '' అన్నాడు రామలింగేశ్వరయ్య.
''ఏమీ లేదండి మా చెల్లెలు లక్ష్మి ఈ ఊరులోనే ఉంటుంది కదా. వాళ్ళ అబ్బాయి చక్రి గాడికి ప్రతిభ కాలేజీలో ఇంజనీరింగ్ లో సీటు కావాలట మీకు చెప్పమంది. '' అంది నెమ్మదిగ.
రామలింగేశ్వరయ్య మంచం మీద కూర్చుని స్టీలు చెంబులో నీళ్లు తాగి..
'' మనవాళ్లకు ఆమాత్రం సాయం చేయలేకపోతే ఈ పదవి ఇంకెందుకు కాత్యాయని. వాడికి మార్కులు తక్కువ వచ్చాయి కదా. పాపం సీటు రావడం కష్టమే. కానీ మనం పైవాళ్లకు రెకమెండ్ చేసి సీటు ఇప్పించే విధంగా మాట్లాడదాం. మనం చెబుదాం. '' అంటూ తన లైట్ బ్లూ కలర్ సెల్ అందుకొని ప్రతిభా కాలేజ్ ప్రిన్సి పాల్ గారికి ఫోన్ చేశాడు రామలింగేశ్వరయ్య.
''బాగున్నారా చిదంబరేశ్వర గారు. నేను ఎమ్మెల్యే అయ్యాక ఏ కోరిక కోరలేదు సొంత కుటుంబ విషయం ఒకటి ఉంది చేసి పెట్టాలి. మా మరదలుగారు అబ్బా యి చక్రీకి మార్కులు బాగా తక్కువ వచ్చాయి. వాడికి ఇంజనీరింగ్ సీటు కావాలట మీరు మేనేజ్ చేసి ఎలా గైనా ఆ సీటు ఇప్పించండి తప్పదు. మా కుటుంబం లోని వ్యక్తి కదా. సమస్య రాదు మీరు కంగారు పడ కండి వస్తే నేను చూసుకుంటాను. డిపార్ట్మెంట్లన్నీ మన చేతిలో ఉంటాయి కదా. ఆ.. సరే.. అలాగే.. మీరు మాటిచ్చారు అంతకన్నా నాకు ఇంకేం కావాలి.. చాలా సంతోషం. నామీద గౌరవం ఉంచినందుకు మీకు రుణపడి ఉంటాను. వివరాలు మీకు మెసేజ్ పెడ తాను. మా మరదలుగారు ఇంటికి సీటు కన్ఫర్మ్ అయినట్టు లెటర్ పంపించండి.. సరే ఉంట. ఆ.. అదా.. అందరికీ సీట్లు ఎలాట్ చేసేసారా. ఏముంది.. ఇంతకుముందే సెలెక్ట్ అయిన ఒక అబ్బాయికి ఏదో రిస్క్ పాయింట్ ఉందని.. అతడిని తప్పించేయండి. ఆ సీటు మా వాడికి వచ్చేలా చూడండి సార్. మీరు తలచుకుంటే జరగనిది ఏముంది.. ఎమ్మెల్యేను కదా.. ఆ మాత్రం గౌరవం ఉంచండి సార్, మీకు ఎప్పుడైనా ఏ విషయం లో నైనా అవసరమైతే నాకు ఫోన్ చేయడం మర్చిపోకండి. జరగనిదైనా చిటికెలో చేసి పెడతాను.. ఉంటాను. '' మాట్లాడి తన లైట్ బ్లూ కలర్ సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
తన భర్త మాట్లాడిన మాటలు విని సంబరపడిపో యింది కాత్యాయని. తన చెల్లెలు కొడుక్కి మహో పకారం జరుగుతున్నందుకు.
**
కాసేపటికి మంచం మీద నుండి లేచి షర్ట్ వేసుకొని బయట తనకోసం చూస్తున్న జనాల్ని పలకరించడానికి వెళ్లి మడత కుర్చీలో కూర్చున్నాడు రామలింగేశ్వ రయ్య. బారులు తీరి ఉన్న ప్రజలే కాదు తన స్నేహి తులు, బంధువులు బ్యాచులు బ్యాచులుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి అతని దగ్గరకు వస్తు న్నారు.
'' నమస్తే ఎమ్మెల్యే అన్నా. '' ప్రభాకర్ అనే వ్యక్తి ముందుకు వచ్చి నమస్కరించి అన్నాడు.
''ప్రభాకర్.. ఇలా వచ్చావ్ ఏంటి?'' కుశలం అడిగాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
'' ఏం లేదు మా బడుద్దాయి కి డిగ్రీ పాసైనట్టు సర్టిఫికెట్ కావాలి. నువ్వు తలుచుకుంటే వస్తుంది అని నీ దగ్గ రకు వచ్చాను. ''
'' మీ వాడు ఏం చదివాడు?''అడిగాడు ఎమ్మెల్యే.
'' నీకు తెలుసు కదా ఇంటర్ మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు. '' చెప్పాడు ఆ వచ్చిన ప్రభాకర్.
'' సరేలే ఇది పెద్ద పని కాదు కదా ఈమాత్రం దానికి నువ్వు రావాలా ఉండు ఇప్పుడే మన విద్యాశాఖ మంత్రి ధనుంజయరావు గారికి ఫోన్ చేస్తాను.. '' అంటూ తన లైట్ బ్లూ కలర్ సెల్ ఆన్ చేసి ఏదో నెంబర్ నొక్కి చెవు దగ్గర పెట్టుకున్నాడు.
'' హలో ధనుంజయరావు గారు బాగున్నారా నేను ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్యని. మీతో చిన్న పని పడింది సార్. ఒక అబ్బాయికి డిగ్రీ పాస్ అయిన సర్టిఫికెట్ కావాలి సార్. అబ్బా అవన్నీ ఉంటే మీకెం దుకు ఫోన్ చేస్తాను. తప్పదు మనవాళ్లు. అలాగే.. చేసి పెట్టండి చాలా థాంక్స్.. '' అంటూ సెల్ క్రింద పెట్టి
'' ఇదిగో ప్రభాకర్ నీ పని అయిపోయింది ఇక నువ్వు వెళ్ళవచ్చు. '' అంటూ మరొక సమస్యతో వచ్చిన వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
'' నమస్తే ఎమ్మెల్యే గారు'' ఆ వచ్చిన మరో వ్యక్తి నమస్కరిస్తూ అన్నాడు.
'' ఏరా సుందరం బావ బాగున్నావా ఎమ్మెల్యే.. గారు అంటున్నావు.. నీకేదో పెద్ద పని చేసి పెట్టాలి అవునా?''
తన బంధువుతో చిలిపిగా నవ్వుతూ అన్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
'' పెద్ద పని కాదురా బావా. నా పేరున అర్జెంటుగా తెల్ల రేషన్ కార్డు కావాలిరా. ''
'''30 ఎకరాల ఆసామివి నీకెందుకురా.. సరే ఉండు మన డెవలప్మెంట్ ఆఫీసర్ గారితో మాట్లాడతాను..
హలో మూర్తి గారు.. నేను ఎమ్మెల్యేని. ఎలా కింద మీద పడతారో నాకు తెలియదు సాయంత్రానికి మా బావ పేరుని తెల్ల రేషన్ కార్డు కావాలి. అలాగన్నారు బాగుంది సరే సరే అలాగే. '' అంటూ సెల్ ఆఫ్ చేసి క్రింద పెట్టి.
''ఆ నీ పని అయిపోయింది రా బావ నువ్వు వెళ్ళిపో వచ్చు మీ ఇంటికి వచ్చేస్తుంది కార్డు. ''' అంటూ అతన్ని పంపించేశాడు.. ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య
'' ఏరా శివసాగరం నువ్వొచ్చావే. ఫోన్ చెయ్యక పోయావా?'' అంటూ పలకరించాడు శివసాగరాన్ని ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
'' ముఖ్యమైన విషయం. మా తమ్ముడు జేజి బాబు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడి మోటార్ సైకిల్ కింద ఓ ముసలోడు పడి చచ్చాడు. వీడిని స్టేషన్లో పెట్టేసారు ప్రాణ స్నేహితుడువి ఎమ్మెల్యే అయ్యావు ఇప్పుడు నువ్వే నాకు ఉపకారం చెయ్యాలి. కేసు లేకుండా చేయాలి. '. చేతులు పట్టుకు అడిగాడు శివసాగరం.
'' సర్లే చేతులు వదులు ఉండు ఫోన్ చేస్తాను.. హలో.. ఎస్పీ గారు. జేజి బాబు అక్కడ ఉన్నాడు కదా స్టేషన్లో.. మనవాడే.. కొద్దిగా కేసు మనవాడి మీద పడకుండా మేకప్ చేయండి.. చూడండి వాడిని స్టేషన్ నుండి పంపేయండి. అలాగా.. అలాగా.. సరే వీలు చూసుకునే పంపండి.. ఏం చేస్తాం మరి. అలాగే మీ మేలు మరిచి పోతానా ఉంటాను. '' అంటూ తన లైట్ బ్లూ కలర్ సెల్ బల్ల మీద పెట్టాడు ఎమ్మెల్యే.
'' ఇక నీ పని అయిపోయింది శివసాగరం వెళ్ళిపో.
జేజి బాబు రేపు జైలు నుండి మీ ఇంటికి వచ్చేస్తాడు. ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే ఫోన్ చెయ్ చాలు పనిగట్టుకు ఈ బారులు తీరిన లైన్లో నిలబడడం ఎందుకు ఇక వెళ్ళు'' అంటూ పంపించేశాడు.. ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
''మా కోడలు తనను వేధిస్తున్నట్టు మా అందరి మీద కేసు పెట్టింది రా.. కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాం.
నీ పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా ఆ కేసు కొట్టి వేయించు'' మరో బంధువు.. డిమాండ్ గా అడిగాడు.
ఎమ్మెల్యే ముందుకు వచ్చి.
ఆ అభ్యర్థనలు.. డిమాండులు తన లైట్ బ్లూ కలర్
సెల్ఫోన్ ద్వారా మాట్లాడి వాళ్లకు ఏం భయం లేదు వెళ్ళండి అంటూ భరోసా ఇచ్చి పంపించేవాడు.. ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
ఇలా.. ఇలా. వారంలో రెండు రోజులు ప్రజా న్యాయ స్థానం ఎమ్మెల్యే గారి ఇంటి ముందు జరుగుతూనే ఉంది.
. ***''
మరో రెండు నెలలు గడిచింది.
ఒక రోజు రాత్రి భర్తకు భోజనం పెడుతూ..
''మా చెల్లెలు గారి అబ్బాయి చక్రి ఇంజనీరింగ్ సీటు గురించి 2 నెలలు క్రితం మీకు చెప్పాను. మీరు వెంటనే ఫోన్లో మాట్లాడి పని అయిపోతుంది అన్నారు. ఆ పని అవ్వలేదట వాళ్ళు బాధపడుతున్నారు.
రామలింగేశ్వరయ్య వినబడనట్లు మౌనంగా ఊరుకు న్నాడు.
మరో విషయం ఇందాక.. ఎవరో ప్రభాకర్ అట.. మీరు లేనప్పుడు వచ్చాడు. వాళ్ల అబ్బాయికి డిగ్రీ సర్టి ఫికెట్ ఇస్తానన్నారట.. అది కూడా వాళ్లకి రాలేదట.. విసవిస లాడుతూ మాట్లాడి మీకు చెప్పమని వెళ్ళి పోయాడు.
తర్వాత సుందరం అని మీకు బావ అవుతాడట. అతను నాలుగు రోజుల క్రితం వచ్చాడు. తెల్లరేషన్ కార్డు కూడా ఇప్పించలేకపోయేడేటమ్మా మీ ఆయన
అంటూ కోపపడినట్టు మాట్లాడి వెళ్లిపోయాడు.
నిన్న శివసాగరమని ఒక అతను వచ్చాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న అతని తమ్ముడుని స్టేషన్ నుండి తెప్పించ లేకపోయారట ఈ రెండు నెలల నుండి. అతను మరో లా ప్రయత్నించుకున్నాడట.. పాపం. మీరు ఎవరికీ ఉపకారం చేయలేకపోతున్నారని ఏమాత్రం గౌరవం లేకుండా అతను మాట్లాడుతుంటే నాకు ఎంత చిన్న తనం అనిపించిందో మీకు తెలుసా? మీకు వీలైతే నే చేస్తానని చెప్పండి లేకపోతే ఎందుకు అలా చెప్పటం.
ఇంకా చాలామంది వచ్చారు. మీరు చేస్తానన్న పని ఏది ఎవరికి జరగలేదట.
మీరు ఆదేశించినప్పటికీ అధికారులు ఎవరూ మీ పని చేయకపోతే మీకు విలువ లేనట్టే కదా.. ఎమ్మెల్యే అయ్యాక ఆ మాత్రం పరువు లేకపోతే ఎలాగండి.
ఒకసారి పరిపాలన చేసే వాళ్ళందరినీ కబురు పెట్టి మీటింగ్ పెట్టి మీరు చెప్పిన పని వెంటనే చేసేలాగా గట్టిగా భయం చెప్పండి. '' అంటూ ఇంకా ఏదో చెప్ప బోయింది.. కాత్యాయని.
రామలింగేశ్వరయ్య నవ్వకుండా నవ్వినట్టు నవ్వి సగం భోజనం చేసి పైకి లేచి పడక గదిలోకి వెళ్లి మంచం మీద వాలాడు.
కాత్యాయని తను భోజనం చేసి వచ్చి భర్త కాళ్ల దగ్గర స్టూలు మీద కూర్చుని కాళ్లు నొక్కడం మొదలు పెట్టింది.
కాసేపటికి టీపాయ్ మీద ఉన్న సెల్ రింగ్ అయ్యింది.
కానీ అది ఎరుపు రంగు సెల్.. ! తన భర్త ఎప్పుడూ
లైట్ బ్లూ కలర్ సెల్ కదా ఎక్కువగా వాడేది. అందరితో మాట్లాడేది ఆ సెల్ నుండే కదా. ప్రజల సమస్యలు తీర్చేది కూడా ఆ సెల్ నుండే. మరి ఈ ఎరుపు రంగు సెల్ ఎక్కడిది?.. కాత్యాయనకి అనుమానం వచ్చింది. అది బలపడింది.
'' ఈ ఎరుపు రంగు సెల్ ఎక్కడిది. రింగ్ అవుతుంది. సెల్ తెమ్మంటారా.. మాట్లాడతారా? అసలు మీ లైట్ బ్లూ కలర్ సెల్ ఏది?'' ప్రశ్నించింది భర్తను.
''వద్దు.. ఇప్పుడు మాట్లాడను. రాత్రి అయింది కదా. బాగా నీరసంగా ఉంది. పడుకుంటాను. రేపు మాట్లా డతాను కాత్యాయని. '' నీరసంగా అన్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
'' ఎమ్మెల్యే అయ్యాక ఈ ఆరు నెలల నుండి చూస్తు న్నాను. మీ లైట్ బ్లూ కలర్ సెల్ లోంచి మీరు మాట్లాడ తారు కానీ ఎక్కడ నుండి దానికి కాల్స్ ఏమి రావేమి
టండి. ?''.. నిద్రలోకి జారుకోబోతున్న భర్తను తట్టి లేపి ప్రశ్నించింది కాత్యాయని.
''కాత్యాయని.. ఆ లైట్ బ్లూ కలర్ సెల్ కి కాల్స్ రావు. అంతేకాదు ఆ సెల్ లో నేను మాట్లాడిన కాల్స్ ఎవరికి వెళ్ళవు కూడా. ''
'' అంటే.. ''
'' నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని నెలలకు ఆ లైట్ బ్లూ కలర్ సెల్లో సిమ్ తీసేసాను. ఆ డమ్మి సెల్ తోనే అందరితో మాట్లాడుతున్నాను'' మత్తుగానే చెప్పాడు రామలింగేశ్వరయ్య.
'' అట్లా ఎందుకు చేశారు.. అసలు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? ''
'' ఎందుకంటే.. ఎందుకంటే.. పదవి నిర్వహిస్తూ మంచిపనులే చేస్తానని నా భార్యకు మాటిచ్చాను. అందు.. కన్న.. మాట!''
మత్తుగా చెప్పి నిద్రలోకి జారుకున్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య.
కాత్యాయనికి కాసేపు అర్థం కాలేదు. కొంచెం సేపటికి అర్థం అయి.. భర్త కాళ్ల పై తన శిరస్సు ఉంచి అలా తను కూడా నిద్ర లోకి జారుకుంది.
****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comentários