top of page
Original.png

ఘనంగా “వహ్వా సామెత కథలు” పుస్తకావిష్కరణ


ఘనంగా “వహ్వా సామెత కథలు” పుస్తకావిష్కరణ
ఘనంగా “వహ్వా సామెత కథలు” పుస్తకావిష్కరణ

Ghanamga Vahva Sametha Kathalu Pusthakavishkarana - Book Unveiling ceremony | Patrayudu Kasi Viswanadham

ఘనంగా “వహ్వా సామెత కథలు” పుస్తకావిష్కరణ | పట్రాయుడు కాశీవిశ్వనాథం

Published In manatelugukathalu.com On 02/05/2026


తెలుగు భాషా సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే సామెతలను కథల రూపంలో అందించిన “వహ్వా సామెత కథలు” పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది.


శ్రీమతి బాదిరెడ్డి భారతి(అంబటి), పిళ్లా కృష్ణవేణి (అమరపిని) సహకారంతో పుస్తక ప్రచురణ చేయడమైనది.


తేదీ.27-4-2026న బాల్య మిత్రురాలు శ్రీమతి బాదిరెడ్డి భారతి ఇంట్లో విశిష్ట అతిధి శ్రీమతి 

యనమండ్ర శ్రీ సాయి మణి (గుమ్మా) తెలుగు అధ్యాపకురాలు శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు పెందుర్తి వారిచే బంధుమిత్రుల మధ్య ఘనంగా “వహ్వా సామెత కథలు” పుస్తకావిష్కరణ చేయడమైనది.


కార్యక్రమంలో శ్రీమతి భారతి దంపతులకు, మరియు పిళ్లా కృష్ణవేణికి దుశ్శాలువా కప్పి వేదపండితులు దేశరాజు సాయి శ్యామ్ కుమార్ శర్మ వేద ఆశీర్వచనంతో వారిని ఘనంగా సత్కరించడం జరిగింది.


అనంతరం విశిష్ట అతిధి శ్రీమతి 

యనమండ్ర శ్రీ సాయి మణి (గుమ్మా) పుస్తక సమీక్ష చేశారు.


పుస్తక సమీక్ష: 

*************

"వహ్వా! సామెతల కథలు" – తెలుగు భాషా మాధుర్యానికి ఓ చిరు వారధి మన తెలుగు భాషా సంస్కృతులకు అద్దం పట్టే సామెతలను, నేటి తరానికి అర్థమయ్యేలా కథల రూపంలో అందిస్తున్న అద్భుతమైన సంకలనం "వహ్వా! సామెతల కథలు". ప్రముఖ రచయిత కాశీ విశ్వనాథం పట్రాయుడు గారు ఎంతో శ్రమించి ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకం ఆబాల గోపాలాన్ని అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


పుస్తక విశేషాలు:

***************

కథల సంఖ్య: ఈ సంపుటిలో మొత్తం 35 ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ప్రతి కథ ఒక సామెతను ప్రాతిపదికగా తీసుకుని, జీవిత సత్యాలను నీతిగా బోధిస్తుంది.


పేజీలు: 80 పేజీలతో, పాఠకులు సౌకర్యవంతంగా చదువుకునేలా ఈ పుస్తకాన్ని చక్కగా తీర్చిదిద్దారు.


బొమ్మలు: పిల్లలను, పెద్దలను ఆకట్టుకునేలా ప్రతి కథకూ తగిన ఆకర్షణీయమైన బొమ్మలను ఇందులో పొందుపరిచారు. ఇవి కథాంశాన్ని మరింత స్పష్టంగా, వినోదాత్మకంగా పాఠకులకు చేరువ చేస్తాయి.


ధర: ఈ పుస్తకం విలువ కేవలం 100 రూపాయలు మాత్రమే.


ఎందుకు చదవాలి?

******************

రచయిత కాశీ విశ్వనాథం పట్రాయుడు గారు, "పిండి కొద్దీ రొట్టె", "నేల విడిచి సాము", "కుక్క కాటుకు చెప్పుదెబ్బ" వంటి ఎన్నో ప్రాచుర్యం పొందిన సామెతలను ఎంచుకుని, వాటి వెనుక ఉన్న లోతైన అర్థాన్ని సహజమైన కథా గమనంతో వివరించారు. సరళమైన భాషలో సాగే ఈ కథలు అందరినీ అలరిస్తాయి.


ముగింపు:

**********

వివిధ ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమై పాఠకుల మన్ననలు పొందిన ఈ కథలన్నీ ఇప్పుడు ఒకే పుస్తక రూపంలో రావడం విశేషం. మన సామెతలను, వాటి వెనుక ఉన్న భావాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. భాషాభిమానులు, పిల్లలకు మంచి కథలను అందించాలనుకునే తల్లిదండ్రులు తమ గ్రంథాలయంలో తప్పక ఉంచుకోవాల్సిన పుస్తకమిది.


పుస్తక ప్రాప్తి:

************


ఈ పుస్తకాలు నేరుగా రచయిత వద్ద లభిస్తాయి. ఆసక్తి గల పాఠకులు 94945 24445 అనే నంబర్‌కు సంప్రదించగలరు.



సమీక్షకురాలు:

శ్రీమతి యనమండ్ర శ్రీ సాయి మణి (గుమ్మా) తెలుగు అధ్యాపకురాలు 

శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు - పెందుర్తి



ఈ కార్యక్రమంలో దాతలు శ్రీమతి బాదిరెడ్డి భారతి, పిళ్లా కృష్ణవేణి, అంబటి రామారావుగారు, వారి కుటుంబ సభ్యులు, పుస్తక రచయిత కాశీ విశ్వనాథం పట్రాయుడు, గుమ్మా విజయశర్మ, తదితరులు పాల్గొనారు.



తదనంతరం దాతలకు, బంధు మిత్రులకు రచయిత ధన్యవాదాలు తెలియచేశారు.



కాశీవిశ్వనాథం పట్రాయుడు (బాల మిత్ర)















***

పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu Kasi Viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు : 

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷

 




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page