'Walking Janalu Teeru Thennulu' - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 30/04/2024
'వాకింగ్ జనాలు - తీరుతెన్నులు' తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
ఉదయం వాకింగ్కి వెళ్ళేవారిలో వృద్ధులు యువత మహిళలు అన్నిరకాల వయసువారు వుంటున్నారు.
ఏమి తోచక కొందరు ఆరోగ్య కోసం కొందరు ఫోను చేసుకోడానికి కొందరు యువతలో గర్ల్ ఫ్రెండును కలుసుకోడానికి కొందరు కనిపిస్తారు.
వీరిలో వస్త్ర ధారణ చూస్తే నవ్వు వస్తుంది. కాలానికి వాతావరణానికి శరీరం తీరుకి సరిపోయేలా ధరించాలి అని మాత్రం అనుకోడంలేదు. ఇది వేసవి అందులో ఎండలు దారుణంగా ఉంటున్నాయి. ఉదయం ఆరుగంటలకే వేడిగా ఉంటుంది.
తేలికగానూ లేత రంగుల్లోనూ వుండే దుస్తులు సదుపాయంగా ఉంటాయి. వాకింగ్కి ఇంట్లో వేసుకోడానికి
బయటకు వర్క్ చేసుకోడానికో కాలేజీకి వెళ్లడానికో ఒకేలాంటి దుస్తులు బాగుండవుకదా !
అదేమిటీ పాటించకుండా అన్నిటికి ఒకటే వేసుకోరాదు. ముదురు రంగులు అసలు వేసుకోకూడదు.
పొడుగు చేతుల టాప్స్, టైట్ పాంట్స్, నలుపురంగు రంగులో వేసుకుంటున్న వారిని చూస్తే చూసేవారికి ఉక్కబోస్తుంది.
వర్షాకాలం చలికాలం వేసవికాలం ఓకే రకం ఎలా ధరిస్తారో అర్ధంకాదు. ఏదో ఒకటి కొనేసుకుని చవకగా వస్తున్నాయని వేసుకుంటే బాగుండదు. డ్రస్ కోడ్ తప్పక పాటించాలి . షాపులోనో ఆన్లైన్లోనే మనం కాలానికి తగినట్టు వుండే దుస్తుల వివరాలు అడగాలి. చూసింది నచ్చింది ఎవరో ఇచ్చింది వేసేసుకుంటారు చాలామంది.
మా బంధువో స్నేహితుడో విదేశాలనుంచి వచ్చాడు . లేదా అక్కడికి వెళ్లి వచ్చినవారితో పంపించాడు అని వేసుకుంటారు కొందరు. విదేశాల్లో కచ్చితంగా దుస్తుల ధరించేతీరు మనం తప్పక నేర్చుకోవాలి. అప్పుడు వాటికి అందం మనకు ఆనందం!
శరీరం అందరికీ ఒకేలా ఉండదు . ఒకరు పైనుంచి కింద దాకా ఒకేలా లావుగా వుంటారు. వీళ్ళు తప్పనిసరిగా లూజుగా వుండే దుస్తులు వేసుకోవాలి. కొందరు సన్నగా వుంటారు. వీరు పట్టినట్టు వుండే దుస్తులు వేసుకోరాదు. సమానంగా వుండేలాటి వస్త్రాలు ధరించాలి. కొందరికి భుజాలు లావుగావుండి చూసేవారికి బాగుండవు. శరీరాన్ని మార్చుకోలేము. కానీ దుస్తులతో మన లోపాన్ని సరిచేసుకోవచ్చు.
ఇలాంటివారు మోచేతులవరకూ వుండే టాప్ వేసుకోవాలి. కొందరికి నడుము పిరుదులు లావుగావుంటాయి.
వారు ఫ్రాక్ మోడలు మోకాళ్ళకు పైగా వుండే టాప్ వేసుకుంటే లావుగా వుండే భాగం కవర్ చేయవచ్చు.
వేసవిలో అందరూ లూస్గా షార్టుగా వుండే పజోలా వేసుకుంటే కంఫర్టుగా ఉంటుంది. ఇక టాప్ మరీ పెద్దగా లోనెక్ వద్దు. లావుగా ఉండేవారు చాలా చాలా అసహ్యంగా వుంటారు.
ఫ్యాషన్ అనుకరించవద్దు. షార్టు టీ షర్టు కంఫోర్టుగా ఉంటాయి.
ఇంటా బయటా ఓకే దుస్తులు వద్దు. చేసే జాబ్ నుబట్టి దుస్తులు ధరిస్తే హుందాగా ఉంటుంది. ముఖ్యంగా
దారిద్రగొట్టు నైటీలు అన్నిటికీ వాడేస్తున్నారు మధ్య వయసు మహిళలు. అది మానుకోండి. నైటీ అంటే పేరులోనే వుంది . రాత్రి పడుకుని టైముకి వేసుకునేది అని. అసలు ఇప్పుడు ఆట్రెండ్ మారింది . స్లీపోవేర్ అని దుస్తులు వాడుతున్నారు. మార్పు మంచిది కానీ మన దేశానికి కుటుంబాల మర్యాదను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. టీనేజ్ పిల్లలు మనకంటే పెద్దవాళ్ళు వున్నప్పుడు నిండుగా దుస్తులు ధరించండి.
ఫ్యాషన్ కొంతవరకు సందర్భాన్ని బట్టి అనుకరించాలి. అప్పుడు గౌరవం ఉంటుంది. మీరు మీ భర్త ఇద్దరు ఉన్నట్టు అయితే మీ ఇష్టం. ఎదిగేపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనపిల్లలు మనల్నే అనుకరించే ప్రమాదం వుంది. ఒక వయసువరకూ పిల్లలను తీర్చి దిద్దే బాధ్యత మనదే అని మరువకండి.
ఫాంట్ షర్ట్ వేసుకుంటే పర్వాలేదు. అవి శరీరం పూర్తిగా కవర్ చేస్తాయి. మోడ్రన్ డ్రెస్సులు ఎవరో సినీతార
-మోడల్ వేసుకున్నారని మనం అనుకరించవద్దు.
లావుగా ఉండేవారు దుస్తుల ఎంపికలో చాలా పధ్ధతి పాటించండి. సెక్సీగా వుంటారు అనుకుని పొరబడకండి
అగ్ లీగా వుంటారు . ఇది నిజం! బీ కేర్ఫుల్ . మీకు తెలియదు. చూసేవారికి మాత్రమే తెలుస్తుంది .
''మనుషుల దుస్తుల ధారణనుబట్టే వారి వ్యక్తిత్వం తెలుస్తుంది'' అని మరువకండి. మనిషిని గౌరవించడం కూడా దుస్తులనుబట్టే ఉంటుంది !
**************************************************************************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Comments