top of page

ఈ దేశం ఏమైపోతే నాకేం

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #YeeDesamEmaipotheNakem, #ఈదేశంఏమైపోతేనాకేం, #TeluguHeartTouchingStories

Yee Desam Emaipothe Nakem? - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 09/06/2025

ఈ దేశం ఏమైపోతే నాకేం - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

''హలో మిస్టర్ మైఖేల్ నేను ఎక్స్ వై జెడ్ శాస్త్రిని మాట్లాడు తున్నాను. ఏం చేస్తున్నావు?'' ఫోన్లో మాట్లాడాడు తన అసిస్టెంట్ తో ఎక్స్ వై జెడ్ శాస్త్రి. 


''బాస్ ఓ అరగంటలో వస్తాను'' ఫోన్లో చెప్పాడు మైఖేల్. 


''మైఖేల్.. అంత బిజీగా ఉన్నావా?''


''అంటే బాస్.. ఓ గుడ్ న్యూస్ బాస్. మా అబ్బాయికి మూడు సంవత్సరముల నుండి మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను.. మీకు తెలుసు కదా. కావలసిన 40 లక్షల రూపాయలు ఇప్పటికి పోగు పెట్టగలిగాను. సీటు కూడా పెద్దవాళ్లును కాళ్లు చేతులు పట్టుకుని కన్ఫర్మ్ చేయించుకోగలిగాను. నాకు బ్యాండ్ మేళంతో వీధులన్నీ తిరిగి డ్యాన్స్ కట్టాలన్నంత మహదానందంగా ఉంది. ఈ గుడ్ న్యూస్ ఫోన్ చేసి నేనే మీకు చెబుదామని అనుకుం టున్నాను. మీరే నాకు ఫోన్ చేశారు. మా అబ్బాయి విషయంలో ఇంత ఆనందం పొందుతానని అనుకోలేదు బాస్ బాస్. '' మైఖేల్ మహదానందంగా ఎగిరి గంతు వేసినట్టు చెప్పాడు ఫోన్లో తన బాస్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి కి. 


''ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్.. అంటే మీ అబ్బాయి కాబోయే డాక్టర్ అన్నమాట. సరే.. పిచ్చోడా.. ఇంత కన్నా కోటిరెట్ల గుడ్న్యూస్ నీకు చెప్తాను విని తట్టుకోలేవు. ముందు ఓ గ్లాసుడు మంచి నీళ్లు తాగి కూర్చు మీద రిలాక్స్ గా కూర్చో. 


నీ కర్ణభేరికి బాగా నా మాటలు వినబడేలా ఫోను చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను. 12 సంవత్సరాల మన కృషి ఫలించింది.. అర్థం కాలేదా మైకేల్.. మనం తీవ్రంగా కృషి చేస్తున్న ఆల్ ఇన్ వన్ టాబ్లెట్ ఫార్ములా సక్సెస్. సక్సెస్.. అనడం తప్పు.. గ్రాండ్ సక్సెస్ అనడం కరెక్ట్. '' విషయం వివరంగా మైఖేల్ కు చెప్పి చాలా ఆనందంగా అట్టహాసంగా నవ్వాడు చాలాసేపు. ఓ అద్భుతం ఆవిష్కరించిన మహా గొప్ప అనుభూతితో ఆనందంగా చెప్పాడు శాస్త్రి. 


''సరే బాస్ ఇది కూడా ఆనందించదగ్గ విషయమే కదా తొందరగా వచ్చేస్తున్నాను. '' పరమానందంగా చెప్పాడు మైఖేల్. 


''తొందరగా రావడం కాదయ్యా బాబు.. ఇదిగో మైకేల్ పరుగు పరుగు పరుగున వచ్చేయాలి నువ్వు. ఎందుకంటే ఈ ఆనందం మొట్టమొదట నీతోనే కదా నేను పంచుకో వాలని. నాకు అసిస్టెంట్ వైన నీకు కూడా క్రెడిట్ ఉంటుంది కదా. ఆ రకంగా ఆలోచిస్తే నువ్వు జెట్ విమానం లాంటి స్పీడుతో వచ్చేయాలి. త్వరగా రా. నేను ఆనందం తట్టుకో లేక పోతున్నాను. '' ఎక్స్ వై జెడ్ శాస్త్రి చిందులు వేస్తున్నట్టు మహా సంబరంగా మాట్లాడి రిసీవర్ కింద పెట్టేసాడు. 


***

కాసేపటికి అదే స్పీడులో వచ్చేసాడు మైఖేల్ తన బాస్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి ల్యాబ్ కు. 


''రా మైఖేల్.. '' పరమానందంగా ఆహ్వానించాడు శాస్త్రి తన అసిస్టెంట్ ను. 


''బాస్ మీరు చెప్పిన గుడ్ న్యూస్ ఫోన్లో విని తట్టుకోలేక పోయాను.. ఆగలేకపోయాను పరుగు పరుగున వచ్చేసాను చెప్పండి బాస్. '' తట్టుకోలేనంత ఉద్వేగ ఆనందంతో బాసుని అడిగాడు మైఖేల్. 



''ఎస్.. బిపి, షుగర్, మలేరియా, టైఫాయిడ్, ఎయిడ్స్ జాండీస్, హార్ట్ ఎటాక్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, కరోనా చివరికి రాబోయే కొత్తరకం వ్యాధులు ఇవన్నీ ఒకే ఒక టాబ్లెట్ తో హుష్ కాకి. ఓన్లీ 10 రూపాయలు టాబ్లెట్. ప్రపంచ వైద్య చరిత్రలో కని విని ఎరుగని పెను మార్పు ఊహించని పరిణామం. 


ఇక డాక్టర్ల అవసరమే ఉండదు. హహహహ.. మైఖేల్ నిరుపేదలకు నా పరిశోధన ఫలితం బంగారు పెన్నిధి లాంటిది కాదంటావా.. నా పక్కనే ఉంటూ నాకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ కొండంత బలం గా ఉన్న నీకు ముందు నా హృదయపూర్వక అభినందనలు. సర్వ మానవాళి సుఖప్రదంగా హాయిగా జీవించాలి అన్న నా కోరిక తీరినందుకు నాకు నేనే అభినందనలు తెలియజేసు కుంటున్నాను. '' భరతనాట్యం, కథాకళి, ఒడిసి, చిందు నాట్యం ఇంకా రకరకాల నాట్యాలు ఒకేసారి చేస్తున్నట్టు ఊగిపోతూ చెప్పాడు ఎక్స్ వై జెడ్ శాస్త్రి


 ''మీ కృషి అమోఘం బాస్. మీకు భారతరత్న, నోబుల్ బహుమతి రావడం ఖాయం. ఈ శుభసమయంలో ఈ విస్కీ మనిద్దరం షేర్ చేసుకుందాం ఇలా కూర్చోండి బాస్. '' 

మహదానంద సంఘటనలు జరిగిన ప్రతిసారి షేర్ చేస్తు న్నట్టు రూములో రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తూ ఆనందంగా నవ్వుతూ అన్నాడు. 

మైఖేల్


ఆనందంగా బాటిల్ క్యాప్ తీసి రెండు గాజు గ్లాసుల్లో వేసి కుర్చీలో కూర్చున్న తన బాస్ ఎక్స్ వై జెడ్ శాస్త్రికి పరమా నందంగా అందించాడు మైఖేల్. 


''ఓకే ఓకే నువ్వు కూడా నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చో మనిద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం.. ఈ శుభ సమయంలో నువ్వు నాకు విస్కీ, బ్రాందీ ఇంకా ఫారిన్ బ్రాండ్స్ రకాలు కాదు.. స్వర్గము నుంచి అమృతం తెచ్చి నా గ్లాసులో పోసిన.. నేను సాధించిన విజయం ముందు నాకు తక్కువే. సరే ఇద్దరం సమానంగా షేర్ చేసుకుందాం.


అబ్బా చాలా టేస్టీగా ఉంది. ఈరోజు శరీరం గాల్లో తేలి పోతున్నట్టు ఉంది ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఇంకొంచెం వెయ్యి. నాకు ఇచ్చే ఆనందంలో నువ్వు తాగ టమే మానేశావు నువ్వు కూడా తీసుకో.. మైఖేల్. '' కొంచెం మత్తు ఆవరించినట్టుగా మాట్లాడుతూ అన్నాడు ఎక్స్ వై జెడ్ శాస్త్రి.


''మిస్టర్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి. '''.. వికారంగా ముఖం పెట్టి అన్నాడు మైఖేల్. 


''ఏమిటలా.. నీ బాస్ ని ఆయన నన్ను పేరు పెట్టి పిలు స్తున్నావు విస్కీ తాగకుండానే కిక్కు ఎక్కినట్టుంది.. లేదా మదపిచ్చి ఎక్కిందా నీకు.. స్కౌండ్రల్.. స్టుపిడ్ '' మత్తుగా అన్నాడు ఎక్స్ వై జెడ్ శాస్త్రి. 


"మిస్టర్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి. కాసేపట్లో చచ్చిపోయే నువ్వు నన్ను ఎలా తిట్టినా పరవాలేదు. బైది బై నేను నీతో పాటు విస్కీ ఎందుకు తాగలేదంటే నువ్వు తాగిన విస్కీ బాటిల్లో పాయిజన్ కలిపాను గనుక. '' వికటంగా, వికృతంగా రక్త పిశాచిలా నవ్వుతూ అన్నాడు మైఖేల్. 


''వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్.. పాయిజన్ ఎందుకు కలిపావు చెప్పు'' ఆశ్చర్యపోతూ అడిగాడు శాస్త్రి. 


''చెప్పినా నీకు అర్థం కాదు బాస్. ఇప్పుడు నువ్వు చచ్చి పోవాలి. నువ్వే కాదు నీ ఫార్ములా కూడా చచ్చి పోవాలి.. చచ్చి తీరాలి. '' ఇంకా భీకరంగా నవ్వుతూ కేకలు పెట్టాడు

మైఖేల్. 


''దుర్మార్గుడా.. వై.. వై.. ఎందుకు చావాలి నా ఫార్ములా కూడా ఎందుకు చావాలి చెప్పు” మత్తులోనే అరిచాడు శాస్త్రి. 


''నీ సమయం ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే.. నీ దగ్గర నిజం నేను చెప్పిన నాకు నష్టం లేదు. అయినా చచ్చే ముందు నువ్వు నిజం తెలుసుకుని మరి చావాలి లేదంటే దయ్య మై వచ్చి నన్ను పిక్కు తింటావు. " అన్నాడు మైఖేల్. 


''సరే నన్ను రక్షించే వాళ్ళు లేరు నేను ఎలాగో చచ్చి పోతాను. ఒక్క ఉపకారం చెయ్ పోనీ. 12 సంవత్సరాలు కష్టపడి కనిపెట్టిన నా ఫార్ములా నాతో నాశనం అయిపో కూడదు. ఇది దేశ సౌభాగ్యం కోసం ప్రపంచ అభ్యున్నతి కోసం. ఈ ఫార్ములా రహస్యం మొత్తం నీకు చెప్పేస్తాను. నీకు తెలిసినది ఐదు పాళ్లే కదా మిగిలిన 95 పళ్ళు నేను చెప్తాను నువ్వు అర్థం చేసుకుని గుర్తుపెట్టుకో.. రాసుకో.. 


ఫార్ములా నీ వల్ల అయినా ఈ ప్రపంచానికి ఉపయో గించాలి నాకు ఎలాగైనా ఇష్టమే.. అంతేకానీ నాతో మాత్రం నా ఫార్ములా చచ్చిపోకూడదు మై డియర్ మైకేల్.. రా దగ్గరికి రా.. 


నా దగ్గరకు రా నీ చెవిలో చెప్తాను పోనీ నువ్వైనా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించు అది చాలు నాకు. '' ఎక్స్ వై జెడ్ శాస్త్రి ఒకపక్కకు ఒరిగిపోతూ అన్నాడు. 


''అవసరంలేదు శాస్త్రి నీ ఫార్ములా ఈ ప్రపంచానికి అవసరం లేదు. నీతో పాటు అది కూడా చచ్చి తీరాలి. ''


''అంటే నీ ఉద్దేశo?''


''మిస్టర్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి.. మా అబ్బాయి మెడికల్ సీట్ కోసం ఇప్పుడే నేను 40 లక్షల ఖర్చు పెట్టాను. కానీ నువ్వు చేసింది ఏమిటి. ఆఫ్ట్రాల్ పది రూపాయలతో సంపూర్ణ ఆరోగ్యమా? నేను మరో 40 లక్షలు ఖర్చుపెట్టి డాక్టర్ పూర్త య్యాక మా అబ్బాయి ఎలా బ్రతుకుతాడు. ఖర్చుపెట్టిన మొత్తం 80 లక్షలు ఎలా సంపాదిస్తాడు.. నీ ఫార్ములా వల్ల కేవలం పది రూపాయల ట్యాబ్లెట్తో ఏ రోగము లేకుండా మనిషి సర్వరోగ నివారిణిగా బ్రతి కేస్తుంటే.. మా అబ్బాయి డాక్టర్ కోసం కోటి రూపాయలు దగ్గర దగ్గరగా ఖర్చు పెట్టిన నాకు ఆ డబ్బు ఎలా వస్తుంది.. ఇంకో 20 కోట్లు నేను వెనకేసుకోవాలని పెద్ద ప్లాన్ వేసుకుని మా అబ్బాయి ని చదివిస్తున్నాను కదా ఆ డబ్బు నాకు ఎలా వస్తుంది


అసలు ఈ ప్రపంచంలో డాక్టర్లు అందరూ ఏమైపోతారు. మా అబ్బాయి 20 కోట్లు సంపాదించి నాకు ఇవ్వాలన్న నా ఆలోచన ఆశయం.. ఏమైపోతుంది????


నీ ఫార్ములా తో నీ పది రూపాయల టాబ్లెట్ తో నా ఆలోచన సర్వనాశనం అయిపోతుంది. నీరు కారిపోతుంది. అందుకనే నువ్వు ఉండకూడదు. నీ ఫార్ములా కూడా ఉండకూడదు. '' ప్రపంచంలో రక్తపిశాచులు అన్ని కలిపి నవ్వినంత భయంకరంగా నవ్వుతూ అన్నాడు మైఖేల్. 


''దుర్మార్గుడా నీచుడా.. మైఖేల్.. నువ్వు నెంబర్ వన్ దేశద్రోహివి. రాక్షసుడువి, నెంబర్ వన్ నమ్మకద్రోహివి. ఈ దేశం ఏమైపోతే నాకేం అని భావించే నీలాంటి ప్రతి వాడిని ఉప్పుపాతర వెయ్యాలి. "ఎక్స్ వై జెడ్ శాస్త్రి హృదయ స్పందన కోల్పోతూ ఒక్కొక్క అక్షరం నొక్కి నొక్కి పలు కుతూ అన్నాడు


''అంతే కదా చచ్చిపోయేటప్పుడు ఇంకా ఏదో పొడి చేసే డైలాగులు చెబుతావేమో అనుకున్నాను. పర్వాలేదు, ఆ ఉప్పులో 'కొంచెం కారం కూడా కలిపితే బాగుం టుంది.. ' అని నువ్వు అనవలసింది.. ఐ డోంట్ కేర్.. ఐ డోంట్ కేర్. 


ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ మై డియర్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి, , నా గురుదేవా.. నా బాసు.. ఇంకా ఏమైనా ఉంటే తీరు బడిగా గుర్తుచేసుకొని తీరుబడిగా తిట్టు చచ్చిపో.. మంచిది. దేశద్రోహివి, కిరాతకుడివి అని పది సార్లు అను నేను బాధ పడను.. మిస్టర్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి నువ్వు చచ్చిపోయే ముందు ఒక విషయం కూడా తెలు సుకో.. 


ఫస్ట్ మార్కు లతో పాసైన కుర్రోడికి 40 లక్షలు పెడితేనే కానీ కాలేజీ సీటు దొరకలేదు.. ఇలాంటి అస మర్ధమైన వ్యవస్థను తయారు చేసిన వాళ్ళు నీకు దేశ ద్రోహులులా కనపడటం లేదా? అలాంటి కుళ్ళు వ్యవస్థను తయారు చేసిన వాళ్ళను తిట్టు శాస్త్రి. ముందు వాళ్లను తిట్టు శాస్త్రి. వాళ్లను శాపనాకారాలు పెట్టు. " ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా లెక్క లేనట్టుగా అన్నాడు మైఖేల్


''వాట్ నాన్సె.. యు.. ఆర.. టా.. కింగ.. '' నేల మీదకు ఒరిగిపోబోతూ ఒక్కొక్క అక్షరం నెమ్మది నెమ్మదిగా పలు కుతూ అన్నాడు ఎక్స్ వై జెడ్ శాస్త్రి. 


''పొరపాటు.. ఐ యాం టాకింగ్ విత్ సెన్స్. నీ మాటలు తడబడుతున్నాయి నీ పని అయిపోయింది. టాటా గుడ్ బాయ్. '' వేగంగా బయటకు వెళ్లిపోయాడు మైఖేల్. 


''స్కౌండ్రల్.. స్టు.. పి.. డ్..” నేల మీద ఒరిగి పడిపోయాడు.. ఎక్స్ వై జెడ్ శాస్త్రి. 


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






Comments


bottom of page