ఈ ప్రశ్నకు బదులేదీ??
- Dr. Brinda M. N.
- Aug 3
- 6 min read
#YeePrasnakuBaduledee, #ఈప్రశ్నకుబదులేదీ, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Yee Prasnaku Baduledee - New Telugu Story Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 03/08/2025
ఈ ప్రశ్నకు బదులేదీ?? - తెలుగు కథ
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కాయ, పండులాంటి పిల్లలతో నిత్యము అల్లరల్లరిగా సందడిగా ఉండేది ఆ గృహము. పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, దీక్షలు, అబ్బో! ఒకటేమిటి, చెప్పుకపోతే లెక్కలేనన్నీ.
"నిరుపమా! నిన్ను చూస్తుంటే ఆ కుంకుమ బొట్టు, చీర కట్టు, జడలో మల్లెపూలు, పాదాలకు పసుపు, అచ్చం అమ్మవారిలా ఇంకాస్త ముందుకెళ్తే ఇంటికి దీపం ఇల్లాలు అనే టైటిల్ నిన్ను చూసి పెట్టారేమో" అంటూ గలగల గెంతుతూ ఒకటే నవ్వు ఓజస్వి.
"చాల్లేవే బడాయి! ఈరోజు నేను, రేపు నువ్వు, ఇలా ఉండకపోతావా??"
"ఓ! నో, నావల్ల కాదమ్మా! జస్ట్ ఎంజాయ్" "ఎన్ని రోజులు ఇలా? నీకేం తక్కువ!" "అవును తల్లి! నాకన్నీ మరీ ఎక్కువగా" చిలిపిగా అంది ఓజస్వి.
"కాస్త, మా బావగారి కోసం ఆ సిగ్గును దాచుకోవే. "
"ఎంతేoటి"
"ఛా, పోవే" సిగ్గుల మొగ్గ అయ్యింది నిరుపమ.
"నిరుపమా, మొన్న ఫోన్ లో అంత గట్టిగా ఏడ్చేసావు, ఏమైంది?"
"పిల్లలకు బడిలో ఫీజు కట్టలేదని తిరిగి పంపించేశారు. ఈ సంవత్సరం ఇంట్లోనే ఉంటారులే తర్వాత చూద్దామని ఆయన, అత్తమామలు. నెల రోజుల నుంచి కష్టపడినా ఫలితం లేదు. పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తరుణంలోనే నీ ఫోన్ వచ్చింది అలాగే మాట్లాడేసాను, సారీ, ఓజస్వి. "
"నో, నో, ఐ డోంట్ హేవ్ ఎనీ ప్రాబ్లం జస్ట్ ఐ వాంట్ టు క్లియర్ యువర్ ప్రాబ్లం యార్"
"సరే, ఈ నువ్వుల లడ్డూలు తినీ ఎలా ఉన్నాయో చెప్పు"
"సో, స్వీట్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పోషకాలతో బెస్ట్ స్నాక్స్ ఇస్తున్నావన్నమాట పిల్లలకి"
"అవును, ఓజస్వి"
"నువ్వు పిల్లలతో ఆడుకుంటూ ఉండు, అరగంటలో వంట చేస్తాను ఎంచక్కా భోంచేసి వెళుదువు గాని, "
"లేదు, నిరుపమా! చాలా పనులు ఉన్నాయి ఈసారి వస్తాలే"
"పర్వాలేదు, భోజనానికి ఇబ్బంది లేదు ఓజస్వి"
"నిరుపమా, ఇంద, ఇది ఉంచు"
"ఏంటే? ఇది, ఇంతా!!" ఆశ్చర్యంతో నోరు అలాగే ఉండిపోయింది నిరూపమకు.
"పిల్లల ఫీజు కట్టి వచ్చేవారం స్కూల్ కి పంపించు"
"ఓజస్వి, నీ రుణం ఎలా తీర్చుకోను?"
"ఛా, ఛా, అలాంటి సెంటిమెంట్ డైలాగులు మనకు సూట్ అవ్వవే, కంట్లో నీరు నింపక, సరసానికి సైగ సారథులు అవి" అని చిలిపిగా చెక్కిలి పై మెలిక వేసి వెళ్ళింది ఓజస్వి.
ఓజస్వి ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్. నెలకు 75 వేల జీతం. తల్లిదండ్రులు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆడిందే ఆట, పాడిందే పాట, తనకు నచ్చినట్టుగా ఉండడమే జీవితం అనే తత్వం.
ఓ రోజు కారులో కంపెనీకి వెళ్తుంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్, గంటన్నర అయినా ముందుకెళ్లడానికి వీలులేదు.
"ఓ, షిట్! వాట్ హాప్పెండ్? హౌ మచ్ టైం స్టిల్ ఐ హావ్ టు వెయిట్?" అంటూ రెండు సిగరెట్లు కాల్చేసింది. కొద్ది దూరంలో గుంపు కనపడితే తిన్నగా అటు వెళ్లి చూసింది ఒక పాప కళ్ళు తిరిగి పడిపోయింది. చుట్టూ ఉన్నవారు నీ, పళ్ళు ఇస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ ఇక వెళ్ళండి ఎంతసేపు ఈ సినిమా చూడాలి గో, గో, అంటూ అందరినీ నెట్టేస్తున్నాడు.
"పాపా! ప్రొద్దున టిఫిన్ తినలేదా?" ఓజస్వి ప్రశ్న.
"లేదు ఆంటీ" పక్కనున్న పాప జవాబు.
"ఏం ఇవాళ టిఫిన్ చేయలేదు? అమ్మకు బాలేదా?"
"మాకు అమ్మ లేదుగా"
"అదేంటమ్మా, అమ్మ ఊరికి వెళ్ళిందా"
"కాదు ఆంటీ మేము ఆశ్రమంలో ఉంటాం" వెంటనే ఓజస్వి వారిని తన కారు వద్దకు తీసుకువచ్చి బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్లు ఇచ్చి అవతలి వైపు తీసుకెళ్లి, కారు పార్క్ చేసి మళ్లీ మూడు సిగరెట్లు లాగించేసింది.
"పాపలు, మీ ఆశ్రమానికి దారి తెలుసా?" "తెలుసు"
"కారులో వెళ్దామా"
"వద్దు ఆంటీ దగ్గరే"
పిల్లల్ని చెరోక వైపు పట్టుకుంటూనే ఆశ్రమానికి చేరారు. ఆ వాతావరణం చూసిన ఓజస్వి గుండే చి చివక్కుమంది.
"ఏంటండీ! ఇది ఆశ్రమమా? ఈగలు, పురుగులు, అక్కడ వంట పాత్రలు, ఇంకాస్త దూరం బాత్రూం, స్నానాల గదిలో సక్రమంగా లేవు, కుళ్ళిన చెత్త, ఈ కంపు ఎందుకు పెట్టుకుంటారు, పిల్లల్ని అన్యాయం చేయడానికా ?" అరిచినంత పని చేసింది ఓజస్వి.
"అమ్మా! ఈ ముసలావిడదే ఈ ఆశ్రమం, నిజానికి ఇది ఆమె ఇల్లు అక్కడక్కడ చెత్తకుండీలో పడేసిన ఈ పదిమంది పిల్లల్ని తెచ్చి పెంచి పెద్ద చేస్తోంది, మాకున్న డబ్బుతో చేస్తున్నాము. అరకోరా ఎప్పుడైనా దాతల సహాయంతో పిల్లలకు బట్టలు, మిఠాయిలు తెచ్చి పెడుతుంటాం. వారం రోజులుగా ఈమెకు జ్వరం, నేనొక్కదాన్నే అన్ని చూసుకోవాలంటే కాదు. కారం బొరుగులు, పల్లీలు ఇవన్నీ రెడీగా చేసి ఉంచుతాం, అత్యవసర సమయాల్లో పిల్లలు ప్రొద్దున అవే తిని పోతారు. మధ్యాహ్నం బడిలో భోజనాలు పెడతారు.
సాయంత్రానికి వంట చేస్తాము, కానీ పిల్లల్ని ఎప్పుడూ పస్తుతో పడుకోబెట్ట లేదమ్మా. ఇది విన్న ఓజస్వి నిజంగా షాక్ అయింది. సిటీకి కాస్త దూరంలో ఉన్న ఒక చిన్న వీధి అది. ఎప్పుడు సిటీలో తిరిగే ఓజస్వికి ఓ క్రొత్త వింత ప్రపంచాన్ని చూసినట్టుంది. ఇప్పుడే వస్తానంటూ కారు వద్దకు వచ్చి జ్వరం మాత్రలు, కొంత పైకం ఇచ్చి వెళ్ళింది ఆయాకు. ఆ రాత్రి భోజనం చేయలేదు ఓజస్వి. డజను పొగలూదినా లాభం లేదు. రెండు పెగ్గులు లాగించేసింది. బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసింది, రిప్లై లేదు. కోపంతో వాగుతూ వాగుతూ అలాగే నిద్రపోయింది. వారం రోజులు అనంతరం సాయంకాలం వెళ్ళింది ఆశ్రమానికి.
"ఓ, మేనేజర్ గారు! ఎలా ఉన్నారు? ఫీవర్ తగ్గిందా! హాస్యంగా ఆటపట్టించింది ముసలావిడను.
"అయ్యో మీ చేతి చలవ వలన బాగున్నాను అమ్మ"
"ఆ పిల్లలు రండి, రండి ఈ డ్రెస్ నీకు, ఈ ఫ్రాక్ నీకు అంటూ పదిమంది పిల్లలకి రెండు రెండు జతలు బట్టలు ఇచ్చింది. ఆయా ఇది నీకు అమ్మకు అంటూ నాలుగు చీరలు ఆయా చేతిలో పెట్టింది.
"ఏంటమ్మా, ఇది వద్దమ్మా, మేమే ఎలాగో గడుపుతాం"
"కాదనకండి, తీసుకోండి, దీనితో ఈ వాతావరణం పూర్తిగా మారిపోవాలి” అంటూ ముసలావిడ చేతిలో ఓ పెద్ద మొత్తం పెట్టేసింది.
"అమ్మ, మీరు చాలా గొప్పవారు" అంటూ పాదాలకు నమస్కరించింది.
పిల్లలకు టాటా చెబుతూ తిరుగు ప్రయాణం ప్రారంభించింది. ఇంటికి వెళుతుండగా దారిలో స్నేహితురాలు కనిపించింది, క్లబ్ దాకా డ్రాప్ చేయమంది, తీరా దిగుతుండగా,
"నువ్వు రావే"
" లేదు, నేను ఇంటికి వెళ్ళాలి రిలాక్స్ అవ్వాలి"
"బాయ్ ఫ్రెండ్ తోనా?"
"కాదు"
"కమాన్యార్, హియర్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ అవైలబుల్ యు కెన్ రిలాక్స్ వెరీ వెల్" అంటూ ఫ్రెండ్ చేతిని బలవంతంగా లాగింది. "నో, నో ఐ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్"
"ఏంటి ఓజస్వి, క్లబ్ లో పబ్ లో డాన్స్ చేస్తావు, అబ్బాయిలతో బాగా ఎంజాయ్ చేస్తావు కదా, ఇవాళ ఏమైంది రావే ప్లీజ్ కంపెనీ కోసమైనా రావే" తప్పదన్నట్టు ఓజస్వి క్లబ్ లోకి వెళ్ళడం, చిందులేయడం పరిపాటే. వారం రోజులుగా సరిగా భోజనం చేయలేకపోతోంది. కొంచెం తిన్నా కడుపునొప్పి ఇక తప్పదని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఓజస్వి.
"గుడ్ మార్నింగ్ డాక్టర్"
"గుడ్ మార్నింగ్"
"పేషెంట్ని తీసుకురండి"
"నేనే పేషెంట్"
"ఓహో! అలాగైతే అరగంట వెయిట్ చేయండి మా ఆవిడ చెక్ చేస్తారు"
"ఏం? మీరు, డాక్టర్ కాదా? మీరు చెక్ చేయకూడదా?"
"నో, నో, అలాంటిది ఏం లేదు, కానీ" "ఇంకా ఏమిటి? డాక్టర్ కూడా జెండా డిఫరెన్స్ ఉంటుందా చెప్పండి! వన్ వీక్ నుండి ఒకటే కడుపు నొప్పి, భరించలేకున్నాను"
"ఎనీథింగ్ రాంగ్ డైట్"
"నథింగ్ డాక్టర్, నాకు లేని అలవాటు అంటూ లేదు, అన్నీ ఉన్నాయి." ఖంగు తిన్నాడు డాక్టర్.
"ఓకే! ఐ విల్ చెక్ అని స్టెతస్కోప్ పెడుతూ ఉండగా
"డాక్టర్ ప్లీజ్ కం ఇన్సైడ్ అండ్ చెక్, ఓన్లీ డాక్టర్ల, లాయర్ల దగ్గర అన్నీ విప్పాలంటారు కదా!" వ్యంగ్యమైన హాస్య ధోరణితో అంది ఓజస్వి.
చెక్ చేయడం, స్కాన్, రిపోర్టు, రిజల్ట్ అంతా చెప్పాడు డాక్టర్. ఇంటికి రాగానే తల్లిదండ్రుల వద్ద నుండి ఫోన్.
"బేబీ హౌ ఆర్ యు? నిన్ను చూసుకోవడానికి అబ్రాడ్ నుండి పెళ్లివారొస్తున్నారు. టుమారో మార్నింగ్ 11: 00 గంటలకు మేమంతా నీ దగ్గర వాలిపోతాం"
"ఇప్పుడే ఏంటి డాడీ! ఇంత సడన్గా మొన్ననే కదా ఆన్లైన్ పెళ్ళి చూపులు అయిపోయాయి"
"అది కాదమ్మా వారికి నువ్వు సరిగా కనిపించలేదంట, సో మళ్లీ నిన్ను చూడ్డానికి వస్తున్నారు"
"ఐ యామ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్ డాడీ"
"వారు నీకోసమే వస్తున్నారమ్మ" రేపు ఆఫీసుకు లీవ్ అప్లై చెయ్ కాదనకు అమ్మ అభ్యర్థన
అన్నట్టుగానే తల్లిదండ్రులు పెళ్ళికొడుకు వారి తల్లిదండ్రులు వచ్చారు పెద్దల మాటామంతి తర్వాత
"అమ్మాయిని చూపించరా వదినగారు!"
"ఆ ఓజస్వి రెడీనా"
“ఆ అమ్మ.”
అలానే వచ్చి నిలుచున్న ఓజస్విని చూసి ముగ్గురు మొహాలు ఒకరికొకరు చూసుకున్నారు, అమ్మాయి ఫాస్ట్ అనుకుంటా అన్నయ్యగారు ఈ కాలం మీకు చెప్పేదేముంది చెల్లెమ్మ, కానీ పెళ్లిచూపులకైనా మన కట్టుబొట్టు కనిపించ లేదే.
"చూడండి, మీరు చేసుకోబోయేది నన్నా, నా డ్రెస్ నా“ కోప్పడింది ఓజస్వి.
"ఓజస్వి! ప్లీజ్ కూల్ బేబీ" నాన్న ఓదార్పు.
“మీ అబ్బాయితో పర్సనల్గా మాట్లాడాలి"
"ఓకే ఐ విల్ కం"
పది నిమిషాల తర్వాత “ఈ సంబంధం నాకు నచ్చలేదండి. వెళ్దాం పదమ్మ” అంటూ అబ్బాయి లేచాడు.
“అదేంట్రా”
“అమ్మాయికి అన్ని అలవాట్లు ఉన్నాయమ్మా.’
“పెళ్లి తర్వాత మార్చుకుంటుంది లేరా’
“ కుదరదు అని చెప్పింది అమ్మా.”
"ఏంటమ్మా! మరీ విడ్డూరంగా ఉన్నావ్?"
"ఇట్స్ మై డెసిషన్, ఇట్ విల్ నెవెర్ చేంజ్" అంటూ ఓజస్వి గదిలోకి వెళ్ళిపోయింది.
రెండు గంటలు అయింది. భోజనానికి రమ్మంది.
“లేదమ్మా. ఐదు గంటలకు ఫ్లైట్ ఉంది. ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఈజీగా ఒక గంట పడుతుంది, మేము వెళ్లి వస్తాం. నువ్వు
భోజనం చేయి”
“టేక్ కేర్ బేబీ” అంటూ తల్లిదండ్రులు వెళ్ళి పోయారు.
"చూడు కావ్య, వీళ్ళా తల్లిదండ్రులు, చిన్నప్పటి నుంచి ఇంతే, ఎన్నేళ్ళు అయింది కలిసి భోజనం చేసి, మ్యారేజ్ ప్రపోజల్ అని తెచ్చి బ్రోకర్స్ లా బిహేవ్ చేసి వెళ్లారు. వచ్చారు, పని చూసుకున్నారు, పోయారు. నా గురించి, ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్న ధ్యాసే లేదు.”
"అక్క! బాధపడకు, రా భోంచేద్దాం" కావ్యను తనకు తోడుగా ఉంటుందని ఒక లేడీస్ హాస్టల్ నుంచి తెచ్చుకుంది. కావ్య మొత్తం బాధ్యత తనే చూసుకుంటుంది. చెల్లిలాగా ప్రతి విషయాన్ని కావ్యతో పంచుకుంటుంది. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది ఓజస్వి. ఆరోగ్యం క్షీణించి పోతుంది రోజురోజుకీ. ఒకరోజు రాత్రి గట్టిగా ఏడుపు వినిపించడంతో, కావ్య ఓజస్వి గది వద్దకు పరుగు తీసింది.
"అక్కా ! అక్కా! ఏమైంది? ఇదిగో నీరు త్రాగు"
"కావ్య! కావ్య! ఐ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ కావ్య, నేనూ ఒక ఆడదాన్నే, నాకు ఒక మనసు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోరుకుంటుంది, ఒక బిడ్డకు తల్లినై, ఆలనా పాలన చేస్తూ, చనుబాలను త్రాగుతుంటే ఆస్వాదించాలని, ఆడుకుంటుంటే ఆనందంతో తేలిపోవాలని నాకు ఉంటుంది కావ్య ఉంది.
బట్ టుడే ఐ మిస్డ్ ఎవరీ థింగ్ ఎందుకో తెలుసా, మా అమ్మ నాన్న చిన్నప్పటినుండి చేసిన నిర్లక్ష్యం. స్కూల్లో, కాలేజీలో అన్ని స్టాండర్డ్స్ లో ఎప్పుడు వాళ్లు నాతో టైం స్పెండ్ చేయలేదు. ప్రైమరీ స్కూల్లో ఫ్రెండ్స్ తో ఆడుకొనే ఆటలు, టీచర్స్ తో మాట్లాడిన మాటలు, డౌట్స్.. ఇలా ఏమి చెప్పాలన్నా టైం లేదు. బేబీ మళ్ళీ మాట్లాడదామని మీటింగ్ అంటూ క్లబ్ అంటూ పబ్ అంటూ వెళ్లిపోయేవారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో నైట్ సంతకం పెట్టి స్కూల్ బ్యాగ్ లో పెట్టేవారు. ఆ కావ్యా.. మెచ్యూర్ ఫంక్షన్ లో కూడా బంధువులు చుట్టుపక్కలవాళ్లే ఎక్కువ సమయం ఉన్నారు నాతో. ప్రతి నెల పీరియడ్స్ పెయిన్ చెప్పుకోవడానికి అమ్మ ఛాన్స్ ఇచ్చేదే కాదు. కాలేజీలో చేరినప్పటి ఆనందం హుషారు ఇలా ప్రతిసారి వారితో పంచుకోవాలన్నా గగనమే. ఆ బాధలు ఆనందాలు, కష్టాలు, విజయాలు చెప్పుకునే వారు లేక ఒంటరితనాన్ని భరించలేక అన్నీ అలవాట్లకు బానిసయ్యాను.
ప్రతిఫలం నా ఆడతనం నన్ను వెక్కిరించింది. సృష్టికి ప్రతి సృష్టి చేయాల్సిన కర్మశాల నేడు కంపుశాలగా, కంపశాలగా మారిపోయింది కావ్యా! తల్లిదండ్రులు చేసిన తప్పిదం వలన మాతృత్వాన్ని కోల్పోయాను కావ్యా.. కోల్పోయాను. అందుకే మొన్న పెళ్లి చూపుల్లో అలా ప్రవర్తించాను. చూసావుగా ఆరోగ్యం బాలేదన్నా టేక్ కేర్ బేబీ అని బ్రోకర్స్లా, పరాయి వాళ్ళలా ఎలా వెళ్లిపోయారు.
వాళ్ళ డబ్బు, హోదా, పరపతి, ఆస్తి, అంతస్తులు నాకు మాతృత్వాన్ని తిరిగి ఇస్తాయా? ఈ, ప్రశ్నకు బదులేది?, ఈ ప్రశ్నకు బదులేది? ఈ విషాగ్నిని ఇంకా ఎన్నాళ్లు భరించాలి? చెప్పండి" అంటూ దిండును గట్టిగా గుండెకు బాదుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది ఓజస్వి.
నీతి : జన్మనిస్తే చాలు కదా! క్రేచ్ లో వదిలేస్తే ఆయాలు, ఇంట్లో పనివారు, స్కూల్లో టీచర్లు మా పిల్లని చూసుకుంటారంటూ ఇరువురు ఉద్యోగాల పేరుతో పిల్లలను దూరంగా ఉంచటం శ్రేయస్కరం కాదు. ఎనిమిది సంవత్సరాల పాటు నిరంతరం ప్రేమ, ఆప్యాయత, అనురాగ, ఆత్మీయతలను పంచి నైతిక విలువలను పెంచి, పోషించి పెద్ద చేస్తే వారి జీవన విధానం సాఫీగా సాగుతుంది. లేకపోతే లక్షల కొద్ది ఓజస్విలు పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.
Comments