top of page
Original.png

111 చాక్లెట్లను 7 మందికి ఎలా పంచాలి?


111 Chakletlanu 7 mandiki Ela Panchali - Telugu Inspirational Story | P V Padmavathi Madhu Nivrithi

111 చాక్లెట్లను 7 మందికి ఎలా పంచాలి? ??? తెలుగు ప్రేరణాత్మక కథ | పి. వి. పద్మావతి మధు నివ్రితి

Published in manatelugukathalu.com on 20/04/2026


ఒక క్లాస్‌లో ఇచ్చిన సాధారణ ప్రశ్న…కానీ అందరినీ కన్‌ఫ్యూజ్ చేసింది!

👉 111 చాక్లెట్లను 7 మందికి ముక్కలు చేయకుండా ఎలా పంచాలి?

ఈ ప్రశ్నకు శ్రీలేఖ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.

1)

ఒకసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక పజిల్ ఇచ్చారు.


111 చాక్లెట్లను 7 మందికి సమానంగా పంచాలి. ఎలా? దాన్ని పూర్తిగా ఇవ్వాలి, ముక్కలుగా చేయకూడదు.


2)

ఎవ్వరూ పరిష్కరించలేక పోయారు.


3)

చివరికి శ్రీలేఖ వంతు వచ్చింది.


శ్రీలేఖ పరిష్కారాన్ని ఈ విధంగా వివరించింది.


111 ను బైనరీ లేదా బేస్ 2 సంఖ్యగా తీసుకోండి. దానిని 10 ఆధార సంఖ్యకు మార్చండి. అప్పుడు అది 7 అవుతుంది.


ఎలా?


4  2  1 ---> స్థాన విలువలు

1 1 1


విస్తరించిన రూపం 

=

(4*1) + (2*1) + (1*1)

=

4 + 2 + 1

=

7


"111 బేస్ 2 (లేదా బైనరీ) సంఖ్య, బేస్ 10 సంఖ్య లో 7."


"ఇప్పుడు ఈ 7 చాక్లెట్లను ఒక్కో వ్యక్తికి ఒకటి చొప్పున ఇవ్వవచ్చు," శ్రీలేఖ తెలివిగా చెప్పింది.



4)

ఉపాధ్యాయుడు మరొక ప్రశ్న వేశారు:-


"111 అనేది బేస్ 10 సంఖ్య అయితే, దానిని బైనరీ సంఖ్యగా ఎలా మార్చాలి"?


శ్రీలేఖ ఉత్సాహంగా చిరునవ్వుతో ఇలా బదులిచ్చింది


"2 తో భాగించడం ద్వారా, 2 కంటే తక్కువ వచ్చే వరకు, మిగిలిన భాగాన్ని పక్కన రాయండి."


2) 111

  ----------

2)  55 -> 1

--------------

2) 27 --> 1

--------------

2) 13 -> 1

--------------

2) 6 -> 1

--------------

2) 3 -> 0

--------------

    1 -> 1



"ఇప్పుడు సమాధానాన్ని కింది నుండి పైకి వ్రాస్తే, మనకు లభించేది 1101111"


"దశాంశంలో 111, బైనరీ సంఖ్యలలో 1101111."




5)

ఉపాధ్యాయుడు 3వ ప్రశ్న అడిగారు: బేస్ 2 సంఖ్యలు మరియు బేస్ 10 సంఖ్యలను నిర్వచించండి. వాటిని అలా ఎందుకు పిలుస్తారు?


శ్రీలేఖ ఉత్సాహంగా చిరునవ్వుతో ఇలా బదులిచ్చింది:

...

"బేస్ 2 సంఖ్యలలో మనం 0 మరియు 1 అనే రెండు అంకెలను మాత్రమే ఉపయోగిస్తాము. బేస్ 10 సంఖ్యలలో మనం 0 నుండి 9 వరకు 10 అంకెలను మాత్రమే ఉపయోగిస్తాము (0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9). అందుకే వారిని ఆ పేర్లతో పిలుస్తారు."


6) ఇప్పుడు ఉపాధ్యాయుడు 

"చివరి ప్రశ్న: 2 ఆధారిత (లేదా బైనరీ సంఖ్యలు) మరియు 10 ఆధారిత సంఖ్యలను ఎక్కడ ఉపయోగిస్తారు"?


శ్రీలేఖ ఉత్సాహంగా చిరునవ్వుతో ఇలా బదులిచ్చింది:


"2 ఆధారిత (లేదా బైనరీ సంఖ్యలు) కంప్యూటర్లలో ఉపయోగించబడుతుంది.

 ... 

అయితే 10 ఆధార సంఖ్యలను మనం రోజువారీ జీవితంలో ఉపయోగిస్తాము, సాధారణ గణనలు, ప్రసంగాలు, లెక్కించడం మొదలైన వాటిలో."



శ్రీలేఖ ఇచ్చిన అద్భుతమైన, తెలివైన సమాధానాలకు అందరూ చప్పట్లు కొట్టారు. 

 7 చాక్లెట్లను 111 మందికి సమానంగా ఎలా పంచాలి???

-------- X X X ----- X X X -------- X X X ---------



7)


శ్రీలేఖ బోర్డు మీద సుద్దతో ఇలా రాసింది:-


దశాంశంలో 111, బైనరీ సంఖ్యలలో 1101111 అని చూసాము. 111 ను, 2 తో భాగించి 

... ...

అప్పుడు వ్రాతపూర్వకంగా దిగువ నుండి పైకి శేషాలు సమాధానంగా (లేదా చివరి నుండి మొదటి శేషం సమాధానంగా) 1101111 వచ్చింది.



ఇప్పుడు, బైనరీ సంఖ్య 1101111 ను బేస్ 10 సంఖ్యగా మార్చినట్లయితే, మనకు 111 తిరిగి రావాలి.


మన సమాధానం సరైనదని రుజువు లేదా ధృవీకరణ:-


స్థాన విలువలు ---> 64 32 16 8 4 2 1


బైనరీ సంఖ్య -------> 1 1 0 1 1 1 1


విస్తరించిన రూపం

=

(64*1) + (32*1) + (16*0) + (8*1) + (4*1) + (2*1) + (1*1)

=

64 + 32 + 0 + 8 + 4 + 2 + 1

=

111

(10 ఆధార సంఖ్య)



గమనిక 1:-


I)


(1101111)₂ = (111)₁₀


II)


(111)₂ = 7₁₀



గమనిక 2:-


I)

బేస్ 2 సంఖ్యలను బైనరీ సంఖ్యలు అని కూడా అంటారు. వీటిని కంప్యూటర్లలో అంతర్గతంగా ఉపయోగిస్తారు. బేస్ 2 సంఖ్యలు 0 మరియు 1 అనే రెండు అంకెలను మాత్రమే ఉపయోగిస్తాయి. 


II)

బేస్ 10 సంఖ్యలను దశాంశ సంఖ్యలు అని కూడా అంటారు. వీటిని మనుషులు రోజువారీ లావాదేవీలలో ఉపయోగిస్తారు. బేస్ 10 సంఖ్యలు 0 నుండి 9 వరకు పది అంకెలను మాత్రమే ఉపయోగిస్తాయి. 


--------- చిన్న కథ సమాప్తం ---------


1) 

అపాయంలో ఉపాయం ముఖ్యo, దిగులు కాదు.


2)

చతురతతో, సూక్ష్మతతో, మనస్సు యొక్క ఉనికి - తెలివి - పరిశీలన - సమయస్ఫూర్తితో తేలికగా విజయం సాధించవచ్చు, దేనిలోనైనా.


3)

పట్టుదల, కృషి, ఓర్పు, నేర్పు, చల్లని స్వభావం, స్నేహపూర్వక స్వభావం మనిషి విజయానికి దోహదపడుతుంది.


ఇష్టము లేని వారితో - స్థలాలతో - సంస్థలతో దూరం ఉంటే చాలు. కొట్లాటలు - కోపతాపాలకు - మనస్పర్థలకు - బి.పి. (రక్తపోటు) - ఉద్రిక్తత భావాలకు తావు ఉండదు. ఆరోగ్యం చెడదు. 


4)

మనిషికి ఉపయోగకరమైన అలవాట్లు: 

మంచి పుస్తకాలు చదవడం, సందేహాలు అడగటం జవాబు తెలిసేదాకా, క్విజ్ చెయ్యడం, పెంపుడు జంతువులు, క్రీడలు, వ్యాయామం (లేక కనీసం నడక), ఇవి శారీరక మరియు సంతోషపూరిత - ప్రశాంతత - మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి.


5)

ఇంకొకరితో పోల్చుకోవద్దు.

ప్రతి వ్యక్తికి శక్తి యుక్తులు, తప్పులు, బలహీనతలు

ఉంటాయి.


6)

మార్కుల కోసం కంఠస్థం చేయవద్దు. జ్ఞానం కోసం చదవండి, భావనలను అర్థం చేసుకోవడం ద్వారా.

 ... ... 

అప్పుడు మీరు అత్యున్నత శ్రేణి (నోబెల్) అవార్డులను గెలుచుకోవచ్చు


7)

మీ బలాలపై దృష్టి సారించి సంతోషంగా ఉండండి మరియు దానిపై మీ జీవితం - భవిష్యత్తు నిర్మించుకోండి.


బలాలు, శక్తి యుక్తులు మెరుగు పరుచుకోండి (శిక్షణ ద్వారా, పుస్తక పఠనం ద్వారా). 


తప్పులు, బలహీనతలను అధిగమించండి (కనీసం కొన్నిటినైనా) ప్రయత్నం - సాధన - శిక్షణ ద్వారా - పుస్తక పఠనం ద్వారా. 


8)

సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ మరియు విన్-విన్ ఆనందకరమైన విజయ పరిష్కారాలు - నిర్మాణాత్మక స్వభావం గురించి పుస్తకాలను చదవండి. 

అవి శ్వాస లాంటి (మంచి) అలవాట్లుగా మారుతాయి. అప్పుడు జయము నిశ్చయము - భయము లేదు. 

... 

అలాగే, క్రమమైన శిక్షణ ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది.

[Always read books of ...

HAPPY Development Management and WIN-WIN JOYFUL success SOLUTIONS & CONSTRUCTIVE nature. Then these become a breathing like habit]



-------------- నీతి సమాప్తం ------------

👉 ఈ పజిల్ మీ ఫ్రెండ్స్‌కు పంపండి


👉 వాళ్ళు solve చేయగలరా చూడండి 😄



పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 

#పివిపద్మావతిమధునివ్రితి, #WinnerInTwoInterviews, #AmmaCheppinaUgadiRahasyam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page