ఆడంబరం

Aadambaram - Telugu Family Story| Addanki Lakshmi
ఆడంబరం - తెలుగు కుటుంబ కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 12/10/2026
ఆడంబరం అద్దంకి లక్ష్మి రచించిన కుటుంబ విలువలను ప్రతిబింబించే తెలుగు నీతి కథ. లేడీస్ క్లబ్ కార్యక్రమాల్లో మునిగిపోయిన సుజాత తన కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడంతో ఎదురైన పరిస్థితులు ఈ కథలో ప్రధానాంశం. కూతురు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఆమె తెలుసుకుంటుంది. “ఇంట గెలిచి రచ్చ గెలవాలి” అనే సామెతలోని జీవిత సత్యాన్ని తెలియజేసే కథ ఇది.
"హలో! సుజాతా, మేకప్ అయిందా?" అంటూ నలుగురు స్నేహితులు వచ్చారు.
"వచ్చేస్తున్నాను, అయింది."
"సుజాతా! మనము కాస్త ముందుగా వెళ్లాలి; లేకపోతే అక్కడ ప్రోగ్రామ్‌లో లేట్ అవుతుంది."
"లేదు, వచ్చేస్తున్నాను... అయిపోయింది" అంటూ చీర సవరించుకుని, మేకప్ సవరించుకుంటూ, బ్యాగు చేతిలో పట్టుకుని—
"అత్తయ్యా! వెళ్లొస్తాను, తొందరగా వచ్చేస్తాను లెండి" అంటూ గబగబా స్నేహితులతో వాళ్ల కారులో కూర్చుని వెళ్లిపోయింది సుజాత.
సుజాత భర్త కంపెనీలో పని చేస్తాడు. ఒక్కతే కూతురు లత, డిగ్రీ చదువుతోంది. సుజాత ఈ మధ్యనే ఇంట్లో ఏమీ తోచక లేడీస్ క్లబ్‌లో చేరింది. లేడీస్ క్లబ్ అంటే మాటలా? ఎన్నో ఆక్టివిటీస్ ఉంటాయి, అస్సలు తీరిక ఉండదు.
చక్కగా టైం పాస్ అవుతుంది. లేడీస్ అందరూ కలిసి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు.
వాళ్లందరికీ కార్లు ఉన్నాయి. బాగా డబ్బున్న వాళ్లు. సుజాతను ఇంటి దగ్గరకు వచ్చి తీసుకువెళ్లి, కార్యక్రమం అయిన తర్వాత విడిచిపెడతారు.
వర్షాకాలం వచ్చింది కదా, చెట్లను నాటాలి. అదో కార్యక్రమం.
'చెట్లే ప్రగతికి మెట్లు'
ఆ వార్డులో ఉన్న కార్పొరేటర్‌ని పిలుస్తారు. ఆవిడ వచ్చి ముందు కార్యక్రమం మొదలుపెడుతుంది.
అందరూ చెట్లు నాటితే వాటి యొక్క ఉపయోగం గురించి మాట్లాడతారు. తర్వాత అందరూ కలిసి ఆ ఎదురుగా ఉన్న పార్కుకి వెళ్లి, అక్కడ వచ్చిన వారందరూ మొక్కలు నాటుతారు.
ఇదే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి—అనాథ శరణాలయానికి వెళ్లడం, డొనేషన్ కలెక్ట్ చేయడం, ఈ డబ్బుతో పిల్లలకి పుస్తకాలు, డ్రెస్సులు కొనివ్వడం...
ఇలా ఏదో ఒక కార్యక్రమం రోజూ ఉంటుంది. సుజాతకు బాగా టైం పాస్ అవుతుంది.
ఇంట్లో అత్తగారు ఉంటారు. ఆమె ఇల్లు చూసుకుంటుంది, ఇబ్బంది లేదు.
ప్రోగ్రామ్ అయ్యి ఇంటికొచ్చేసరికి ఏడు అయింది సుజాతకు.
అత్తగారు శ్రీ మహాలక్ష్మి వంటగదిలో పని చేసుకుంటోంది.
"అత్తయ్యా! లత కాలేజీ నుంచి వచ్చిందా?" అని అడిగింది రాగానే సుజాత.
"ఏమోనమ్మా, కాలేజీ నాలుగు గంటలకు వదిలిపెడతారు. ఇప్పటివరకు ఏం చేస్తుందో తెలియదు. ఆడపిల్లని అలా వదిలేస్తే ఎలాగా? ఇంట్లో చూసుకోవాలి కదా నీవు!" అంటూ అత్తగారు మండిపడింది.
"సరేలే అత్తయ్యా! చిన్నపిల్ల, దానికి ఏం తెలుస్తుంది? ఎవరితోనో స్నేహితుల ఇంట్లో సరదాగా గడుపుతూ ఉంటుంది. ప్రతిదానికి మీరు రాద్ధాంతం చేస్తారు" అంటూ సుజాత విసుక్కుంది.
ఇంతలో లత వచ్చింది.
"ఏమే, ఇంత లేట్ అయింది?" అని అడిగితే, "ఫ్రెండ్స్‌తో పార్కులో కూర్చున్నాము" అని చెప్పింది.
"సరేలే, రేపటి నుంచి తొందరగా వచ్చేయ్!" అంది.
తండ్రి రవీంద్ర ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అవుతుంది. భోంచేసి రెస్ట్ తీసుకుంటాడు. ఇంటి గొడవ ఎక్కువగా పట్టించుకోడు.
ఇలా ఓ సంవత్సరం గడిచింది సుజాతకి. చాలా బాగుంది. కార్యక్రమాలు చేసుకుంటూ, కారులో తిరుగుతూ, ఫ్రెండ్స్‌తో సరదాగా చక్కగా గడుపుతోంది. అత్తగారు ఏమైనా అంటే పట్టించుకోదు.
ఒకరోజు లత ఫ్రెండు రమ్య ఫోన్ చేసింది సుజాతకు.
"ఆంటీ! మీకో విషయం చెప్తాను, ఏమీ అనుకోకండి. లత నా బెస్ట్ స్నేహితురాలు కదా!"
"ఏంటి, చెప్పు రమ్యా!" అంది సుజాత.
"ఏం లేదు ఆంటీ! మా క్లాస్‌మేట్ రమేష్ ఉన్నాడు, వాడు చాలా అల్లరి పిల్లగాడు.
అమ్మాయిలందర్నీ ఊరికే అల్లరి పెడతాడు. వాడంటే అమ్మాయిలెవరికీ నమ్మకం లేదు.
లత ఈమధ్య వాడితో సినిమాలకి, షికారులకి తిరుగుతోంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటున్నారు ఆంటీ.
వాడు మంచివాడు కాదు, నమ్మవద్దు, తిరగవద్దు అని చెప్తున్నాను కానీ వినడం లేదు. మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఈ విషయం నేను చెప్పానని చెప్పకండి."
"మేమందరము కాలేజీ వదిలిపెట్టగానే ఇంటికి వెళ్తే, తను రమేష్‌తో తిరుగుతుంది. 'నువ్వు కూడా ఇంటికి వెళ్లవే, మీ అమ్మకు కోపం వస్తుంది' అంటే, 'మా అమ్మ ఇంట్లోనే ఉండదు కదా! నాకేం భయం?' అంటుంది.
లత భవిష్యత్తు అంతా పాడైపోతుంది. 'మొక్కై వంగనిది మానై వంగునా?'" అంటూ సలహా ఇచ్చింది రమ్య.
అంతే! సుజాత గుండెల్లో బాంబు పడింది, శరీరం వణికిపోయింది.
'అమ్మో! ఆడపిల్ల, దాని జీవితం సర్వనాశనం అయిపోతుంది' అనుకుంది.
వెంటనే సుజాతకి జ్ఞానోదయం అయింది. 'ఇంట గెలిచి రచ్చ గెలవాలి', అంతేగాని ఇలా కాదు... తనవల్ల లత జీవితం సర్వనాశనం అయిపోతుంది. మనసులో ఆలోచించుకుంటేనే వణుకు పుట్టింది.
రాత్రి మెల్లిగా ఎనిమిదింటికి వచ్చింది లత.
"ఏమే! ఇంత లేట్ అయింది?" అంటూ అరిచింది.
"ఏం లేదమ్మా, నేను, రమ్య సినిమాకి వెళ్లాము" అంది ధైర్యంగా.
"రమ్యతో నీవు సినిమాకి వెళ్లావా? ఈ అబద్ధాలు ఎప్పుడు నేర్చుకుంటున్నావ్?" అంటూ కేకలేసింది సుజాత.
వెళ్లి ఒక్క చెంపదెబ్బ వేసింది.
"నీ ఆటలు సాగవు. రేపటి నుంచి నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వు వేళకి రా! వాడితో వీడితో తిరగడానికి ఇంకా లేదు!" అంటూ మండిపడింది సుజాత.
"ఏమైంది?" అంటూ అత్తగారు వచ్చింది.
"ఏం లేదు అత్తయ్యా, ఇది ఊరుకుంటుంటే నెత్తి మీదకు ఎక్కుతోంది" అంది.
లత ఏడుస్తూ వెళ్లి గదిలో పడుకుంది.
"అందుకే అంటారమ్మ... 'ఇంట గెలిచి రచ్చ గెలవాలి'. నువ్వు క్లబ్బుల వెంట తిరుగుతావు, ఇది ఇంటికి రావడం లేదు. ముందు ఇంటిని, ఆడపిల్లని చూసుకో. రేపు ఏదైనా జరిగితే నలుగురిలోనూ అవమానము, నవ్వులపాలు..."
"అవునత్తయ్యా, మీరు చెప్పింది నిజమే. రేపటి నుంచి ఆ క్లబ్బుకి వెళ్లను, నేను ఇంట్లోనే ఉంటాను" అంది సుజాత.
మొదట సంసారం సక్రమంగా దిద్దుకోవాలి అని మనసులో నిర్ణయించుకుంది సుజాత.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,











Comments