top of page

ఆడాళ్లూ మీకు జోహార్లు

#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #AdalluMeekuJoharlu, #ఆడాళ్లూమీకుజోహార్లు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Adallu Meeku Joharlu - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 25/10/2025

ఆడాళ్లూ మీకు జోహార్లు - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 

"ఏమండీ ఇదిగో కాఫీ, "


"ఓకే! అక్కడ పెట్టి వెళ్ళు" అన్నాడు రవి సీరియస్ గా కంప్యూటర్ లో పని చేసుకుంటూ, 


"ఒకటి చెప్పనా అండి అంటూ నసిగింది


 "ఆ సరే చెప్పు"


"ఏం లేదు! మన కాలనీ లేడీస్ అందరూ ఒక గ్రూపు తయారవుతున్నారు. అందులో నేనుకూడా చేరనా అండీ, 


"దానిదేముంది ? చేరు, నీకు కూడా కాస్త కాలక్షేపం, ఇప్పుడు పిల్లలు ఎదిగారు కదా, టైం పాస్ అవుతుంది మధ్యాహ్నం ఊరికే ఇంట్లో కూర్చుంటావు కదా, " రవి కంప్యూటర్ చూసుకుంటూ. 


"అవునండి నాకు ఏం తోచటం లేదు, కిట్టి పార్టీ అంటారు.. నెలకోసారి అందరూ లేడీస్ హాయిగా కలుసుకుని ఆటపాటలతో మజా చేస్తారు. "

లత ఎంతో హుషారుగా ఉంది. 


"సరే దానికి అడగడం ఎందుకు?


"రేపు అందరూ మీట్ అవుదాం అనుకుంటున్నారు, మీరు ఒప్పుకుంటే వెళదామని"


"వెళ్లి చేరు" అన్నాడు సీరియస్ గా పని చేసుకుంటూ. 


"అయితే నాకు పది వేలు ఇవ్వండి" అంది లత మెల్లిగా. 


ఒక్కసారి అదిరిపడ్డాడు రవి. 

రెండు చేతులతో కుర్చీని పట్టుకుని కాస్త బ్యాలెన్స్ చేసుకున్నాడు కింద పడిపోకుండా. 

 

"ఏంటి ? పదివేలా! పదివేలు ఎందుకే గ్రూపులో చేరడానికి?”

 

 అయోమయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు రవి. 

 

“అందరూ తలో 10, 000 వేసుకుంటాము. ఒక ఏడాది జరిగేసరికి మా 10 మంది మెంబర్లు వేసిన డబ్బు ప్రతినెలా చీటీ కలుపుతారు. ఒకొక్కళ్ళకి 1, 20, 000 వస్తుందండి” లత హుషారుగా చెప్పుకుపోతోంది, 


రవి మైండ్ పనిచేయడం మానేసింది. ఒక్కసారి నెత్తి మీద పెద్ద బండరాయి పడినట్లుగా ఉంది, . "అయ్యబాబోయ్! పదివేలు ఎక్కడనుంచి తెచ్చేది? ఇద్దరు పిల్లలతో సంసారం గడవడమే కష్టంగా ఉంది" 


"ఏవండీ. మనము కష్టపడి సేవ్ చేసుకోలేము కదా, ఈ విధంగా నైనా మనకు ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఒక్కసారి పెద్ద వస్తువులు అంత డబ్బు పెట్టుకొనలేము కదా"


"సరే నాదేముంది? నువ్వే అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి”


"అయితే రేపటికి 10000 నాకు ఇచ్చేయండి. నేను కిట్టి పార్టీ గ్రూప్లో జేరుతాను.” 


రవి కూడా మనసులో ఆలోచించుకుంటే, ఇదేదో బాగానే ఉంది కంపల్సరిగా సేవింగ్ చేయొచ్చు, అనుకున్నాడు. 

ఒక లక్ష రూపాయలు వస్తే ఏమైనా కొన్ని ఖర్చులకి ఉంటుంది కదా అని అనుకున్నాడు. 

"ఓకే" అని ఒప్పుకున్నాడు. 


"మీరెంత మంచి వారండీ" అంటూ ఆనంద పడిపోయింది లత. 


మర్నాడు కిట్టి పార్టీ గ్రూపులో చేరింది. పదిమంది ఉన్నారు. పద్మావతి గారి ఇంట్లో పార్టీ చేరారు. నెలకి ఒక్కొక్కళ్ళ ఇంట్లో పార్టీ ఉంటుంది. చీటీ కలుపుతారు. అందులో వచ్చిన వారికి ఈ డబ్బంతా ఇస్తారు. 


ఇలా ఏడాదంతా కట్టాలి. చక్కటి భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆటపాటలు ఆడవాళ్ళందరూ ఎంతో సరదాగా గడుపుతారు. ఇందులో పెద్ద వయసు వాళ్ళు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. 


కొందరికీ పిల్లలు సెటిల్ అయ్యారు. 

కొందరి పిల్లలు చదువుకుంటున్నారు. మొత్తానికి కాలక్షేపం బాగానే ఉంటుంది. 


రెండు నెలలు బానే గడిచింది. 

ఇంక సమయం దొరికినప్పుడల్లా, రవికి ప్లానింగ్.. 

ఆ డబ్బు వస్తే ఏం కొనాలని.. 


₹1, 20, 000.. ఎన్నో ఉన్నాయి కొనడానికి. పాత సోఫా పాడైపోయింది. కొత్తగా వస్తున్న చక్కటి సోఫా మెత్తగా ఉండేది కొనవచ్చు


కంప్యూటర్ కూడా పాడయింది. అది కొనాలా?

స్కూటర్ డొక్కులా తయారయింది. ఆస్తమాను రిపేర్లు, 

ఇలా ఆలోచించుకుంటే ఆ వచ్చే డబ్బు ఏమాత్రం సరిపోదు.. అంటూ నవ్వుకున్నాడు రవి. 


లత పార్టీకి వెళ్తూ ఆనందపడిపోతోంది. 

ప్రతినెలా టంచన్గా 10000 పట్టుకుపోతుంది. 


వాళ్ళింట్లో పార్టీ, వీళ్ల ఇంటో పార్టీ అని వచ్చిన తర్వాత పది రోజులపాటు అక్కడ విశేషాలు, వాళ్లు మాట్లాడుకునే ఆటలు పాటలు. 

ఒక్కొక్కసారి రవికి మరీ బోర్ కొట్టేస్తుంది. 

ఆడవాళ్లు, వాళ్శ అతి తెలివితేటల మాటలు వింటుంటే.. 


ఒకరోజు ఆనందంతో ఇంటికి వచ్చింది లత, 

 "ఏవండీ! ఏవండీ ఇది చూడండీ” అంటూ సంతోషం పట్టలేక పోతోంది. 


"ఇప్పుడు టైమ్ ఎంత అయిందో తెలుసా లతా ! రాత్రి 8 అయింది. నీవు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నా ము. పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడుగుతున్నారు. ఇంత ఆలస్యం ఏమిటి” అంటూ, రవి విసుకున్నాడు. 


"ఆపండి బాబు మీ గొడవ మీదే! మొట్టమొదట ఇది చూడండి” అంటూ ఒక బంగారపు నెక్లెస్ మధ్యలో డైమండ్స్ పొదిగి వున్నాయి. చిన్న పెట్టె తెరిచింది. ధగధగా మెరిసిపోతోంది. 


"లలితా జివెలరీలో కొన్నాం. బావుందా అండీ, ఈ మధ్య ఇది కొత్త డిజైన్ " అంటూ లత ఉషారుగా చెప్తోంది. 


 "ఏమైందంటే ఈరోజు చీటీ కలిపారు, చీటీ పద్మకు వచ్చింది. నాకు ఎప్పటినుంచో ఈ రవ్వల నెక్లెస్ కొనుక్కోవాలని ఉంది, పద్మనా ఫ్రెండు కదా.. 

‘ఈ డబ్బు నువ్వు తీసుకుని రవ్వల నెక్లెస్ కొనుక్కోవే. ఈసారి నీకు చీటీ వచ్చినప్పుడు నా డబ్బు నాకు ఇచ్చేయ్’ అంది. 

మా లేడీస్ అందరం షాపుకెళ్ళాము నాకు ఇది బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు బాగుంటుందని.. 

వెంటనే కొనేసుకున్నాను. నెక్లెస్ బాగుందా అండి, ?”


"అయ్యబాబోయ్ కొంప ముంచావు కదే! ఆ డబ్బు వస్తే నేను ఇంకా ఏవేవో కొందామని ప్లాన్స్ వేసుకుంటున్నాను"


"మరి నేను ఎంత ప్లాన్ వేశానండి ! నాకు చక్కటి నెక్లెస్ కొనమంటే కొననే కొనరు, ఏదో ఐడియా వెయ్యాలి కదా. మీ మగాళ్ళకి ఏదో ఒకటి ఖర్చులు ఉండనే ఉంటాయి. మా దాకా వచ్చేసరికి మీకు డబ్బులు ఉండవు. ”


“అయ్యబాబోయ్ ఆడవాళ్ళు కాదే దెయ్యాలు మీరు, 

మీ తెలివి మొగుడిని ముంచేసే తెలివి. మరైతే లక్ష రూపాయలు దీని విలువ అన్నావు కదా. మిగతా 20, 000 ఏవే, ?”


"మేం పదిమంది మెంబర్లు కదా, మేమంతా గోల్డ్ కొనుక్కుని హాయిగా ఫైవ్ స్టార్ హోటలు కెళ్ళి పార్టీ చేసుకున్నాము. " అంది లత. 


"వాళ్ళందరికీ నువ్వెందుకే మధ్యలో పార్టీ ఇవ్వడము. 


పైగా 20వేలు, ఫైవ్ స్టార్ హోటల్, " నెత్తి మొత్తుకున్నాడు రవి. 


"బావుండదు కదండి, ఇంత మంచి నగ కొనుక్కున్నప్పుడు, మా స్నేహితులందరూ ఒకటే పీకేస్తారు పార్టీ ఇవ్వు పార్టీ ఇవ్వమని. ” అంది లత. 


వాళ్ళు డబ్బు కాకపోతే సరి. 


ఇక్కడ మగవాళ్ళు నానా పాట్లు పడుతుంటారు, మీరంతా ఎంజాయ్ చేయడం.. కిట్టీ పార్టీ కిట్టీ పార్టీ అని. 


ఇంటికి కావలసిన వస్తువులు అవి కొనాలి, ఇవి కొనాలి అని ఆలోచించుకుంటున్నా". 


రవి ఆశా సౌధాలు ఒక్కసారి కుప్ప కూలిపోయాయి. 

ఏడుపుఒకటే తక్కువ రవికి. 


"సరేలెండి! ఇలాగైనా తెలివితేటలుగా డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను, నా సరదా తీర్చుకున్నాను, " అంది లత. 


"నా కర్మ కాలిపోయిందే, మీ ఆడవాళ్ళ బుర్ర ముందు, మేము ఎంత పెద్ద చదువులు చదివినా ఏమి ఉపయోగం లేదు, " అన్నాడు రవి. 


"పొండి! మీరు మరీ చెప్తారు, భార్య ఏదో సంతోషంగా అడిగితే ఎప్పుడూ లేదు లేదని ఏడుపే ఏడుపు మీ మగాళ్లకు, ఏదో ఇలా తెలివితేటలుగా కావలసినవి కొనుక్కోవాలి గాని ఆడవాళ్లు. లేకపోతే మీ మగవాళ్ళతో వేగడం ఎంత కష్టం, " అంటూ లత రుసరుసలాడుతూ వెళ్లి, ఆ నెక్లెస్ కబోర్డ్ లో దాచుకుంది. 


"అన్నం పెడతానురండీ!" అంది. 


"కడుపు నిండిపోయిందే. ఇంకా అన్నం ఎందుకు?" అన్నాడు రవి. 


ఏడుపుఒక్కటేతక్కువ రవికి. 


"నాన్నా! పాపం అమ్మ నెక్లెస్ కొనుక్కుంటే నీకెందుకు అంత బాధ.. " అంటున్నారు పిల్లలు ఇద్దరు జేరి. 


"కర్మ రా బాబు, బాగా దొరికారు మీరు నాకు!" అన్నాడు రవి. 


"అయ్యా! పాఠక మహాశయులారా, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆడవాళ్ళతో. కొంప ముంచేస్తారు. మొగుడు మునిగిపోతుంటే నవ్వుకుంటారు. "


&&&&&&_


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. నాటకాలు వ్రాసి విద్యార్థుల నాటకాలు వేయించాను. బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను. సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి.

చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను.


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,

**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం

**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం

సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి

ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు, పద్యాలు ప్రచురించ బడినవి. కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు, పంచపదులు, సున్నితాలు, ఇష్టపదులు

**గేయాలు, వ్యాసాలు, నాటకాలు, పద్యాలు, గజల్స్,

కథలు, రుబాయీలు, బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు, తొణుకులు, చిలక పలుకులు, పరిమళాలు, మధురిమలు, ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు, సున్నితాలు, పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,, 2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,

రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,

ప్రచురణ: కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments


bottom of page