top of page
Original.png

అలా దోచుకోవడమేనా!

2 days ago
3 min read

భూమాత వేదనను తెలుసుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తున్న వేణు

Ala Dochukovadamena! - Telugu Social Story | Varalakshmi Yanamandra

అలా దోచుకోవడమేనా! - తెలుగు సామాజిక కథ | వరలక్ష్మి యనమండ్ర  

Published in manatelugukathalu.com on 06/11/2026


భూమాతను స్వార్థం కోసం దోచుకుంటున్న మానవుల తీరును ప్రశ్నిస్తూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటిచెప్పే హృదయస్పర్శి కథ ఇది. వేణుకు వచ్చిన ఒక కల అతని ఆలోచనలను మార్చి, ప్రకృతి కోసం కార్యాచరణకు ప్రేరేపిస్తుంది.


"ఏయ్... మొద్దూ! నిద్రలేస్తావా? నీతో మాట్లాడాలి" అన్నది ధరణి వేణు వీపు మీద ఒక్కటి చరుస్తూ...


"అమ్మా... ఎవరు మీరు? ఎందుకు అలా కొడుతున్నారు? నిద్రపోనివ్వరా ఏంటి?" అన్నాడు వేణు.


"నిద్రపోయింది చాలు... మంచం విరిగిపోతుంది... నీ మొద్దు నిద్రకి ఇక లేవాలి" అన్నది ధరణి.


"సరే... లేచాను... ఎవరు మీరు అమ్మా! మీ రూపం ఇంత దీనంగా ఉన్నది. నేనేం చేయగలను మీకోసం చెప్పండి" అన్నాడు వేణు.


"నా పేరు ధరణి. నేను మానవ మనుగడకు ఆధారాన్ని" అని చెప్పింది కళ్ళు తుడుచుకుంటూ.


"ఈ చెట్లు, మొక్కలు, కొండలు, లోయలు, నదులు, సముద్రాలు, అడవులు, జంతువులు సమస్తం నేను లేకపోతే వాటి ఉనికిని కోల్పోతాయి. 


ఆ సృష్టికర్త మానవుల కోసం ఇవన్నీ భరించమని నాకు చెప్పారు. మీరంతా నా పిల్లలని భావించి, మీకు ఉపయోగపడదామని మీరు నన్ను బాధపెడుతున్నా కూడా మీకు మేలు చేస్తున్నాను."


"అమ్మా! మీరు భూమాతా! నమస్కారం తల్లీ! పచ్చని మొక్కలతో కొండలు, నదులతో కళకళలాడుతూ ఉంటావని ఊహించుకున్నానమ్మా భూమాతని... మీరేంటి ఇంత దీనావస్థలో ఉన్నారు?" అని మళ్ళీ అడిగాడు వేణు ఆశ్చర్యపోతూ...


"ఇలా కాక ఎలా ఉంటాను కుమారా? మనుషులు చేసే నీచమైన పనులకు... చెప్పు?" అన్నది ధరణి కన్నీరు తుడుచుకుంటూ...


"అమ్మా... నిద్ర మత్తు పోయిందమ్మా! నన్నేం చెయ్యమంటారు మీ ఆనందం కోసం చెప్పండి? చేస్తాను" అన్నాడు స్థిరంగా కూర్చుంటూ వేణు.


"కొందరు స్వార్థపరులు అడవులను కనుమరుగు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో 'యూజ్ అండ్ థ్రో' వస్తువులను వినియోగిస్తున్నారు. కొండలను కూడా తవ్వేసి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. 


ఖనిజ సంపద కోసం తవ్వి తవ్వి... నా గర్భంలో మీ అందరి కోసం దాచిన నిధులను కొందరే స్వార్థంతో దోచుకుంటున్నారు.


నాలోని సారాన్నంతా ధాన్యంగా మార్చి మీకు ఇస్తున్నాను కదా! ఐనా జ్ఞానహీనులు అధిక రసాయనాలతో నన్ను కలుషితం చేసేస్తున్నారు.


నేను పచ్చని పంటలనిచ్చే మాగాణిని. నల్ల బంగారాన్నిచ్చే సింగరేణిని. నాలో ఉన్న, నాపైన ఉన్న, నాతో ఉన్న సమస్తాన్ని కలుషితం చేశారు మానవులు... అందుకే ఇలా ఉన్నాను" అన్నది కంటినీరు తుడుచుకుంటూ...


"అమ్మా అర్థమైంది నా కర్తవ్యం... తల్లీ నీ మట్టి బంగారం, అది మానవుల నుదుట మెరిసే సిందూరం. అమ్మా! నీవు పంచే అనురాగం కమ్మని తియ్యని సమభావం. 


మా తప్పులు క్షమించమ్మా! నీ ఒంటిపై చితులు మండిస్తున్నా చల్లని దీవెనలే ఇస్తున్నావు అమ్మా!" నేనేం చెయ్యాలో బోధపడింది తల్లీ. 


నన్ను క్షమించమ్మా... నిన్ను కళకళలాడే తల్లిగా చూస్తానమ్మా... అమ్మా... నన్ను నమ్మమ్మా... అమ్మా..." అంటున్నాడు సాష్టాంగ నమస్కారం చేస్తూ...


"ఏమైందిరా వేణూ? రోజూ చస్తున్నాం నీ కలవరింతలతో... ఏంటిరా ఇలా కింద పడ్డావు..." అంటూ హైమవతమ్మ వేణుని కింద నుండి లేపుతూ అడుగుతోంది...

"అమ్మా!" అంటూ తనకొచ్చిన కల చెప్పాడు...


"ఆలస్యం ఎందుకురా... ఈరోజు రిపబ్లిక్ డే. ఇంతకన్నా మంచి రోజు ఉంటుందా? ఈరోజు నుండి నీ స్నేహితులు రఘు, రాము, రాజు, మురళి, కుమార్, మనింట్లో వాళ్ళం అందరం ప్రతి ఆదివారం మొక్కలు నాటడం, వీధులు శుభ్రపరచడం, వ్యర్థాలను డ్రైన్లలో వేయవద్దని ప్రతి వీధికీ తిరిగి చెబుదాం, అవకాశం దొరికినప్పుడు పాఠశాలల్లో పిల్లలకు అవగాహన కల్పిద్దాం... 


ఇంకా ఇలా... మన ఊర్లో నాగార్జున మెడికల్ షాపు శివ స్మశానం బాగుచేయిస్తానన్నారు... తెలుసా... మొన్న చెప్పారు..." అని తల్లి చెప్పింది...

"అమ్మా! నువ్వు టీచర్‌వని నిరూపించావ్. అలాగే చేద్దామమ్మా..." అంటూ ఇంట్లో ఉన్న ఐదుగురూ ఆమె నిర్ణయానికి సంతోషపడ్డారు.


"అమ్మా ధరణీ, అలా దోచుకోవడమేనా అని బాధపడకమ్మా! నీ మనసు గెలుచుకునేలా చేస్తామమ్మా!" అంటూ మనసులోనే ధరణికి, అదే భూమాతకి మాట ఇచ్చాడు వేణు... కార్యాచరణ కూడా జరుగుతున్నది.


వరలక్ష్మి యనమండ్ర








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వరలక్ష్మి యనమండ్ర

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర

పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర 

కలం పేరు: లేదు

స్వస్థలం: అద్దంకి,‌ప్రకాశం జిల్లా

ప్రస్తుత నివాసం: హైదరాబాద్ 

వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని 

విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.


ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు


1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి) 

2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి) 

3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి) 

        తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది. 

కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం

4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి) 

5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)

6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక) 

          (400 ఆటవెలది పద్య సంపుటీ)

   7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు) 


అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి. 


పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు 

కొన్ని సమూహాలను నిర్వహణ,‌ కొన్ని సమూహాలలో సమీక్షణం 

యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను 



నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,‌బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.


ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.


జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం. 







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page