top of page
Original.png

ప్రేమ లేఖ

10 hours ago
3 min read

ప్రేమలేఖ చదువుతూ భావోద్వేగంతో ఉన్న కళ్యాణి, వెనుక బామ్మ మరియు వేణు జ్ఞాపక దృశ్యం

Prema Lekha - Telugu Love Story | Varalakshmi Yanamandra

ప్రేమ లేఖ - తెలుగు ప్రేమ కథ | వరలక్ష్మి యనమండ్ర  

Published in manatelugukathalu.com on 08/11/2026


కళ్యాణికి బావ వేణు రాసిన ప్రేమలేఖలో వారి ప్రేమ, విరహం, కలిసి జీవించాలనే ఆశలు అందంగా ప్రతిబింబిస్తాయి. ఆ ఉత్తరం ఆమెను ప్రేమతో నిండిన కొత్త జీవితపు ప్రయాణం వైపు నడిపిస్తుంది.


"పోస్ట్ వచ్చింది!" అన్న కేకతో ఒక్క ఉదుటున పరిగెత్తింది కళ్యాణి బయటికి.


"ఏమిటే ఆ పరుగు? నెమ్మదిగా వెళ్లవచ్చు కదా! నీకొచ్చిన ఆ ప్రేమలేఖ మేమేం చింపి చదవములేవే," అన్నారు మురిపెంగా మనవరాలిని చూస్తూ బామ్మ.


"పో బామ్మా! నువ్వు నన్ను ఆటపట్టిస్తావు ఎందుకు? నేను మామూలుగానే వెళ్లాను," అంటూ బామ్మ సమాధానం కోసం చూడకుండా తుర్రుమని గదిలోకి వెళ్లేడు కళ్యాణి.


'బావ నుండి ఉత్తరం వచ్చింది... ఏం రాసుంటాడో!' అనుకుంటూ మంచం మీద పడుకుని, ఎన్వలప్ కవర్ చింపి, లోపలి నుండి మల్లెపువ్వు లాంటి తెల్లని కాగితాన్ని తీసింది బయటకు.


మడత విప్పి చూసి, ఆణిముత్యాల్లాంటి అక్షరాలను చూసి మురిసిపోతూ, ఆ ఉత్తరానికే ముద్దుపెట్టింది.


చదవడం ప్రారంభించింది. కాగితంలో అక్షరాలు నాట్యం చేస్తుంటే, మనసులో వేణు మాట్లాడుతున్నట్టు అనిపించింది. 


ఎదురుగా కొంటెగా చూస్తూ కూర్చున్నాడు వేణు. సిగ్గేసింది... ఉత్తరంలో నుండి బయటికి ఎలా వచ్చాడో అనుకుంటూ...


"డియర్ కళ్యాణీ,

నీవు లేక నాకు క్షణమొక యుగంగా ఉంటోందోయ్! ప్రతిరోజూ నిన్ను తలచుకుంటూ, స్వప్నాల వాకిలిలో నీకోసం నిరీక్షిస్తున్నాను.


నీవేమో అక్కడ ఏ దిగులు, విచారం లేకుండా ఉన్నావు కదూ!"

'బావకెలా తెలుస్తుంది నేనెంత దిగులుగా ఉంటున్నానో' అనుకుంది మనసులో కళ్యాణి.

"నీవు వచ్చేసెయ్ కళ్యాణీ! మనిద్దరం హాయిగా ఊహల పల్లకిలో ఊరేగుతూ, సుందర జగత్తులో నివసిద్దాం. ఏమంటావ్, చెప్పవోయ్!


ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నీవక్కడ, నేనిక్కడ... మరి మన ఆనందం ఎక్కడ? చెప్పు డియర్! జీవితం ఒక వరం. దాన్ని అనుభవిద్దాం, ఆనంద తరంగాలలో హాయిగా తేలిపోదాము. త్వరగా రావాలి, డార్లింగ్!


మరి నీవు మామయ్యతో, అత్తయ్యతో మాట్లాడతావా? వచ్చేటప్పుడు బామ్మని తీసుకురా.

హాయిగా సంగీతంలా మధురంగా ఉండాలి మన జీవన పయనం... సప్తస్వరాల మేళవింపులా! ఆనందభైరవి రాగంలా హాయిగా సాగిపోవాలి. హంసగీతులెన్నో ఆలపించాలి... మనకు ఒక పాప, ఒక బాబు చాలు కదూ, కళ్యాణీ! ఎవరైనా అభ్యంతరం లేదు నాకు. ఆ పిల్లలను మనం ఎంతో అపురూపంగా, ఆదర్శవంతంగా పెంచుదాం. 'భావిపౌరులకు ఆదర్శంగా నిలవడమే మన కర్తవ్యం' అన్నట్లు.


నీ ఉత్తరం కోసం కాదు, కాదోయ్... నీకోసమే వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటాను.

నీ

బావ"


ఉత్తరం చదివిన కళ్యాణి ఆ ఉత్తరాన్ని తెచ్చి బామ్మ చేతిలో పెట్టింది. బామ్మ, కళ్యాణి మరునాడు ఒంగోలులో గరీబ్ రథ్ రైలు ఎక్కారు ఢిల్లీ వెళ్లడానికి. కిటికీ పక్కన కూర్చున్న కళ్యాణి చేతిలో ఇంకా ఆ ఉత్తరమే. రైలు కదిలిన ప్రతి కూతకు గుండె వేగం పెరిగింది.


వరలక్ష్మి యనమండ్ర ✒️



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y







వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వరలక్ష్మి యనమండ్ర

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర

పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర 

కలం పేరు: లేదు

స్వస్థలం: అద్దంకి,‌ప్రకాశం జిల్లా

ప్రస్తుత నివాసం: హైదరాబాద్ 

వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని 

విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.


ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు


1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి) 

2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి) 

3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి) 

        తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది. 

కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం

4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి) 

5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)

6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక) 

          (400 ఆటవెలది పద్య సంపుటీ)

   7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు) 


అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి. 


పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు 

కొన్ని సమూహాలను నిర్వహణ,‌ కొన్ని సమూహాలలో సమీక్షణం 

యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను 



నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,‌బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.


ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.


జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం. 







1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 4 out of 5 stars.

బాగుంది

Like
bottom of page