top of page
Original.png

విజయానికి ప్రాణం తొలి అడుగే

11 hours ago
4 min read

సురేష్ చీపురు పట్టుకుని గ్రామ వీధిని శుభ్రం చేస్తుండగా మహిళలు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యం

Vijayaniki Pranam Tholi Aduge - Telugu Moral Story | Kollu Prasanth Kumar

విజయానికి ప్రాణం తొలి అడుగే - తెలుగు నీతి కథ | కొల్లు ప్రశాంత్ కుమార్

Published in manatelugukathalu.com on 08/11/2026


చిన్న మార్పు కూడా పెద్ద విజయానికి తొలి అడుగు కావచ్చని చెప్పే ప్రేరణాత్మక కథ ‘విజయానికి ప్రాణం తొలి అడుగే’. చదువుతో పాటు సమాజం కోసం బాధ్యత తీసుకున్న సురేష్ తన గ్రామాన్ని ఎలా స్వచ్ఛంగా మార్చాడో ఈ కథ తెలియజేస్తుంది.


ఆ ఊరి పేరు అనపర్తి. పచ్చని చెట్లు, విశాలమైన వీధులు ఉన్న ఆ ఊరు ఒకప్పుడు కళకళలాడేది. కానీ కాలక్రమేణా మనుషుల అలవాట్లు మారాయి. 


ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఇళ్లలోని మురుగు నీటిని నేరుగా వీధి కాలువల్లోనే వదిలేయడంతో ఆ ఊరి అందం కనుమరుగై, వీధుల వెంట దుర్వాసన అసహ్యం పుట్టించేది.


అక్కడే ఉండే యువకుడు మిరియాల సురేష్ ప్రభుత్వ ఉద్యోగం కోసం తపస్సులా కష్టపడుతున్నాడు. 


రోజూ పోటీ పరీక్షల కోసం ఉదయం నుండి రాత్రి వరకు చదివేవాడు. అయితే, నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టి తల నొప్పెక్కినప్పుడు, తన మనసును రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక పద్ధతి పెట్టుకున్నాడు. 


ప్రతి మూడు గంటల చదువు తర్వాత వచ్చే గంట విరామం (Break time) లో కాసేపు ఇంటి ముందుకు వచ్చి కూర్చునేవాడు. అప్పటివరకు మిగతా వాళ్లలాగే ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేసే అలవాటు సురేష్‌కూ ఉండేది.


ఒకరోజు ఆ బ్రేక్ సమయంలో సురేష్ తన జనరల్ స్టడీస్ పుస్తకాన్ని తెరిచి చదువుతుండగా, అందులో 'స్వచ్ఛ భారత్ మిషన్ - పర్యావరణం మరియు ప్రజారోగ్యం' అనే పాఠ్యాంశం కంటపడింది. 


అందులోని విశ్లేషణను అతను లోతుగా చదవడం ప్రారంభించాడు:

"భారతదేశంలో పరిశుభ్రత లేకపోవడం వల్ల భూగర్భ జలాలు కలుషితమై, ప్రజలకు కలరా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయి... సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిశుభ్రతను పాటించినప్పుడే దేశం ఆరోగ్యంగా మారుతుంది. 


మార్పు ఎవరికో ఎక్కడి నుంచో రాదు, మన ఇల్లు మరియు వీధి నుంచి మనమే మొదటి అడుగు వేయాలి."


ఆ పుస్తకంలోని అక్షరాలు సురేష్ గుండెను బలంగా తాకాయి. సరిగ్గా అప్పుడే ఎదురింటి వారు బాత్‌రూమ్ వ్యర్థాలను కాలువలోకి వదలడం, అక్కడే ప్లాస్టిక్ కవర్ విసిరేయడం అతని కంట పడింది. ఆ క్షణంలో సురేష్ గుండె జివ్వుమంది. 


"పుస్తకాల్లో స్వచ్ఛ భారత్ గురించి చదువుతున్నాం కానీ, మన కళ్ల ముందే మన ఊరు ఎలా నాశనమైపోతుందో మనం పట్టించుకోవడం లేదు కదా!" అనే తీవ్రమైన పశ్చాత్తాపం అతనిని దహించివేసింది.


ఆ క్షణమే సురేష్ జీవితంలో ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు నుండి తన స్టడీ బ్రేక్ సమయాన్ని ఊరి శుభ్రత కోసం కేటాయించాలని నిశ్చయించుకున్నాడు. 


చేతిలో ఒక చిన్న సంచీ, చీపురు పట్టుకుని తన ఇంటి ముందున్న రోడ్డును శుభ్రం చేయడం ప్రారంభించాడు.


మొదట్లో పక్కవీధివాళ్ళు నవ్వుకుంటూ, "ఏంట్రా సురేష్... ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేవాడివి ఇప్పుడు చీపురు పట్టావు? ఊరంతా నువ్వొక్కడివే బాగు చేసేస్తావా?" అని ఎగతాళి చేశారు.


అందుకు సురేష్ చిరునవ్వుతో... "అవునన్నయ్యా, చదువుకున్న పాఠం నాకు కళ్లు తెరిపించింది. నా చదువుకు భంగం రాకుండా ఈ గంట సేపు మా ఊరి కోసం కేటాయిస్తున్నా" అని సర్దిచెప్పి తన పని తాను చేసుకుపోయేవాడు.


అలా ఒకరోజు బ్రేక్ సమయంలో ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావిచెట్టు వీధికి వెళ్లాడు. అక్కడ రావిచెట్టు నీడన గృహిణులందరూ గుమికూడి ముచ్చట్లు పెడుతూ, కిరాణా సామాను డబ్బాల్లోకి సరుకులు సర్దుకుంటున్నారు. 


ఆ సామాను తీసిన ప్లాస్టిక్ కవర్లను, కాగితాలను ఏ మాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న మురికి కాలువలోకి విసిరేస్తున్నారు.


ఆ తల్లులు స్వచ్ఛ భారత్ ప్రాముఖ్యత తెలియక తమ చేతులారా తమ పిల్లల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఆ దృశ్యం చూసి సురేష్ గుండె తరుక్కుపోయింది. 


వారి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా ఇలా అన్నాడు:

"అమ్మా... ఇక్కడ పారుతున్న ఈ డ్రైనేజీ కాలువలోకి మీరు పడేస్తున్న ప్లాస్టిక్, మురుగు నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోయి.. మనం తాగే బోర్ల ద్వారా నీళ్ల రూపంలో మళ్లీ మన కంచట్లోకి, మీ చంటిబిడ్డ కడుపులోకి చేరుతున్నాయి. ప్రభుత్వం 'స్వచ్ఛ భారత్' అంటోంది అంటే ఇదే. కానీ ఆ ప్రయోజనాలు మన ఇంట్లోకి రావాలంటే ముందు మనమే మారాలి."


అయితే, అప్పుడు ఆ తల్లులు సురేష్ మాటలను నవ్వుతూ కొట్టిపారేశారు. కానీ సురేష్ మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. రోజూ వచ్చి కాలువల్లో పడిన ప్లాస్టిక్ కవర్లను ఏరడం, మురుగు నీరు నిలవకుండా దారి చేయడం క్రమం తప్పకుండా చేసేవాడు.


రోజురోజుకూ సురేష్ పడుతున్న ఆ కష్టాన్ని గమనించిన ఆ గృహిణుల్లో ఆలోచన మొదలైంది. "ఎల్లప్పుడూ చదువుకునే ఈ కుర్రాడు, స్వార్థం లేకుండా రోజూ వచ్చి మా ఊరి కోసం ఎంత కష్టపడుతున్నాడు! మేము మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నాం" అనే పశ్చాత్తాపం వారి మనసుల్లో బలపడింది.


కొన్ని రోజులకు వారిలో సంపూర్ణ పరివర్తన వచ్చింది. మరుసటి రోజు నుండి ఏ మహిళ బజార్కెళ్లినా ఇంటి నుండి సంచీ పట్టుకెళ్లడం ప్రారంభించారు. షాపు వాళ్ళు మైకా కవర్లు ఇస్తే "మా బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడే ఈ విషం మాకొద్దు" అంటూ గట్టిగా తిరస్కరించారు. 


ఇళ్లల్లో భర్తలు ప్లాస్టిక్ కవర్లు తెస్తే వారిని వారించారు. డ్రైనేజీల్లో పైప్‌లు కలిపిన వారు వాటిని కట్ చేయించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు.


కొన్నాళ్లకు చుట్టుపక్కల ఊళ్లలో వర్షాకాలం వచ్చి డ్రైనేజీలు పొంగిపొర్లి జనం టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో ఆస్పత్రులపాలయ్యారు. 


కానీ, సురేష్ చదివిన పుస్తక స్ఫూర్తితో మేల్కొన్న ఆ ఊరి తల్లుల చొరవ వల్ల, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉన్న అనపర్తిలో మాత్రం ఒక్కరికి కూడా చిన్న జ్వరం రాలేదు.


చుట్టుపక్కల ఊళ్ల దుస్థితి చూసి, తమ ఊరు ఎంత ఆరోగ్యంగా ఉందో అర్థం చేసుకున్న గ్రామస్తులందరూ సురేష్‌ను ఘనంగా అభినందించారు. సరిగ్గా అదే సమయానికి సురేష్‌కి అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చిందని తెలిసి ఊరంతా పండగ చేసుకుంది. ఆ రోజు నుండి ఆ ఊరు మొత్తం 'ప్లాస్టిక్ రహిత ఆదర్శ స్వచ్ఛ గ్రామంగా' వెలుగొందింది.


నీతి:

మనం చదివే మంచి పుస్తకాలు కేవలం మన పదవుల కోసమే కాదు, సమాజానికి మార్గదర్శకం కావాలి. స్వచ్ఛ భారత్ నినాదం ప్రభుత్వంతోనే కాదు, ప్రతి ఇంటా తల్లులు మనసు మార్చుకుని కదిలితేనే పరిపూర్ణమవుతుంది.


*** 








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



కొల్లు ప్రశాంత్ కుమార్ ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొల్లు ప్రశాంత్ కుమార్.

రచయిత పరిచయం: నా పేరు కొల్లు ప్రశాంత్ కుమార్.

సాహిత్యం మరియు కథారచనపై ఉన్న అభిలాషతో సమాజంలోని అనుబంధాలు, మానవీయ విలువలు నేపధ్యంగా రచనలు చేస్తుంటాను.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Chaalaa baagaa chepparu sir

Like
Prassanth Kollu
Prassanth Kollu
7 hours ago
Replying to

Thank you medam smajamiki upayoga pade amsam edaina okati cheppandi dani koraku కథ రాస్తాను 🤝

Like
bottom of page