top of page

అమాయకరావు



'Amayakarao - New Telugu Story Written By Vemuri Radharani

'అమాయకరావు' తెలుగు కథ

రచన: వేమూరి రాధారాణి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

హడావిడిగా ఆఫిస్ కి తయారవుతున్నాడు అమాయకరావు. అమ్మ కాంతం సోఫాలో కూర్చుని ఏదో జపిస్తుంది.


“ఏమండోయ్! చింటుగాడిని స్కూల్ కి తీసుకెళ్లాలి, మీకు అసలే తొందర ఎక్కువ” అంటూ చింటుని తీసుకుని వచ్చింది భార్య మందమతి.


చింటుని స్కూల్ లో దిగబెట్టి ఆఫీస్ చేరాడు ఆయాస పడుతూ అమాయక రావు. అలా కుర్చీలో కూర్చున్నాడో లేదో ఫోన్ మోగింది. ఎత్తగానే అటూ నుండీ భార్య .


“ఏమండీ! అది.. మీరెక్కడైనా చూసారా? కనపడడం లేదు.. అయ్యో అది.. కనపడడం లేదు. కాళ్ళు చేతులు ఆడడం లేదండి”


“అసలు పోయింది ఏమిటే?”


“అయ్యో అదేనండి.. అది పోయింది.. మీకు అర్థం కాదే ఖర్మ”.


“ఒసేయ్ మందమతి! కాస్త పోయిందేమిటో చెప్తే నేను చూసానో లేదో చెప్తాను”.


“అవునండీ.. ఏం పోయిందంటారు?”

“నాకేం తెలుసే ఏం పోయిందో తెలియకుండానే వెతుకుతున్నావా? నా పని అంతా డిస్టర్బ్ చేసావు”


“ఆ గుర్తొచ్చింది.. నా ఫోన్ పోయిందండి. ఇందాకే అమ్మతో మాట్లాడాను. ఇంతలో ఏమైందొ బుజ్జి ముండ. ఆమ్మో అమ్మో.. మొన్ననే కదే పదిహేను వేలు పోసి కొన్నాను.. ”


“అంత ఏమరుపాటుగా ఎలా ఉంటావే, వుండు నే వస్తున్నా” అంటూ బయలుదేరి ఇంటికి వచ్చాడు అమాయక రావు.


అడుగు పెట్టాడో లేదో “ఏరా వచ్చేసావే” అంది తల్లి కాంతం.


“ఏదో పనుండి వచ్చి చచ్చాలేవే”.


“ఏంటీ ఫణి కాలం చేశాడా.. అయ్యో మొన్నే కదరా పెళ్లి అయ్యి పెళ్ళాంతో వచ్చాడు. పాపం అప్పుడే కాలం చేశాడా”.


“అబ్బా అది కాదే! పని ఉండి వచ్చాను” అన్నాడు విసుగ్గా.


ఇంతలో మందమతి “ఏమండీ! వచ్చేసారా.. పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి” అంది. “ముందు మీరు చంటి బడికెళ్లి వాడి బాగు లో ఉందేమో చూసి రండి’.


‘అలాగేలేవే’ అంటూ చంటి గాడి బడికి వెళ్లి లేదనేసరికి నీరసంగా బయటకొచ్చాడు. ఇంట్లో భార్యని తీసుకుని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని వెళ్ళాడు.

“ఎస్సై గారు.. కంప్లైట్ ఇవ్వాలండి”

“ఏం కంప్లైట్ ఇవ్వాలి?” అన్నాడు ఎస్సై.


“ఫోన్ పోయిందండి” అంది మందమతి.


“ఫోన్ ఎలా ఉంటుంది”.


“నల్లగా ఉంటుందండి” అంది టక్కున మందమతి.


“అందరివీ నల్లగానే వుంటాయే” అన్నాడు అమాయక రావు.


“అది కాదండి! నా ఫోన్ చిన్నగా ముద్దొస్తూ ఉంటుంది పిచ్చిది” అంది.


“అది కాదమ్మా.. ఏ ఫోన్” అన్నాడు ఎస్సై.


“ఇదిగో ఇలానే ఉంటుంది” అని చేతిలో ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టింది మందమతి.


“ఇదెవరి ఫోన్?” అన్నాడు ఎస్సై.


“ఇది నాదే కదా” అంది అమాయకంగా.


“అదేంటే ప్రొద్దుటి నుండి ఫోన్ పోయింది అంటూ నన్ను ఊరంతా తిప్పావుగా. అయినా నువ్వు ఫోన్ చేసినప్పుడైనా నాకు ఆలోచన రాలేదు ఎవరి ఫోన్ నుంచి చేస్తున్నావో” అని మట్టి బుర్ర అంటూ తనని తాను తిట్టుకున్నాడు అమాయక రావు.

“ఏమయ్యా చూసుకునే పనిలేదా. మేము తీరిగ్గా ఉన్నామని వచ్చారా” అంటూ ఎస్సై అరిచేసరికి ఉసూరు మంటూ బయటకు వస్తూ “నీలాంటి మొద్దు మొహం మాట విన్నాను చూడు, అది నా తప్పు” అన్నాడు.


“అయ్యో! నేనేం చేసానండి.. ” అంటూ ఏడుస్తూ ఇంటికి చేరింది మందమతి భర్తతో.


“అదేంటిరా మళ్ళీ వచ్చావు? ఆఫీస్ లేదా ఎవరైనా పోతారా” అంది కాంతం ఆత్రంగా.


“దొందూ దొందే! ఎక్కడ దొరికారే నాకు” అంటూ తల కొట్టుకున్నాడు అమాయక రావు.


“ఏంటిరా.. దొంగతనం జరిగిందా. అయ్యో అయ్యో నా మరచెంబు వుందో పోయిందొ.. మహానుభావుడు కొనిచ్చిపోయాడు” అంటూ పరిగెత్తింది గదిలోకి కాంతం.


“ఏమే నా ఫోను తీసుకురా, ఆఫీస్ కి చెయ్యాలి” అన్నాడు.


“అదేంటండీ! ఇప్పుడే కదా ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు”.


“పోయింది నా ఫోన్ కాదే, నీది అని వెళ్ళాం. నా ఫోన్ ఎక్కడా?” అన్నాడు ఆవేశంగా అమాయక రావు.


“అయ్యో అంత ఆవేశం ఎందుకు? బీపి ఎక్కువయ్యిద్ది” అంటూ లోపలికి వెళ్ళింది.


“ఏరా అబ్బాయ్, అమ్మాయ్! దొంగ వెధవ నా మర చెంబు తీసుకుపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలిరా భగవంతుడా! ఒకే ఒక జ్ఞాపకం అది” అంటూ సోకాలు అందుకుంది కాంతం.


ఇంతలో మందమతి మర చెంబుతో బయటకు వచ్చి “ఏమండి.. నా ఫోన్ పోయింది కదా! అందుకని మీది భద్రంగా ఈ మర చెంబులో దాచాను” అంది.


“అయ్యో అయ్యో! ఎవరైనా నీళ్లలో ఫోను దాస్తారంటే.. ఈ ఇంట్లో ఉండడం ఇక నా వల్ల కాదు” అంటూ బయటకు పరిగెత్తాడు అమాయకరావు.

***

వేమూరి రాధారాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

రాధా రాణి. వేమూరి

స్కూల్ ప్రిన్సిపాల్

కవితలు, కథలు వ్రాస్తాను. ఇంతకు ముందు వేరే మాధ్యమాలలో వ్రాసాను.




45 views0 comments
bottom of page