'Kodukulakanna kuthuru Nayam' - New Telugu Story Written By Sumathi Thaduri
'కొడుకులకన్న కూతురు నయం' తెలుగు కథ
రచన: సుమతి తాడూరి
హైదరాబాద్ వెళ్తున్న ట్రైన్ ఎక్కి కూచుంది రాధమ్మ. మొఖంలో కళ లేదు, కళ్ళలో కాంతి లేదు, పెదాలపై చిరునవ్వు లేదు. తనని చూస్తే ఎవ్వరికైనా అర్ధం అవుతుంది, తనేదో బాధలో ఉందని, తనకి ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ.
అందరికి పెళ్లిళ్లు అయిపోయాయి, ఇద్దరు కొడుకులూ అమెరికాలో సెటిల్ అయ్యారు. కూతురు వాణి హైదరాబాద్ లో ఉంటుంది. తను ఒక లాయర్. ఇప్పుడు రాధమ్మ, వాణి దగ్గరికే వెళ్తుంది.
ఒకప్పుడు బాగా బ్రతికిన రాధమ్మ, తన భర్త మరణం తో ఒంటరై పోయింది. కొడుకులు అయితే తండ్రి ఆఖరి చూపుకి వచ్చి వెళ్లిపోయారు కానీ..
“అమ్మా! నాన్న లేకుండ నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు? మాతో రా” అని ఏ కొడుకు అనలేదు, వాళ్ళ దారిన వాళ్లు వెళ్లిపోయారు. ‘నా భర్త తో పాటే నేనూ చనిపోయి ఉంటే బాగుండేది’ అని మనసులోనే బాధపడింది రాధమ్మ. ‘అలా అయిన నా కొడుకులు ఈ సమాజం దృష్టిలో చెడ్డవారు అయ్యేవారు కాదు’ అనుకుంది.
తన కూతురు వాణి, అల్లుడు అరవిందు, రాధమ్మకు తోడుగా ఓ నెల రోజులు ఉన్నారు. వాణి లాయర్ కావడముతో, కేసులు ఉండడముతో రోజు ఫోన్ లు వచ్చేవి.
“అమ్మా! మాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు మాతో రామ్మా.. హైదరాబాద్ వెళ్లి పోదాం. అక్కడే మాతో ఉందువు, నాన్న లేని ఇ ఇంట్లో ఒక్కదానివే ఎలా ఉంటావు?” అంది వాణి.
“వద్దమ్మా! మీకెందుకు ఇబ్బంది, నేను ఇక్కడే, ఈ ఇంట్లోనే మీ నాన్న గారి జ్ఞాపకాలతో ఉంటాను” అనగానే “అదేంటి అత్తయ్య.. మీ వల్ల మాకేమి ఇబ్బంది ఉండదు, నువ్వు మా అమ్మ లాగా స్వతంత్రం గా ఉండొచ్చు. నాకు అమ్మ నాన్న, లేరని ఈమాట చెప్పడం లేదు అత్తయ్య, వాళ్ళు ఉన్నా మిమల్ని, మా ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం” అన్నాడు అరవిందు.
“సరే బాబు మీరు వెళ్ళండి, ఇక్కడ కొన్ని పొలం పనులు ఉన్నాయి, అవి చూసుకొని వస్తాను” అంది రాధమ్మ. కూతురు అల్లుడు వెళ్లిపోయారు.
అమ్మ నాన్నలను తోడుగా ఉండి, పోషించి, తల కొరివి పెట్టె కొడుకులు, బాధ్యతలు మరిచి, బంధాలను విడిచి, సంపాదన కోసం విదేశాలకు వెళ్లి, అనుబంధాలను తెంపేసుకుంటున్నారు.
అందుకే చివరిదాకా తోడుండే కొడుకుల కన్న, అత్తగారింటికి వెళ్లే ఆడపిల్లలు నయం. అందుకే అంటారు ఆడపిల్ల ఇంట్లో ఉంటే అదృష్టం అని.
తనకు ఓ బంధం తెలుసు, బాధ తెలుసు అనుకోని రాధమ్మ హైదరాబాద్ కు బయలుదేరింది.
రాధమ్మ వెళ్ళగానే కూతురు, అల్లుడు ఎంతో సంతోషపడ్డారు, తల్లి కి ఏ బాధ రాకుండా చివరిదాకా చూసుకున్నారు.
***శుభం***
సుమతి తాడూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు :సుమతి తాడూరి
నా భర్త పేరు నాగరాజు, పురోహితం చేస్తాడు.
నాకు చిన్నపటి నుండి కథలంటే ఇష్టం, ఎందుకంటే అందుకు కారణం మా అమ్మ, రోజు పడుకునేటప్పుడు కథలు చెప్పేది, అలా నాతో పాటే నాలోని ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది ,చందమామ, భేతాళ, విక్రమార్క కథల బుక్స్ చదివేదాన్ని, అలా నాలోను సొంతముగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. 9 వ తరగతిలోనే కథలు రాయటం మొదలుపెట్టాను. కొన్ని కథలు, సీరియల్ రాశాను. కొన్ని ఆర్థిక ఇబ్బందులు/నాకు ఎవ్వరి సఫోర్ట్ లేకపోవడం, వలన ప్రచురణ కాలేదు.
కానీ నా భర్త నాకు ఫోన్ కొనిచ్చాక, రెండు కథలు రాశాను. నేను రచయిత్రి కావాలన్నదే నా జీవిత ఆశయం.
Comments