top of page

అంబులెన్స్


'Ambulance' - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri

'అంబులెన్స్' తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


రంజిత్ ఒక కార్ డ్రైవర్. ఆరోజు ఆదివారం కావడం తో, ఏ కస్టమర్ లేక ‘ఈరోజు ఎలాగరా దేవుడా గడిచేది, ఒక్క బేరం కూడా చేయలేదు’ అనుకుంటూ వైజాగ్ లో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర చెట్టు కింద కారు పెట్టి ఆలోచిస్తున్నాడు.


సరిగ్గా మధ్యాహ్నంమూడు గంటల వరకు చూసి, అక్కడే రోడ్డు మీద ఉన్న లంచ్ బండి దగ్గర 30 రూపాయలకు, ఒక ప్లేట్ భోజనం చేసి వచ్చి కారులో కూర్చొని, ఏ బేరం చేయకపోతే ఇంట్లో ఎలా గడుస్తుంది, అసలే ఈ ఉద్యోగానికి కొత్త, అందుకే భయపడుతున్నాడు డ్రైవర్ రంజిత్.


ఇంతలో కారు డోర్ చప్పుడై చూసేసరికి, ఒక ఫుల్ సూట్ వేసుకున్న వ్యక్తి చేతిలో సూట్ కేస్ తో వచ్చి, 'ఒరేయ్ బాబు ఎయిర్పోర్టుకు వస్తావా, ! నాకు ఫ్లైట్ టైం అవుతుంది!” అని అడిగేసరికి, రంజిత్ కళ్ళల్లో ఎనలేని మెరుపుతో, “అలాగే సార్ రండి, రండి!” ఒకసారి సీటు దులిపి, “కూర్చోండి” అంటూ “ఇవాళ ఆదివారం, ఎయిర్పోర్టుకు అయ్యే బిల్లుతో పాటు ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. అలాగేనా సార్!” అనగానే,


“పోనీ బాబు ముందు, ఇస్తానులే !” అంటూ లోపల కూర్చుని అలసటగా కళ్ళు మూసుకున్నాడు ఆ ఖరీదైన ప్యాసింజర్.


ఎనలేని ఉత్సాహంతో కారులోని డాష్ బోర్డు మీద ఉన్న' గణపతికి దండం పెట్టుకొని ఏసీ ఆన్ చేసి, లైట్ గా పాటలు పెడుతూ, కారును ముందుకు పోనిచ్చాడు డ్రైవర్ రంజిత్.


అసలే ఆదివారం, సెలవు దినం కావడంతో విశాఖ ప్రజలు తమ తమ కుటుంబాలతో, సరదాగా విశాఖలోని అతి సుందరమైన ఆర్కే బీచ్, ఋషి కొండ, లాంటి సముద్ర తీర ప్రాంతాలకు బయలుదేరడంతో, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.


తన కారును పోనిస్తుండగా, హైవే దగ్గరికి వచ్చేసరికి మాటిమాటికి సిగ్నల్స్ పడుతూ ఉండడంతో, వెనకాల కస్టమర్ “ఒరేయ్ బాబు !నువ్వు ఇలా మెల్లిగా పోనీస్తే, ఫ్లైట్ మిస్ అయిపోతుంది, తొందరగా పోనీ, ఏంటి ఉద్యోగానికి కొత్తలా ఉన్నావే”, అంటూ నవ్వేసరికి, “లేదు సార్! ఒక రోడ్డు రిపేర్ అవడంతో, అన్ని వాహనాలు ఒకే రోడ్డు మీదకు రావడం ట్రాఫిక్ కన్జస్ట్ అయిపోయింది”, అంటూ తన సంజాయిషి చెప్పుకుంటు, కారు స్పీడ్ పెంచాడు డ్రైవర్ రంజిత్.


ఈ. లోపల వెనకాల ఉన్న ప్యాసింజర్ ఆస్తమాను టైం చూసుకుంటూ, హడావిడిగా డ్రైవర్ రంజిత్ భుజం మీద తడుతూ, “ఒరేయ్ బాబు! ఇలాగైతే నేను ఊరు వెళ్ళినట్లే, కాస్త తొందరగా పోనీ”, అని గాబరా పెట్టేసరికి, ముందున్న బస్సును తప్పించబోయి, భయంతో ఒకచోట ఆపేసాడు.

"సార్ మీరు గాబరా పడితే మీరు పడండి, నన్ను అస్తమాటు అలా భుజం తట్టకండి ! అసలే నాకు కారు డ్రైవింగ్ కొత్త, నేను ఇన్నాళ్లు మార్చురీ వాన్లు నడిపాను. ఒక్కడినే ఎన్నో శవాలను, తీసుకెళ్లే వాణ్ణి. ఆ పని చేయలేక ఈ కారు డ్రైవింగ్ కొచ్చాను.

మీరు భుజం తడుతూ పోనీ, పోనీ అంటుంటే, నాకు మార్చురి వ్యాన్లో, శవం తట్టి లేపుతున్నట్లు ఉన్నది. ఇంకా ఆ అలవాటు పోలేదు. అయినా మీరు డ్రైవర్ని నోటితోనే చెప్పాలి గాని, సడన్గా భుజం తడుతూ గాబరా పెట్టకూడదు. ఏదైనా జరిగితే ఇద్దరము శవాలైపోతాం!! అని అనగానే, పాసింజర్ గబుక్కున కారు దిగి, “ఒరేయ్ బాబు! నువ్వు వద్దు, నీ కారు వద్దు!” అంటూ 500 రూపాయలు సీట్లో పడేసి, పరిగెత్తి పారిపోయాడు అక్కడినుంచి.


డ్రైవర్ రంజిత్ తను అన్న మాటలకు భయపడిపోయాడు పాసింజర్, అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు.


(ఏది ఏమైనా కారు ప్రయాణంలో డ్రైవర్ను డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు. అది మన ప్రాణాలకే ముప్పు. )

**************

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.





28 views0 comments
bottom of page