అమ్మ చెప్పిన ఉగాది రహస్యం!
- P. V. Padmavathi Madhu Nivrithi

- 2 minutes ago
- 5 min read

Amma Cheppina Ugadi Rahasyam - Telugu Moral Story | P V Padmavathi Madhu Nivrithi
అమ్మ చెప్పిన ఉగాది రహస్యం! - తెలుగు నీతి కథ | పి. వి. పద్మావతి మధు నివ్రితి
Published in manatelugukathalu.com on 19/03/2026
1)
ఆ రోజు ఉగాది పండుగ. ఆరవ తరగతి విద్యార్థి మాధవ్ కొత్త బట్టలు వేసుకొని, ఉగాది పచ్చడి తిని, స్నేహితులతో ఆడుకొని
ఉషారుగా గడిపాడు.
2)
మరునాడు పాఠశాలలో క్లాసులు అయిపోయాక ఇంటికి పరుగు పరుగున వచ్చాడు.
"అమ్మా! ... నన్ను అందరూ స్నేహపూర్వకంగా మాట్లాడిస్తున్నారు. పాఠశాలలో మరియు బయట ... ఇరుగు పొరుగులో కూడా."
3)
అమ్మ ఆశ్చర్యంగా ఎగా దిగా చూసింది మాధవ్‌ను.
"అదేంట్రా మాధవా! ... రోజు అంటావు, అందరూ 'పేదవాడు' అంటూ కసురుకుంటారు అని. ఈ నిర్దయ ప్రపంచంలో, 'పేదవాడి మాట పెదవికి చేటూ' అని కన్నీరు పెట్టుకున్నావు చాలాసార్లు. ... 'దేవుడు పక్షపాతంతో ధనికులను విడిగా - పేదవారిని విడిగా ఎందుకు సృష్టించడు?' అన్నావు... మరి... ఒక్క రోజులో ఎలా మారిపోతుంది సమాజం-ప్రపంచం? ... సరే, రేపు కూడా చూడు... అందరి ప్రవర్తన ఎలా ఉందో చెప్పు," అన్నది అమ్మ ఆశ్చర్యంగా.
4)
మరునాడు కూడా ఇంటికి పరుగు పరుగున వచ్చాడు మాధవ్. "అందరూ స్నేహపూర్వకంగా మాట్లాడిస్తున్నారు," అన్నాడు.
అమ్మకు అంతుబట్టలేదు.
"ఈ వారం అంతా చూడు... అందరి ప్రవర్తన ఎలా ఉందో చెప్పు," అన్నది అమ్మ రెండింతల ఆశ్చర్యంగా.
5)
ఆ వారం అంతా... అందరి ప్రవర్తన స్నేహపూర్వకంగా ఉంది... అంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా చెప్పాడు మాధవ్.
అమ్మకు చటుక్కున ఏదో గుర్తుకు వచ్చింది. మాధవ్ చెవిలో 'ఉగాది రహస్యం' చెప్పింది మెల్లగా.
6)
మాధవ్ హాయిగా నిద్రపోయాడు రాత్రి. అతను ఉదయాన్నే తొందరగా నిద్రలేచాడు. తన పనులన్నీ పూర్తి చేసుకుని పాఠశాలకు తొందరగా పరుగెత్తాడు. అక్కడ అతను తన సహవిద్యార్థిని వింధ్యను కలిశాడు. అతను కృతజ్ఞతతో ఆమె వైపు చూస్తూ ధన్యవాదాలు తెలిపాడు.
వింధ్య ఆశ్చర్యపోయింది. "ధన్యవాదాలు ఎందుకు?" అన్నది.
------------- ఏమిటా ఉగాది రహస్యం ??? ---------
... తెలుసుకోవడానికి చదవండి... తదుపరి పేరా - వాక్యాలు...
త్వరత్వరగా...
"ఉగాది రోజు... చల్లటి సంధ్యా సమయంలో - హాయినిచ్చే సాయంత్రం వేళ... నువ్వు (అందాల వింధ్య) మా ఇంటికి వచ్చావు. అప్పటి నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. అందరూ నాతో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే నువ్వు... ఓ ధనవంతురాలు - గుణవంతురాలు - బార్బీ డాల్... నా స్నేహితురాలివని వారికి తెలిసింది కాబట్టి... నువ్వు అందుకే వచ్చావు కదూ మా ఇంటికి... నీది తేనె మనస్సు - దేవతా హృదయం!"... అన్నాడు మాధవ్ సంతోషం నిండిన హృదయంతో.
"నువ్వు 'మంచిని మించిన మంచి వాడివి'... అందరికీ నోట్స్ పుస్తకాలు ఇచ్చి... మాట, చేత సాయం చేస్తావు నీకు తోచినంత... నీది నిండు మనసు - పవిత్ర హృదయం... అందుకే నువ్వంటే నాకు ఇష్టం... అందుకే నీకు మంచి జరగాలని వచ్చాను మీ ఇంటికి... డబ్బుకు లోకం దాసోహం!"... అంటూ కిలకిల నవ్వింది వింధ్య.
---------------- చిన్న కథ సమాప్తం -------------
--------------- నీతి --------------
1)
డబ్బుకు లోకం దాసోహం... లా కాదు... మంచికి మానవత్వానికీ దాసోహం... లా బ్రతకాలి... దేవుడు చేసిన మనుషులు అన్నాక.
2)
ప్రతి రోజు పండగేలా బ్రతకాలి... సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ, ఉభయతారక ఆనందకరమైన విజయ పరిష్కారాలు మరియు నిర్మాణాత్మక స్వభావంతో... మంచిని పంచుతూ పెంచుతూ... సర్వత్రా శాంతి, శ్రేయస్సు, పురోగతిని వ్యాప్తి చేయడం... మంచి మాటలు, చేతలు అమలు చేయడం... అందరికీ అద్భుతమైన ఆరోగ్యం కూడా చేకూరాలి... దేవుడు చేసిన మనుషులు అన్నాక.
3)
దేవుడు చేసిన మనుషులు అన్నాక ఇవి చేయకూడదు
[
యుద్ధాలు - హాని - బలిపశువు - బ్రోకరేజీ - టైమ్‌పాస్ - భూత స్వభావం - కృత్రిమ భంగిమ - సంస్థాగత ముఖస్తుతి - డాలర్ ముఖస్తుతి - డబ్బు దురాశ - అసంతృప్తికరమైన నిర్వహణ - అవాస్తవిక నిర్వహణ] -
(చేస్తూ - ఇస్తూ ఇతరులకు... బ్రతకకూడదు)
...
ఇతరుల నుండి తగినంత దూరం పాటించడం మరియు సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ పుస్తకాలను క్రమం తప్పకుండా చదవడం సహాయపడుతుంది... అలాగే అభిరుచులను కొనసాగించడం, పెంపుడు జంతువులు, వ్యాయామం (కనీసం నడక), పోషకమైన ఆహారం తీసుకోవడం
మొదలైనవి కూడా సహాయపడతాయి.
4)
చిన్ననాటి స్నేహితులు దేవుడిచ్చిన బహుమతులు.
5)
Every human in this God-gifted, excellent world should live like every day is a festival day... Spreading all-round peace, prosperity, and progress... HAPPY development management and WIN-WIN JOYFUL success solutions and constructive nature... Good words, deeds, and implementation... EXCELLENT health... FOR all.
...
6)
Humans should NOT spend time in wars - harm - scapegoat - brokerage - timepass - devilish nature - artificial pose - organizational sycophancy - dollar sycophancy - money greed - unhappy management - unrealistic management - artificial pose - play one against another - jealousy, etc., devilish qualities.
...
7)
Keeping a decent distance FROM others & regularly reading happy development management books helps... ALSO pursuing hobbies, pet animals, exercise (at least walking), nutritious food etc., helps.
8)
Childhood friends are God's gifts.
----------- నీతి సమాప్తం ------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
#పివిపద్మావతిమధునివ్రితి, #WinnerInTwoInterviews, #AmmaCheppinaUgadiRahasyam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు |




Comments