అమ్మ చెప్పింది
అమ్మ చెప్పింది, వంగీపురం శశిరేఖ, తల్లి ప్రేమ, అమ్మ గొప్పతనం, కుటుంబ విలువలు, తెలుగు వ్యాసం, ప్రేరణాత్మక వ్యాసం

Amma Cheppindi - Telugu Emotional Family Article | Vangeepuram Shashirekha
అమ్మ చెప్పింది - తెలుగు భావోద్వేగ కుటుంబ వ్యాసం | వంగీపురం శశిరేఖ
Publishes in manatelugukathalu.com on 28/07/2026
అమ్మ... ఈ ఒక్క మాటలోనే ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యత, మార్గదర్శకత్వం అన్నీ ఇమిడిపోయి ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లయ్యే వరకు ప్రతి అడుగులోనూ తన అనుభవంతో, ఆప్యాయతతో, ప్రేమతో మన జీవితాన్ని తీర్చిదిద్దేది అమ్మే. "అమ్మ చెప్పింది" అనే ఈ హృద్యమైన వ్యాసంలో వంగీపురం శశిరేఖ తల్లి ఇచ్చే జీవిత పాఠాలు, కుటుంబ విలువలు, నేటి తల్లులు ఎదుర్కొంటున్న సవాళ్లు, తల్లి-పిల్లల అనుబంధాన్ని హృదయాన్ని కదిలించేలా వివరించారు.
అమ్మ చెబుతూనే వుంది, చెబుతూనే వుంటుంది. అన్ని వేళలా మనం విన్నా, వినకపోయినా, వినినట్లు నటించినా, మనకి నచ్చినా నచ్చకపోయినా, అన్ని విషయాల్లో తన సలహాలు మనకిచ్చి కాపాడుతూనే ఉంది/వుంటుంది.
తొలి గురువు అమ్మే. తను చదువుకున్నా, చదవలేకపోయినా మన దగ్గర కూర్చొని మరీ క్రమశిక్షణతో చదువు చెప్పేది లేదా చదివేలా చేసేది.
అమ్మ అనే పదమే అపురూపమైనది. అది అమ్మ నీడలో ఉన్నప్పుడు తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. స్పష్టంగా ఏనాడు కూడా ఎంత పనైనా సహనంతో చేసేదే కానీ, ఒక్కనాడు 'అబ్బా ఇంత పని' అని విసుక్కున్న దాఖలాలు లేవు.
ఒక స్త్రీ చదువుకున్నట్లైతే పూర్తి కుటుంబం విద్యావంతులవుతారు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్నప్పటినుండి మనల్ని అన్నివిధాలుగా సంరక్షిస్తూ, పరిశీలిస్తూ ఒక స్థితికి తీసుకురావడం సులువైన పని కాదు. అమ్మ అనే పదవికి మాత్రం ఎలాంటి శిక్షణ లేదు.
నాకైతే చిన్నప్పటినుండి 'అమ్మో ఈ పని నావల్ల కాదు, ఇప్పుడు కాదు తరువాత చూద్దాము, ఇప్పుడు నెలాఖరు తరువాత చూద్దాము' అన్న పదాలు వినబడలేదు మా అమ్మ నోటంట. అలా అని బాగా సంపన్నమైన కుటుంబం కాదు మాది. ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యమేస్తుంది అవన్నీ గుర్తొస్తే.
అస్తమానం చుట్టాలు, పక్కాలు, పండగలు పబ్బాలు, పురుళ్లు పుణ్యాలు ఎలా గడుపుకొచ్చారో అని. పైగా ఏ పని చేసినా మొలచిన మొక్కలాగా ఉండాలని చెప్పేది అమ్మ. అంటే చడీ చప్పుడూ లేకుండా నిశ్శబ్దంగా చేసుకుంటూ పోవాలన్నమాట.
ఇప్పుడనిపిస్తూ ఉంటుంది, అయినదానికీ కానిదానికీ పాపం చాలాసార్లు కటువుగా మాట్లాడుంటాను కానీ ఎప్పుడూ బాధపడినట్లు గమనించలేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనసు కష్టపెట్టుకొనే ఉండి ఉండొచ్చు. కానీ నేను ఏమీ చేయలేను, ఎందుకంటే మా అమ్మ, నాన్నగార్లు తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు కాబట్టి.
ఈ తరం అమ్మలకైతే ఇంకా ఎన్నో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలు మొదలగు వాటి నుండి పిల్లల్ని కాపాడుకోవడం చాలా పెద్ద సవాలు. ఇలాంటి పరిస్థితుల్లో 'తానొవ్వక నొప్పింపక' అన్నట్లుగా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.
తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక సన్నని తెలియని తెర, కొన్ని సంగతులు అడగలేము, మానలేము అన్నట్లు ఉంటాయి, ముఖ్యంగా పిల్లల యుక్త వయస్సులో. అయినా అమ్మ కనుక ఆలోచించి ప్రణాళికలు వేయక తప్పదు.
ప్రతీ ఒక్కరికీ రోజు ఏదో ఒక సందర్భంలో 'అమ్మ అయితే ఇలా చేసేది' అని తప్పక అనిపిస్తుంది. మన జీవితంపై అమ్మ, నాన్నల ప్రభావం ప్రతీ విషయంలో ప్రతిబింబిస్తుంటుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
తరచూ పెద్దవాళ్ల దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మన మనసులోని మాటని వాళ్లకు స్పష్టంగా తెలియజెప్పాలి. పెద్దవాళ్లు కూడా కాలానుసారంగా తమ సలహాలను మార్చుకుంటూ ఉండాలి. అమ్మ మనకి దేవుడిచ్చిన వరం. ఏదైనా కానీ, మనకు అమ్మ కాక ఎవరు చెపుతారు?
***************************************
వంగీపురం శశిరేఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వంగీపురం శశిరేఖ
నేను ఆదాయపన్ను శాఖలో ఇనస్పెక్టర్ గా పని చేసి విశ్రాంత జీవనం
గడుపుతున్నాను,నాకు తెలుగు భాష అంటె ఎంతో మక్కువ.టీచింగ్ అంటే కూడా చాలా
ఇష్టం.నా విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. మా మనవడు
ఆరుష్ వియాన్ మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.




Comments