ఆనంద నిలయం
- Addanki Lakshmi

- 1 day ago
- 5 min read
#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #AnandaNilayam, #ఆనందనిలయం,#TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ananda Nilayam - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 25/11/2025
ఆనంద నిలయం - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
సాయంత్రం అయిదు అయ్యేసరికి ఆ పార్కులో సీనియర్ సిటిజనులందరూ చేరుతారు,
వాకింగ్ చేసి సరదాగా ఒక గంట సేపు కష్టసుఖాలు మాట్లాడుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు,
ఆరోజు సాయంత్రం అక్కడ కూర్చున్న నలుగురు ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంతలో రామారావు గారు హలో ఫ్రెండ్స్ అంటూ వచ్చారు
" అరే మీరు ఎప్పుడు వచ్చారు?" అని అడిగాడు పరంధామయ్య.
"అప్పుడే మీ యూఎస్ ట్రిప్ అయిపోయిందా?".
రామారావు గారు నవ్వుతూ వచ్చి వాళ్ళ మధ్య కూర్చున్నారు.
"అవునండి ఆరు నెలలు అయిపోయింది వచ్చేసాము”
"మీరు గ్రీన్ కార్డు తీసుకుని అక్కడే ఉందామని అనుకుంటున్నారు కదా!"
"లేదండీ ఆ ఆలోచన మార్చుకున్నాము. ఈ వృద్ధాప్యంలో మన దేశంలో మనము ఉంటేనే అదృష్టము, ఇంకేది ఉండదు".
"అదేంటి పూర్వం మీరు అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది పిల్లలు బాగా చూస్తారు అని ఎంతో గొప్పగా చెప్పేవారు కదా!"
గోపాల్ రావు గారు అడిగారు,
"అవును నిజమే! దూరపు కొండలు నునుపు కదా అలా కనిపిస్తుంది.
దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఉండే రాళ్లు రప్పలు దారి ఎంత కష్టతరంగా అర్థమవుతాయి, "
"అయితే మీ ఎక్స్పీరియన్స్ లన్నీ పంచుకోండి మిత్రమా!" అంటూ నవ్వాడు సుధాకర్.
చెప్పండి మిత్రమా అన్నారు అందరూ.
రామారావు గారు మొదలు పెట్టారు.
“కొడుకులు కోడళ్ళు ఇద్దరు మమ్మల్ని చాలా బాగా చూచుకుంటారు. అమెరికాలో పెద్దపెద్ద ఇళ్లు ఉంటాయి. అందరికీ కారులు ఉంటాయి. జీవితం సుఖంగా సులభంగా జరిగిపోతుంది.
మనవలు పుట్టినప్పుడు పిల్లల్ని పెంచడానికి వెళ్లే వాళ్ళం. అప్పుడు బాగానే గడిచిపోయేది. ఇంటి నిండా పనిమూలంగా.. ఇప్పుడు పిల్లలు పెద్ద క్లాసులకు వచ్చి చదువులకు వెళ్ళిపోతారు. వచ్చి వాళ్ళ రూముల్లో చదువుకుంటూ కూర్చుంటారు. కోడళ్ళు కొడుకులు వాళ్ళు ఉద్యోగాలు..
ఏ దేవాలయామో వెళదాం అంటే దగ్గరగా ఉండవు చాలా దూరం.
ఎక్కడికి వెళ్ళేందుకు ఉండదు. మనకా కారు డ్రైవింగ్ రాదు.
ఇక్కడ ఇండియాలో అయితే మన చుట్టుపట్ల దేవాలయాలు, ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. అందులో పాల్గొంటే మనకు చక్కని కాలక్షేపం. వృద్ధాప్యం మనకు ఒక వరం. చక్కగా మనకు నచ్చిన విధంగా కాలక్షేపం చేయొచ్చు. భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి.
ఒకవేళ ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం వచ్చిన సహకారం దొరుకుతుంది.
వంట మనిషిని పెట్టుకోవచ్చు. హెల్ పర్ ని పెట్టుకోవచ్చు.
మా పిల్లలకి నేను చెప్పేసాను మేము ఇండియాలోనే ఉంటాము మీరు వచ్చి చూసి వెళుతూ ఉండండి అని, " రామారావు గారు తన మనసులోని మాట చెప్పారు,
"వృద్ధాప్యం కూడా మనకు వరం. మనకు కావలసిన విధంగా నచ్చినట్టుగా ఉండవచ్చు. వయసులో ఈ సంసార సాగరంలో పడి మనకు దేనికి టైం ఉండదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న వైలెన్ పాటలని మళ్లీ మొదలుపెట్టి వాయించుకుంటూ ఉంటాను. రిటైర్డ్ లైఫ్ నిజంగా హాయిగా ఉంది, " అన్నాడు గోపాల్ రావు.
"నేను కూడా అంతే. నా కొడుకు కోడలు రమ్మంటారు. ఒక్కడే అక్కడే ఎందుకు అంటూ, మా ఆవిడ ఉండంగా అక్కడ ఉండే వాళ్ళము. నాకు కూడా అక్కడ తోచక, నచ్చక నేను ఇంటికి తిరిగి వచ్చేసాను,.
మా ఆవిడ లేకపోయినా నేను ఒక్కడినే వండుకుని కాలక్షేపం చేస్తున్నాను. టీవీలో నాకు కావలసిన ప్రోగ్రాములు చూసుకొని రెండు పూటలా వాకింగ్ కి వెళ్లి వస్తాను.
చూద్దాము మరి లైఫ్ ఎట్లా ఉంటుందో.. మరీ లేవలేని పరిస్థితి వస్తే వాళ్ల మీద ఎలాగా ఆధారం తప్పదు కదా, " అన్నారు పరంధామయ్య గారు,
సుధాకర్ వెంటనే మొదలుపెట్టారు..
"మనలాంటి వారి లైఫ్ లో బాగానే ఉన్నాయి. వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత హాయిగా గడుపుతున్నాము, మనకు కావలసిన విధంగా మలుచుకుంటూ.
అయితే మా పక్క వాటా లో ఉన్న పిన్ని గారి పరిస్థితి చెప్తాను.
ఒక్కతే అమ్మాయి. పట్టణంలో ఉంటుంది. ఇద్దరు మనుమలు.
అల్లుడు అమ్మాయి జాబ్ కి వెళ్తారని వీళ్ళిద్దరూ వెళ్లి అక్కడ చాకిరీ చేస్తూ ఉండేవారు భార్యాభర్తలు. ఆ మధ్య ఆయన పోయాడు. తర్వాత కాలంలో ఆవిడకి పక్షవాతం వచ్చింది.
దాంతో అల్లుడుకి అత్తగారి వల్ల ఉపయోగం లేదని తీసుకెళ్లి అనాధాశ్రమంలో పెట్టేశాడు.
ఆవిడ వద్దంటూ ఎంతో ఏడ్చింది, వినిపించుకోలేదు.
ఇలాంటి కర్కసులు కూడా ఎంతోమంది ఉన్నారు,. పిన్ని గారి లాంటి వాళ్ళకి ఎవరి వల్ల సహాయం లేక వృద్ధాప్యం శాపంగా మారుతుంది, "
"అలాగే మా దూరపు చుట్టాల్లో ఒకాయన ఉన్నారు. ఆయన్ని కూడా వాళ్ల కొడుకు కోడలు, అనాధ ఆశ్రమంలో పెట్టేశారు. ఆ ముసలి ఆయనకి చాకిరీ చేయాలని.
ఇటువంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది.
నిజంగా ముసలితనం శాపమా అనిపిస్తుంది.
కాళ్లు చేతులు ఆడినంత కాలం జీవితం సవ్యంగా నడుస్తుంది.
ఇంక రోడ్డుమీద ఎంతోమంది, ముసలి వాళ్లు అనాధలు అడుక్కుతింటూ ఉంటారు. వాళ్ల కొడుకులు కోడళ్ళు తిండి పెట్టలేక వీళ్ళని ఇంటి నుంచి గెంటేస్తారు. ఒక్కొక్కసారి సమాజంలోని పరిస్థితులను చూస్తే చాలా బాధగా ఉంటుంది, " ప్రభాకర్ మనసంతా బాధగా మూలిగింది.
వెంటనే రామారావు గారు ఇలా అన్నారు..
"ఇటువంటి వాళ్ళని అనాధలను చూస్తే మనకు ఎంతో జాలి వేస్తుంది కదా..
నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. మన ఫ్రెండ్స్ అందరూ ఒక పదిమంది కూడుకుని, కొంత డబ్బు వేసుకుని, ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని అందులో ఒక వంట మనిషిని, ఒక నర్సుని, ఇద్దరు ఆయాలని పెడదాము.
ఎవరైతే వృద్ధులై అనాధలు గా ఉన్నారో, వారి పిల్లలు పట్టించుకోరో, ఎవరికి సహాయ సహకారాలు కావాలో ఒక ప్రణాళిక ఏర్పరచుకొని అందిద్దాము. దానికి ఆనంద నిలయం అని పేరు పెడదాము.
మనందరికీ డబ్బుకి లేటు లోటు లేదు కదా, రిటైర్ అయి ఉన్నాము మానవసేవయే మాధవసేవ అన్నారు.
బాగా లేవలేక వృద్ధులైన వారికి సహాయం చేస్తే మనకు పుణ్యం కూడా వస్తుంది.
అలాంటి వారికే వృద్ధాప్యం ఒక శాపముగా కాకుండా ఒక వరముగా మనం ప్రసాదిద్దాం. ఏమంటారు మిత్రులారా !" అని అడిగాడు రామారావు.
ఈ ప్లాను అందరికీ నచ్చింది.
"చాలా సంతోషం రామారావు గారు! మనకి ఇంకా ఓపిక ఉంది. ఈ ప్రాజెక్టు మొదలు పెడితే మనకు చాలా తృప్తిగా ఉంటుంది.
ఓపిక లేని వృద్దులు, పిల్లలు సరిగా చూడక, వృద్ధాప్యం శాపంగా తలచి బాధపడుతూ ఉంటారు, అటువంటి అవసరమైన వృద్ధులకు సహాయం చేయవచ్చు, " అన్నారు స్నేహితులు అందరూ సంతోషపడుతూ ఏకకంఠంగా.
"సరే! రేపటి నుంచి ప్రాజెక్టుకు పని మొదలుపెడదాం, ముందర మన మందరము కొంత డొనేషన్లు కలెక్ట్ చేసుకుందాము, " అంటూ అందరూ సంతోషంగా లేచి ఇళ్లకు, వెళ్లారు.
మరుసటి నెలలో ఆ కాలనీలో ఒక ఫ్లాట్లో ఆనంద నిలయం ఏర్పడింది.
అందులో రోడ్డుమీద దిక్కులేని 20 మంది వృద్ధులను తీసుకొచ్చి, వారికి సదుపాయాలు కలగజేశారు.
వృద్ధాప్యం శాపం అని తలచవద్దు, అంటూ ఆనంద నిలయం కార్యనిర్వాహకుల గ్రూపు వారు భరోసా ఇస్తున్నారు.
&&&&&&_
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. నాటకాలు వ్రాసి విద్యార్థుల నాటకాలు వేయించాను. బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను. సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి.
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను.
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు, పద్యాలు ప్రచురించ బడినవి. కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు, పంచపదులు, సున్నితాలు, ఇష్టపదులు
**గేయాలు, వ్యాసాలు, నాటకాలు, పద్యాలు, గజల్స్,
కథలు, రుబాయీలు, బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు, తొణుకులు, చిలక పలుకులు, పరిమళాలు, మధురిమలు, ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు, సున్నితాలు, పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,, 2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
ప్రచురణ: కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments