అనాథ బాలల బాధ్యత

'Anatha Balala Badhyatha' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana
'అనాథ బాలల బాధ్యత' తెలుగు కథ
రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ
అది నేను రోజూ.. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళి వచ్చే దారిలో.. వచ్చే పెద్ద సిగ్నల్ కూడలి. సిగ్నల్ పడిందంటే నిమిషం పైనే ప్రయాణానికి విరామం పడినట్లే! కార్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి.. గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకూ.. ఎదురు చూస్తూ కూర్చోక తప్పదు!
సరిగ్గా అదే విరామ సమయంలో.. ఎందరో రకరకాల బిచ్చగాళ్ళు, చిన్న చిన్న ఫేన్సీ వస్తువులు అమ్మే.. చిరు సంపాదనకెగబడే.. చిల్లర బేరగాళ్ళూ.. హడావుడిగా వాహనాలు నిలిచిన వైపుకు.. ఆయాస పడుతూ.. అటూఇటూ కంగాళీగా తిరుగుతూ, .. ఆ సెంటర్లో నిత్య కృత్యంగా.. కాలం గడుపుతుంటారు!!
అందులో.. నన్ను ఆలోచనకు గురిచేసి.. వ్యాకులపరచే చిన్నారులు కూడా.. ఎందరో ఎదురు పడుతుంటారు!
ఈ దేశంలో.. ఆడుతూ పాడుతూ బడిలో గడపవలసిన బాల్యం.. ఇలా రోడ్ల మీద జీవన సమరంలో గడపటానికి బాధ్యులెవరు?.. వాళ్ళను కన్న నిరుపేద తల్లిదండ్రులా... లేక… స్వాతంత్య్రం ఒచ్చి డెబ్బై ఏళ్ళు గడిచినా.. అనాధ నిరుపేద బాలల.. బాధ్యత తీసుకోని.. ప్రభుత్వాలదా?!.. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చే.. కనీస చర్యలు తీసుకోని నాయకులు.. బాధ్యులు కారని అనుకోగలమా!?... సరిగ్గా ఇలా.. నా ఆలోచనలు సాగుతుండగానే… ఆ సెంటరు రానే వచ్చింది!... సిగ్నలు కూడా పడింది!!
మండు వేసవికాలం! సూర్యుడి భగభగలతో.. ఎండ మండిపోతోంది!! బ్రేకు వేసి వాహనం ఆపగానే… ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడు వట్టి నిక్కరుతో.. చేతిలో తడిగుడ్డతో… బహుశా వాడి చొక్కానే కావొచ్చు… చమటలు కక్కుతూ.. గబగబా వచ్చి… ఆదరాబాదరా కారు అద్దాలు తుడిచి.. , ఆశగా.. చెయ్యి జాపాడు!
ఆ చిన్నవాడి శ్రమైక జీవన శైలికి, .. నమ్మకానికి అబ్బుర పడ్డాను! నా మనసులో ఆలోచనలను పక్కకు నెట్టి.. ప్రక్కనున్న వాటర్ బాటిల్ తెరిచి.. సగం నీళ్ళు వాడి మొహన కొట్టి… నా సీటు కింది టవలిచ్చి… తుడుచుకోమని సైగచేసి… ఈలోగా ప్రక్కనున్న లంచ్ కేరియర్ తీసి… వాటర్ బాటిల్ తో సహ… వాడి చేతికందించాను.
అప్పటికి.. ఆ సమయానికి… నా జాలి గుండెకు.. తోచిందేదో చేసానన్న… తృప్తి మిగుల్చుకున్నాను!
కానీ… సమస్య ఈ ఒక్క కుర్రాడిది, .. ఆ ఒక్క రోజుతో తీరేది కూడా.. కాదని నాకు తెలుసు! అలాగని.. జాలితో.. డబ్బులివ్వడం కూడా.. పసివాళ్ళను పాడుచెయ్యడమే అవుతుందని.. నా నమ్మకం!
సమాజాన్ని ఉధ్ధరించటానికి… తాహతు చాలని సామాన్యుడిగా.. ఆ భారం.. ప్రభుత్వానిదే అని.. గట్టిగా నమ్ముతాను! ప్రభుత్వాలు.. ప్రణాళికా బధ్ధంగా పూనుకొని, .. నేటి అనాథ బాలల్ని.. రేపటి మేటి భావి పౌరులుగా.. తీర్చిదిద్దగలిగితేనే.. దేశ భవిష్యత్తు పురోగమిస్తుంది!.. కాదనగలమా?!...
****************
గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/vsg
ముందుగా మన తెలుగు కధలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కధలను, కధకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!
నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.
వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.
ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!