top of page
Writer's pictureMohana Krishna Tata

శ్రీమతి కోరిక


'Srimathi Korika' - New Telugu Story Written By Mohana Krishna Tata

'శ్రీమతి కోరిక' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"ఏమండీ! ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసారు...ఏమైనా ప్రమోషన్ వచ్చిందా?...శుభవార్త ఎప్పుడు చెబుతారు?"


"ప్రమోషన్ వస్తే ఏమిటి కావాలి కళ్యాణి?"

"ప్రమోషన్ వస్తే, ట్రాన్స్ఫర్ కూడా చేస్తారుగా...అందుకని....ఏ వైజాగ్ కు ట్రాన్స్ఫర్ అయ్యిందనుకోండి....ఎంచక్కా..రోజూ బీచ్ వెళ్లొచ్చుకదండీ..."

"నా ఫ్రెండ్స్ అందరూ...ఇక్కడే ఉన్నారు....పైగా...పుట్టి పెరిగిన ఊరు..వదలి ఎక్కడకు వెళ్ళమంటావు..."


"ఏముందండి...ఇక్కడా? ఒక బీచ్ లేదు...పోనీ అలా సరదాగా...ట్యాంక్ బండ్ వెల్దామంటే, అక్కడ కూర్చోగలమా? చెప్పండి...


"నువ్వు ఎన్నైనా చెప్పు...వైజాగ్ వొద్దు కళ్యాణి!"


కళ్యాణి కు వైజాగ్ లో ఉండాలని ఎప్పటినుంచో కోరిక...భర్త ను ట్రాన్స్ఫర్ పెట్టమంటే...వినరు...పోనీ ప్రమోషన్ తో వస్తుందనుకుంటే....రావట్లేదు..


కళ్యాణి కి పెళ్ళై సంవత్సరం అయ్యింది. ఎందుకో హైదరాబాద్ ట్రాఫిక్, పొల్యూషన్ నచ్చదు. పైగా, పుట్టిల్లు విజయనగరం. వైజాగ్ అయితే దగ్గర కూడా.


తన కోరిక ఎలాగైనా తీరాలని, దేవుడ్ని రోజు ప్రార్థిస్తుంది...


ఒకరోజు....సూపర్ మార్కెట్ కు వెళ్తుండగా...ఒక పెద్దాయన రోడ్ క్రాస్ చేస్తున్నపుడు పడిపోవడం, వెనుకనుంచి వేగంగా కార్ రావడం కళ్యాణి గమనించింది. అతన్ని రక్షించబోయి, చేతికి దెబ్బ తగిలించుకుంది...


"నా ప్రాణాలు కాపాడినందుకు థాంక్స్ తల్లీ! ఇంటికి రా అమ్మాయి! మా అమ్మాయి డాక్టర్...కట్టు కడుతుంది.."


కళ్యాణి అతని మాట కాదనలేక వాళ్ళింటికి వెళ్ళింది.

వాళ్ళమ్మాయి, మందు వేసి డ్రెస్సింగ్ చేసింది.


"ఇప్పుడు ఎలాఉంది? ఇంతకీ నీ పేరు ఏమిటి"


"కళ్యాణి"


"మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు"


"విజయనగరం దగ్గర అంకుల్”


"మీ ఆయన ఎక్కడ చేస్తారు"


"సిటీ సెంటర్ లో ఉన్న కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్"


"అంత డల్ గా చెబుతున్నావు ఏమిటి?. మీ ఆయనంటే ఇష్టం లేదా?"

"మా ఆయనంటే చాలా ఇష్టం...కానీ...వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే, ఆయన ఒప్పుకోవట్లేదు.. నేను వొస్తాను అంకుల్" అని కళ్యాణి ఇంటికి బయల్దేరింది.


ఒక వారం తర్వాత....సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి...దిగాలుగా కనిపించాడు..


"ఏమిటండి...ఏమైంది...వర్క్ ఎక్కువ గా ఉందా ఆఫీస్ లో?”


"అదేం లేదు! మా బాస్ ఈరోజు పిలచి ప్రమోషన్ వచ్చిందని న్యూస్ చెప్పారు"


"అయితే హ్యాపీ గా ఉండాలి కదా!"


"ఏం హ్యాపీ! వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసారు మేనేజర్ గా"


బయటకు మాములుగా ఉన్నా, లోపల, చాలా హ్యాపీ కళ్యాణి...


ఈలోపల ఫోన్ వచ్చింది! కళ్యాణి లిఫ్ట్ చేసి “ఎవరు?" అని అడిగింది


"నేను తల్లీ! గుర్తొచ్చానా!"


"చెప్పండి అంకుల్"


"మీ ఆయనకు ప్రమోషన్ వచ్చిందా? ఇప్పుడు హ్యాపీ యేనా? నీకు చెప్పడం మర్చిపోయాను..మా అబ్బాయి సొంత కంపెనీ కే ఇప్పుడు మీ ఆయన మేనేజర్"


**********************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ



119 views1 comment

1 Comment


sudershanap44
Aug 26, 2023

కథ బాగుంది అభినందనలు.

Like
bottom of page