top of page

అందమైన అనుభూతి

'Andamaina Anubhuthi' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 09/02/2024

'అందమైన అనుభూతి' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

ఆ రాత్రి  శరత్, వెన్నెలల ఫస్ట్ నైట్.  ఆరోజు ఉదయాన్నే వారిరువురి పెళ్లి అంగరంగ వెభవంగా జరిగింది.

అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన వెన్నెల  తెల్లని మైసూర్ సిల్క్ చీర లో ముగ్ధమనోహరంగా ఉంది.  ఆమె జడలో పెట్టుకున్న మల్లెమొగ్గల మాల  పువ్వులుగా విచ్చుకోడానికి పోటీ పడుతున్నాయి.  ఆ మల్లెల గుభాళింపులు ఆ గదినిండా వ్యాపించి సువాసనలు వెదజల్లుతున్నాయి.  

"శరత్,  మన శోభనం రాత్రి కోసం మా అమ్మ  మాడుగుల హల్వా  ప్రత్యేకంగా  ఆర్డరిచ్చి తెప్పించింది.  ఈ హల్వా విశాఖ జిల్లాలో  మాడుగుల ప్రాంతం పేరుతోనే గుర్తింపు వచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశాడు.   ఇప్పుడు ఈ హల్వా  చాలా ప్రసిధ్ది చెందింది.  స్వఛ్చమైన నేతి తో తయారుచేసిన ఈ హల్వా   నీకు పెట్టమని ఇచ్చింది.    అలాగే బాదం పాలు కూడా".

"వావ్, నాకిష్టమైనవి ఏమిటో అత్తయ్య గారికి బాగా తెలుసునే.  అయినా వెన్నూ, ఏమాటకామేటే చెప్పాలి, పెళ్లి ఎంత బాగా చేసారో మీ వాళ్లు. కనీ వినీ ఎరుగని ఎన్నో   షడ్రసోపేతమైన ఘుమఘుమ లాడే వంటకాలు,   ఆఖరులో ఆ జున్ను వడ్డించారు చూడు,  సూపర్ అనుకో". 

"ధాంక్యూ శరత్".  

"ఆ అవును వెన్నూ, నేను అడగకుండానే అంత ఖరీదైన కారు నాకు పెళ్లి కానుకగా ఇచ్చారు.  నాకు ఎంత మొహమాటం వేసిందో తెలుసా"?

"మొహమాటం ఎందుకు శరత్.  వాళ్ల ముచ్చట్లు, సరదాలు వాళ్లకుంటాయ్.  ఒక్కగా నొక్క కూతురిని.  నా  ఆనందమే వాళ్లకు కావాలి".

"అవుననుకో".

"ఆ చెప్పడం మరిచాను శరత్.  ఇందాక  అత్తయ్యగారు గదిలోకి పిలిచి  నాకొక  జ్యూయెలరీ  బాక్స్ ఇచ్చారు..  మీ  బామ్మవని చెపుతూ అవి శరత్ కి కాబోయే భార్యకే చెందాలని చెపుతూ    కన్నుమూసారుట కదా".

'అవును వెన్నూ, బామ్మకు నేనంటే ప్రాణం,అందుకనే'.

"పాతకాలం నగలైనా ఎంత బాగున్నాయో, ఇదిగో చూడు ఈ కెంపుల నెక్లెస్ ఎంత మెరుస్తోందో.  నాకు బాగుందా శరత్".

"ఎందుకు బాగుండదు వెన్నూ.  అందమైన నీ మెడకి ఆ నెక్లస్ కొత్త అందానిస్తోంది".

"ఈ ఏడురాళ్ల వజ్రాల దుద్దులు చూడు, ఎంత ముద్దుగా ఉన్నాయో కదూ  శరత్".

"అవును వెన్నెలా.  నక్షత్రాల్లా మెరుపులీనుతున్నాయి".

'అబ్బ, ఈ బెడ్ రూమ్ డెకరేషన్ ఎంతో బాగుందో కదా వెన్నెలా'.

'హా శరత్, ప్రత్యేకంగా  డెకరేషన్ చేయించారు.  ఈ మల్లెలు, గులాబీలన్నీ కడియం తోటల్లోనుండి తెప్పించారు'.

'ఆ, ఇంతకీ  నోరూరించే ఆ హల్వా ఇటివ్వు, అనగానే',  ఒక చిన్న ప్లేట్ లో రెండు కోవా బిళ్లలను అతనిచేతికిస్తూ ఫక్కున నవ్వేసింది.  ఆ నవ్వు చూసి శరత్ కూడా  నవ్వేసాడు.

"తల్లితండ్రులు లేని మనం  అనాధాశ్రమంలో పెరిగి  వారి ధర్మమా అంటూ డిగ్రీవరకు చదువుకుని ఉద్యోగాల్లో స్తిరపడి,  ఈరోజు ఉదయాన గుడిలో  పెళ్లి చేసుకున్నాం.  మన అమ్మా నాన్నా ఉండి ఉంటే అందరిలాగే మన పెళ్లి కూడా  ఆర్భాటంగా చేసి ఉండేవారనుకుంటూ  నీవు చాలాసార్లు బాధపడేదానివి .    ఆ అనుభూతిని మన మొదటిరాత్రి  ఒక చిన్న దృశ్యకావ్యంగా ఊహించుకోవాలని అభినయించాం. ఆర్భాటాలు కంటే ఆనందం ముఖ్యం. సంపదలు కంటే బాంధవ్యం విలువైనది.     నీవు నావెంటే ఉంటే  నా జీవితమంతా శరత్కాల వెన్నెలే" అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

51 views0 comments
bottom of page