top of page
Original.png

అందమైన భూతం

#విజయలక్ష్మి, #Vijayalakshmi, #AndamainaBhutham, #అందమైన భూతం​, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Andamaina Bhutham - New Telugu Story Written By Vijayalakshmi Published In manatelugukathalu.com On 09/12/2025

అందమైన భూతం​ - తెలుగు కథ

రచన: విజయలక్ష్మి


ఒక రోజు రాత్రి చిట్టితల్లి నిద్రకు వెళ్లే ముందు అమ్మ దగ్గరకు వచ్చి “అమ్మా! నాకు ఒక కథ చెప్పవా?” అని అడిగింది. 


అమ్మ నవ్వుతూ “ఏమి కథ చెప్పాలి చిట్టితల్లి?” అంది. 


చిట్టితల్లి కిటికీ బయట ప్రకాశిస్తున్న చంద్రుడి కాంతిని చూస్తూ “అమ్మా! చంద్రుని కాంతిలా ప్రకాశించే కథ చెప్పవా?” అని అడిగింది. 


అప్పుడు అమ్మ మెల్లగా “మన జ్ఞానం చంద్రుని కాంతిలా ఉంటుంది. మంచికి వాడితే వెలుగు, చెడుకు వాడితే చీకటి. ఇప్పుడే నేను నీకు ఒక ప్రత్యేకమైన కథ చెబుతాను. ఇది చెడు మార్గంలో నడిచిన ఒక అమ్మాయి కథ. ఈ కథ పేరు అందమైన భూతం” అంది. 


కలియుగంలో భూలోకంలో యువతీ యువకులు, చిన్న పిల్లలు చెడు మార్గాన్ని అనుసరించవద్దని బ్రహ్మదేవుడు ఒక అమ్మవారి లాంటి అమ్మాయిని సృష్టించాడు. ఆమెకు అందం, జ్ఞానం, అద్భుతమైన శక్తులు, తెలివితేటలు ఇచ్చి ‘ఈ వరాలతో భూలోకాన్ని కాపాడు. చెడు మార్గంలో ఉన్న పిల్లలను మంచి దారిలో నడిపించు. అలా చేస్తే నిన్ను దేవతలా పూజిస్తారు’ అన్నాడు. 


అమ్మాయి బ్రహ్మదేవునికి నమస్కరించి ‘మీ మాటలే ధర్మం. నేను నా శక్తులన్నీ మంచికే వాడుకుంటాను’ అంది. 


భూలోకానికి వచ్చిన తర్వాత ఒకరోజు ఆమెకు దాహం వేసింది. ఒక నీటి కుండలి దగ్గరకు వెళ్లింది. చంద్రుని కాంతిలో తన ప్రతిబింబాన్ని చూసి ఆమె మనసులో గర్వం మొదలైంది. “నా అందం అసమాన్యం… నా జ్ఞానం అపారం…” అని ఆలోచించింది. 


కొద్దికాలంలో ఆ చిన్న గర్వం పెద్ద అహంకారంగా మారింది. ఆ అహంకారంతో ఆమె పిల్లలకు, యువతకు “మీ ఇంట్లో వారు చెప్పేది పాత మాటలు. నేను చెప్పిందే నిజం” అని చెప్పి చెడు మార్గంలో నడిపించడం ప్రారంభించింది. 


భూలోకంలో గందరగోళం పెరుగుతుండగా బ్రహ్మదేవుడు దిగివచ్చి “నీకు ఇచ్చిన వరాలు ఏం చేశావు?” అని ప్రశ్నించాడు. అమ్మాయి గర్వంతో “నా దారే మంచిది. నేను చూపిన దారిలో పిల్లలు ఆనందంగా ఉన్నారు” అంది. బ్రహ్మదేవుడు కోపంతో “నీ శక్తులు చెడుకు వాడిన నువ్వు వాటితోనే నాశనం అవుతావు” అని హెచ్చరించాడు. ఆమె వినలేదు. 


అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి శ్రీవిజయ్ కృష్ణ అనే సామాన్య అబ్బాయిగా అవతరించాడు. అతన్ని చూసిన అమ్మాయి ఆకర్షితురాలై “మనిద్దరం కలిసి భూలోకాన్ని పాలిద్దాం” అంది. 


విజయ్ కృష్ణ గంభీరంగా “నీ శక్తులు నాశనానికి, నీ అందం అజ్ఞానానికి మూలం, నీ తెలివితేటలు మట్టి కోటలు. నీ దారి తప్పు” అని అన్నాడు. 


అతను పరీక్షగా “నీ శక్తులు వదిలి, సాధారణ అమ్మాయిగా జీవించు” అన్నాడు. ఆమె అంగీకరించగా శక్తులు పోయాయి. 


శక్తులు లేకుండా సాధారణురాలిగా మిగిలిన ఆమెను ఆమె దగ్గర నేర్చుకున్న పిల్లలే చెడు మార్గంలో కోపంతో హతమార్చారు. ఒకప్పుడు దేవతలా పూజించిన ప్రజలు చివరికి ఆమెను “అందమైన భూతం” అని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. 


అమ్మ కథ ముగించగా చిట్టితల్లి ఇలా అంది: “అమ్మా! నేను ఎప్పుడూ చెడు దారి పట్టను. నా జ్ఞానం, నా తెలివితేటలు, నా అందం — ఇవన్నీ మంచికే వాడుకుంటాను”. 


***

విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: విజయలక్ష్మి


విజయలక్ష్మి

junior lecturer MA.economics

కొత్తగూడెం




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page