అంతా మంచికే
- Mohana Krishna Tata
- 2 days ago
- 2 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #AnthaManchike, #అంతామంచికే, #తెలుగుభక్తికథలు, #TeluguDevotionalStories

Antha Manchike - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 03/01/2026
అంతా మంచికే - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
అనగనగా ధర్మసేనుడనే రాజు రాజ్యాన్ని బాగా పాలించేవాడు. కొడుకంటే రాజుకు అమిత ప్రేమ. కానీ విధి ఇంకొకలాగా నిర్ణయించింది. రాజు కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. ఎంత వైద్యం చేయించినా.. నయం కాలేదు. ఏం చెయ్యాలో రాజుకు అసలు అర్థం కాలేదు. కొన్ని రోజులకి కొడుకు మరణించాడు. రాజు చాలా దుఃఖించాడు. కొడుకుని చివరిచూపు చూడటానికి చాలా మంది వచ్చారు. అందులో ఒక విద్యావంతుడు పక్కన ఇంకొకనితో ఇలా అన్నాడు:
"ఇతనికి పెళ్ళి కాకముందే యుక్త వయసులోనే మరణించాడు. ఇతని ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది? ఎన్ని కలలు కన్నాడో పాపం. ఇతని ఆత్మకు శాంతి దొరకదు."
"మరి ఏం చెయ్యడం?"
"చనిపోయిన ఇతనికి పెళ్ళి జరిపిస్తే, ఆ దోషం పోతుంది." అన్నాడు ఆ విద్యావంతుడు
ఆ మాట..ఈ నోటా, ఆ నోటా పడి చివరికి రాజుగారికి చేరింది. వెంటనే ఆ పండితుడుని పిలిచి విచారించాడు.
"అవును మహారాజా.. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయితో పెళ్ళి చేస్తే మీ కొడుకు ఆత్మకు మంచిది."
విద్యావంతుడు మాటలు మీద రాజుకు నమ్మకం కలిగింది. కొడుకు మీద ప్రేమతో రాజు ఒప్పుకున్నాడు.
వెంటనే రాజు చాటింపు వేయించాడు. ఎవరైతే ఆరుద్ర నక్షత్రంలో పుట్టి, మరణించిన తన కుమారుడిని వెంటనే పెళ్ళి చేసుకుంటారో, వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు.
ఆ రాజ్యంలో ఒక ఇంట్లో....
"అమ్మా కమల! మీ నాన్న మాట వింటావా?"
"ఏమిటి నాన్నా?"
"నాకు ముగ్గురు అమ్మాయిలు.. నువ్వే పెద్దదానివి..ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన దానవు. చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యలేడు ఈ పేదవాడు. రాజుగారి చాటింపు విన్నావా? చనిపోయిన అతని కొడుకుని నువ్వు పెళ్ళి చేసుకుంటే, మనకి ఈ పేదరికం ఇక ఉండదు. మీ చెల్లెళ్ళు సంతోషంగా ఉంటారు. కాకపోతే నీ గురించే నా బాధంతా."
"ఎందుకు బాధ నాన్న? మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పండి? ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారుగా? అంతా ఆయనే చూసుకుంటాడు..మీరందరూ సంతోషంగా ఉంటె నాకు అదే చాలు"
"నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. భర్త చనిపోతే, భార్య సహగమనం చేయాల్సి ఉంటుంది.. నీకు తెలుసు కదా?"
"తెలుసు నాన్నా! మీరందరూ సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం..అంతా ఈశ్వరేచ్ఛ!"
కమల చనిపోయిన ఆ యువరాజును పెళ్ళి చేసుకుంది. సముద్ర తీరానా అంతా సిద్ధం చేశారు. అప్పుడు ఆ సముద్ర ఇసుకతో శివలింగం చేసి.. శివుణ్ణి ప్రార్థించింది "నాకు అంతా మంచే జరిగేలా చూడు స్వామీ!"
ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడు.
"ఏమిటి ఈశ్వరా! నా జీవితం ఇలా ముగుస్తున్నది..?" అంటూ నమస్కరించి అడిగింది కమల.
"నేను ఏది చెసినా..అంతా మంచికే. మరో విషయం ఆ రోజు "మరణించిన కొడుకుకి పెళ్ళి చెయ్యమని రాజుగారికి సలహా ఇచ్చింది నేనే" అంటూ ఆమె భర్తను బతికించి, శివుడు అదృశ్యమయ్యాడు.
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
