top of page
Original.png

అన్వేషణ - అబ్సర్డ్ కథ


తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో S3 కోచ్‌లలో తన ప్రేమికురాలి కోసం నిరంతరం వెతుకుతున్న యువకుడు, పక్కనే పుస్తకం చదువుతున్న వృద్ధుడు, నిరీక్షణ మరియు అస్తిత్వవాద భావనలను ప్రతిబింబించే దృశ్యం.
తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో S3 కోచ్‌లలో తన ప్రేమికురాలి కోసం నిరంతరం వెతుకుతున్న యువకుడు, పక్కనే పుస్తకం చదువుతున్న వృద్ధుడు, నిరీక్షణ మరియు అస్తిత్వవాద భావనలను ప్రతిబింబించే దృశ్యం.

Anveshana - Absurd Story - Telugu Emotional Story | Veereswara Rao Moola

అన్వేషణ - అబ్సర్డ్ కథ - తెలుగు భావోద్వేగ కథ | వీరేశ్వర రావు మూల

Published In manatelugukathalu.com On 06/06/2026


తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్:


అతను పాతికేళ్ళ యువకుడు. రైలు రాగానే కోచ్ S3 లోకి వెళ్ళి వెతికాడు. తను ఎదురుచూసిన అమ్మాయి లేదు.

కొద్దిసేపటికి విజయవాడ

వెళ్ళవలసిన రైలు

వచ్చింది. అతను S3 లోకి వెళ్ళి, మళ్ళీ వెతికాడు. అతను అనుకున్న అమ్మాయి లేదు.

ఆ రైలు కూడా వెళ్ళిపోయింది.

ఈ వెతుకులాట చూస్తున్న ఒక ముసలాయన

అడిగాడు.

"ఎవరి కోసం చూస్తున్నావు?"

"నా లవర్ కోసం"

"ఏ ట్రైన్‌లో వస్తోంది?"

"తెలియదు."

"ట్రైన్ నెంబర్ తెలుసా?"

"తెలియదు"

"ట్రైన్ పేరు తెలుసా?"

"తెలియదు"

"కోచ్?"

"S3"

"ఏ ట్రైన్? గూడెం నుండి బయటికి వెళ్ళేదా? లోపలికి వచ్చేదా?"

"తెలియదు. ఐనా మీకు ఎందుకు

ప్రశ్నలు?

మీ పని చూసుకోండి." అన్నాడా యువకుడు అసహనంగా.


రైలు వెళ్ళిపోయింది. అన్ని

ప్లాట్‌ఫారమ్‌లు

ఖాళీగా ఉన్నాయి.

అరగంట తర్వాత మళ్ళీ రైలు వచ్చింది. అతను

మళ్ళీ కోచ్ S3 లోకి వెళ్ళి వెతికాడు.

వెతికి నిరాశగా ప్లాట్‌ఫారం మీదకు వచ్చాడు.

ముసలతను 'ఆల్బర్ట్ కామూ, మిత్ ఆఫ్ సిసిఫస్' చదువుకుంటున్నాడు.

రైలు వెళ్ళిపోయింది.

ఆ యువకుడు వేచి ఉన్నాడు రైలు కోసం.


                  సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 


#TeluguComedyStory, #తెలుగుహాస్యకథ







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page