top of page
Original.png

అర్థంతోనే అర్థనారి


Arthamtone arthanari Telugu Family Story | Ganti Subrahmanya Sarma  

అర్థంతోనే అర్థనారి - తెలుగు కుటుంబ కథ | గంటి సుబ్రహ్మణ్య శర్మ

Published in manatelugukathalu.com on 01/06/2026


అర్థనారి అంటే కేవలం శరీరంలో సగభాగం కాదు, జీవితంలో సమాన భాగస్వామ్యం కూడా అని చెప్పే హృద్యమైన కథ ఇది.

ఆర్థిక స్వాతంత్ర్యం, దాంపత్య విశ్వాసం, పిల్లల పట్ల బాధ్యతల మధ్య ఒక మహిళ మనసులో జరిగిన సంఘర్షణను రచయిత చక్కగా ఆవిష్కరించారు.

జయలక్ష్మి తీసుకున్న ఒక నిర్ణయం ఆమె మనసులో ఎలాంటి అలజడి రేపిందో ఈ కథ వివరిస్తుంది.

చివరికి ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహనే కుటుంబ బంధాలకు నిజమైన బలమని గుర్తు చేస్తుంది.


జయలక్ష్మికి కాళ్లు చేతులు ఆడటం లేదు. తన భర్తకు తెలియకుండా ఏవిధమైన ముఖ్యమైన నిర్ణయాలను ఎప్పుడూ తీసుకోలేదు; అదేకాకుండా ఇక ఆర్థిక విషయాలైతే మరీనూ. ఒక్కసారిగా నలభై లక్షలు భర్తకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండానే ఉన్న ఒక్కగానొక్క కూతురికీ ధారపోయడం ఈ గాబరాకి అసలు కారణం. ఒక విధంగా అల్లుడికి, కూతురికి మంచి జరగాలనే ఆశ ఉన్నా, అసలు ఆయనతో ఒక్క మాట చెబితే బాగుండేదేమో అని ఎన్నిసార్లు అనుకుందో ఏమో! మనిషి మాత్రం కొంచెం అన్యమనస్కంగానే ఉంది. అయినా కూడా తన మనసులో ఉన్న ఆలోచన, ఆందోళనలను పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతోంది.


ఎలాగో ఒకలా తన గాబరాను పైకి కనపడకుండా, ఆ పూట ఉదయం భోజనాదులు కావించారు. భర్త శంకరం కాస్త విశ్రమించడానికి వెళ్ళగానే తలుపు జాగ్రత్తగా వేసి సోఫాలో కూలబడి ఆలోచనలోకి జారుకుంది. కులమతాల పట్టింపులు చాలా గట్టిగానే ఆచరణలో ఉండే కాలంలో తన వివాహం వేరొక కులానికి చెందిన శంకరంతో, పెద్దల కోపతాపాల మధ్య జరిగింది. అయినా ప్రతీ స్త్రీ ముందు తన చదువుపై దృష్టి పెట్టి, తర్వాత ఆ చదువుకు సార్థకత చేకూర్చడం కోసం మంచి ఉద్యోగం సాధించాలి; లేదా ఆర్థిక స్వావలంబన ఉంటే మంచి వ్యాపార రంగంలో ప్రవేశించి తన ఆర్థిక పురోగతి కోసం తానే కృషి చేయాలి.


'అర్థనారి' అంటే కేవలం శరీరంలో అర్థభాగం అనేది కేవలం కాలం చెల్లిన, పనికిరాని, పాతమాట మాత్రమే. పురుషులతో సమానంగా పాటుపడుతూ, వారితో సమానమైన ఆర్థిక భద్రత కోసం తపనపడే నేటి నారీలోకం, అర్థనారీ తత్వానికి ఏనాడో కొత్త భాష్యం చెప్పారు. జయలక్ష్మి కూడా సరిగ్గా అదే కోవకు చెందిన మనిషే కాక, ఆ ఆర్థిక తత్వాన్ని పూర్తిగా వంటబట్టించుకున్న స్త్రీమూర్తి.


అటువంటి ఆలోచనలతోనే తన డిగ్రీ చదువు చక్కగా పూర్తి చేసి, తన స్వశక్తితోనూ, స్వయంకృషితోనూ బ్యాంకులో ఉద్యోగం సంపాదించడంతో, కావలసిన ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందింది. ఆ అర్థబలం వల్ల తల్లిదండ్రులు చూస్తున్న వివాహ సంబంధాలను కూడా ఎదిరించగలిగే స్థాయికి చేరుకుంది. "నేను బ్యాంకులో చేస్తున్నాను కాబట్టి అదే బ్యాంకు లేదా వేరే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగిని మాత్రమే చేసుకుంటాను" అని తెగేసి చెప్పడమే కాకుండా, ఆ పట్టుదలతోనే మిగిలిన ఉద్యోగ సంబంధాలన్నింటినీ నిష్కర్షగా తిరస్కరించడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు కూడా చేసేదేమీ లేక ఆమె నిర్ణయానికే తలవంచారు.


అటువంటి ఆలోచనల తోనే తన డిగ్రీ చదువు మంచిగా పూర్తి చేసి, తన స్వశక్తితోనూ, స్వయంకృషి తోనూ బ్యాంకులో ఉద్యోగం సంపాదించడంతో, కావలసిన ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పొందింది.  ఆ అర్ధబలం వల్ల తల్లిదండ్రులు చూస్తున్న వివాహ సంబంధాలను కూడా ఎదిరించగలిగే  స్థాయికి చేరుకుంది. 


నేను బ్యాంకులో చేస్తున్నాను కాబట్టి అదే బ్యాంకు కానీ లేదా వేరే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగిని మాత్రమే చేసుకుంటాను, అని తెగేసి చెప్పడమే కాకుండా ఆ పట్టుదలతోనే మిగిలిన ఉద్యోగ సంబంధాలను అన్నింటినీ నిష్కర్షగా తిరస్కరించడం మొదలు పెట్టింది.  తల్లిదండ్రులు కూడా చేసేదేమీ లేక ఆమె నిర్ణయానికే తల వంచారు.


కానీ ఆశ్చర్యంగా తన బ్యాంకులోనే తనకంటే రెండేళ్లు ముందుగా ఉద్యోగం చేస్తున్న శంకరం పట్ల తాను, తన పట్ల శంకరం కూడా దాదాపుగా ఒకే అభిప్రాయం కలిగి ఉండటం, వారిరువురి ఆశయాలు ఒకటి కావడం గమనించి, కొంచెం సఖ్యతగా ఉండటం మొదలుపెట్టింది. ఒకరోజు శంకరం వివాహ ప్రస్తావన తేవడంతో తమ కులాలు వేరని, ఇంట్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పి, అయినా సరే తన ప్రయత్నం చేస్తానని చెప్పింది.


తల్లిదండ్రులు, అన్నదమ్ములు చెప్పిన మాటలు వినను పొమ్మంది; "చంపినా సరే చావడానికైనా సిద్ధం" అనే ఆమె ధైర్యం వారందరినీ నివ్వెరపరిచింది. "సరే మీ చావు మీరు చావండి" అంటూ రెండు వైపుల వారు వారిద్దరినీ వదిలి వెళ్లిపోయారు. అలా రెండు కులాల వారు వివాహం ద్వారా ఒకటైపోయారు.


"మన కులాలు వేరైనా మన ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ కూడా దాదాపుగా ఒకేలా ఉన్నాయి. మానసికంగా మన ఇరువురం ఒకటే కాబట్టి, మనం ముందు మన పొరపాట్లు, అలవాట్లు ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలి" అనే శంకరం మాటలు తనకు సబబుగానే తోచాయి.


"కానీ పెద్ద అడ్డంకి మీరు మాంసాహారులు కావడం, మేము పూర్తి శాఖాహారులు కావడం; మీకు ఇబ్బందిగా ఉంటుందేమో" అంటే, "అదేం లేదు, అది ప్రశ్న కాదు. మనం మన తల్లిదండ్రుల పెంపకంలో ఏవిధంగా తీర్చిదిద్దబడతామో, అవే మనకు అలవాటవుతాయి. కానీ నీకోసం నేను పూర్తి శాఖాహారిగా మారుతున్నాను" అన్న అతని మనోనిబ్బరానికి, నిశ్చలతత్వానికీ ఆమె ఆశ్చర్యపోయి తలవంచక తప్పలేదు.


వివాహమైనా కూడా ఎన్నెన్నో అలకలు, అపార్థాలు, అవమానాలు భరించక తప్పలేదు ఇద్దరికీ. ఇరువైపుల వారు కూడా దాదాపుగా వారిద్దరినీ బహిష్కరించినట్లుగానే భావించి దూరం పెట్టారు. అయినా కూడా వారిద్దరిదీ ఒకే మాట, బాట కావడం, వారిరువురి ఉద్యోగాలనే ఆర్థిక పునాదులు వారిని బలంగా మరింత ముందుకు నడిపిస్తున్నాయి.


అయినా కూడా కొద్దికాలం దూరమైతే కులాల కుమ్ములాటలు, ఇరు వర్గాల ఆవేశకావేశాలు తగ్గవచ్చుననే ఉద్దేశంతో, దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు శాఖకి బదిలీ చేయించుకున్నారు ఇద్దరూ. తొలి కాన్పు అబ్బాయైనా ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండానే జాగ్రత్తపడి, మలి కాన్పు అమ్మాయిని కూడా కన్నప్పుడు ఇరువైపుల వారి మధ్య సంబంధాలు కొంచెం బలపడటంతో, తిరిగి రాకపోకలు మొదలుపెట్టారు.


తామిరువురూ ఉద్యోగంలో ఉన్నపుడే పిల్లలిద్దరినీ బాగా చదీవించడమే కాకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్ది, తమ పదవీ విరమణ అనంతరం, ఇద్దరు పిల్లల వివాహాలు కూడా పూర్తి చేసి వారు కూడా తమలాగే స్థిరపడ దానికి దోహదం చేశారు.


అంతా సవ్యంగా జరుగుతున్న మంచి తరుణంలో ఒక పిడుగులాంటి వార్త. అమ్మాయి భర్త ఉద్యోగం కోసం దాదాపు నలభై నుండి యాభై లక్షలు ఖర్చు పెట్టాలి, అది కూడా ఒకటి రెండు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాయి అనే మాటలు వినిపించాయి.


జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, ఆర్థిక ఇబ్బందులు చాలా దగ్గరి నుండి చూసిన తాను ఆ మాటల భ్రమలో పడి, తన బ్యాంకు ఖాతా నుండి డబ్బు తీసుకుని కూతురికి సాయం చేశాక కాస్త మనసు కుదుటపడినా, ఆ తర్వాత కానీ తాను చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు. తీరా అర్థమయ్యాక జయలక్ష్మి మనసులో కొంచెం అలజడి రేగింది; అది ఆమెను నిబ్బరంగా ఒకచోట నిల్చోనివ్వడం లేదు.


ఏనాడూ అసలు అభిప్రాయ భేదాలు లేకుండా, రాకుండా ఒకరినొకరు చూసుకుంటూ మెలిగిన తమ దాంపత్య జీవితానికి, తనకు తానుగా తలవంపులు తెచ్చినట్లుగా అనిపించింది. అయినా తన వయసు, అనుభవం, ఆర్థిక వెసులుబాటు తీసుకువచ్చిన ధైర్యంతో గుంభనంగా ఉంటున్నా, ఏదో తెలియని మానసిక వేదన కలుగసాగింది.


ఒక ఆరు నెలలు గడిచాక కూతురు ఫోన్ చేసి, "అమ్మా, మీ అల్లుడు గారి కష్టాలు గట్టెక్కుతున్నాయి. అయినా మొదటి వాయిదాగా ఒక 15 లక్షలు తిరిగి పంపిస్తున్నాను" అని చెప్పి తన ఖాతాకు జమ చేశాక, జయలక్ష్మికి కొంచెం ధైర్యం వచ్చింది. "సరే, ఇంకా పాతిక లక్షలు వస్తే కానీ తన మనసు కుదుటపడదు" అని అనుకుంది.


కలుగసాగింది.  ఒక ఆరు నెలలు గడిచాక కూతురు ఫోన్ చేసి “అమ్మా మీ అల్లుడు గారి కష్టాలు గట్టెక్కుతున్నాయి.  ఐనా మొదటి వాయిదాగా ఒక 15 లక్షలు తిరిగి పంపిస్తున్నాను” అని తన ఖాతాకు జమ అయ్యాక, జయలక్ష్మికి కొంచెం ధైర్యం వచ్చింది. సరే ఇంకా పాతిక లక్షలు వస్తేకానీ తన మనసు కుదుటపడదు అని అనుకుంది.


ఎప్పటిలాగే ప్రతీ సంవత్సరం ఇరువురూ కలిసి ఒక వారం లేదా పది రోజుల పాటు ఏదో ఒక విహారయాత్రకు వెళ్లడం, లేదా ఇతరులతో కలిసి చిన్న చిన్న దూరాలకు ప్రయాణించి తిరిగి రావడం వంటివి కూడా జయలక్ష్మికి మానసిక ప్రశాంతత కలిగించలేదు. ఇంకా పాతిక లక్షలు కూతురు తిరిగి పంపిస్తే కానీ ఆమె మనసు కుదుటపడదని ఆమెకు అర్థమయ్యింది.


అలాగే మరో నాలుగు నెలలు గడిచాయి. కూతురు, అల్లుడు ఫోన్ చేయడం లేదు. తాను ఫోన్ చేసినా ఏదో ముక్తసరిగా మాట్లాడుతున్న కూతురు వైఖరి అనుమానాస్పదంగా తోచింది. ఇక ఉండబట్టలేక తానే అల్లుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది.


"అయ్యో అత్తయ్యగారు, మీకు పద్మ ఫోన్ చేయలేదా? మీ పాతిక లక్షలు కూడా మీకు తిరిగి ఇవ్వమని పద్మకు ఇచ్చాను. మీరేం గాబరా పడకండి" అంటే జయలక్ష్మి ఆశ్చర్యపడి కూతురికి ఫోన్ చేసి అడిగితే, "ఇస్తాను, అంత కంగారు ఎందుకు? అయినా ఆ తర్వాత ఎలాగూ ఆ డబ్బంతా మాకే కదా" అంది. "నేను మీ నాన్నకైనా చెప్పకుండా ఇస్తే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటే! ముందు వెంటనే డబ్బు బదిలీ చేయి" అని కొంచెం గట్టిగానే చెప్పింది. అయినా కూడా మరో వారం రోజులు అయ్యాక ఆ పాతిక లక్షలు తిరిగి తన ఖాతాలోకి జమ అయ్యాయి.


ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని తిరిగి మామూలు స్థితికి రావడానికి జయలక్ష్మికి కొంత సమయం పట్టింది. "ఎంత కంగారు పెట్టింది" అని మొదటిసారిగా తన మనసులో ఏదో తెలియని బాధ, ఆందోళన కలిగింది.


ఎప్పుడూ తెరిచిన పుస్తకంలా ఉన్న తమ దాంపత్యంలో తన వల్లా, తన కూతురు కారణంగా చిన్న అలజడి రేగింది అనే భావన ఆమెను వెంటాడుతోంది. "అయినా తర్వాత ఇదంతా మాదేగా" అనే కూతురి వైఖరి కూడా కోపాన్ని కలిగించింది.


అసలు ఏమిటీ ధోరణి? తామిద్దరం ఒకే మాట మీద నిలబడి కష్టనష్టాలకోర్చి పేర్చిన ఆర్జన అంత తేలికగా ఎలా సొంతం చేసుకోవాలో అనే కూతురి ఆలోచనా విధానం నచ్చలేదు. అందుకే తన అనంతరం తన ఆస్తి మొత్తం చెరిసగం చేసి, ఒక భాగం కొడుకుకి, మిగిలిన భాగం కూతురి సంతానానికి చెందజేయాలని దృఢంగా నిశ్చయించుకున్న తర్వాత కానీ ఆమె కుదుటపడలేదు.


"ఏంటోయ్, ఏదైనా వెండి బంగారాలు కొంటున్నావా, లేదా నీ ముద్దుల కూతురు గారాలు చూసి డబ్బు పంపావా? ఏమిటీ విశేషం?" అని భర్త మృదువుగా అడిగినా జయలక్ష్మి కళ్లు జలపాతాలయ్యాయి.


భర్త రెండు చేతులు పట్టుకుని, "ఇన్నేళ్ల ప్రయాణంలో మీతో చెప్పకుండా చేసిన పనికి నన్ను క్షమించండి. అల్లుడి ఉద్యోగం అంటే వెంటనే ఇచ్చేశాను" అంటుంటే, "ఛీ, మనలో ఆ మాటకే ఎప్పుడూ అవకాశం లేదు అని నీకు తెలియదా?" అంటూ ఆమెను దగ్గరకు తీసుకోవడంతో ఆమె మామూలు మనిషి అయిపోయింది.


"అల్లుడు నాకు ముందుగానే చెప్పాడు నీ దగ్గర తీసుకుంటానని. సరే, నువ్వే చెబుతావు కదా అని ఎదురుచూశాను. అయినా మనదంతా వారికే కదా" అంటుంటే పడ్డ వేదన అంతా పోయి జయలక్ష్మి మనసు తేలికైపోయింది.


"నా దగ్గర అంటే అన్నారు కానీ, పిల్లల దగ్గర అలా అనకండి" అంటున్న భార్య వైపు అర్థం కాకుండా అలా చూస్తూ ఉండిపోయాడు శంకరం.


“ఇన్నేళ్ల ప్రయాణంలో మీతో చెప్పకుండా చేసిన పనికి నన్ను క్షమించండి, అల్లుడి ఉద్యోగం అంటే వెంటనే ఇచ్చేశాను” అంటుంటే, “ఛీ, మనలో ఆ మాటకే ఎప్పుడూ అవకాశం లేదు అని నీకు తెలియదా” అంటూ ఆమెను దగ్గరకు తీసుకోవడంతో ఆమె మాములు మనిషి అయిపోయింది. “అల్లుడు నాకు ముందుగానే చెప్పాడు, నీదగ్గర తీసుకుంటానని.  సరే నువ్వే చెపుతావు కదా అని ఎదురు చూసాను.  ఐనా మనదంతా వారికే కదా” అంటుంటే పడ్డ వేదన అంతా పోయి జయలక్ష్మి మనసు తేలిక అయిపోయింది. 


“నా దగ్గర అంటే అన్నారు కానీ, పిల్లల దగ్గర అలా అనకండి” అంటున్న భార్య వైపు అర్థం కాకుండా అలా చూస్తూ ఉండిపోయాడు శంకరం.


@@@@@@@@@


గంటి సుబ్రహ్మణ్య శర్మ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

గంటి సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్ర ప్రదేశ్ న్యాయ శాఖలో 34 సంవత్సరాలు ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.  ఉద్యోగం చేస్తున్న సమయంలోనే, న్యాయ శాఖలో పని చేసిన అనుభవంతో, అమలాపురం లో తొలిసారిగా ఏర్పాటైన సాయంకాల న్యాయ కళాశాలలో, గౌరవ జిల్లాకోర్టు రాజమహేంద్రవరం వారి అనుమతి పొంది, బీ ఎల్ పట్టా సాధించారు.  అనంతరం మరలా వారి అనుమతి తోనే ఎల్ ఎల్ ఎమ్ కూడా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ గా పూర్తి చేసారు. అదేవిధంగా హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ నుండి “సైబర్ లా” లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసారు.  కాకినాడ, రాజమండ్రి కోర్టులలోనూ, అమరావతి, హైకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.  ప్రస్తుతం అమరావతి హై కోర్టు బార్ అసోసియేషన్ లో జీవితకాల న్యాయవాద సభ్యులుగా ఉన్నారు.

ఉద్యోగంలోనూ, ఆ తరువాత కూడా వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు.  న్యాయ సలహాలు కూడా ఇస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page