top of page

అసలు (బంగారు) తల్లి ఎవరు?

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AsaluBangaruThalliEvaru 

#అసలుబంగారుతల్లిఎవరు, #TeluguChildrenStories, #TeluguMoralStories, #నైతికకథలు

Asalu Bangaru Thalli Evaru - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 03/05/2025

అసలు (బంగారు) తల్లి ఎవరు? - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)

ఒక రాజు వద్దకు ముగ్గురు స్త్రీలు వచ్చారు. ఒక పాప ను పట్టుకొని. "ఇది నా పాప, నాకు ఇప్పించండి", అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రాధేయ పడుతున్నారు. 


రకరకాల ప్రశ్నలు వేసినా.. ప్రలోభ పెట్టినా.. వారిలో అసలు తల్లి ఎవరో తేలలేదు. 


"ముగ్గురూ కలిసి పెంచండి", అంటూ సూచన చేశాడు రాజు. దానికి వారు ఒప్పుకోలేదు. 


2)

ఇంతలో కొంత మంది గజ దొంగలు - నర హంతకులు - బందిపోట్లు అకస్మాత్తుగా అక్కడికి చేరారు. వారి చేతుల్లో ఖడ్గాలు ఉన్నాయి. సైనికులు ఎదిరిస్తే వారిని చంపేశారు. రాజును - మంత్రిని కూడా పొడిచేసారు. తమ ఆసనాల పైనే పడిపోయారు ఇద్దరూ.. ప్రాణాలు కోల్పోయి. 


3) 

ఆ నరరూప రాక్షసులు - బందిపొట్లలో ఒకడు. పాపను హతమార్చాలని తన చేతిలోకి తీసుకొని.. ఖడ్గం పైకెత్తాడు. 


పాప తో బాటు వచ్చిన ముగ్గురు స్త్రీలలో ఒక స్త్రీ "నన్ను చంపి నీ కసి తీర్చుకో.. నా రక్తం తాగి నీ దాహం తీర్చుకో.. అభం శుభం తెలియని నా చిన్నారి పాప ను ఏమీ చేయకు.. " అంటూ అతడి కాళ్ళ మీద పడింది. 


4)

వెంటనే అతడు ఆమె కు నమస్కరించి "ఈ పాపకు నువ్వే అసలు తల్లివి", అంటూ ఆమెకు ఇచ్చేశాడు పాపను. 


ఆశ్చర్యం.. రాజు, మంత్రి, పడిపోయిన సైనికులు.. అందరూ లేచి నిల్చున్నారు నవ్వుతూ. 


అంటే ???.. ఇదంతా నాటకం అన్న మాట. చిన్నారి పాపకు అసలు తల్లి ఎవరు అని నిర్ధారించటానికి. 


5)

మంత్రి నవ్వుతూ, "నేనే కావాలని ఈ నాటకం ఆడించాను. వారు బందిపోట్లు కారు.. మా సైనికులే". 


"అసలు తల్లి ఎవరు అనే సమస్య ఎంతకు తేల కుంటే.. ఒక సైనికుడికి నాటకం గురించి చెప్పి.. అతడిని పంపించి.. ఇక్కడ ఈ రాజసభ లో ఉన్న ప్రతి సైనికుడికి మరియు రాజుకు చెవిలో చెప్పించాను.. ఈ నాటకం గురించి.. ఎలా మన సైనికులు బయిటికి నుండి వస్తారు రాజసభ లోకి.. బంది పోట్ల - నర హంతకుల వేషాల్లో.. కాసేపు కత్తియుద్ధం చేసి.. చచ్చినట్టు పడి పోవాలి కిందికి రాజసభ లోపల ఉన్న అందరు సైనికులు.. నేను, రాజు కూడా.. , అని చెప్పించాను". 


బందిపోటు వేషం. లో ఉన్న మా సైనికుడు కత్తి - ఖడ్గం పైకి ఎత్తగానే.. అసలు తల్లి గుండె క్షోభిస్తుందని మాకు తెలుసు" అని ముగించాడు మంత్రి. 


6)


రాజు ఇతర ఇద్దరు స్త్రీలకు కారాగార శిక్ష విధించాడు. వారిరువురూ, "అపచారం అయిపోయింది ప్రభూ. మాకు సంతానం కలగ లేదు. పిల్లల పై వాత్సల్యం వదులుకోలేక.. ఈ పని కి పాల్పడ్డాము. వేరే ఏ దురుద్దేశం లేదు. డబ్బు దురాశ, ఆస్తులు - అంతస్థుల అత్యాశ మాకు ఏమాత్రం లేదు.. ఇంకెన్నడు ఇలా చేయము", అంటూ నమస్కరించారు రాజుకు. 


అసలు తల్లి కూడా వారి పుత్ర వాత్సల్యం అర్థం చేసుకొని.. వారిని క్షమించి వదిలేయమని ప్రాధేయ పడింది రాజు తో. 


రాజు ఇలా అన్నాడు, 

"ఈ పాప దేవుడు మన దేశానికి ఇచ్చిన బహుమానం. మీరు ముగ్గురు మా అంతపౌరం లోనే ఉంది.. రాజ కొలువు చేసుకుంటూ.. ముగ్గురు తల్లుల్లా ఈ పాపను పెంచండి. అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించి, శిక్షకులు పెట్టించి.. ఆ పాపకు ఉన్నత విద్యా బుద్ధులు నేర్పించి.. అన్ని నైపుణ్యాలలో తర్ఫీదు ఇప్పించి.. మా తరువాత ఈ దేశానికి.. రాజు గా నియమిస్తాను. మాకు ఎలాగు సంతానం లేదు కదా. భవిష్యత్తు లో పుట్టినా కూడా.. మా సంతానం ను ఉప రాజుగా నియమిస్తాము", అంటూ ప్రతిజ్ఞ చేశాడు"


"ఇవన్నీ ఆ బంగారు తల్లి అనుమతిస్తేనే.. " అని రాజు అసలైన తల్లి వైపుకు చూసాడు ప్రశ్నార్థకంగా. 


ఆమె సంతోషంగా తలూపింది


"దేవుడిచ్చిన బహుమానం పాపకు జై.. భవిష్యత్తు లో రాజు అయ్యే పాపకు జై", అంటూ అకాడున్న సైనికులు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. 


నీతి:


I) తల్లిని మించిన దైవం లేదు. కుటుంబంలో కలహాలు / మనస్పర్థలు కోప తాపాలు ఉన్నా / లేకున్నా.. ఫ్యామిలీ కౌన్సిలర్ ల వద్దకు వెళ్లి తరచూ వెళ్లి కలవాలి, సలహాల కోసం

.. వారు చెబుతారు ఎలా దూరం గా (కూడా) మెలగాలి.. మంచి మాటలు - చేతలు తో - ఆచరణలో - గోప్యం తో.. జోక్యం లేకుండా మెలగాలి (ప్రతి కుటుంబం / సంస్థ / కార్యాలయం (ఆఫీసు). 



ii) ఒక చెవితో విని, ఇంకో చెవితో వదిలేయాలి.. అక్కడ యే

 మరచి పోవాలి.. ఒక వేళ సహాయం చేసిన నెత్తికెక్క కూడదు. 


Iii) ప్రతి విషయం సంతోష దాయక నిర్వహణ మరియు ఆనందదాయక పరిష్కార ప్రాజెక్ట్ అవకాశం లా తీసుకోవాలి. 


Iv) ఎవరు అయినా.. యే సంస్థ అయినా కానీ.. ఎవరిని బలి పశువులు చేయరాదు.. "హాని", "కష్టం", మరియు "నష్టం" ఇవ్వకూడదు.. (తమ స్వంత లాభాల కోసం) 


V) మంచి జరిగినా లేక చెడు జరిగినా.. మొత్తం సంస్థ ఒక "జట్టుగా" / జట్టు సమస్య గా తీసుకోవాలి.. ఆనంద దాయక పరిష్కారాలు కనుక్కోవాలి. 


----------------- చిన్న కథ - నీతి సమాప్తం -------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






Commentaires


bottom of page