అసలు ఏం జరిగింది?

'Asalu Em Jarigindi' New Telugu Story
Written By A. Annapurna
'అసలు ఏం జరిగింది?' తెలుగు కథ
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
ఆనా రెండు గంటలుగా లాప్ టాప్ తో వర్క్ చేసుకుని కాస్సేపు రిలాక్స్ అవుదామని బాల్కనీ లోకి వచ్చింది.
అది కార్నర్లో వున్న ఫ్లాట్. శాండియాగో నగరం నడి బొడ్డున వున్న రిచ్ ఏరియా. అన్నీ అపార్ట్మెంట్స్.
యూనివర్సిటీకి దగ్గిరగా అన్నిటికీ అందుబాటులో వుంది. ఎప్పుడూ జనాలతో సందడిగా ఉంటుంది.
లెఫ్ట్- రైట్ రోడ్డుకి అటు ఇటూ ఫైర్ truks, రెండు అంబులెన్స్, రెండు టీవీ chanal వాళ్ళ కార్లు, అటునాలుగు ఇటునాలుగు పోలీస్ కార్లు ఆగి ఉండటం చూసి అరే ఎక్కడ ఏమైందా అని కంగారు పడింది.
ఎదురుగా పెద్ద అపార్ట్మెంట్ భవనాలు హై వోల్టేజ్ లైట్స్ తో పగలేమో అన్నట్టు ధగ ధగ లాడుతున్నాయి.
అపార్ట్ మెంట్ జనాన్ని పోలీసులు ఖాళీ చే ఇంచి బయటకు తీసుకువచ్చారు. అందరినీ దూరంగా పంపేశారు.
ఎవరో వ్యక్తులను యాంబులెన్స్లో హాస్పటల్కి తీసుకు వెళ్లారు.
అక్కడే వున్న ఇద్దరు అమ్మయిలను పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు.
నలుగురితో టీవీ ఛానల్ వాళ్లు అక్కడ ఏమి జరుగుతోంది? మీకు తెలుసా అని అడుగుతూ వేధిస్తున్నారు.
పోలీస్ కార్లు వస్తో వెళుతూ తిరుగుతున్నాయి.
ఎవరూ గట్టిగా మాటాడటానికి ఇష్టపడటం లేదు.
ఆనా, భర్తని “పిలిచి ఇక్కడ ఏదో జరుగుతోంది..” అంది.
ఆయన బయటకు వెళ్లి మాటాడి వచ్చాడు.
''ఏమిటిటా.. ఈ సందడి?” అడిగింది ఆనా.
''గాసోలిన్ లీకయ్యింది అట. నువ్వు బయటికి రావద్దు అన్నారు. ''
వెంటనే నాలుగు మైళ్ళ దూరంలో వున్న కొడుకు, కోడలికి ఈ కబురు చెప్పింది,. వుండబట్ట లేని ఆనా.
వీడియో ఆన్ చేసి చూపించు.. అన్నారు వాళ్ళు.
కానీ లైటింగ్ ఎక్కువగా వుంది. రెడ్ లైట్లు తప్ప అంతా అలుక్కు పోయినట్టు కనబడింది.
''మీరు జాగ్రత్త ఎవరితో మాటాడొద్దు. పొలీసులతో ఇబ్బంది. సైలెంటుగా వుండండి'' అన్నారు వాళ్ళు.
కానీ మానవ సహజం. గ్యాస్ లీక్ అంటున్న ఎక్కడా మంటలు, పొగ రాలేదు. గ్యాస్ స్మెల్ కూడా లేదు.
ఏమిటో.. అనుకుంది ఆనా.
''టీవీ పెట్టు న్యూస్ లైవ్ వస్తోందేమో.. ఏమి జరుగుతోందో తెలుస్తుంది..” అన్నాడు ఆనా భర్త.
లాప్ టాప్ - టీవీ ఆన్ చేసింది. రాత్రి 11 గంటలకు లోకల్ న్యూస్ రావాలి. అప్పుడు.
కానీ రాలేదు.
ఆనా అలాగే బాల్కానీలో కూర్చుని చూస్తోంది. మొక్కలు పెంచడం ఆమెకు హాబీ. అక్కడ చాల పెద్ద కుండీల్లో
గుబురుగా ఎన్నో మొక్కలు వున్నాయి.
అంతలో బాల్కానీ దగ్గిరవున్న పోలీస్లు వాళ్ళ కారు దగ్గిరకి ఒక అమ్మాయిని తీసుకు వచ్చి వాటర్ ఇచ్చి ''ఏమి జరిగింది? అని అడిగారు.
ఆపిల్ల ఏడుస్తూ నాకు తెలీదు.. అంటోంది.
''భయపడకు. నీమీద కేసు రాదు. జరిగింది చెబితే నీకు రివార్డు ఇస్తాం. నేరస్తులు దొరుకుతారు. నీ పేరు ఏమిటి? '' అంటూ ఆపిల్లకి ధైర్యం చెబుతున్నారు వాళ్ళు.
ఆనా చీకటిగా ఉన్నప్లేస్లో చెట్ల చాటున వుంది. కనుక వాళ్లకి కనిపించలేదు.
''నా పేరు పత్రీషా. సోఫియా మార్నింగ్ ఫోన్చేసి ఈ రోజు డిన్నర్కి రమ్మని పిలిచింది. ‘నాకు వేరే పని వుంది రాలేను.’ అన్నాను.
‘ఈ రోజు మన ఫ్రెండ్స్ కూడా వస్తారు. అది కాకుండా నీకో సర్ ప్రైస్ కూడా. మిస్సవకు’ అని బలవంతం
చేసింది.
''ముందుగా చెప్పకుండా సడన్గా చెబితే ఎలా అన్నాను.. కోపం తెచ్చుకుని. ,
''ఈరోజు రాకపోతే నన్ను మళ్ళీ చూడవు.. '' అంటే సరాదాగా చెప్పింది అనుకున్న. ''
''నీ రూమ్ ఇక్కడికి ఎంత దూరం? పోలీస్ ఆఫీసర్ అడిగాడు పత్రీషాని.
''టూ అవర్స్ డ్రైవ్. ''
''తర్వాత ఏమి జరిగింది? చెప్పు!
''నిజానికి నాకు వేరే పనివుంది. సోఫియా కి కోపం ఎక్కువ. తనకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేసెను. ''
''ఆకోపంతోనే నిన్ను ఇరికించాలని పిలిచిందా?''
''ఏమో తెలియదు. అంతగా మా మధ్య డిఫ్రెన్సెస్ లేవు. ఇలా జరుగుతుంది అనుకోలేదు.. పత్రీషా కళ్ళు తుడుచుకుంది.
''చూసింది చూసినట్టు చెప్పు. ''
''నేను వచ్చి సోఫియా ఫ్లాట్ కాలింగ్ బెల్ ప్రెస్ చేసాను.. డోర్ ఓపెన్ చేసే వుంది. ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళాను.
అక్కడ ఎవరూలేరు. ఆశ్చర్యంగా బెడ్ రూమ్ డోర్ నాక్ చేసాను. లాక్ చేసివుంది. ఆ డోర్ దగ్గిర.. నోట్ కనబడింది. !” అని పత్రీషా మల్లి ఆసంఘటన తల్చుకుని భయపడినందు వలన ఆమె గొంతు వణికింది..
''ఇదిగో వాటర్ తీసుకో. భయం వద్దు. రిలాక్స్ బేబీ..” అన్నాడు పోలీస్.
వాటర్ తాగి కాసేపు ఆగి మళ్ళీ ఏడవసాగింది.
''చెప్పు.. అక్కడ ఏమి వుంది?
''ఫోల్డ్ చేసిన తెల్ల కాగితం వుంది.. అది తీసుకుని చదివాను. అందులో..”
''అందులో ఏముందీ?”
''డోంట్ కం మై రూమ్.. లీక్ గాసోలిన్.. అని వుంది. ''
''అప్పుడు ఏమిచేశావ్?”
'' నాకు భయం వేసింది. కాస్సేపు ఏమి చేయాలో అర్థం కాలేదు. బయటకు వచ్చి మీకు కాల్ చేసాను. ''
అంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, పత్రీషాను గాఢంగా హత్తుకున్నాడు.
''హే.. ఎవరు నువ్వు? దూరంగా వుండు..” అతడిని దూరంగా నెట్టాడు పోలీస్.
''ప్లీస్ అతను.. నా బాయ్ ఫ్రెండ్ !” అంది పత్రీషా.
''ఓకే.. మీరిద్దరూ ఇక్కడే కార్లో కూర్చోండి.. నేను వచ్చేదాకా..” అని పోలీస్ ఆఫీసర్ వాళ్ళతో చెప్పి వాళ్ళ కారులో కూర్చోబెట్టి వెళ్ళాడు.
వాళ్ళు అటు వెళ్ళగానే ఆనా కూడా లోనికి వచ్చి వాటర్ తాగి.. బాల్కానీ లోకి వెళ్ళబోతే ఆమె భర్త,
''నిద్ర మానుకుని ఎందుకు కూర్చోవడం.. వెళ్లి నిద్రపో ఆనా..” అన్నాడు.
''నాకు నిద్ర ఎలా వస్తుంది.. ఇంత గందర గోళంగా ఉంటే! మీరు నిద్రపోండి..” అని వెళ్లి బాల్కానీలో కూర్చుంది ఏదో సస్పెన్స్ థిల్లర్ మూవీ చూస్తున్నంత కుతూహలంతో.
అంతదాకా ఉగ్గబట్టుకుని కూర్చున్న టీవీ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు మైకులు పట్టుకుని పత్రీషా నీ, బాయి ఫ్రెండ్ అలెక్స్నీ చుట్టుముట్టారు.
''లీవ్ హర్ అలోన్.. ప్లీస్ ' 'అన్నాడు అలెక్స్ వాళ్ళని వారిస్తూ.
అబ్బే.. వాళ్ళు అలా ఎందుకు వదులుతారు? ఇంతదాకా పోలీసులు వున్నారు కనుక సహనంగా వున్నారు.
ఇప్పుడు టీవీలో మా ఛానల్ ముందుగా ఈ వార్తను లైవ్ ఇవ్వాలి.. అనే ఆత్రం తో వున్నారు.
''హలో మీరు ఎందుకు ఈ అపార్ట్మెంట్ కి వచ్చారు? అక్కడ ఏమి జరుగుతోంది? పోలీసులు ఏమిఅడిగారు?” అంటూ అడిగారు.
మళ్లీ ఓపికగా అంతా చెప్పింది పత్రీషా.
''సోఫియా ఎందుకు అలా చేసింది అనుకునున్నావ్?”
''ఏమో తెలీదు. ''
''నీ ఫ్రెండ్ కదా.. ఆమె గురించి కొంత నీకు తెలిసే ఉండాలి. ''
''నో అయి డోంట్ నో..” అరిచింది అసహనంతో, పత్రిషా. కళ్ళు మూసుకుని అలసటగా కారు సీటులో ఒదిగిపోయి.
''లివ్ అస్ అలోన్ ప్లీస్.. అన్నాడు అలెక్స్.
వాళ్ళు కాస్త దూరంగా తప్పుకున్నారు.
ఆనా కొడుకు క్రిస్టఫర్ పిలిచాడు. అక్కడ పరిస్థితి ఏమిటీ అంటూ.
''ఏమి తెలీదు.. ఇప్పటిదాకా జరిగింది ఇదీ..” అని చెప్పింది.
''అప్పుడే పన్నెండు దాటింది. నిద్రపో మాం. ప్లీస్ గోటూ బెడ్'' అన్నాడు.
''ఓకే..” అంది కానీ అలాగే కూర్చుంది. అదేమిటో తెలుసుకునే వరకూ ఆమెకు తోచదుగా!
అంతలో ఆ వార్త తెలిసిన ఫ్రెండ్స్ కాల్ చేయడం మొదలు పెట్టారు.
''మీకెలా తెలిసింది? ఎదురుగా వున్నా నాకే తెలియదు. ?”
''నిద్ర పట్టక గూగుల్ న్యూస్ చూస్తుంటే ఫ్లాష్ న్యూస్ అని చెప్పాడు. నీకేమి కాలేదుగా?” ఆత్రంగా అడిగారు.
''లేదులే! విషయం తెలిస్తే నేనే కాల్ చేస్తా.. అంది.
బాత్ రూంకి వెళ్లి మొహం కడుక్కుని బననా ఒకటి తిని తీరికగా బాల్కానీ లోకి వచ్చింది.
ఆశ్చర్యం. అక్కడ ఎవ్వరూలేరు. వెళ్లి ఫైర్ ట్రక్స్ టీవీ వ్యానులు పోలీసుకార్లు అన్ని వెళ్లిపోయాయి.
'అరే, అన్నీ మాయం. అనవసరంగా లోనికి వెళ్ళాను.
పత్రీశాను అలెక్స్ను పోలీసులు విడిచిపెట్టేరా.. స్టేషన్కి తీసుకెళ్ళరా? సోఫియా ఉందా పోయినదా?
సృహ తప్పితే హాస్పటల్కి తీసుకెళ్లారా?’ అని ఒకటే ఆరాట పడిపొయిన్ది ఆనా.
చేసేది లేక వెళ్లి పడుకుంది.
నిద్ర పట్టలేదు. ఒకటే ఆలోచనలు.
సోఫియా ప్రాబ్లమ్ ఏమిటి? పత్రీషా నిజం చెప్పిందా? అసలు ఆ సాయంత్రం ఏమి జరిగింది?!
ఇది జరిగింది ఎదుటి అపార్టుమెంట్లో. పక్కన వున్నా ఎవరో ఏమిటో తెలియని కాలం.
రెంటుకి వున్నవాళ్లు వస్తూ వుంటారు. వారానికో నెలకో వేరే చోటుకి వెళ్లి పోతారు.
ఇక్కడ రెంట్ చాలా ఎక్కువ.
ఆనా ది స్వంతం కనుక ఎవరూ పరిచయస్తులు లేరు.
మరునాడు టీవీ న్యూస్లో అసలు విష్యం తెలిసింది.
సోఫియా సూసైడ్ చేసుకుంది. కారణం తెలియదు. ఆమె ఒంటరిగా ఉంటుంది.
పత్రీషా బాయ్ ఫ్రెండ్ అలెక్స్ సోఫియాకి స్టెప్ బ్రదర్. ఇద్దరికీ పడదు.
పత్రీషా -అలెక్స్ మధ్య వున్న సంబంధం ఆమెకు తెలుసు.
ఎవరికివారుగా వుండే వారు. ఒంటరిగా ఉండటం కొత్తకాదు.
మరి సోఫియా మనోవేదనకు కారణం ఏమిటో ఎవరికీ తెలియని మిస్టరీ.
అలెక్స్ అన్నాడు. ''సోఫియా నన్ను ఏనాడూ ఇష్టపడేదికాదు. ఓకే ఒక్కసారి పత్రీశ తో వున్నప్పుడు
కలిసాము. కానీ నాతొ మాటాడలేదు. తప్పించుకుని వెళ్ళిపొయిన్ది. !
పూర్ సోఫియా.. తన బాధను నాతో పంచుకునివుంటే బాగుండేది.
అలెక్స్ తో ప్రేమగా ఉంటే ఆమెకు ఏ కష్టమూ ఉండేది కాదు.
ఆమెకు మనసులో మాట పంచుకునే అలవాటులేదు.
ఒంటరితనమే ఆమె మరణానికి కారణం కావచ్చు.. అనుకుంది పత్రీషా బాధగా.
కానీ సోఫియా అనుకున్నది ఏమిటీ అంటే.. , పత్రీషా కంటే ముందు అలెక్స్ రూముకి వస్తాడు.
అక్కడ బెడ్ మీద పడివున్న నన్ను చూసి ‘సోఫియా.. ఏమిటిది? ఎందుకు ఇలా చేసావ్’ అని నా
శరీరం పట్టి కుదుపుతాడు.
''ఇకనుంచి మనిద్దరం కలిసిపోదాం. నా మనసు మార్చుకున్నాను. నా ప్రియమైన తమ్ముడా, ఇప్పటికే నిన్ను దూరంగా ఉంచి తప్పుచేసాను. ఈ సందర్భంగా ముగ్గురమూ పార్టీ చేసుకుందాం. పత్రీశాను పిలిచాను. ఆమె తప్పకుండా వస్తుంది. నువ్వుకూడా రా..” అంటూ ఫోను చేసింది.
అతడి వేలు ముద్రలు, షూ ముద్రలు చూసి పోలీసులు అనుమానిస్తారు. అతడికి శిక్ష పడుతుంది. ''అని.
ఎందుకు అతడిని తమ్ముడిగా ఆత్మీయుడుగా అనుకోలేక పోయినదీ.. అతడి తప్పు ఏమిటీ?
పత్రీషాని అతడు ఇష్టపడటం నచ్చలేదు. వాళ్ళిద్దరిమధ్యా సంబంధాన్ని సహించలేక ద్వేషం పెంచుకుంది.
ఆ ద్వేషంతోనే ప్రమాద కరమైన గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కొందరు అంతే! మానసికంగా బాధ పడతారు. లేనిది ఊహించుకుని పిచ్చిగా ప్రవర్తిస్తారు.
తండ్రి చేసిన తప్పుకి అలెక్స్ ని దూరం చేసుకుంది. తల్లి -తండ్రి ఇప్పుడు లేనేలేరు.
వున్నవాడు అలెక్స్ ఒక్కడే. అతడిని ప్రేమించి దగ్గిరకు తీసుకుని ఉంటే బాగుండేది.
పత్రీషా కూడా సహకరించేది. అసూయతో తనను బలిచేసుకుంది.
చాలా రోజుల తర్వాత అలెక్స్ బట్టలు లాండ్రీలో వేయడానికి అతడి ప్యాంటు జేబులు చూస్తే ఒక నోట్ కనబడింది.
అందులో ''డియర్ బ్రదర్ అలెక్స్ ! లోనికిరా.. నీకోసం ఎదురుచూస్తున్నా.. నీ అక్క సోఫియా !” అనివుంది.
పత్రీషా వెంటనే దాన్ని ఫైర్ లో పడేసి రహస్యం సమాధి చేసింది.
(చలికి ప్రతీ ఇంట్లో మంటవేసుకునే ప్లేస్ ఉంటుంది. )
***
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
https://www.manatelugukathalu.com/profile/annapurna/profile
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
