top of page

బాబోయ్ పేలు


'Baboy Pelu' - New Telugu Story Written By Mohana Krishna Tata

'బాబోయ్ పేలు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"అమ్మా! తల చాలా దురద పెడుతుంది.. ఏదో చెయ్యి అమ్మా!"


"స్కూల్ నుంచి పేలు ఎక్కించుకు వస్తున్నావా ఏంటి? పక్కింటికి వెళ్ళి పేల దువ్వెన అడిగి తెస్తాను, ఉండు బేబీ"


"నాకు కొత్తది కావాలి.. అంతే.. పక్కవాళ్ళది వద్దు అమ్మ"


"అలాగే రేపు కొంటాను మార్కెట్ కు వెళ్ళి" అంది మాధవి.


"మార్కెట్ కు వెళ్ళేటప్పుడు రెండు పెద్ద చాక్లెట్లు తీసుకురా.. మర్చి పోవద్దు"


‘దీనికి ఏమి తక్కువ లేదు..’ అనుకుంది మాధవి.


మర్నాడు, ఫ్యాన్సీ స్టోర్ కు వెళ్ళినప్పుడు, పేల దువ్వెన అడిగింది. "బాబు! పేల దువ్వెన ఒకటి మంచిది చూపించు!"


"మేడం! ఇదిగోండి మంచి దువ్వెన"


"ఈ కలర్ వద్దు బాబు. మా అమ్మాయికి బ్లూ కలర్ అంటే ఇష్టం, బ్లూ ఇవ్వు"


"మేడం! పేల కు మంచి షాంపూ ఉంది.. ఇమ్మంటారా?"


"ఇవ్వు బాబు.. ఇవ్వు.. " అంది.. మాధవి


దువ్వెన, షాంపూ, ఇంకా కిరానా సామాన్ల తో, ఇంటికి నడుచుకుంటూ వస్తోంది మాధవి. దారిలో, ఫ్రెండ్ అనిత ఎదురైంది..


"అనితా! ఎలా ఉన్నావు? ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేసావు. ఒకే వీధిలో ఉంటామనే మాటే గాని.. కలుసుకోవడం తక్కువైపోయింది.. "


"మా ఇల్లు దగ్గరే కదా! రావే మాధవి! చక్కా.. కాఫీ తాగుదుగాని"


ఇద్దరూ.. అనిత ఇంటికి వెళ్లారు.. అనిత కాఫీ పెట్టి, వేడి వేడి గా కప్ లో తెచ్చి ఇచ్చింది..


"తాగవే.. మాధవి.. ఏమిటే విషయాలు?.. పిల్లలు ఎలా చదువుతున్నారు?"


"బానే చదువుతున్నారు.. కానీ.. "


"ఏమిటే సమస్య.. "


"మా అమ్మాయికి పేలే బాబు పేలు.. రోజూ దువ్వితే, 30.. 40 వస్తాయి.. రెండు రోజులు గ్యాప్ ఇచ్చాననుకో.. హాఫ్ సెంచరీ చేస్తాయి!..


"అవునా.. " అంది అనిత.


"మొన్న ఎగ్జామ్స్ లో తలగోక్కోవడానికి 15 మినిట్స్ వేస్ట్ అయ్యిందంట.. ఒక క్వశ్చన్ కు ఆన్సర్ రాయడానికి టైం సరిపోలేదంట.. మార్కులు తక్కువ వచ్చాయని ఒకటే గోల.. మా బేబీ..


"నిజమా?.. "


"అందుకే, పెద్ద దువ్వెన, పేల షాంపూ తీసుకెళ్తున్నాను!"


"ఒకటి చెప్పనా మాధవి!.. మా ఎదిరింట్లో, ఆంటీ ఉంటుంది.. ఒకసారి ఆవిడ బాల్కనీ లోకి వచ్చినప్పుడు.. చూస్తే, జుట్టు సరిగ్గా లేదు. మొన్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, ఆవిడ జుట్టు చూస్తే అర్ధమైంది. అది విగ్ అని.. పేలు కొరుకుడు వల్ల జుట్టు పాడైందని..


ఇంకొకటి చెప్పనా! ఎదిరింట్లో.. విపరీతమైన దురదతో తల గోకుడుకి, రాత్రి ఆంటీ నిద్ర పోదు.. వాళ్ళాయనని పోనివ్వదు.. గోల భరించలేక, విషయం విడాకులదాకా వెళ్లిందట..


"భయపెట్టకే! తల్లీ! ఓకే, నేను వెళ్తాను ఇక.. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చాక, కొత్త దువ్వెన తో ఆ పేలు పని పట్టాలి..” అంది మాధవి


“పేల పై యుద్ధానికి వెళ్తున్న సైనికురాలు మాధవి.. ! అల్ ది బెస్ట్ మాధవి..”

“అమ్మ వచ్చింది.” అంటూ బయటకు వచ్చింది బేబీ.


"అమ్మా! చాక్లేట్లు ఏవి?.."


"చాక్లేట్లు ఎక్కువ తినకే.. పేలు పెరిగిపోతాయేమో.. "


"ముందు నాకు తల దువ్వు.. చికాకుగా ఉంది.."


దువ్వడము స్టార్ట్ చేసింది. ఒకటి, రెండు, మూడు.. పది.. ఇరవై.. ఇంకా వస్తున్నాయి..


“ముప్పై.. నలభై.. యాభై.. పెద్ద ఫామిలీ ఉన్నటుంది పిల్లా.. నీ తలలో"


"ఏమండీ! ఇది చూసారా, అమ్మాయికి 50 పేలు వచ్చాయి.. ఏమైనా చెయ్యండి!"


"ఆన్‌లైన్ లో మందు ఆర్డర్ చేస్తాను. ముందు ఆ షాంపూ ఏదో తెచ్చావు గా.. అది వాడి చూడు.. "


సండే, షాంపూ తో యుద్ధం.. తల మీద ఒకటే షాంపూ రుద్దుడు..


ఇప్పుడు దువ్వుతాను..

కాస్త.. బెటర్ ఇప్పుడు.. కౌంట్ తగ్గింది..


"ఎంతో?" అడిగాడు భర్త


"20 అండి.. 30 పేల సైనికులు మరణించారు.."


"వీర నారి.. మా ఆవిడ.."


"ఏమిటే! నువ్వు కూడా తల గోక్కుంటున్నావు? నువ్వు కూడా తల దువ్వుకో! "


"అవునమ్మా! రాత్రి నువ్వు నా దగ్గర ఒక గంట పడుకున్నావు కదా! నాకు కథ చెబుతూ.." అంది బేబీ.


"అవునే! నిజమే"


"ఏమిటే! నాకూ తల దురద వేస్తుంది" అన్నాడు భర్త


"రండి! మీకూ దువ్వుతా"


"అందరూ తల దువ్వుకున్నారు! కౌంట్ మళ్ళీ 50"


"ఇంక లాభం లేదు! ఆన్‌లైన్ లో పవర్ఫుల్ మెడిసిన్ ఆర్డర్ చేసేస్తాను. దానితో పేలన్నీ ఖతం" అన్నాడు భర్త.


************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ27 views0 comments

Comments


bottom of page