top of page

బామ్మ తెలివి


'Bamma Thelivi' - New Telugu Story Written By Mohana Krishna Tata

'బామ్మ తెలివి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

"రోజు రోజు కు దొంగతనాలు.. మోసాలు.. ఎక్కువై పోతున్నాయి రా సూర్యం!" అంది బామ్మ కాంతం..


"అవునే బామ్మ! కలికాలం.. ఏం చేస్తాం చెప్పు! మొన్నటికి మొన్న.. మా ఫ్రెండ్ సిటీ బస్సు లో వెళ్తుంటే, వాడికి తెలియకుండానే, జేబు కత్తిరించేసారు.. వాడు ఒకటే గోల ఫోన్ లో.. ఇంకొక ఫ్రెండ్ ట్రైన్ లో రాత్రి పడుకోగానే, కనిపెట్టి.. బ్యాగ్ ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇలా చెప్పుకుంటూ.. పోతే, చాలానే ఉన్నాయి.. టీవీ పెట్టినా.. పేపర్ లో చూసినా.. అన్నీ ఇవే.."


"మనకి రేపు ట్రైన్ ప్రయాణం ఉంది గా.. అన్నీ జాగ్రతగా సర్దుకోండి" అన్నాడు సూర్యం.


"బామ్మా! నువ్వు నీ వస్తువులు చాలా జాగ్రత్త గా చూసుకోవే.. !"


"నాకు నువ్వు చెప్పనక్కరలేదు రా!.. నీ బామ్మ అంటే ఏమనుకున్నావు.."


మర్నాడు ట్రైన్ కోసం అందరూ.. బయల్దేరారు ఇంటినుంచి.. సూర్యం, బామ్మ, సూర్యం భార్య ఉమ.. అందరూ ట్రైన్ ఎక్కి.. సెట్ అయ్యారు..


"ఏమిటే బామ్మా! అది నేను గమనించనే లేదు.. అంత పెద్ద బ్యాగ్ ఏమిటి?"


"ఏమైతే నీకెందుకు.. ఇది నా బంగారం.. ఇష్టమైన బంగారం..”

"అదేమిటి బంగారం బ్యాగ్ లో పెట్టావా?"


"పెళ్ళంటే.. ఆ మాత్రం తీసుకెళ్ళాలి మరి.. ఎవరికీ అనుమానం రాదు లే.. " అంది బామ్మ.


పక్కనే ఉన్న ఇద్దరు దొంగలు.. ఇదంతా విన్నారు..


‘ఈ బామ్మ.. ఎవరో చాలా అమాయకురాలు లాగ ఉంది.. మన పంట పండిందనుకో.. ఈ రోజు..’


రాత్రి.. అందరూ గాడ నిద్రలో ఉండగా.. సైలెంట్ గా బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయారు దొంగలు.. ట్రైన్ దిగేసి.. పండగ చేసుకుందామని పారిపోయారు..


ఉదయం లేచి చూసేసరికి బామ్మ బాగ్ లేదు..


"ఏమే బామ్మ! నీ బంగారం బ్యాగ్ ఏది?.. కనిపించట్లేదు.. "


"పోనీలేరా! మనవడా!"


"అదేంటి అంత సులువుగా అనేసావు!.. బంగారం అంటే లెక్క లేదా?"


"అలాగ కాదు రా.. ఈ భోగిలో ఆ ఇద్దరినీ చూస్తే.. నాకు కొంచం అనుమానం కలిగింది.. వాళ్ళు ఎప్పుడూ.. మీ ఆవిడ నగల వైపే చూస్తున్నారు..


అందుకే వాళ్ళ ఎదురుగా.. నేను బంగారం అంతా బ్యాగ్ లో ఉందని చెప్పాను.. నా అనుమానం నిజమైంది.. వాళ్ళు దొంగలే!.. నా బ్యాగ్ తీసుకుని పోయారు.. మీ నగలు.. బ్యాగ్ లు వదిలేసారు..”


"ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది బామ్మా?"


"ఏమీ లేదు.. కొంచం బరువు కోసం గులకరాళ్లు ఉంచి.. గట్టిగా తాళం వేసాను, అంతే!"


"నువ్వు చాలా తెలివైన దానివే బామ్మ!.. సూపర్!"


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ



55 views0 comments
bottom of page