top of page
Original.png

బంగారు పంజరం

3 hours ago
2 min read

తేజ బంగారు పంజరం నుంచి రామచిలుకను స్వేచ్ఛగా వదిలేస్తున్న దృశ్యం

Bangaru Panjaram - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

బంగారు పంజరం - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 25/09/2026


“బంగారు పంజరం” రాళ్లబండి సంగం నాయుడు రచించిన చక్కని బాలల నీతి కథ.  పిల్లల మనసు, తల్లిదండ్రుల అనుబంధం, స్వేచ్ఛ విలువను ఎంతో సరళంగా వివరించే ఈ కథ, సౌకర్యాలు ఉన్నా స్వేచ్ఛ లేకపోతే ఆనందం ఉండదనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది.


తేజ ఒకటో తరగతి చదువుతున్నాడు.


ఇదివరకు హాస్టల్లో ఉండి ఇంటికి దూరంగా చదువుకునేవాడు.


హాస్టల్లో ఆరోగ్యం బాగుండటం లేదని ఇంటి నుంచే బడికి వెళుతున్నాడు.


ఇంటి మీద బెంగ కారణంగా హాస్టల్లో ఉన్నప్పుడు సరిగా బడికి వెళ్లేవాడు కాదు, చక్కగా చదివేవాడు కాదు.


ఇంటి నుంచి బడికి వెళ్లడం వలన చక్కగా బడికి వెళ్లి చదువుతున్నాడు.


తేజలో వచ్చిన ఈ మంచి మార్పుకు సంతోషించిన శ్రీమంతులైన ఆ తల్లిదండ్రులు, తమ ఏకైక సంతానానికి బంగారు పంజరంలో రామచిలుకను తెచ్చి బహుమానంగా ఇచ్చారు.


పంజరంలోని ఆ చిలుక తిండి తినేది కాదు.


చిలుక తన తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకుంది.


ఇది గమనించిన తేజ, తల్లిదండ్రులు లేని సమయంలో చిలుకను వదిలేశాడు.


తేజ చిలుకతో, “తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో ఉండే స్వేచ్ఛను వదిలి నిన్ను పంజరంలో, నన్ను హాస్టల్లో బంధించారు.


అడవికి పోయి హాయిగా ఉండు,” అన్నాడు.


“ధన్యవాదాలు మిత్రమా! జామపళ్లు అప్పుడప్పుడు నీకిస్తాను,” అని తేజతో అంటూ చిలుక గాల్లోకి సంతోషంగా ఎగిరిపోయింది.


*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page