top of page

బార్ షాపు బతుకు'Bar Shop Bathuku' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 14/01/2024

'బార్ షాపు బతుకు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


జీవితం ఎప్పుడూ ఎవరికీ ఒకేలా ఉండదు.

కొందరు తాము అనుకున్నది సాధిస్తారు. 


అంటే కోరుకున్న ఉద్యోగమో.. లేదా కోరుకున్న ప్రేమో.. లేదా ఇంకేదో..అది సాధిస్తే చాలు జీవితాన్ని గెలిచినట్టు అనుకుంటారు.


జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. జీవితాన్ని గెలవటం దాదాపు అసాద్యం.


నిజంగా మంచి జీవితం అంటే ఏమిటి..? 

కోరుకున్నది సాధించటమా....కాదు.  నిజంగా కోరుకుంది సాధించటమే జీవితం అయితే.. ఈ భూమి పై ఎందరో అనుకున్నది సాధించి కూడా జీవితంలో సుఖంగా బతికిన దాఖలాలు లేవు  మరి..


నిజమే.. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళమని చెప్పుకునేవాళ్ళు, గొప్ప స్థానాల్లో ఉన్నవాళ్లు ఆనందంగా బతికిన రోజులు తక్కువే. 


మరి జీవితం ఆంటే ఏంటీ..? ఒక్కమాటలో చెప్పాలంటే

మరణం వరకు మనం నేర్చుకునే పాఠం ఒక జీవితం. దీన్ని సాదారణంగా బతుకు అంటారు.


రామచంద్రం ఒక వ్యాపారవేత్త,మరియు నావికుడు.

మద్యం లేనిదే అతడికి ప్రాణం నిలబడలేనంతగా ఉంటుంది. డబ్బు ఉన్నవాడు కదా ఇక ఆగుతాడా...ఆ ప్రాణం కోసం..


ఇష్టముంటే ఇంటికి తెప్పించుకోవటం.. 

లేకపోతే బార్ షాపులోనే తాగటం అతనికి అలవాటు.


రోజంతా పనిలో ఉన్నా... ఖాళీగా ఉన్నా.. సంద్యవేళ కాగానే స్వయంగా అయినా.. స్నేహితులుతో అయినా.. రామచంద్రంకి తాగటం కామన్.


ఎంత సంపాదించిన, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా , తల ఎత్తుకుని బతికే సత్తా ఉన్నా.. బార్ షాపు వద్ద, బీరు సీసా వద్ద తలవంచే రకం రామచంద్రంది. ఒక బార్ షాపు ఒకరి జీవితాన్ని ఇక్కడ నాశనం చేయగలుగుతుంది.


ధను అదే బార్ షాపులో వెయిటర్ గా పని చేస్తున్నాడు. ధనుకి పట్టుమని పదిహేను ఏళ్ళు నిండలేదు. కానీ ఈ పని అతడికి తప్పటంలేదు. ఎందుకంటే.. 


ధను తండ్రి వెంకట్ గతంలో చేతులు లేకపోయినా ఒక అమ్మాయి సుప్రియను ప్రేమించాడు.వెంకట్ మంచివాడు. చదువులో మేటి గొప్పవాడు అవుతాడని అందరూ అనుకునేవాళ్ళు. అంతటి సత్తా ఉన్నవాడు వెంకట్. ఈరోజుల్లో అవసరం తీరాకా వెళ్ళిపోయేవారి కంటే చేతులు లేక ఎవరితో ప్రేమించబడని తన క్లాస్ మెట్ సుప్రియనే పెళ్ళిచేసుకున్నాడు. అనుకున్నట్లే ప్రభుత్వ కొలువు కొట్టి సుప్రియను బాగా చూసుకునేవాడు. 

ఇంతా బాగుందనుకుంటున్న సమయంలో జీతం పట్ల తృప్తిచెందక లంచాలబాట పట్టి అడ్డంగా దొరికిపోయి, అటు ఉద్యోగం, ఇటు ఇల్లు, ఆస్తులను కోల్పోయి  మద్యానికి బానిసై సుప్రియతో గొడవలు పెట్టుకోవటం చేసేవాడు. అప్పటికే సుప్రియ నిండు గర్భిణీ.


బార్య ప్రసవం కూడా జరగలేదు. వెంకట్ విపరీతంగా మద్యం సేవిస్తాడని తాగుబోతని ఇరుగుపొరుగు వెంకట్ ని నిందించేవాళ్ళు. అవనీతిపరుడని ,తాగుబోతనే మాటలు వెంకట్  ప్రాణాలు తీసుకునేలా చేశాయి.


 అప్పుడు సుప్రియ కష్టాలు వర్ణనాతీతం.

ఎలాగో బాబు పుట్టాడు. అతడికి ధను అనే పేరు పెట్టి జీవితం సాగనంపుతు పదేళ్లు పెంచింది. భర్త జ్ణాపకాలతో సుప్రియ ఆత్మహత్య చేసుకుని ధనుని ఒంటరి చేసింది.


అలా ధను ఐదో తరగతి వరకు చదువుకుని బతుకు తెరువుకోసం బార్ షాపులో పనిచేస్తున్నాడు.


ధను చిన్నప్పటి నుండే మంచి వ్యక్తిత్వం కలవాడు.


ధను పనిచేస్తున్న బార్ షాపుకే రామచంద్రం వస్తుండేవాడు. అతడిని ధను కూడా గుర్తించగలడు.


ఒకరోజు రామచంద్రం స్నేహితులుతో బార్ షాపు కు వచ్చాడు.

ఎన్నోసార్లు వచ్చిన ఏనాడూ ధనుని ఏం అనలేదు. ఆరోజు స్నేహితులు ముందు ప్రెస్టీజ్ కోసం తమ వద్ద బాటిల్స్ పెట్టిన ధనుని

"బాబు, నీ పేరేంటో కానీ.. నువ్వు రేపటి నుండి ఇక్కడ పని చేయకు. పాడైపోతావు.  ఇక్కడ నుండి వెళ్ళి వేరే పని చేసుకో" అన్నాడు రామచంద్రం.


అప్పుడు ధను

"అయ్యా....మీరే ఇక్కడికి రేపటి నుండి రావటం మానివేయండి.మీరు ఇలా తాగి మీ కుటుంబానికి దూరమయితే మీ కొడుకు కూడా నాలాగే ఇక్కడ పని చేయల్సి ఉంటుంది.


ఇక నేను చెడిపోవటం అంటావా... ఈ బార్ షాపే నాకు ఐదేళ్ళుగా బతుకు నడిపిస్తుండగా నేనెలా చెడిపోతాను..?  మన వ్యక్తిత్వం మంచిదైతే.. చెడు స్నేహితులుతో కలిసి ఉన్నా చెడు అలవాట్లు మనకు అలవడటం సాధ్యం కాదు. 

దయచేసి మీరు ఈ షాపు వద్దకు మరలా రాకూడదని మనవి చేసుకుంటున్నాను.

మీకు ఎప్పటి నుండో చెప్పాలనుకున్నాను. కానీ..! సందర్భం లేకుండా చెబితే ఫలితం ఉండదు. మీరు అర్థం చేసుకోకపోవచ్చు. అలాగే తాగేవాళ్ళని తాగనివ్వకుండా చేస్తున్నానని మా ఓనర్ కూడా చీవాట్లు పెట్టవచ్చు. అందుకే అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కరెక్ట్ గా సందర్భం వచ్చింది, చెప్పాను. దయచేసి నా మాట వినండి. మద్యం హానికరమని ఈ సీసాలపైనే రాసి వీటినే ప్రభుత్వం అమ్ముతుంది అంటే ఆదాయం కోసం. అమ్ముతున్నారు కదా.. డబ్బులు ఉన్నాయి కదా.. అని విచ్చలవిడిగా తాగితే రేపు మీ కొడుకు బతకుతెరివు కోసం ఇక్కడకే రాడంటే గ్యారెంటీ ఏంటీ "అని ప్రశ్నించాడు ధను.


ఆ మాటలకు రామచంద్రంకి తాగినదంతా దిగి

"బాబు, చిన్నవాడివైనా గొప్ప జీవిత పాఠం చెప్పావు. ఏ బార్ షాపు అయితే నాకు తెలియకుండానే నన్ను నాశనం చేస్తుందో.. అదే బార్ షాపు తల్లిదండ్రులు కోల్పోయిన నీకు బతుకుదారి చూపిస్తుంది.


నిజంగా బార్ ఉంది కదా అని నేను తాగటంలేదు ,డబ్బు ఉంది కదా అని తాగుతున్నాను. అది నా దుర అలవాటు. డబ్బు ఉన్న వ్యాపారవేత్త, నావికుడునైన నేను, నాకు అన్ని తెలుసు అనుకున్నాను. కానీ..! డబ్బు , ఆస్తులు ,చివరకు మంచి చెప్పే తల్లిదండ్రులు ,జ్ణానం ప్రసాదించే చదువునకు దూరం అయినా,, గొప్ప జీవిత పాఠం నేర్పావు నాకు.


రేపటి నుండే నీవు పాఠశాలకు వెళ్ళు. నీలో చాలా తెలివితేటలు ఉన్నాయి. నీకు తండ్రిగా నేను ఉంటాను. నాతో వస్తావా.. ఇన్నాళ్లు నేను మద్యానికి చేసిన ఖర్చు ఈరోజు నుండి నీకోసం చేస్తా.నా కొడుకుతో సమానంగా చదివిస్తా. గొప్పవాడివైతే గర్వంగా చెప్పుకుంటా. లేకుంటే తల్లిదండ్రులు లేని బిడ్డకు బతుకునిచ్చానని ఆనందంతో బతుకుతా " అన్నాడు.


బార్ షాపు ఓనర్ వచ్చి

"ఇన్నాళ్ళకి నీ రూపంలో  ధనుని చూసుకోవటానికి దేవుడు వచ్చాడు. చిన్నవాడైన ధనుతో ఇక్కడ పని చేయించటం తప్పే. అయినా అతడి బతుకు కోసం ఏన్నో షాపులు తిరిగినా.. ఎవరు ఒప్పుకోకపోవటంతో ఇక్కడ చేర్చుకున్నాను" అన్నాడు.


రామచంద్రం ఓనర్ ని సముదాయించి ధనుని తన వెంట తీసుకెళ్ళాడు.


సమాప్తం.


 పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

38 views0 comments

コメント


bottom of page