top of page
Original.png

భాండాగారం

#Bhandagaram, #భాండాగారం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Bhandagaram - New Telugu Poem Written By Dr. Brinda M N

Published In manatelugukathalu.com On 31/12/2025

భాండాగారం - తెలుగు కవిత

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


క్షీరసాగర మథనవేళ ఉద్భవించిన అమృతం

వైద్యో నారాయణో హరిహి అవతారం

ఆయుర్వేద శాస్త్రానికి మూలస్తంభం

శ్రీరంగం ప్రాంగణంలో ధన్వంతరి దర్శనం

నెల్లువాయేలో నీడనిచ్చిన మూర్తి స్వరూపం!!


ఆరోగ్య సంరక్షణకు అభిమాన సూచికం

పీనాయుత బాహుదండాలు కంబుకంఠం

పద్మారుణ లోచనాల విశాల వక్షస్థలం

సుస్నిగ్ధ కేశజాల నీలగాత్ర తేజం మణికుండలాల పీతాంబర పుష్పమాలకృతం!!


త్రైలోక్యనాధాయ విష్ణువే నమోవాకం

కషాయాలతో పాలద్రోలే కలవరం

లేహ్యాల లాలనలో సలక్షణం

గుగ్గుల్లతో గెలిచే గుండెకవాటం

రసాలతో విరబూసే నవీన తేజం!!


పంచకర్మతో కర్మలన్నీ ఖండం

త్రిదోషాలను తరిమేసే దొడ్డ దండం చింతలూరులో చింతలన్నీ చకచకా చిద్రం

ధారలతో ధన్యమాయే దేహదారుఢ్యం

మానసిక వికాసానికి మోహనరాగం!!


ఆర్థిక ఆలంబనకు ప్రకృతి ఓషదం

ప్లాస్టిక్ సర్జరీ విజయంలో తొలిదైవం

క్రిమి కీటక సంహారానికి హరిద్రం

ఆయుర్వేద శ్రేష్టకు పాదాభివందనం ధన్వంతరి సంపూర్ణ ఆరోగ్యానికి భాండాగారం!!


 "జై తెలుగుతల్లి! జై భరతమాత"


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page