top of page
Original.png

ఓ పెద్దాయనా… నీ చిరునవ్వెక్కడ?

Aug 29
3 min read

శివుని సన్నిధిలో కన్నీళ్లతో కరుణ కోసం ప్రార్థిస్తున్న భక్తుడి ఆధ్యాత్మిక దృశ్యం
ఓ పెద్దాయనా… నీ చిరునవ్వెక్కడ? – శివభక్తి కవిత

O Peddayana Nee Chirunavvekkada- Telugu Devotional Poetry | Routhu Srinivasa rao

ఓ పెద్దాయనా… నీ చిరునవ్వెక్కడ? తెలుగు భక్తి కవిత | రౌతు శ్రీనివాసరావు

Publishes in manatelugukathalu.com on 29/08/2026


తనలోని బలహీనతలతోనే శివుని కరుణను ఆశ్రయించే ఆత్మీయ అన్వేషణ ఓ పెద్దాయనా… నీ చిరునవ్వెక్కడ? కవితలో కనిపిస్తుంది. రౌతు శ్రీనివాసరావు గారు రచించిన ఈ శివభక్తి కవిత భక్తుడికి, భగవంతుడికి మధ్య ఉన్న అంతరంగ సంబంధాన్ని హృదయానికి  హత్తుకునేలా  ఆవిష్కరిస్తుంది..


ఓ పెద్దాయనా… నీ చిరునవ్వెక్కడ?


ప్రసీద సర్వభూతనాథా పరమేశా! ‘పరమేశా గంగా విడువు, పార్వతి చాలు’ అన్న శ్రీనాథ కవి సార్వభౌముని చరితం గొప్పది.


నీ మీద కాలు పెట్టి, నీ కంటికి కన్ను పెట్టిన, కన్నప్ప చరితం గొప్పది.


యమ ధర్మరాజు వెంటాడినా, నీ లింగాన్ని ఆలింగనం చేసుకున్న ఆ మార్కండేయుని చరితం గొప్పది.


స్వామీ! నాకు మాత్రం పరమాత్మా… ప్రతి అణువు నీదే అనిపిస్తుంది.


బ్రహ్మాండము నీదే, మోస్తున్న భారం నీదే. నీవు ఘటికుడివి స్వామీ, గరళము కూడా జారకుండా గొంతులో ఆపేశావు.


మనసులోని మాటలన్నీ చెప్పాలనిపిస్తుంది. పటువు తగ్గినా, మనసు మాత్రం నీ దారినే వెతుకుతుంది.


స్వామీ… నీ పాదాలను చేరాలని..నా అన్వేషణ ఆగదు. కానీ, నాకు అంత శక్తి లేదు, ఆ మహానుభావులు లాగా పయనించలేను.. కానీ


మీ కరుణలోనే నా ప్రయాణం, మీ ఛాయలోనే నా జీవనం.


మీ చిద్విలాస మోము చాలు, మీ ఉనికి చాలు, మీ నామస్మరణ చాలు స్వామీ. ఇప్పటికే సత్యసోధనలో ఉన్నాను, మీ చిన్న ఉనికినే తట్టుకునే శక్తి చాలు స్వామీ.


— R. S. Rao

OS, Railways



============================================


Swamee - Telugu Emotional Poetry | Routhu Srinivasa rao

స్వామీ! తెలుగు భావోద్వేగ కవిత | రౌతు శ్రీనివాసరావు

Publishes in manatelugukathalu.com on 07/08/2026


భగవంతుని ముందు తన మనసును విప్పి చెప్పుకునే ఒక సాధారణ భక్తుని ఆత్మీయ సంభాషణ. భక్తి, వినయం, ఆత్మపరిశీలన, శివస్మరణతో నిండిన ఈ తెలుగు కవిత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.


మీరు కాస్త నిద్రపోండి, స్వామీ…

అసలు విశ్రాంతి లేదు మీకు.


సృష్టి – స్థితి – లయలతో మీరు ఎప్పుడూ అలసిపోతున్నారు,

మీకు విశ్రాంతి అవసరం ఉండదా?


ప్రతి జీవి చేసిన కర్మను మీరు లెక్కిస్తారు,


ప్రకృతిని మరమ్మత్తు చేయడానికి మహానుభావులను సృష్టిస్తారు.


పంచభూతాలను ఆదేశిస్తారు,

యోగులు, సిద్ధులను కాపలా పెడతారు,

సృష్టి దారి తప్పకుండా…


అంత పని మధ్యలో…

మీకు యోగనిద్ర ఎప్పుడు లభిస్తుంది స్వామీ?


అందరి బాధలను మోస్తూ,

అందరి కోరికలను వింటూ,

అందరి కర్మలకు తీర్పునిస్తూ…

మీ బాధను మాత్రం ఎవరు వింటారు స్వామీ?

నాతో ఆడుకోండి… నాతో చెప్పండి.


స్వామీ! నిజంగా ఎవరైనా మీ దర్శనం పొందారా?


 *మీ జాడను ప్రతి చోట వెతకడానికి

నాలో శక్తి లేదు.

నడవడానికి కాళ్లలో బలం లేదు,

ఈ దేహంలో శక్తి లేదు.* 


కానీ ఒక బలమైన కోరిక ఉంది—

స్మరణతో, తలపుతో

మిమ్మల్ని కనుగొనాలని.


అంతటి శ్రద్ధ కూడా నాలో పూర్తిగా లేదనిపించే

ఒక అనామక భక్తుడిని నేను.


స్వామీ…

ఒక్క అవకాశం ఇవ్వండి.

మీ ఉనికిని నాకు అనుభవింపజేయండి.

ఒక చిన్న నిదర్శనం చూపండి.


నిజాయితీగా అడుగుతున్న

 *ఈ చిన్న మనసును నమ్మండి,

చిన్నబుచ్చుకోనివ్వకండి…* మహానుభావా.


ఓం నమః శివాయ


================================







Na Chinni Gundelo Sivudu - Telugu Emotional Poetry | Routhu Srinivasa rao

నా చిన్ని గుండెలో శివుడు తెలుగు భావోద్వేగ కవిత | రౌతు శ్రీనివాసరావు

Publishes in manatelugukathalu.com on 01/08/2026


శివుడు అంటే కేవలం ఒక దేవతా రూపం కాదు... విశ్వాన్ని తనలో ధరించిన పరబ్రహ్మ స్వరూపం. గంగను జటాజూటంలో నిలిపినవాడు, హాలాహలాన్ని మింగినవాడు, పంచభూతాలకు అధిపతి అయిన మహాదేవుడిని వర్ణించడం కంటే, ఆయనను మన హృదయంలో నిలుపుకోవడమే నిజమైన భక్తి అని చెప్పే అందమైన ఆధ్యాత్మిక కవితే "నా చిన్ని గుండెలో శివుడు." ఈ కవిత భక్తి, వినయం, ఆత్మసాక్షాత్కారం అనే మూడు భావాలను హృద్యంగా మేళవిస్తుంది.


గంగను, శిరస్సులో సులభంగా ధరించినవాడివి.


గరళాన్ని, గుటుక్కున మ్రింగినవాడివి.


పామును, మెడలో అలంకారంగా వేసుకున్నవాడివి.


సూర్యచంద్రులకు, దిశ చూపినవాడివి.


పంచభూతాలను, ఆధీనంలో ఉంచుకున్నవాడివి...


...స్వామీ, నీవు....

అంతటి అపారమైన శక్తి గలవాడివి, మిమ్మల్ని,భిక్షువంటారు, లయకారుడంటారు...స్వామీ... అర్థంకారు మీరు, ఎంత గొప్పవారో....


కానీ, నా లోనున్న శివయ్యకు,నాకు జ్ఞానం ప్రసాదించమని కోరుతున్నాను...


ఎందుకంటే—


ముక్కంటిని చూసి మురిసిపోవాలని.

పరమాత్మ పాదాలు చేరుకోవాలని.

బొమ్మలు చేసినవారిని,బ్రహ్మాండాన్ని సృష్టించినవారిని తలచుకుంటూ,తాకుతూ, భక్తితో, 

నా తనువు అలసిపోవాలని కోరుకుంటున్నాను...


నీ మహిమను వర్ణించే మాటలకంటే,


నీ తత్వంలో నేను కలిసిపోవడమే,

నా జీవిత పరమార్థం...


అందుకే...


నాకు కొద్దిగా దొరుకు స్వామీ...

ఈ చిన్న గుండెలో,

నిన్ను పెద్దగా దాచుకునేందుకు.


– ఆర్.ఎస్. రావు


***************************************


రౌతు శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


Routhu Srinivasa Rao

రచయిత పరిచయం: రౌతు శ్రీనివాసరావు

నా పేరు రౌతు శ్రీనివాసరావు. నేను భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. కవితలు, కథలు చదవడం, రచించడం నా అభిరుచులు. సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, నా మనోభావాలను చిన్న చిన్న కథానికలుగా, కవితలుగా మలచే ప్రయత్నం చేస్తున్నాను. నా రచనలను చదివి మీ విలువైన అభిప్రాయాలు, ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page