top of page

భిన్నత్వంలో ఏకత్వం



'Bhinnatvamlo Ekatvam' - New Telugu Story Written By Kolla Pushpa

Published In manatelugukathalu.com On 01/03/2024

'భిన్నత్వంలో ఏకత్వం' తెలుగు కథ 

రచన: కొల్లా పుష్ప

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ముంబైలో ట్రైన్ దిగేసరికి చిన్న కొడుకు మురళి ఎదురు వచ్చాడు. "బాగున్నావా అమ్మా" అంటూ చేతిలో లగేజీ తీసుకున్నాడు. "బాగున్నాను బాబు నీవు కోడలు పిల్లలు బాగున్నారా"? అంది అన్నపూర్ణమ్మ కారు ఎక్కుతూ.


"ఆ బాగున్నారమ్మ , నువ్వు ఎప్పుడు వస్తావా అని పిల్లలు ఎదురుచూస్తున్నారు" అన్నాడు మురళి డ్రైవర్ కు రూట్ చెప్తూ.


గంట తర్వాత ఇంటి దగ్గరికి చేరేసరికి కోడలు మంజుల "బాగున్నారా అత్తయ్య" అంటూ చేతిలో బ్యాగు తీసుకుంది.

వేడివేడిగా వంట చేసి పెట్టింది తిన్నాక "పడుకోండి అత్తయ్య పొద్దున్న మాట్లాడుకుందాం బాగా అలసిపోయారు" అంటూ కోడలు మంజుల లైటు ఆపి బెడ్ లైట్ వేసింది.

@@@


ఉదయం లేచే సరికి అందరూ ఆఫీసులకి స్కూళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు.

మనవడు ఐదవ క్లాసు, మనవరాలు మూడో క్లాసు చదువుతున్నారు.


        "అమ్మా నా పుట్టినరోజు నాడు స్కూలుకి ఏ డ్రెస్ వేసుకోవాలి" అని అడుగుతుంది ముద్దు ముద్దుగా వాళ్ళ అమ్మని.తనని చూడగానే "నానమ్మ" అంటూ వచ్చి వాటేసుకుంది.     దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది అన్నపూర్ణమ్మ.


ఇంతలో కొడుకు, కోడలు రెడీ అయి వచ్చారు.   "అత్తయ్య అన్ని టేబుల్ మీద పెట్టాను టైం కు తిని మందులు వేసుకోండి, సాయంత్రం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది పాప పుట్టినరోజు కదా! చిన్న పార్టీ ఉంది అందుకు కావలసిన వన్నీ కొనుక్కొని వస్తాము" అన్నది కోడలు మంజుల.


అచ్చం తెలుగింటి ఆడపడుచులా తయారైన కోడల్ని చూసి సంబరపడింది అన్నపూర్ణమ్మ. వాళ్ళు వెళ్ళగానే అన్ని పనులు పూర్తి చేసుకుని బాల్కనీలో నిలుచుంది.


అన్నీ కూడా 10, 12 అంతస్తుల భవనాల సముదాయాలు అందరూ బిజీ బిజీగా ఎవరి పనుల మీద వాళ్ళు తిరుగుతున్నారు.   


 చిన్న కొడుకు మురళి ఐదవ అంతస్తులో ఉంటాడు. పెద్దకొడుకు విశాఖపట్నంలో ఉంటున్నాడు. భర్త చనిపోయాక ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉంటుంది.


ఇంతలో ముందు వరండా లో ఏదో గలాటా వినిపించింది అటువైపు కిటికీ తీసి చూసింది.

ఒకతను హిందీలో, ఒకతను తమిళంలో తిట్టుకుంటున్నారు. తనకు భాష తెలియకపోయినా వాళ్ళ హవ భావాలను బట్టి వాళ్లు దెబ్బలాడుకుంటున్నారని తెలిసింది.   


  ఇంతలో వాళ్ళు ప్రక్కనుంచి పక్క ఫ్లాట్ అమ్మాయి విజయ "ఆంటీ బాగున్నారా" అని పలకరించింది. "బాగున్నానమ్మ వాళ్ళిద్దరూ ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు" అని అడిగింది అన్నపూర్ణమ్మ.      " నిన్న రాత్రి సెల్లార్లో వాళ్ళ పిల్లలు కొట్టుకున్నారట అందుకని" అని చెప్పేసి నాకు ఆఫీస్ టైం అయిపోతుందని వెళ్లిపోయింది .


ఎవరు కలుగ చేసుకోలేదు అలిసిపోయె దాకా తిట్టుకొని ఎవరికి వాళ్లు వెళ్లిపోయారు. 'అయ్యో

మనవరాలు పుట్టినరోజుకి బట్టలైనా కొన్నాను కాదు, మతిమరుపు దాన్ని.

చేతిలో డబ్బులు పెడదాంలే' అనుకున్నది.

***


పాప పుట్టినరోజు ఇంకా రెండు రోజులు ఉండగా ఫ్లాట్స్ లో అందరికీ ఫోన్లు చేసి మెసేజ్ లు పెట్టి చెప్పారు పైన టెర్రస్ మీద బర్త్డే పార్టీ ఉందని.


ఆరోజు రానే వచ్చింది అందరూ పిల్లలను తీసుకుని వస్తున్నారు. కోడలు "వెల్కమ్, వెల్కమ్" అంటూ వాళ్లను ఆహ్వానించింది.


 అందరూ రకరకాల డ్రెస్సులతో  వాళ్ళందరూ వాళ్ళ ఆచారానికి తగ్గట్టుగా వస్తున్నారు.

కన్నడ ,మలయాళం, మరాఠీ, పంజాబ్, తమిళనాడు కొందరైతే జర్మన్ ,రష్యా వాళ్ళు కూడా ఉన్నారు. 'వాళ్లందర్నీ చూస్తుంటే ఒక మినీ భారతదేశం కదలి వచ్చిందా' అనిపించినట్లు ఉంది అన్నపూర్ణమ్మ కు. 

అందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి పాస్ ఆన్ బాల్ గేమ్ ఆడించింది.

ఎవరైతే ఓడిపోతారో వాళ్లు ఏదో ఒక ఎక్టివిటీ చేయాలి పిల్లలందరూ చూడముచ్చటగా ఉన్నారు. వాళ్లకు వయసుకు తగ్గట్టు పాటలు, డాన్స్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ భాషలో.

మధ్య మధ్యలో ఒక పాప "ఆంటీ నీరు బేకు" అన్నది.

ఒక బాబు "అంకుల్ ముజే బాత్రూం జానా హై" అని ఇంకొకరు.

ఒక పాప "ఐ వాంట్ గిఫ్ట్"అని ఒకరు.

ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక భాషలో  మాట్లాడుతున్నారు. మురళి వాటన్నిటికీ అర్ధాలు చెప్తున్నాడు తల్లి అన్నపూర్ణమ్మ కు.


తనకి భాష రాకపోయిన పిల్లల ఆటపాటలు చూసి చాలా ఆనంద పడింది.

కేక్ కట్ చేసే టైం వచ్చింది పాప పట్టు పరికిణిలో మెరిసిపోతుంది.


అందరూ "హ్యాపీ బర్త్ డే అంటూ ఇంగ్లీషులో చెప్పారు.      కోడలు మంజుల పిల్లలందరి చేత తెలుగులో "పుట్టినరోజు శుభాకాంక్షలు" చెప్పించింది.

 అందరూ తమదైన శైలిలో చక్కగా చెప్పారు.


 ఆరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం కూడా అందుకని కోడలు మంజుల వారి చేత "దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టవోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్" అంటూ తెలుగులో గురజాడ అప్పారావు గారు రచించిన పాట పాడించింది.     


అందరికీ గిఫ్ట్ లు ఇచ్చాడు కొడుకు మురళి వెళ్లిపోయే ముందు అందరి చేత జనగణమన పాడించింది కోడలు.

జనగణమనలో చెప్పినట్లు పంజాబు, సింధు, మరాఠా, ద్రావిడ, ఉత్కళ ,వంగ అన్ని రాష్ట్రాలు ఒక్క తీరుగా ఉండాలి పిల్లల లాగా.        ముందు రోజు దెబ్బలాడుకున్నా కానీ అందరూ ఆరోజు కలిసిపోయి ఆడుకుంటున్నారు.

భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే అనిపించింది. ఈ పిల్లలను చూసి ఎంతైనా నేర్చుకోవాల్సిందే పెద్దవాళ్లు.


 'ఇలాగే దేశమంతా ఐక్యతగా ఉండగలిగితే భరతమాత గర్విస్తుంది.     భారతదేశం ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉంటుంది' అనుకుంది ఆనందంగా అన్నపూర్ణమ్మ.


                    శుభం 

కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప








74 views0 comments

תגובות


bottom of page