బీర్బల్ సమయస్ఫూర్తి

Birbal Samayasphurthi - Telugu Moral Story | Rallabandi Sangam Naidu
బీర్బల్ సమయసూర్తి- తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 07/10/2026
బీర్బల్ సమయస్ఫూర్తి అక్బర్–బీర్బల్ కథల్లోని తెలివితేటలను చాటిచెప్పే ఆసక్తికరమైన తెలుగు నీతి కథ.
పూర్వం మొగల్ సామ్రాజ్యాన్ని అక్బర్ చక్రవర్తి పరిపాలించేవాడు. అక్బర్ దగ్గర బీర్బల్ పని చేస్తుండేవాడు. బీర్బల్ మహా తెలివైనవాడు, మహా గడసరి. తన తెలివితేటలతో తరచూ అక్బర్ ను ఓడించేవాడు. అక్బర్ తాను ప్రతిసారీ ఓడిపోతున్నా దాన్ని సరదాగానే తీసుకునేవాడే తప్ప బీర్బల్ పై ఎప్పుడూ కత్తి దూయలేదు.
ఒకసారి అక్బర్, బీర్బల్ ఒక సాయంకాలం వేళ ఉద్యానవనంలో పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నారు. వారు ఇరువురు సరదాగా చక్కని సాహితీ చర్చలతో కాలాక్షేపం చేస్తున్నారు. ఇంతలో ఒక కాకి పాదుషా భుజంపై రెట్ట వేసింది. వెంటనే అక్బర్ కు రెట్ట వేసిన కాకిపై కోపం వచ్చింది.
"ఎవరక్కడ? నాపై రెట్ట వేసిన కాకిని చంపండి!" అని ఆజ్ఞాపించాడు.
ఒక భటుడు వచ్చి రెట్ట వేసిన కాకిపైకి గురి చూసి బాణం వదిలాడు.
రెట్ట వేసిన కాకి తప్పించుకుంది. అక్బర్ కోపం ఎక్కువైంది. "మన రాజ్యంలో కాకుల సంఖ్య ఎంత చెప్పండి బీర్బల్! కాకుల జాతి లేకుండా చేస్తాను. లేకపోతే ఒక సామ్రాజ్యానికి చక్రవర్తిని నైన నామీద కాకి రెట్ట వేస్తుందా?" అని కోపంతో ఊగిపోతున్నాడు అక్బర్.
అక్బర్ కోపం తగ్గిస్తూ... "ప్రభూ! మన రాజ్యంలో కాకుల సంఖ్య రెండు లక్షలు" అని నోటికి వచ్చిన అంకె చెప్పేసాడు.
బీర్బల్ "రాజా! కాకుల జాతి లేకుండా నేను చేస్తాను. తమరు మందిరానికి దయచేయండి ముందు" అన్నాడు. బీర్బల్ దగ్గర మాట తీసుకుని అక్బర్ రాజ మందిరానికి వెళ్ళిపోయాడు.
మరునాడు అక్బర్ "మంత్రితో మన రాజ్యంలో కాకుల సంఖ్య కనుగొనండి. కాకి జాతి లేకుండా చేద్దాం" అన్నాడు.
మంత్రి అక్బర్ తో అటులనే అని చెప్పి కాకుల సంఖ్య లెక్కవేసే పనిలో పడ్డాడు. వారం రోజుల తరువాత వచ్చి "కాకుల సంఖ్య లెక్క పెట్టటకు సాధ్యం కాలేదు ప్రభు, మన్నించండి.
అవి స్థిరంగా ఒకచోట గుంపుగా ఉండటం లేదు. లెక్కించుటకు వీలు కాకున్నది" అని చెప్పాడు.
మంత్రి సమాధానంతో మండిపడ్డాడు అక్బర్. కాకుల సంఖ్య రెండు లక్షలని, కాకుల జాతి లేకుండా చేస్తానన్న బీర్బల్ గుర్తుకు వచ్చాడు అక్బర్ కి. తక్షణమే బీర్బల్ ను తీసుకురమ్మని రాజ భటులను ఆజ్ఞాపించాడు అక్బర్. హటాహుటిన రాజ ఆస్థానానికి వచ్చాడు బీర్బల్.
అక్బర్ బీర్బల్ పై అగ్గిమీద గుగ్గిళం అవుతున్నాడు. "కాకుల జాతి లేకుండా చేస్తానన్నావు.
కాకుల సంఖ్య రెండు లక్షలని తడుముకోకుండా సమాధానం చెప్పావు. కాకులు స్థిరంగా ఒకచోట గుంపుగా ఉండటం లేదట, లెక్కపెట్టటానికి. నువ్వు నాతో అబద్ధం చెప్పావు. ఒకచోట గుమిగూడని కాకులను రెండు లక్షలని ఎలా చెప్పావు?" అని అక్బర్ బీర్బల్ ను గద్దించి అడిగాడు.
"మన్నించండి మహాప్రభూ! కాకులు ఒకచోట గుమిగూడే ఏర్పాటు నేను చేస్తాను. మంత్రితో మీరు లెక్కపెట్టుకోండి" అని బీర్బల్ రాజ ఆస్థానంలో సభ్యుల ముందు చెప్పాడు.
అక్బర్ దానికి "కాకులు ఒకచోట చేరి గుమిగూడే ఏర్పాటు నువ్వు చేయు. లెక్కపెట్టే ఏర్పాటు మేము చేస్తాము. ఒకవేళ కాకులను ఒకచోట చేర్చి గుమిగూడే ఏర్పాటు చేయలేకపోతే మరణదండన నీకు" అని బీర్బల్ తో అన్నాడు.
అక్బర్ సభలోని వారిని ఉద్దేశించి "బీర్బల్ కాకులను లెక్కపెట్టటానికి అనువుగా గుంపుగా చేర్చగలిగితే నేను కాకుల జాతిని నాశనం చేస్తానన్న మాట వెనుకకు తీసుకుంటాను.
ఒకవేళ బీర్బల్ కాకులను గుంపుగా చేయలేకపోతే మరణశిక్షకు సిద్ధపడాలి" అన్నాడు. సభలోని వారు, బీర్బల్ సరేనన్నారు. సభ తర్వాతి రోజుకు వాయిదా పడింది.
తర్వాత రోజు సభకు బీర్బల్ బంగారు పంజరంలో ఒక కాకిని బంధించి తీసుకువచ్చాడు.
బంగారు పంజరంలో చిలుక కదా ఉండాల్సింది? ఇదేమిటి కాకి ఉందని సభలోని వారు, అక్బర్ తలగోక్కున్నారు బీర్బల్ వసరి అర్థం కాక. అక్బర్ కు, సభలోని వారికీ బీర్బల్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. అందరూ "బీర్బల్ పని అయిపోయింది, బీర్బల్ కు మరణశిక్ష తప్పదు" అనుకున్నారు.
కొంచెం సేపు గడిచింది. బంగారు పంజరంలోని కాకి అరవటం మొదలుపెట్టింది. అంతే, బయటి నుండి కాకుల గుంపు ఆ రాజ ఆస్థాన భవనాన్ని చుట్టుముట్టాయి. గుంపులు గుంపులుగా ఎన్నో కాకులు వేల సంఖ్యలో కావ్ కావ్ మంటూ నిమిషాలలో చేరాయి.
బీర్బల్ "రాజా! నేను చెప్పిన ప్రకారం కాకులను గుంపుగా తెచ్చాను. ఇక లెక్కపెట్టడం తమ వంతు" అన్నాడు.
అక్బర్ ఆ వేల సంఖ్యలో కాకులను ఆనందంతో చూస్తూ... బీర్బల్ తెలివికి, సమయస్ఫూర్తికి అబ్బురపడుతూ... "బీర్బల్! కాకుల సంఖ్య ఇక్కడ ముఖ్యం కాదు. మీ అమోఘమైన తెలివితేటలు ముఖ్యం. ఈ తెలివైన ఆలోచన నీకెలా తట్టింది?" అని అడిగాడు.
బీర్బల్ "ఏముంది మహారాజా! కాకులు తమ జాతి కాకికి ఏదైనా ఆపద సంభవిస్తే అన్నీ ఒకటైపోతాయి. ఆ ప్రకృతి నిబంధనను అనుసరించి నేను పంజరంలో కాకిని బంధించాను.
తమ జాతి కాకి ఒకటి పంజరంలో ఉందని, దాన్ని తమ ప్రాణాలు పణంగా పెట్టి విడిపించటానికి మిగిలిన కాకులు వచ్చాయి. కాకుల సమైక్య భావం గొప్పది" అని చెప్పాడు.
అక్బర్ తాను ఓడిపోయానని ఒప్పుకుంటూ పంజరంలోని కాకిని వదిలిపెట్టగానే వేల సంఖ్యలోని కాకుల గుంపు ఒక్కసారిగా ఆనందంతో ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. సభలోని వారందరూ హర్షధ్వానాలు చేశారు బీర్బల్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ...
అక్బర్ పొంగిపోయాడు అనంతమైన భూతదయ గల బీర్బల్ తన ఆస్థానంలో ఉన్నందుకు. బీర్బల్ కాకుల జాతిని అక్బర్ కోపానికి బలి కాకుండా రక్షించినందుకు మనసులో సంతోషపడ్డాడు.
~ సమాప్తం ~
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం







Comments