సారి

Saari - Telugu Moral Story | Thokala Rajesham
సారి - తెలుగు నీతి కథ | తోకల రాజేశం
Published in manatelugukathalu.com on 07/10/2026
“సారి” ఒక చిన్న మాట ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో చెప్పే హృద్యమైన తెలుగు నీతి కథ. స్నేహం, దాంపత్య బంధం, ఇగో, క్షమాపణ వంటి మానవ సంబంధాల అంశాలను ఈ కథ అందంగా చూపిస్తుంది.
ఆఫీసు నుండి హడావిడిగా ఇంటికి వెళ్తున్న సంతోష్ బండికి అకస్మాత్తుగా బ్రేక్ పడింది.
గల్లీలో రాంగ్ రూట్‌లో వస్తున్న పల్సర్ బండి దాదాపు గుద్దినంత పని చేసింది. అసలే బాధలో ఉన్న సంతోష్‌కి కోపం నషాలానికి అంటింది. హెల్మెట్ తీసి తిట్టబోయాడు. తెలిసిన మనిషిలా కనిపించాడు.
'ఏమిటా పరధ్యానం?' ఎదురుగా హెల్మెట్ తీస్తూ నవీన్.
'అరేయ్ ఏం కోపం రా నా మీద! బండితో కొట్టి చంపేద్దాం అనుకున్నావా?'
'లేదురా... పిలిస్తే నువ్వు పలకడం లేదు. అందుకే నీ ఎదురుగా వస్తేనన్నా కనికరిస్తావని' నవ్వుతూ అన్నాడు నవీన్.
'రారా అలా తోవలో కాఫీ తాగి వెళదాం' నవీన్ అనేసరికి ఇద్దరూ దగ్గర్లో టీ షాపులోకి వెళ్లి కూర్చున్నారు.
ఇద్దరూ మంచి హాస్యగాళ్లు, జిగిరీ దోస్తులు. నవీన్ వేసే పంచులకు నవ్వలేక నవ్వుతున్నాడు సంతోష్.
'ఏమిరా! మళ్లీ ఏమైంది? చెల్లెకి నీకు గొడవా?' అన్న నవీన్ ప్రశ్నకు గాఢమైన నిట్టూర్పును సమాధానంగా వదిలాడు సంతోష్. సమస్య ఏమిటో అర్థమైంది. సంతోష్ కుటుంబం గురించి నవీన్‌కు పూర్తిగా తెలుసు. వాళ్ల మనస్తత్వాలు కూడా తెలుసు.
'అరేయ్! నేనొకటి చెప్తా వింటావా?' ఇద్దరి మధ్యా అలుముకున్న మౌనాన్ని బద్దలు కొట్టాడు నవీన్.
'నీ కన్నా వయసులో చాలా చిన్నది కావటం వల్ల, తన పుట్టింట్లో వంటింటి కుందేలుగా ఉండటం వల్ల బహుశా! చెల్లె అలా తెలిసీ తెలియని తనంతో గడుసుదానిలా కనిపిస్తుంది.
కానీ చెల్లె చాలా మంచిది. ఈ విషయం నాకంటే నీకే బాగా తెలుసు' కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు నవీన్.
'నిజమే కానీ.....?' సంతోష్ గొంతులో తెలియని నిస్సహాయత.
'ఈరోజొక పని చేస్తావా?' అన్న నవీన్ మాటలకు ఆశగా తల ఎత్తాడు సంతోష్.
'ఈరోజు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నువ్వే ఒకమెట్టు దిగి చూడు. ఇంటికెళ్లాక ప్రేమగా మా చెల్లికి ఒకసారి "సారి" చెప్పి చూడు.
నీ ఇగోని పక్కన పెట్టి ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నం చేసి చూడు. మెల్లగా మా చెల్లెలో కలిగే మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోతావ్. పాపం! చిన్న పిల్లల తత్వం రా! ఆడవాళ్ళది' అని స్నేహోపదేశాన్ని ముగించాడు నవీన్.
"అది కాదురా..."
రెండు చేతులూ జోడించి సంతోష్ వాక్యాన్ని మధ్యలోనే విరిచేశాడు నవీన్. నవీన్ ముఖ కవళికలు సంతోష్‌ను ఇంటిదారి పట్టమని చెప్పాయి.
అనుకున్నట్టుగానే రెండోరోజు సాయంత్రం అదే కాఫీ హోటల్లో ద్విసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నవీన్ రెండుచేతులూ పట్టుకొని 'థాంక్యూ రా! ఇప్పుడు హ్యాపీ' అని మెరుస్తున్న కళ్ళతో కృతజ్ఞతలు చెప్పాడు సంతోష్.
సంతోష్ మాటలను విని నవీన్ సంబరపడిపోయాడు. కాఫీ తాగటం పూర్తి అయిందో లేదో 'సరే వెళ్తానురా! మీ చెల్లె ఎదురుచూస్తుంది' అంటూ కదులుతున్న సంతోష్‌ను సంతోషంగా సాగనంపాడు నవీన్.
ఇదంతా గమనిస్తున్న టీ షాపు యజమాని ఎవరికో ఫోన్ చేసి 'సారి' అంటున్నాడు. వినీ విననట్టు లోలోపలే నవ్వుకుంటున్నాడు నవీన్.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.








Comments