'Chattam Nyayam Dharmam' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 13/10/2023
'చట్టం న్యాయం ధర్మం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
చట్టం, న్యాయం, ధర్మం అనే పదాలు అందరికీ తెలుసు కానీ..
వాటి అర్దాలు మాత్రం కొందరికే తెలుసు. కొందరికి అర్థం తెలిసినా.. ఉదాహరణతో చెప్తే కానీ.. వాటి అర్థం తెలిసినట్లు బోదపడదు.
ఏ దేశంలో అయినా చట్టాలు ఉంటాయి.
అయితే.. !
వాటి అమలు తీరు వేరేగా ఉంటుంది.
అలాగే న్యాయం కూడా అంతే ఒక్కో దేశంలో ఒక్కోలా న్యాయం జరగొచ్చు
అలాగే డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, లేనివారికి ఒక న్యాయం అని ఇప్పటికీ చాలామంది మేధావులు, నిపుణులు, న్యాయం విషయంలో తమ అభిప్రాయాలు వెళ్ళగక్కుతూనే ఉంటారు.
ఇక ధర్మం గూర్చి అందరికీ తెలుసు
అలాగే ధర్మాన్ని అందరూ అనుసరించగల, కాపాడగలిగే అర్హత ఉన్నా.. ధర్మాన్ని రక్షించటం అటుంచి ఒక్కరు కూడా ధర్మం తో మెలగరు.
అలాంటి సమాజంలో ఓ పల్లెటూరులో వ్యక్తి వీరేశం చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాడనే కారణం తో ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించింది.
పేదవాడే అయినా.. నిజాయితీ నిరూపించుకుని, స్వర్ధం లేకుండా బతుకున్నందుకు ఎంతోగానో గౌరవించింది.
అయితే ఇంత జరిగినా కూడా వీరేశం ఊరులో ఒక్క కుటుంబంనకు తప్ప మిగిలిన వారి ఎవరికి తాను ఏం చేశాడో ఎందుకు సన్మానించారో తెలియదు. ఒకప్పుడు పేదోడిగా ఉన్న వీరేశం కష్టపడి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అదే తమ ఊరికి ఒక ఆశ్చర్యం అలాంటి ఈ దశలో ప్రభుత్వం సన్మానం వారికి అంతుపట్టలేదు.
చట్టం, న్యాయంపై వారికి పెద్ద అవగాహన కూడా లేదు. కానీ.. ఏం చేస్తే వీరేశంను ప్రభుత్వం గుర్తించిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
నిజంగా వీరేశం ఊరిలో అందరి కంటే పేదోడు.
కానీ.. కష్టపడటం, తెలివిగా ఆలోచించటంలో అతని తర్వాతే ఎవరైనా..
అలాంటి వీరేశం ఏనాటికైనా ఒక మంచి స్ధానంలో ఉంటాడనేది జగమెరిగిన సత్యం.
నిజమే కదా మరీ.. !
ఒక వ్యక్తి తనకు తానుగా తన కష్టానికే నమ్ముకున్నోడు, ఎవరికి ఆపద తలపెట్టని వాడు, నిజాయితీగా తన పని చేసుకున్నవాడు. ఎప్పటికైనా మంచి స్ధానంలో ఉండటం విజయం సాదించటం అనేది ఇక్కడ కామన్ పాయింట్.
అయితే వీరేశం ఎంత కష్టపడినా ఒకనొక దశలో తన కుటుంబం నకు బాగా చూసుకోలేకపోయాడు.
ఎందుకంటే..
ఆ సమయంలో తన కొడుకు, కూతురు కు ఒకేసారి ఆరోగ్యం బాలేకపోవటం.
ఆ సమయంలో ఎంతో క్షోభ అనుభవించాడు వీరేశం.
ఒకనొక దశలో డబ్బులు లేక అప్పు చేయాల్సిన పరిస్థితి.
ఆ అప్పు కోసం ఊరంతా ఒక్కొక్కరికి అడిగినా.. తిరిగి చెల్లించలేడనే అనుమానంతో ఎవరు ఇవ్వలేదు.
చివరకు దానయ్య అనే వ్యక్తి వీరేశంకి పదిలక్షల రూపాయలు అప్పుగా డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడు.
ఆ డబ్బు తో పిల్లలు వైద్యం చేసి మిగిలిన డబ్బులు సహయంతో తన ఎదుగుదలకు మార్గం చూసుకున్నాడు వీరేశం.
అలా ఆ డబ్బులుతో సంపాదించే వనరులు వెతుక్కుని తన కష్టంతో మెల్లగా కొత్త జీవనం ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలిచే గొప్ప జీవితాన్ని అనుభవించసాగాడు.
ఇప్పుడు వీరేశం కి ఎంతో డబ్బు ఉంది. ఆస్థి కూడా ఉంది.
అలా కొంతకాలం గడిచాక తీవ్రమైన అనారోగ్యంతో తనకు అప్పు ఇచ్చిన దానయ్య అకస్మాత్తుగా మరణించాడు.
వీరేశం అతని మరణవార్త విని కుటుంబం ను ఓదార్చి అన్ని కార్యక్రమాలు తానే దగ్గరుండి చేయించాడు.
పదకుండో రోజు కార్యక్రమాలు సైతం తాన సొంత ఖర్చులుతోనే చేశాడు.
అక్కడితో అతని బాధ్యత పూర్తి అయిందనుకున్న సమయంలో..
దానయ్య బార్య పిల్లలు పెద్ద దిక్కు కోల్పోవటంతో రోడ్డున పడ్డారని విని గతంలో దానయ్య తనకు అప్పుగా ఇచ్చిన పదిలక్షల రూపాయలు గుర్తుకు వచ్చాయి.
నిజంగా ఇక్కడే ఒకే ఒక్క పనితో వీరేశం నిజాయితీ మరియు చట్టం, న్యాయం, ధర్మం అనే పదాలకు న్యాయం చేశాడు.
దానయ్య.. వీరేశం పై నమ్మకంతో ఎప్పటికైనా తన డబ్బులు తనకు ఇస్తాడని ఏ పత్రం రాయించుకోలేదు.
కాబట్టి ‘చట్టం’ ప్రకారం అప్పు ఇచ్చిన డబ్బు పత్రం లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం వీరేశంకి లేదు. అయినా ఆ డబ్బుని ఆపద కాలంలో తిరిగి దానయ్య కుటుంబంనకు అందజేశాడు వీరేశం
ఇక ఆ ఇచ్చిన డబ్బుకు ఎంత కాలం అయిందో లెక్కించి మరీ తన అవసరానికి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బులుకు ‘న్యాయపరంగా’ వడ్డీ కూడా చెల్లించాడు వీరేశం. అదే న్యాయం.
అక్కడితో ఆగక ఒక్క అడుగు ముందుకేసి ఆపదలో తనను ఆదుకున్న దానయ్య కుటుంబం కోలుకునే వరకు, తమ జీవనం సబాబుగా సాగే వరకు, దానయ్య పిల్లలు పెద్దవారు అయ్యే వరకు కుటుంబం యోగక్షేమాలు తానే చూసుకోవటానికి ముందుకొచ్చాడు. ఇదే ‘ధర్మం’.
అలా వీరేశం ఒకే ఒక్క పనితో అందరి ప్రశంసలు అందుకుని చట్టం, న్యాయం, ధర్మం అనే పేర్లుకు చక్కని అర్థం ఇచ్చినవాడైనందునే ప్రభుత్వం ఆయన్ను ఇంత చక్కగా సత్కరించిందని ఊరి వారు తెలుసుకుని తెల్లముఖం వేయటం వారి వంతయింది.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comentários