top of page
Original.png

చెప్తేనే తెలుస్తుంది

#KanuKolanuVenkataSubrahmanyeswaraRao, #CheptheneTelusthundi, #చెప్తేనేతెలుస్తుంది, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Chepthene Telusthundi - New Telugu Story Written By Kanu Kolanu Venkata Subrahmanyeswara Rao Published in manatelugukathalu.com on 13/02/2026

చెప్తేనే తెలుస్తుంది - తెలుగు కథ 

రచన: కాను కొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు


కాలేజీ లో సమావేశపు హాల్ యువతీ యువకులతో కళకళ లాడుతోంది. 


ఆ రోజు ప్రముఖ రచయిత్రి, సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు రమాదేవి విద్యార్థినీ–విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి వచ్చారు. 


కాలేజీ విద్యార్థులు అందరూ ఆమె చెప్పే విషయాలు కుతూహలంగా వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 


ఆమె మైక్ తీసుకుని ప్రసంగం ప్రారంభించగానే అందరూ మంత్ర ముగ్ధులై వింటూ ఉండి పోయారు. 


“నేను మీకు కథలు చెప్పడానికి వచ్చాను. 

ఆ కథలు విని మీ వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలన్నది మీరే నిర్ణయించుకోండి, ”

అంటూ కథ ప్రారంభించారు రమాదేవి. 


మీలాగే ఇంజనీరింగ్ చదువుతున్న ఒక అమ్మాయి — శ్రావణి. 


ఒక రోజు…

శ్రావణి మనసు ఆనందంతో గెంతులేస్తోంది. 

నిన్న వినాయక చవితికి నాన్న తెచ్చిన కొత్త డ్రెస్ వేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెట్టగానే ఐదు నిమిషాల్లో వేల లైకులు, మెసేజ్‌లు వచ్చాయి. 


“మీరు చాలా అందంగా ఉన్నారు. ”

“హీరోయిన్ శ్రీలీల మీ చెల్లెలా!”

అంటూ వరదల్లా మెసేజ్‌లు వచ్చి పడ్డాయి. 


“మీరు డాన్స్ చేస్తే చూడాలని ఉంది, ” అంటూ యువ స్నేహితులు ఎందరో సందేశాలు పంపించారు. 


శ్రావణి అసలు ఊహించలేదు —

తనకు ఇంత ఆదరణ లభిస్తుందని. 

అందుకే డాబా మీదకు వెళ్లి, తమ్ముడు వేణు సాయంతో

“ఒక్కడు” సినిమా లోని భూమిక పాట పెట్టుకుని దానికి అనుగుణంగా నృత్యం ప్రాక్టీస్ చేసి రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. 

అదే రోజు జీవితంలో మర్చిపోలేని ఒక సందేశం వచ్చింది. 


“శ్రావణీ! ఐ లవ్ యూ, ”

అంటూ ఢిల్లీ నుంచి సాగర్ అనే యువకుడు పంపిన మెసేజ్. 


ఎంత అందంగా ఉన్నాడు!

అతను నన్ను ప్రేమిస్తున్నాడా?

శ్రావణి మనసు ఆనందంతో ఉరకలేసింది. 


“థాంక్స్” అని పెట్టగానే చాటింగ్ మొదలైంది. 

అలా ప్రారంభమైన పరిచయం వ్యక్తిగత విషయాలు, అభిరుచులు, కుటుంబ నేపథ్యం — అన్నీ తెరిచిన పుస్తకం లాగా ఒకరికి ఒకరు చెప్పుకునే స్థాయికి వచ్చింది. 


వీడియో కాల్స్…

ప్రేమ మాటలు…

“నిన్ను ప్రేమిస్తున్నాను. 

నిన్ను అలా చూడాలని ఉంది… ఇలా చూడాలని ఉంది…”

అంటూ సాగర్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. 


శ్రావణి వీడియోలు రికార్డు చేసి పంపమని, 

లేకపోతే అలిగానని, అన్నం తినలేదని చెప్పి బలవంతం చేసి

రకరకాల వీడియోలు చేయించి తీసుకునేవాడు. 


ప్రేమలో మునిగిపోయిన శ్రావణి సాగర్‌ను పూర్తిగా నమ్మింది. 

ఒక రోజు —

“నేను విజయవాడ వస్తున్నాను. 


 హోటల్‌లో దిగాను. ఒక్కసారి నిన్ను కలవాలని వచ్చాను, ”

అనగానే శ్రావణి కాలేజీకి డుమ్మా కొట్టి హోటల్‌కు వెళ్లింది. 


అక్కడ సాగర్ ప్రేమగా మాట్లాడిన మాటలకు లొంగిపోయి తనను తాను అర్పించేసుకుంది. 


“త్వరలో మీ వాళ్లతో మాట్లాడడానికి మా అమ్మా నాన్నను పంపిస్తాను, ”

అనగానే గుడ్డిగా నమ్మింది. 


ఆనందంతో ఇంటికి వచ్చి అతని ఫోన్ కోసం ఎదురు చూసింది. 

రోజులు గడిచినా కాల్ రాలేదు. 


తానే కాల్ చేస్తే —

“ఈ నంబర్ పనిచేయడం లేదు” అన్న వాయిస్. 

తను మోసపోయానని అర్థమయ్యే సరికి జరగవలసిన మోసం జరిగిపోయింది. 


శ్రావణి గర్భవతి అని తెలిసిన క్షణంలో

ఆమె గుండె పగిలిపోయింది. 


తల్లిదండ్రులు కూతురు చేసిన పనికి తలెత్తుకోలేక ఏడుస్తూ…

పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇస్తే, 

పోలీసులు పిల్లలపై శ్రద్ధలేదా అంటూ తల్లిదండ్రులనే మందలించారు. 


జరిగిన అవమానం తట్టుకోలేక

శ్రావణి ఆత్మహత్య చేసుకుని

కుటుంబానికి గర్భశోకం మిగిల్చింది. 


మరో బాలుడి కథ వినండి. 


శౌర్య ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. 

ఫోన్‌లో పబ్జీ గేమ్స్‌కు అలవాటుపడి

పాఠశాల మానేసి గేమ్‌కు బానిసయ్యాడు. 

ఆ గేమ్‌లో చెప్పే సూచనలు పాటిస్తూ

ఒక రోజు తొమ్మిదవ అంతస్తు మీద నుంచి దూకి

ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించాడు. 


అలాగే సురేష్ కథ


సురేష్ ప్రైవేట్‌గా చిరుద్యోగం చేస్తున్నాడు. 


అవసరాల కోసం లోన్ యాప్‌లలో లక్షలు అప్పు చేసి

అప్పుల పాలయ్యాడు. 

అప్పుల వాళ్ల బెదిరింపులు భరించలేక ఒత్తిడికి గురై

నిండు ప్రాణం బలి చేసుకున్నాడు. 

పెళ్లి కాని సుధీర్, 

ఫేస్‌బుక్‌లో పెళ్లి ప్రకటన చూసి మోసపోయి

పెళ్లి చేసుకుంటానన్న యువతికి తన ఆస్తి మొత్తం అప్పగించాడు. 


ఆ తర్వాత పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక

పరువు పోయి

ఎక్కడికో దూరంగా వెళ్లి బ్రతుకుతూ ఉన్నాడు. 


ఇలా క్రికెట్ బెట్టింగులు, సైబర్ నేరాలు, 

ఖాతాల్లో డబ్బు ఖాళీ చేసే నేరస్థులు

మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటారు. 


కాబట్టి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి మీడియాను

అవసరానికి మించి వాడకుండా

హద్దుల్లో, తెలివిగా ఉపయోగిస్తే

మీడియా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 


సాహితీవేత్తలకు, రచయితలకు, కళాకారులకు

తమ ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి

మీడియా ఒక అద్భుత వేదికగా మారింది. 


విద్యా, వైద్య రంగాలకు కూడా

మీడియా ఎంతో ఉపయోగకరంగా మారింది. 


స్రవంతి యూట్యూబ్‌లో వీడియోలు చూసి

ఎంసెట్ రాసి మెడిసిన్‌లో ఫ్రీ సీట్ సంపాదించింది. 


చంద్రం పేద విద్యార్థి. 

ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చినా

కోచింగ్‌కు వెళ్లే ఆర్థిక స్థోమత లేక

తండ్రి ఫోన్‌లో ఎంసెట్ మెటీరియల్ చూసి ప్రాక్టీస్ చేసి

వందలోపు ర్యాంక్ సాధించాడు. 

ఇంజనీర్ అయి సెటిల్ అయ్యాడు. 


తన అభివృద్ధికి మీడియా ఎలా సాయపడిందో చెబుతూ

యువతకు మార్గదర్శకుడయ్యాడు. 


అరుణ తనకు వచ్చిన బ్యూటీ టిప్స్ ద్వారా

ఆన్‌లైన్‌లో సంపాదిస్తోంది. 

ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారం చేసి

ఎందరో కోట్లకు పడగలెత్తారు. 

స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటిని ఆదర్శంగా తీసుకుని

ఎందరో తమ జీవితాలను సుఖమయం చేసుకుంటున్నారు. 


మీడియా అనేది మనం వాడే విధానాన్ని బట్టి మనకు ఉపయోగపడుతుంది

అనే చిన్న విషయం గ్రహిస్తే చాలు. 

మీరు నీ వ్యక్తిత్వం చక్కగా ఆదర్శ వంతంగా, అందరికి నచ్చే విధంగా

ఉన్నత స్థాయిలో కి వెళ్ళడానికి అనువుగా తీర్చి దిద్దుకోవచ్చు. 


అని రమాదేవి గారు ప్రసంగం ముగించి స్టేజ్ మీదనుండి కిందకు దిగగానే సమావేశపు హాల్ కరతాళ ధ్వనులతో

మారుమ్రోగి పోయింది. 


యువతీ యువకులు అందరూ ఆమె ను చుట్టుముట్టి ధన్యవాదాలు చెప్పి అభినందనలతో ముంచెత్తుతూ ఉంటే


ఆమె నిష్క్రమిస్తూ... అందరికి చివరగా ఒకమాట వివేకం తో ఉండండి. 

మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా తెలివిగా వ్యవహరించండి. 

చాలు మీ జీవితాలు నందన వనం అవుతాయి. 


మీ తల్లిదండ్రుల కలలు నెరవేరతాయి"

అంటూ ముగించి కారులో వెళ్తుంటే ఆమెకు ఆరోజు చాలా మంచి విషయాలు యువతకు చెప్పగలిగినందుకు ఎంతో సంతృప్తి అనిపించింది. 

************

కాను కొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కాను కొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు

B.A.BEd.



రిటైర్డ్ టీచర్ (సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు)


స్వస్థలం:మచిలీపట్నం

కృష్ణాజిల్లా,ఆంధ్ర ప్రదేశ్.

ప్రస్తుతం:హైదరాబాద్.


రచనా వ్యాసంగం;:

గత ఐదు సంవత్సరాలుగా కథలు ,కవితలు దినపత్రికలు

ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్ లో

సుమారు 1000కవితలు

100కథలు


జీవనరాగాలు పేరుతో 36 కథలతో

కథా సంపుటి విడుదల

17/8/2025 వతేది.

ప్రముఖ విమర్శకులచే ప్రశంసలు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page