'Chirunavve Andam' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 03/11/2023
'చిరునవ్వే అందం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"మాధురి! ఎందుకలా ఉన్నావు? పెళ్ళి చూపుల రోజు తర్వాత నుంచి చూస్తున్నాను.. ఎందుకు అంత డల్ గా ఉన్నావు? నేను నచ్చలేదా?"
"అయ్యో! ఎంత మాట? మీకేమి తక్కువ? చక్కగా ఉంటారు. మీరంటే నాకు చాలా ఇష్టం.. ’నా కన్నా అదృష్టవంతురాలు ఎవరూ ఉండరేమో!’ అని అందరూ అనుకుంటున్నారు.. ”
"నేను అదృష్టవంతుడని కాదా! మాధురి?"
"మీ లాంటి అందమైనా అబ్బాయి భర్త గా వచ్చినందుకు.. నేనే లక్కీ అని అందరూ అంటున్నారు.. "
"ఇంకేమిటి అంటారు అందరూ చెప్పు... !"
"నా చిన్నప్పటినుంచి అందరూ నన్ను చాలా మాటలన్నారు"
"వింటాను.. చెప్పు మాధురి! నీ మాటలు నీ పేరులాగే చాలా మధురంగా ఉంటాయి.. "
***
నేను పుట్టిన తర్వాత నన్ను చూసి.. నర్సు చిరాకు పడిందని.. మా అమ్మ చెప్పింది. నేను చాలా నల్లగా పుట్టాను. మా అమ్మ నన్ను చూసి మొదట్లో కొంచం బాధ పడింది. అమ్మ ప్రేమ ముందు నా రంగు ఓడిపోయిందనే చెప్పాలి. నాన్న మాత్రం ఫీల్ అయ్యేవారుకాదు, లక్ష్మీ దేవి పుట్టిందని చాలా మురిసిపోయేవారు. నాకు చిన్న బాధ కలిగినా.. నాన్న తట్టుకునే వారు కాదు. నాకు కావాల్సిన వన్నీ తెచ్చి పెట్టేవారు. నాన్న నాకు మంచి ఫ్రెండ్. నేను కాలేజీ లో చదువుతుండగా… నాన్న చనిపోయారు. అప్పటినుంచి అమ్మ నన్ను తిట్టేది... నాకు పెళ్ళి సంబంధాలు చూడలేక.. ఎవరూ నన్ను ఇష్టపడట్లేదని, నా రంగు గురించి ఎప్పుడూ బాధపడేది. అది చూసి... నాకు ఇంకా చాలా బాధ ఉండేది.
మా ఇంటి చుట్టుపక్కల అందరూ.. నేను చాలా దురదృష్టవంతురాలినని.. నన్ను ఎవరూ పెళ్ళి చేసుకోరని.. అనేవారు. పైగా, నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి.. ఇవన్నీ వింటూ, మా అమ్మ చాలా ఇబ్బంది పడేది. రోజూ అద్దం ముందు నిల్చొని, నన్ను నేను చూసుకుంటే చాలా బాధ వేసేది.. అందరూ అనేది నిజమేనా? అని అనిపించేది.
మా ఫ్రెండ్స్ సలహా మేరకు, బ్యూటీ పార్లర్ కు వెళ్ళాను. అక్కడ నన్ను చూసి... ట్రీట్మెంట్ తీసుకుంటే, ఐశ్వర్య రాయ్ లాగా అవుతానని నాకు నవ్వుతూ చెప్పారు. కొన్ని వీడియోస్, ఫొటోస్ చూపించి నమ్మించారు. ఎక్కడో మనసు చాలా అశపడింది.. కాదనలేక.. అప్పు చేసి డబ్బులు తెచ్చి బ్యూటీ పార్లర్ కు పోసాను. చాలా రోజులు ఈ క్రీం అని.. ఆ క్రీం అని.. ఈ ప్యాక్ అని.. ఆ ప్యాక్ అని.. ముఖం అంతా అలంకరించారు. ఫేస్ ప్యాక్స్ తో నా ముఖాన్ని ఇంకా పాడు చేస్తారని.. అన్నీ మానేసి, నేను.. నేను లాగే పెళ్ళి చూపులలో చిరునవ్వుతో మీకు కనిపించాను.
***
"నువ్వు చెప్పినదంతా విన్నాను..
"పెళ్ళి చూపులలో నీ పెదవి పై ఆ చిరునవ్వు చూసి నిన్ను ఇష్టపడ్డాను మాధురి! నీ చిరునవ్వే అందం.. నీ మంచి మనసే అందం మాధురి!
చుట్టూ ఉన్న జనాలు.. మాటలు అనడానికి ఎప్పుడు అవకాశం వస్తుందో అని ఎదురు చూస్తారు. నిన్ను అప్పుడు అన్నిమాటలు అన్న వారే, ఇప్పుడు నీ అదృష్టాన్ని చూసి నోరు మూసుకున్నారు. మీ అమ్మ కు నీ పెళ్ళి అవట్లేదని నీ మీద కోపం.. ప్రేమ లేక కాదు. బ్యూటీ పార్లర్ వాళ్ళు బిజినెస్ కోసం ఎన్నైనా చెబుతారు.. మన బలహీనతే వారికి బిజినెస్. అద్దం నువ్వు ఎలా ఉంటే, అలాగే చూపిస్తుంది.. నీ పెదవి పై చిరునవ్వు ఉంటే.. అది నిన్ను అందంగానే చూపిస్తుంది”.
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments