top of page
Original.png

కవర్ కాలకేయ


పట్టణంపై భారీ ప్లాస్టిక్ కవర్ రాక్షసుడిలా కనిపిస్తున్న “కవర్ కాలకేయ”, ఒకవైపు ప్లాస్టిక్ కాలుష్యం, మరోవైపు గుడ్డ సంచులతో పర్యావరణాన్ని కాపాడుతున్న పిల్లలను చూపించే అవగాహన దృశ్యం.
పట్టణంపై భారీ ప్లాస్టిక్ కవర్ రాక్షసుడిలా కనిపిస్తున్న “కవర్ కాలకేయ”, ఒకవైపు ప్లాస్టిక్ కాలుష్యం, మరోవైపు గుడ్డ సంచులతో పర్యావరణాన్ని కాపాడుతున్న పిల్లలను చూపించే అవగాహన దృశ్యం.

Cover Kalakeya - Telugu Inspirational Story |  Chandrakala Deekonda

కవర్ కాలకేయ - ప్రేరణాత్మక తెలుగు కథ|చంద్రకళ దీకొండ

Published in manatelugukathalu.com on 05/06/2026


అనగనగా ఒక భూతం.


ఎవరి ఇంట్లో చూసినా, ఆఫీసుల్లో చూసినా, షాపుల్లో చూసినా, చివరికి ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో కూడాను..


రోడ్డు మీద వెళుతూ చూసినా,

నడుస్తూ వెళుతున్నా...

కంటికి కనిపించే భూతమే అది!


అందరి చేతుల్లో వ్రేలాడుతూ ఉంటుంది. ఒక్కోసారి తెల్లగా, మరోసారి నల్లగా, ఇంకోసారి రకరకాల రంగుల్లో కనబడుతూ ఉంటుంది. పారదర్శకంగా ఉంటుందది.


ఒక్కోసారి గాలికి ఎగిరొచ్చి, పసిపిల్లల మెడకు చుట్టుకుంటుంది. వెళ్లే బళ్లకు, పారే నీళ్లకు అడ్డం పడుతుంది. ప్రమాదాలకు,

వరదలకు కారణమౌతుంది.


"వాడి ఆయుష్షు లక్ష సంవత్సరాలు పైగా! తెలుసునా?!"


"అమ్మో!!!"


భూమిలో పాతినా కలిసిపోదు.

మంటలో కాల్చితే గాల్లో కలిసి, కాన్సర్ రోగాన్ని తెస్తుంది.


"ఆ భూతం పేరేమిటో తెలుసునా పిల్లలూ?"


"కవర్ కాలకేయ"


మనమే ఆ భూతం మనను ఆవహించేలా చేసుకున్నాం. వాడడం సులభం అని, ఎక్కడికైనా మోసుకెళ్లడం తేలికని!


మరి ఆ భూతాన్ని వదిలించుకోవాలంటే...

మనమేం చేయాలంటే...


గుడ్డతో చేసిన సంచుల్ని వాడాలి. బజారుకు వెళ్లేముందు దానిని తీసుకుని బయల్దేరాలి.


దాంట్లో పెట్టిన వేడి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఎక్కడ పడితే అక్కడ దానిని పారవేయకూడదు.


అలా చేస్తే... మీకు "రక్తబీజుడు" గురించి తెలుసా... ఆ రాక్షసుని రక్తం నేలపై పడితే, ఒక్కో రక్తపు చుక్క నుంచి ఒక్కో రాక్షసుడు పుడతాడుట!

అలాగే, ఈ కవర్ కాలకేయుడు లోని సూక్ష్మ రేణువులన్నీ గాల్లో కలిసి ఉబ్బసం, కాన్సర్ వ్యాధుల్ని తెస్తాయి, తెలుసునా!


మరి ఈ సంగతులన్నీ ఇంట్లో కూడా చెప్పి, ఆ "కవర్ కాలకేయుని" బారినుండి తప్పించుకుంటారు కదూ

మా మంచి పిల్లలూ!


***

చంద్రకళ దీకొండ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చంద్రకళ దీకొండ

పేరు:చంద్రకళ.దీకొండ,

స్కూల్ అసిస్టెంట్,

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.

రెండు జాతీయ స్థాయి పొటీలలో ప్రథమ,ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాను.పలు కవితా సంకలనాలలో 

నా కవితలు ప్రచురించబడ్డాయి.పలు ప్రముఖ అంతర్జాల మరియు వారపత్రికలలో నా కవితలు అనేకంప్రచురించబడినవి.

విహంగభూమిక* మానవి*మనోహరి*వంటి మహిళా ప్రత్యేక  పత్రికలలోనూ నా కవితలు ప్రచురించబడినవి. సున్నితం చంద్రికలు అను లఘుకవితా ప్రక్రియలో రచించబడిన 250 కవితల సంపుటి మరియు 100 కవితల సంపుటి సాహితీచంద్రికలుప్రచురించబడినవి.

తానా వారు అమృతోత్సవ్ సందర్భంగా నిర్వహించిన గేయ,కవితల పొటీలలో ఎంపిక కాబడి, కవి సమ్మేళనంలోపాల్గొని,

ప్రశంసాపత్రాలను అందుకున్నాను.*తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో మూడు సార్లు మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒకసారి నమోదు అయ్యాను.*GATA* వారు సిరివెన్నెల గారి స్మృతిలో నిర్వహించిన కవితల పొటీలలో మూడవ బహుమతిగా 2000 రూపాయలను స్వీకరించాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page