top of page
Original.png

దడుపు జరం

56 minutes ago
3 min read

ఎన్నికల సమయంలో ముసుగులు వేసిన విగ్రహాలను చూసి భయపడుతున్న పిల్లలు – దడుపు జరం తెలుగు హాస్య వ్యంగ్య కథ

Dadupu Jaram - Telugu Comedy Story | Dr. Ramana Yashaswi

దడుపు జరం - తెలుగు హాస్య కథ | డాక్టర్ రమణ యశస్వి 

Published in manatelugukathalu.com on 24/11/2026


ఎన్నికల కోడ్‌లో ముసుగులు వేసుకున్న రాజకీయ విగ్రహాలను చూసి పిల్లలు భయపడటంతో మొదలైన వింత జ్వరాల కథే “దడుపు జరం”. హాస్యం, వ్యంగ్యం, సమకాలీన రాజకీయ పరిస్థితులను కలిపిన ఈ కథ నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది.


చిన్న పిల్లల ఆసుపత్రులన్నీ జ్వరం వచ్చిన పిల్లలతో నిండిపోతున్నాయి. వణుకుతున్నారు పిల్లలు జ్వరంతో. మలేరియా పరీక్షలు నెగటివ్ వచ్చాయి.


పిల్లలు భయం భయంగా చూస్తున్నారు. ఆసుపత్రి వాతావరణం, ఇంజెక్షన్ల వలన భయపడుతున్నారని అనుకున్నారు పిల్లల తల్లిదండ్రులు మరియు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కూడా.


కోవిడ్ గురించి కూడా ఆలోచించారు. కానీ జలుబు, దగ్గు లేవు ఎవరికీ. కొంతమంది ‘అదే తగ్గుతుందిలే ఇంటికి తీసుకెళ్తే’ అని జ్వరం తగ్గక ముందే డబ్బు ఖర్చుకి భయపడి బలవంతంగా డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తున్నారు.


కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికల రోజు దగ్గరపడుతోంది, ఆసుపత్రి ఖర్చులతో పాటు అభ్యర్థులిచ్చే డబ్బు కూడా నష్టపోతామని డిశ్చార్జ్ అడుగుతున్నారు. 


కొంతమంది పిల్లలను ఆసుపత్రులలోనే ఉంచారు. మరీ ఒళ్లు మసిలిపోయే జ్వరం కాదు. పరీక్షల్లో ఏమీ తేలలేదు కాబట్టి ప్రమాదకరం కాదు అని చిన్న పిల్లల వైద్యులు నిర్ధారించారు. కానీ థర్మామీటర్ ఎంతో కొంత వేడిని చూపిస్తూనే ఉంది.


ఈ నేపథ్యంలో ఆ టౌన్‌లోనే ప్రాక్టీస్ చేస్తున్న చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ రమేష్, తన పిల్లల్ని మోటార్ సైకిల్ పైన ముందొకరిని వెనకొకరిని కూర్చోబెట్టుకొని ఊరిలో పార్క్‌కు తీసుకెళ్తున్నాడు.


పిల్లలిద్దరూ ఒకేసారి పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. బండి ఆపి ఏమిటని అడిగాడు. 


ఇద్దరూ అక్కడున్న ముసుగు వేసి ఉన్న విగ్రహం వైపు చూపిస్తూ “దెయ్యం” అని చెప్తూ కళ్ళు మూసుకొని మళ్లీ ఏడవడం మొదలుపెట్టారు. ఇక ఇంటికెళ్లే లోపు చాలా ముసుగేసిన విగ్రహాలు వచ్చాయి. 


వచ్చినప్పుడల్లా “డాడీ! ఇంకో దెయ్యం” అని ఏడుపు లంకించుకుంటున్నారు. ఇంటికి వెళ్ళేసరికి జ్వరం వచ్చేసింది ఇద్దరికీ.


ఎన్నికల పోలింగ్ అయిపోయింది. విచిత్రమైన పిల్లల జ్వరాల గురించి టౌన్‌లోని పీడియాట్రిషియన్స్ అందరూ కలసి సమావేశం పెట్టుకున్నారు.


తలా ఒక డయాగ్నోసిస్ చెప్పారు. పరీక్షలన్నీ నెగటివ్ వచ్చాయి కాబట్టి కొత్తరకం వైరస్ జబ్బు అని తేల్చారు సందేహంగానే. 


ఆ సమావేశంలో పాల్గొన్న రమేష్ డాక్టర్ మాట్లాడుతూ “మా పిల్లలిద్దరికీ కూడా ఈ ఫీవర్ వచ్చింది” అని చెప్తూ, “ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడం వలన రాజకీయ నాయకుల విగ్రహాలకు తెల్లటి ముసుగులు వేశారు. 


వాటిని చూసి దయ్యాలని భయపడిపోయినాకే ఈ జ్వరాలు వచ్చాయి. టెస్టులన్నీ నార్మల్‌గా ఉండటం వలన దడుపు జరం అని డయాగ్నోసిస్ చేశాను” అని చెప్పాడు. 


అప్పుడు అందరూ "అదే కరెక్ట్ డయాగ్నోసిస్. పెద్దవాళ్ళు కూడా దడుచుకునేటట్లు ఉన్నాయి ఆ విగ్రహాలన్నీ" అంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు చూసి అందరూ ఇది ‘దడుపు జరం’ అని నిర్ధారించుకున్నారు. 


ఎన్నికల కోడ్ తీసేయగానే ముసుగులు తీశారు. క్రమేపీ ఈ మాయదారి జ్వరాలు తగ్గుముఖం పట్టి ఆసుపత్రుల్లో జ్వరం పిల్లలందరూ డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు, నేతలు, వైద్యులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


డా. రమణ యశస్వి ఆర్థో సర్జన్ యశస్వి హాస్పిటల్ గుంటూరు

***








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


డాక్టర్ రమణ యశస్వి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


డాక్టర్ రమణ యశస్వి

రచయిత పరిచయం: డాక్టర్ రమణ యశస్వి




ఒక్క వాక్యంలో నా గురించి నేను



గుండెను తాకే అలలా ,


స్వప్నాన్ని తాకే జోలలా ,


అసమానతలను తాకే జ్వాలలా


సామాజిక భాద్యత కలిగిన సాహిత్యం ,


మనుషులను ఇష్టపడుతూ ,


ధనం వైపు చూడక


 మనుషుల జీవితం వైపు చూస్తూ ,


ఆకాశం ఆశలను ,


పుడమి స్వప్నాలను


ఈ రెంటి మధ్య వున్న  ప్రకృతిని ,


నలుగుతున్నజీవితాలను


వాక్యాలలో దట్టిస్తూ


సమాజంలో మంచి మార్పు కోసం


 ' నేను సైతం ' అని


నిశ్శబ్ద శబ్దం చేస్తూ


గమ్యం సుదూర తీరాలలో


దాగి ఉందని తెలిసీ

సామాజిక చైతన్యాన్ని

సాహిత్య ప్రగతిగా మార్చాలని 

సమతా ఉషస్సు సమాజ శ్రేయస్సు

సాహిత్యానికి  రెండుకాళ్లలాంటివి అని నమ్మి

పట్టువదలని విక్రమార్కుడిలా


 ప్రయత్నిస్తున్న


ఒక అసాధారణ సామాన్యుడిని,

మరియు  ఆర్థో సర్జనుడిని


డాక్టర్ రమణ యశస్వి 

గుంటూరు





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page