top of page
Original.png

దివ్య దర్శనం

11 hours ago
3 min read

100 ఏళ్ల సరస్వతమ్మకు వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం లభించిన భావోద్వేగ దృశ్యం

Divya Darshanam - Telugu Devotional Story Written By Kolla Pushpa

దివ్య దర్శనం - తెలుగు భక్తి కథ  | రచన: కొల్లా పుష్ప

Published In manatelugukathalu.com On 18/11/2026


30 ఏళ్లుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న 100 ఏళ్ల సరస్వతమ్మ కథే “దివ్య దర్శనం”. భక్తి, మనవడు–నానమ్మ ప్రేమ, చివరి కోరిక, ఆధ్యాత్మిక అనుభూతితో హృదయాన్ని హత్తుకునే కథ ఇది.


"గోవిందా గోవిందా, ఏడుకొండలవాడా వెంకన్నా! కాస్త దయ చూపవయ్యా... నాకు నీ దర్శన భాగ్యాన్ని ఇయ్యవయ్యా.


 నిన్ను మనసారా ప్రార్థిస్తున్నాను తండ్రీ! నీ దయవలన ఈ సంవత్సరంతో నాకు 100 ఏళ్లు పూర్తవుతాయి. ఇంకా ఎన్నాళ్లయ్యా నీకోసం ఎదురుచూడటం? దాదాపు 30 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, కాస్త కరుణించవయ్యా! ఇంకా ఎన్నాళ్లు బతుకుతానో నాకే తెలియదు..." అని గట్టిగానే ఏడుస్తోంది సరస్వతమ్మ.


@@@


సరస్వతిది చిత్తూరు జిల్లా. భర్త ఉపాధ్యాయుడు. ఆదివారం సెలవు రాగానే తిరుపతి కొండకు చట్టపట్టాలేసుకొని పోటీపడి మెట్లు ఎక్కి ఆ ఏడుకొండలవాడి దర్శనం చేసుకునేవారు.


ఒకసారి తిరుపతి బస్టాండ్‌లో దిగగానే నెత్తి మీద విమానం రయ్‌మని పోతుంది. "ఒక్కసారైనా విమానం ఎక్కించవయ్యా" అని అడిగింది.


"అవన్నీ గొప్పోళ్లకి, మనకి కాదే" అనేటోడు. తరువాత కొడుకు బాగా చదువుకుని ఉద్యోగం వచ్చాక అడిగింది. "తీరిక లేదమ్మా" అనేటోడు. ఆమె ఆశలు వదిలేసుకుంది. కానీ, ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం అల్లాడిపోతోంది.


@@@


"ఈ ముసలావిడ బాధ చూడలేకపోతున్నాను. ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు, తిరుపతి దర్శనం చేయించమంటోంది. ఈ రోజుల్లో అది కుదిరే పనా? ఒకప్పుడు ధర్మదర్శనాలు ఉండేవి, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేవి. 


ఆ తర్వాత ఆన్‌లైన్ బుకింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త రూల్... ఎవరైతే తక్కువ దర్శనాలు చేశారో వాళ్లకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. 


ఈమె ఒకప్పుడు చాలాసార్లు వెళ్లొచ్చింది, అందుకే ఏమో... 30 ఏళ్లయినా ఎంత ఎదురుచూస్తున్నా దర్శనానికి అనుమతి రావడం లేదు" అంటూ వాపోయింది కోడలు వాసంతి.


"నిజమేనోయ్! మా చిన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నడిచి మెట్లు ఎక్కి వెళ్లేవాళ్లం. 


ఇప్పుడు ఆ అవకాశాలు కరువయ్యాయి" అన్నాడు విచారంగా విశ్వనాథం.


ఈ సంభాషణ అంతా వింటున్న మనవడు సందీప్... "ఇంకా కొద్దిరోజులే డాడీ, నానమ్మకు, నాకు ఆ వెంకన్న దర్శనానికి పర్మిషన్ వచ్చేస్తుంది. 


నానమ్మను నేను విమానంలో తీసుకుని వెళ్తాను, ఆమె చిరకాల కోరిక నెరవేరుస్తాను" అన్నాడు ఇంటర్నెట్‌లో చూస్తూ సంబరంగా.


@@@


"నానమ్మా, ఓ నానమ్మా! నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ ఏడుకొండల వెంకన్న దర్శనం చేయిస్తాను. రేపే బయలుదేరుతున్నాం. మళ్లీ సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటాం" అంటూ సందీప్ నానమ్మను లేవదీసి పాలు పట్టాడు.


"సంతోషం మనవడా! చచ్చిపోయే లోపు ఆ ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవాలని నా కోరిక. నీ వలన నా కోరిక తీరుతుంది. మరి రైలు టికెట్లు తీసుకున్నావా?" అడిగింది నానమ్మ ఆనందంగా.


"రైల్లో కాదు నానమ్మా... నిన్ను విమానంలో తీసుకెళ్తాను, వింత వింత విషయాలు చూస్తావు" అన్నాడు ఆమెను పడుకోబెడుతూ.


"మరి ఆ వెంకన్నకు నా తలనీలాలు ఇస్తానురా మనవడా!" అన్నది ఆమె తన తల తడుముకుంటూ. నెత్తిమీద నాలుగు వెంట్రుకలు కూడా లేవు. అది చూసి నవ్వుతూ "అలాగే..." అంటూ ఆమెకు దుప్పటి కప్పి, లైట్ ఆపి బయటకి నడిచాడు సందీప్.


@@@


"నానమ్మా చూడు! ఫ్లైట్ ఎంత బాగుందో, ఒక్క గంటలో తిరుపతిలో దిగిపోతాము" అన్నాడు ఆమెను రిమోట్ కంట్రోల్డ్ వీల్ ఛైర్ నుంచి ప్లేన్ సీట్లోకి మారుస్తూ.


తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో దిగి అలిపిరి వరకు తీసుకొచ్చాడు. "మెట్లు ఎక్కుదామా రా?" అన్నది బోసి నవ్వులు నవ్వుతూ.


"నువ్వా మెట్లు ఎక్కేది? చూడు... ఆకాశంలో ఎగిరే 'ఏరియల్ డ్రోన్ ఛైర్లు' ఉన్నాయి. అందులో కూర్చుంటే విమానంలా గాల్లో తేలుతూ కొండపైకి ఐదు నిమిషాల్లో చేరిపోతాము" అంటూ ఆమెను అందులో కూర్చోబెట్టాడు. అన్నట్టుగానే ఐదు నిమిషాల్లో కొండపైకి వచ్చేశారు.


"మనవడా! తలనీలాలు ఇస్తానన్నాను కదా, మర్చిపోయావా? నన్ను కళ్యాణకట్టకు తీసుకువెళ్లు" అన్నది.


"నానమ్మా! ఇప్పుడు గంటల తరబడి క్యూలలో నిలబడే పాత పద్ధతులు లేవు. ఈ 'లేజర్ హెయిర్ కటింగ్ క్యాబిన్'లో కూర్చో" అని తలకు ఒక లేజర్ హెడ్-సెట్ అమర్చాడు. 


సెకన్లలో గుండు అయిపోయింది! అక్కడే సెన్సార్లతో పనిచేసే 'ఆటోమేటిక్ మిస్ట్ షవర్'లో స్నానం కానిచ్చి, క్విక్ డ్రై అయ్యాక దర్శనానికి వెళ్లారు.


ఆమె వేంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని తనివితీరా చూసింది. 


బయటికి వచ్చి కూర్చుంది. ఏడుస్తున్న మనవడిని చూసి... "ఎందుకురా కన్నా ఏడుస్తున్నావు? ఎంత బాగా దర్శనం చేయించావు! ఇంకెందుకు ఏడుపు? లే లే... నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏదైనా తీసుకురా. 


ఈ తృప్తితో ఇంకో పది ఏళ్లు బతుకుతానురా!" అన్నది సరస్వతమ్మ కళ్లనీళ్లతో మరోసారి స్వామి గోపురాన్ని చూస్తూ. అలా చూస్తూనే... ఆమె ముఖంలో ఒక దివ్యమైన ప్రశాంతత ఆవరించింది.


@@@


"నానమ్మా... నానమ్మా! లే నానమ్మా! ఫ్లైట్‌కు టైమ్ అవుతోంది... ఎన్నాళ్ల నుంచో అడుగుతున్నావు కదా! ఒక్కసారి లే నానమ్మా, తిరుపతి వెంకన్న దర్శనానికి వెళదాం, నిన్ను నేను తీసుకెళ్తాను లే నానమ్మా..." అంటూ మంచం పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు సందీప్.


కానీ అక్కడ నానమ్మ భౌతికకాయం నిశ్చలంగా పడి ఉంది. ఆమె కళ్లు మూసి ఉన్నాయి కానీ, ఆ పెదవులపై మాత్రం స్వామి దర్శనం పొందినంత తృప్తికరమైన చిరునవ్వు చెరగకుండా అలాగే ఉంది.


"అయ్యో! ఆ ముసలావిడ చివరి కోరిక తీరకుండానే పోయింది పాపం..." అని చుట్టూ ఉన్న బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.


తను తీసుకెళ్లేలోపే నానమ్మ వదిలి వెళ్లినందుకు సందీప్ ఏడుస్తున్నా... ఆమె ముఖంలో ప్రశాంతత, చిరునవ్వు చూసిన సందీప్‌కి, 'నానమ్మ ఆత్మ వెంకటేశ్వరుని దర్శనం ముగించుకుని తృప్తిగా స్వామిలో ఐక్యమైందన్నట్లుగా ఉంది' అనుకున్నాడు సందీప్.


                    శుభం 








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

కొల్లా పుష్ప

రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప








Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page