దుస్తులు - మర్యాద!
- A . Annapurna

- 5 days ago
- 3 min read
#AAnnapurna, #అన్నపూర్ణవ్యాసాలు, #DusthuluMaryada, #దుస్తులుమర్యాద

విన తగు నెవ్వరు చెప్పిన..
Dusthulu Maryada - New Telugu Article Written By A. Annapurna
Published in manatelugukathalu.com on 26/12/2025
దుస్తులు-మర్యాద! - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి
అవును. ఎవరైనా దుస్తులు ధరించే తీరే వారి హుందాతనాన్ని, చవకబారుతనాన్ని సూచిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. నటుడు శివాజీ ఇదే విషయాన్ని చెబితే ఎవరో దుస్తులు సరిగా వేసుకోని వాళ్ళు రాద్ధాంతం చేస్తే, ఆలా వేసుకోడాన్ని సమర్ధించే వాళ్ళు ఒకరో ఇద్దరో మాత్రమే.
అదీ వార్తల్లోకి రావడానికి అన్నట్టు కనబడుతోంది. తప్పుచేసేవాళ్ళు తప్పకుండా భుజాలు తడుముకుంటారు. అసలు నేను చాలా రోజులుగా అర్ధనగ్నంగా దుస్తులు ధరించి షోలకు వచ్చేవారిని, జనంలోకి వచ్చేవారిని చూసినపుడు చిరాకు పడుతున్నాను. వీళ్ళకి ఎవరు- ఎలా చెబితే బాగుంటుందా అనుకున్నాను. నేరుగా వాళ్లకి హెచ్చరికలు చేసేవారు కావాలి అనుకున్నాను.
మన దుస్తులు గౌరవప్రదంగా లేవు అని మగవాడిచేత చెప్పించుకోవడం సిగ్గుమాలిన పని! అందుకు ఆ మహిళలు సిగ్గుతో సగం చచ్చి పోవాలి. అలాంటిది నలుగురిలోకి వెళ్లేవారు మర్యాదగా ఉండాలి. దుస్తులు శరీరాన్ని పూర్తిగా కవర్ చేసేలా ఉండాలి. సాధారణ స్త్రీలుకూడా ఫ్యాషన్ పేరుతొ గుడ్డిగా అనుకరించకూడదు.
వీపంతా కనబడే బ్లవుజులు వేసుకునేవారిని చూసినపుడు ‘మహిళగా నాకే చిరాకు వస్తుంది’ అని తెలుసుకోవాలి. మగవారు ఎదో అన్నారు అంటే అది మనలోపమే! వాళ్ళను ఆడిపోసుకోవడం సరికాదు.
మనలను విమర్శించే అవకాశం వారికి ఎందుకు ఇవ్వాలి? సినిమాల్లో కూడా నిర్మాతలు దర్శకులు స్త్రీలను అసభ్యంగా చూపించాలనే ఆలోచనలు దయచేసి మానుకోండి. మా సినిమాలు చూస్తేనే బుద్ధి వక్రిస్తుందా ? అంట బలహీనులా ? నాఇష్టం. చూస్తే చూడండి. లేకపోతె మానుకోండి అని సమర్ధించుకోవద్దు. మీరు అలాంటి పాత్రలు ఇస్తే నేను చేయను అని నటీ నటులు కూడా ఒక పద్ధతి పాటించాలి. అంతేకాని అన్నిటికి రెడీ ఐపోకండి. ఎవరైనా హద్దులో వుండాలి. డబ్బు రావచ్చు కానీ చులకన ఐపోతారు. గౌరవం ఉండదు.
బహిరంగ సమావేశాలకు వేడుకలకు వచ్చే మీరు వొంటి నిండుగా దుస్తులు ధరించాలి అని చాలామంది పెద్దలు చెప్పేరు కూడా! అంటే వాళ్ళు శివాజీ చెప్పినట్టు మనసులో ''ఛీ.. ఈ ఆడవాళ్లు మరీ చీపుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళకేమి రోగం '' అని తప్పకుండ తిట్టుకునే వుంటారు. సందేహం లేదు. బహిరంగంగా చీవాట్లు పెట్టలేక పరోక్షము గా చెబుతారు. ఆలా చెప్పేరని వాళ్ళమీద దండెత్తడం, ఎదో ఘనకార్యంగా భావించడం, ఇష్టం వచ్చినట్టు మాటాడటం సరిపోదు. ఎదో ఒకరోజు బుద్ధివచ్చేలా చేస్తారు. చాలా మందికి ఎంత అసహ్యం కలిగిందో అర్ధం అవుతోంది. శివాజీని సపోర్ట్ చేయడం చూస్తే.
సినిమాల్లో నటించే అవకాశం కోసం శరీరాన్ని ప్రదర్శించక్కరలేదు. మీలో ప్రతిభ అంటూ ఉంటే అవకాశాలు తప్పకుండా వస్తాయి. అందుకు ఉదాహరణగా ఎందరో వున్నారు. ఒకప్పుడు పబ్లిసిటీ ఇచ్చే మాధ్యమాలు ఏమి వున్నాయి? టీ వీలు వేడుకలు ప్రదర్శనలు... ఏవీ లేవు కదా! అయినా ఎందరో కళాకారులు వారి ప్రతిభతో వెలుగులోకి వచ్చారు. నటులు, కళా కారులు, రచయితలు, కవులు, నాట్యం చేసేవారు, చిత్ర లేఖనం తెలిసినవారు, శిల్పాలు చెక్కేవారు, విద్యావంతులు, పాటలు పాడేవారు, కళాభిరుచి వున్నవారు ఎందరో!
నలుగురూ మెచ్చే పని చేసేవారు, చిరస్మరణీయులు వున్నారు. ఇలా మంచిపేరు తెచ్చుకోవాలి. అంతేకాని నవ్వుల పాలయ్యే పనిచేసే వారు అపకీర్తిని మూట కట్టుకుంటారు.
*******************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాగురించి పరిచయం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే
వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)





Comments